డైలీ సీరియల్

దూతికా విజయం-54

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘రాణీ! నిరాశపడకు, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకు. నా శరీరంలోని చిట్టచివర రక్తకణాన్ని కూడా తమసేవలో వ్యయపరుస్తాను!’’ అన్నది సరస్వతి ఉద్రిక్తంగా.
‘‘నాకు తెలుసు సరూ! కాని విధి విలాసాన్ని అనుసరించే నడవాలి కదా!’’
‘‘ఆ విధిని ప్రాధేయపడో, ప్రార్థించో అవసరమైతే మోసగించే కార్యాన్ని సాధిస్తాను రాణీ! ముందుగా రాత్రి కాపలా వుండే దక్షిణ ద్వార పాలకుడితో పరిచయం చేసుకుంటాను. ఈ చదరంగంలో మనకు వాడే అతి ముఖ్యమైన పావు. ఇంట గెలిచి కదా రచ్చ గెలవాల్సింది! ఇక్కడ వీణ్ని సరిజేసి నీ ప్రియుని దగ్గరికి వెళ్లి నా తెలివితేటలతో ఎలాగైతేనేమి అతని ముక్కుకి తాడువేసి, చీకటి సముద్రంలోకి దూకించి సప్త సముద్రాలనూ ఈది సప్తదర్పణ శయన మందిరంలో తమకు అతన్ని కానుకగా సమర్పించలేకపోతే నా పేరు సరస్వతి కాదు!’’ హృదయపు లోతుల నుంచి సరస్వతి ప్రతిజ్ఞ చేసింది.
రాణి ముఖం సూర్యకిరణాలు సోకిన పద్మంవలె వికసించింది.
‘‘సరూ! నీవంతదానివే! నా ఆశలన్నీ నీమీదనే! భగవానుడు మనకు విజయాన్ని చేకూర్చునుగాక!’’ అన్నది రాణి.
పరమ పవిత్రంగా భావించబడే మాతృత్వాన్ని లభ్యపరచుకునేందుకు పరమ నీచంగా భావించబడే కాముక క్రీడను ప్రకృతి ఎందుకు నిర్దేశించిందో సరస్వతి తీవ్రంగా ఆలోచించింది.
ఏమైనప్పటికీ రాణీ ఆశీర్వాదంతోనూ, తన చర్మాన్ని సైతం చెప్పులు కుట్టించి నవ్వుతూ రాణికి కానుకగా సమర్పించగలిగే విశ్వాస సహాయంతోనూ తాను ముందు వెనుకలు ఆలోచించక దూకవలసిందేననే దృఢ నిశ్చయం సరస్వతిలో గాఢంగా నాటుకుపోయింది.
***
కృష్ణసప్తమి రాత్రి సరస్వతి కార్యరంగంలోనికి మొదటి మెట్టుమీద బరువేసి చూడాలని నిశ్చయించుకున్నది.
రాచనగరమంతా మాటు మణిగింది. అర్థరాత్రికాకపోయినా ఫరవాలేదు లెమ్మని తనను తాను సమాధానపరచుకున్నది. మెల్లిగా పిల్లివలె తన శయ్యను విడిచి, ఉద్యానవనంలోంచి నడక సాగించింది. తలచుకునేందుకు సులభంగా వున్న ప్రతి విషయంలోనూ, ఇప్పుడు సవాలక్ష అనుమానాలూ అనేక అడ్డంకులూ ఎదురయ్యేటట్లున్నవి. సిద్ధాంతానికీ, ప్రయోగానికీ వున్న తేడాయే అది!
ఉద్యానవనపు సరిహద్దుకు నాలుగడుగులు వెనుక నిలిచి జాగ్రత్తగా దృష్టి సారించిందామె. దక్షిణ ద్వారం దగ్గర ద్వారపాలకుడు గస్తీ తిరుగుతూనే ఉన్నాడు. కుడ్యదీపిక చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తనను గమనించలేదనే స్పష్టమైంది. అంటే ఎంతో మెలకువతో వున్న ద్వారపాలకుని కన్ను గప్పగలగడం విజయ సోపానికి మొదటి మెట్టుగా భావించుకున్నది.
ఈ ద్వారపాలకుడు యువకుడు. ముప్ఫై ఏళ్ళుంటాయేమో? తన మాత్రపు అందగత్తె అర్థరాత్రి సమయాన ఒంటరిగా చేత చిక్కితే వొదులుతాడా?
కలలో కనిపించినవాడు నడి వయస్కుడు కనుక ప్రణయోష్ణాన్ని అందుకోవటంలో కొంత వ్యవధి అవసరమైంది. కాకి కూస్తే కోయిలేననుకునే వయసువాడైన ఇతను అంత కాలయాపన చేయజాలడని ఆమెకు తోచింది. అయితే తనమీదవున్న బాధ్యత తలచుకుంటే ఆరు నూరయ్యేది కార్య సాఫల్యమే తన గురి. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ, వాటిని ఎదుర్కొని శక్తి యుక్తులతో జయించే తీరాలి. అలా కానినాడు తాను రాణికి ఇచ్చిన మాట ప్రకారం మారు పేరు పెట్టుకోవాలి!
ఇతన్ని పలుకరించటమెలా? ఆమె రెండు క్షణాలు ఆలోచించింది. చుట్టుపట్ల ఎవ్వరూ లేరనీ, మాట్లాడినా వినిపించే దూరంలో కూడా నరవాసన తగలటంలేదనీ నిశ్చయంగా తెలుసుకున్నది.
‘‘ఎవరక్కడ?’’ అన్నదామె మృదువైన కంఠస్వరంతో స్పష్టంగా.
ద్వారపాలకుడు హడలిపొయ్యాడు. అంతలోనే తేరుకొని చప్పున కరదీపిక ముట్టించాడు.
‘‘అక్కడే ఆగాలి.. నేను అడగవలసిన ప్రశ్నను అడిగిందెవరు? ఎవరక్కడ? వెంటనే జవాబు రాకుంటే నా చేతుల్లో ఉన్న పదునైన రుూ బల్లెమే వెతుక్కుంటూ వస్తుందని హెచ్చరిక!’’ ఆ కంఠస్వరంలో ఉద్రేకం లేదు, కాని ఆతృత, జాగ్రత్త ధ్వనిస్తూన్నవి.
‘‘మిత్రశ్రేణిలోని వ్యక్తిని..’’
బహుశా ఆ మాటలకన్న స్వరమే అతన్ని సమాధానపరచి ఉండాలి.
‘‘కదలవొద్దు..’’ అని అతను కరదీపికతో సహా, కంఠస్వరం వచ్చిన దిక్కే కదిలాడు. త్వరలోనే సరస్వతిని చూసి- అల్లంత దూరానే వుండి, కరదీపికను పైకి ఎత్తిపెట్టి ‘ఎవరవో వివరాలు చెప్పాలి!’ అన్నాడు అధికారాన్ని సూచిస్తూ.
‘‘నేను చిన్నరాణి ప్రియసఖిని సరస్వతిని’’
కరదీపిక కిందికి దిగింది.
‘‘ప్రణామం!.. ఇటు ఎందుకొచ్చారు?’’
‘‘్భయం లేదు.. నీతోపని ఉండి వచ్చాను. ఇక్కడ ఇంకెవ్వరూ లేరు. కరదీపికను ఆర్పేసేయ్!’’అన్నది సరస్వతి.

