డైలీ సీరియల్

దూతికా విజయం-73

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదృష్టముండాలేకాని, మిగతా ఎన్ని ఉన్నా దానిముందు దిగదుడుపే. ఏమీ లేక అదృష్టం ఉంటే, ప్రతిభను అధిగమించి విజయాన్ని సాధించగలదది.
తానిప్పుడు ఊబిలో ఇరుక్కునట్లయింది. అదృష్టవశాత్తు తనను తానే సురక్షిత స్థలానికి జేర్చుకోగలదు; తల మునిగేదాకా ఆలోచిస్తూ కూర్చుంటే, పుణ్యకాలం కాస్తా పూర్తవుతుంది. అందుకని తొందరపడవలసిన అవసరాన్ని కూడా ఆమె గుర్తించింది.
ఇలాంటి దారుణ పరిస్థితి కోట లోపల సంభవించివుంటే ఏవౌతుందో తనకు తెలుసు. జన్మలో మరువలేని స్వాప్నవికానుభవానికి విరుద్ధంగా జరగదు. ఇక్కడ ఈ వీరభద్రుని ఇంటిలోనే కనుక, జరిగిపోయిన పొరపాటును సరిదిద్దుకునే సదవకాశం లభించింది. ఇలాంటిది కాలచక్రమే వెనక్కు తిరిగినట్లుగా భావించి, సద్వినియోగపరచుకోకపోతే తను ఆత్మద్రోహానికి తలపడినట్లే భావించవచ్చు. పరిస్థితులు క్లిష్టతరం కాకముందే తాను సరిదిద్దాలి!
కప్పుకోలేని, తప్పుకోలేని తప్పుచేసినపుడే ఒప్పు ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది. స్వప్నానుభూతిలో తప్పు జరిగి పూడ్చలేని గండి ఏర్పడిందో తానింకా మరువలేదు. సరిగ్గా అదే తప్పు ఇపుడు, ఇక్కడా జరిగింది. అయితే అదృష్టవశాత్తు దాన్ని సరిదిద్దుకునే అవకాశం లభించింది. దాన్ని దుర్వినియోగపరచడం దేనికి?
జీవితంలో ఎన్నో తప్పులు చేయవలసి వున్నది. చేసిన తప్పే చేయటం జీవితాన్ని వ్యర్థపరచుకోవటమే కదా! కొత్త పొరపాట్లు చేయడం నయం! అందుకని ఆ పాత పాట జోలికే పోరాదు!
సామాన్యులు కష్టసాధ్యమైన పనులు చేస్తేనే తప్ప గొప్పవారు కాలేరు. గొప్పతనం పరిస్థితుల్ని బట్టి కూడా సంక్రమిస్తూ ఉంటుంది. ఇప్పుడీ వీరభద్రుడు సర్వసామాన్యుడు, రాణిచే కోరబడి అత్యున్నత స్థానానికి ఎగబాకాడు. ఇంత గొప్పవాణ్ణి తాను వలపు వలలో బంధిస్తే తన ఆధిక్యత కూడా దానంతదే పెరుగుతుంది.
అయితే ఇలాంటి గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకోవటమెందుకని చాలామంది దూర దూరాన ఉంటారు. నిజానికి తాను కూడా ఆ ఆధిక్యతను కోరలేదు. అది తనమీద రాణి కారణంగా బలవత్తరంగా విరుచుకుపడింది; కనుక చచ్చినట్లు దాన్ని భరించి; నిభాయించుకొని విజయాన్ని సాధించక తప్పదు. ఈ సాధనలో వీరభద్రుడు ఒక కొసనుంచి తరుముకొస్తున్నాడు. తాను రెండో కొన నుంచి వేగంగా కదిలే సంధి జరగవలసిన శ్రమా, వ్యవధీ సగమై త్వరలోనే జయం లభిస్తుంది. ఇంతకన్నా సానుకూలం మరేమీ ఉండగలదు?
తనకు ప్రణయమూ వద్దు; సాఫల్యతా అవసరం లేదు. కాని ఇది రాణికి సంబంధించిన ప్రణయం కావడంతో గోరంత కొండంతయింది! తనది కానీ, మరే సాధారణ వ్యక్తికి సంబంధించినది కానీ ఐనట్లయితే ఇంత గొడవ ఉండకపోను. పరోక్షంగా వున్న రాణి ప్రణయం తను ప్రత్యక్షంగానే ఎదుర్కొనేట్లు చేసింది!
జీవిత రహస్యాలను ఛేదించేందుకూ, తప్పించుకునేందుకూ సాహసకృత్యాలు చేయటం అప్పుడప్పుడైనా అవసరమే అవుతూంటుంది. ఇప్పటి తన ఈ సాహసంలో తాను తెలుసుకోబోయే పరమ రహస్యాలు ఎన్ని ఎదురౌతవో! తాను ఊహించనివి, ఊహించినా అర్థం కానివీ, ఇపుడు సుబోధకంగా జీర్ణించుకోగలిగిన విధానంలో వాటంతటవే కొట్టుకొని వచ్చి పడుతున్నవి. తన నిరాకరణతో సంబంధం లేకుండానే లభ్యపడుతూన్నవి!