- ఇంకాఉంది

ధనికొండ సాహిత్యం - 12 సంపుటాలు
Vol. I. దేశోద్ధారకుడు - 32 కథలు - 368 పేజీలు వెల: రూ. 250 లు
Vol. Il ప్రియురాలు - 33 కథలు - 416 పేజీలు - వెల: రూ. 250 లు
Vol. Ill. గళ్ల రుమాలు - 31 కథలు - 352 పేజీలు - వెల: రూ. 200 లు
Vol. IV అవును - అతను - ఆమె- ఈమె - 36 కథలు - 352 పేజీలు - వెల: రూ. 200 లు
Vol. V మొపాసో కథలు (అనువాదం) 33 కథలు - 256 పేజీలు - వెల: రూ. 150 లు
Vol. Vl. గుడ్డివాడు ( 4 నవలికలు) --- 344 పేజీలు - వెల: రూ. 200 లు
Vol. Vll లోకచరిత్ర ( 5 నవలికలు) 336 పేజీలు - వెల: రూ. 200 లు
Vol. Vlll. మగువ మనసు (నవల) 288 పేజీలు - వెల: రూ. 175 లు
Vol. lX. జగదేక సుందరి క్లియోపాత్రా (నవల) 384 పేజీలు - వెల: రూ. 225 లు
Vol. X. . దూతికా విజయం (నవల) 320 పేజీలు - వెల: రూ. 175 లు
Vol. Xll అంతిమ పోరాటం ( Last of the Mohicans అనువాదం) 224 పేజీలు - వెల: రూ. 125 లు
Vol Xlll ఎర్రబుట్టలు (నాటికలు, నాటకాలు ) 360 పేజీలు - వెల: రూ. 200 లు
మొత్తం = వెల: రూ. 2350 లు
Set కొనేవారికి రూ.1800/-లకే లభించును. చరవాణి నెం. 9841183685 , 9841021266

-ధనికొండ హనుమంతరావు