వ్యాధి పాలై చికిత్స ద్వారా ఆరోగ్యాన్ని పొందటంకన్నా, వ్యాధి నుంచి తప్పించుకోగలగటమే అత్యుత్తమ మార్గం. ఐతే వ్యాధి రానే వచ్చాక, ఎందుకొచ్చిందనే ప్రశ్న కన్నా, చికిత్స ఏమిటనేదానికే ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా ఇపుడు ఎదురైన ఈ విపత్కర పరిస్థితి విషమించక ముందే, దీన్ని తగిన మందు మాకుల్తో నిరోధించక తప్పదు.
తన ఈ పరిస్థితి సరిగ్గా వాడి అయిన రెండు ముళ్ళ మధ్య ఇరుక్కున్న లేత అరిటాకల్లేతయారైంది. ఒక పక్క రాణి అనే ముల్లూ, రెండోవైపు వీరభద్రుడనే ముల్లూ వాడిగా గుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నవి. వీటిల్లో ఏదో ఒకదానిని కాటు తప్పించుకునే అవకాశం మాత్రమే ఉన్నది!
జీవితాంతం వరకు తన సేవలు రాణికి అంకితం ఇవ్వబడినవి. రాణి అనే ముల్లు గుచ్చుకునేందుకు తాను సమ్మతిస్తే, దాని బాధ జీవితమంతా ఉండనే ఉంటుంది. ఆ వేటు తప్పించుకుంటే ఈ బతుకంతా తనకో బంగారు బాటగా పరిణమిస్తుంది.
వీరభద్రుడనే ఈ కంటకం పాలబడితే రాణికి కూడా ఇతనితో కూడిన పని తాత్కాలికమైనదే కనుక ఈ ముల్లు గుచ్చుకున్నా తనకది తాత్కాలికమే! ఇతనితో రాణి పొందబోయే సౌఖ్యం ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ తను గర్భవతి అయేవరకే ఆమె ఈ సౌఖ్యాన్ని ఆశిస్తుందే కాని, ఆ తరువాత తప్పక విసర్జించవలసే వున్నది. అప్పటికి ఈ ముల్లు బాధ కూడా తనను పూర్తిగా విడనాడినట్లే నమ్మవొచ్చు.
వీరభద్రుడనే కంటకపు కాటునే తన రాణి కోరిదంటే, అదో గొప్ప సౌఖ్యానిచ్చేది ఐ ఉండాలి. కనుక ‘బాధ’ అని తాను పద ప్రయోగం చేసినా, నిజంగా అనుభవించేది మాత్రం అమర సుఖమే అయి ఉండాలి.
అందాలరాశి అయిన రాణిని కూడా కాదని తననే ఈ వీరభద్రుడు వలచాడంటే, నిజంగా తానెంత గర్వపడాలి! అతనికి తన పట్ల తాత్కాలికంగా ఏర్పడిన ద్వేషాన్ని విడిచి, నిరభ్యంతరంగా తనను తాను అర్పించుకుంటే, సుఖ సౌఖ్యాల సంతర్పణ చేసే బాధ్యత అతని వంతే అవుతుంది.
స్ర్తి అబల అనే అనుకుంటే రాణితో తాను చేయి కలపటం ద్వారా ఈ అబలత్వం రెట్టింపవుతుంది! కనుక స్ర్తిత్వం సబలమైన పురుషత్వంతో మిళితం కానిదే రాణించదు. ఈ విధంగా చూసినా తాను వీరభద్రుని పొందు పొందవలసే వున్నది.
రాణి కలను కనే శ్రమకూడా పడలేదు. ఈ స్వప్నాన్ని ఊహించింది. అన్నీ తనకు అనుకూలంగా, హాయిగా, సుఖంగా ఉండే విధానంలోనే ఊహించింది! అలాటి ఊహలను అనుసరించే కల రావటం కూడా కుదరదు.
అలాటిది- ఆ ఊహలన్నిటినీ నిజం చేయమని రాణి తనను ఆదేశిస్తే, ఆరంభశూరత్వంతో బయలుదేరి, ఇక్కడ ఈ పద్మవ్యూహంలో ఇరుక్కుపోవలసి వచ్చింది. తన అవస్థ తాను పడి బైటపడాలేకాని, ఆ మార్గాలేవీ రాణి చెప్పదు; చెప్పలేదు కూడాను. ఈ అష్టదిగ్బంధనం జరిగాక తనకు మిగిలి వున్న ఒక్క మార్గమే గతి!
నిజ జీవితానికి కొంత ఊహామాత్రపు అసంభవాల్ని కూడా జోడించందే, ఎలాంటి ఆసక్తీవుండదు. ఈ సిద్ధాంతం ప్రకారమే రాణి ఊహారచనలు ఆమె ఇష్టానుసారంగా సాగినవి. వాటిని వినేవారికే సరైన అనుభూతులు కలుగుతవనే నమ్మకం లేదు. ఇక వాటిని క్రియారూపానికి మార్చటం- ఆమె ఊహల ప్రకారం తదితర పాత్రలన్నీ ప్రవర్తించటం ఎంత విడ్డూరమైన విషయం!
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు