డైలీ సీరియల్

దూతికా విజయం-82

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రాహ్మణుల్లో ఐతే విధవ సింగారాలన్నీ తీసెయ్యటమే గాక, బుర్ర కూడా నున్నగా గొరిగించుకోవాలి. ఆ కులంలోనే కళత్ర వినియోగం జరిగితే పురుషుడు ప్రత్యేకించి ఏ రూపంలోనూ, తన హీన స్థితిని చూపవలసిన పనిలేదు. తనదైన స్ర్తి తాను చచ్చినా, తనకే విశ్వాపాత్రురాలై ఉండేందుకూ, ఇతర పురుషుల్ని ఆకర్షించకుండా ఉండేందుకు ఈ ఆంక్షలు విధించబడినవి! ఇలాంటి కట్టడులు పురుషులకు ఎందుకు అవసరంలేదో!
ఈ వ్యాధి ఒక్క మానవులకే కాదు దేవతలక్కూడా వున్నది. మానవుడు పూజించే దేవతల్లో ఒక్క బ్రహ్మదేవుడు మినహా మిగతా అందరూ కూడా బహు పత్నీవ్రతులే కదా! బ్రహ్మదేవుడు ఏకపత్నీవ్రతుడు కనుకనే, మానవుడు ఆయనకు గుళ్ళు గోపురాలు కట్టకా, పూజాపునస్కారాలు చేయకా, లెక్కచేయనివాడయ్యాడు. ఏ దేవుని భార్య కూడా బహుపత్నీవ్రత కాదు. ఆమె మాత్రం పవిత్రంగానే ఉండాలి. ఈ పురుషుని స్వార్థాన్ని నిరూపించేందుకు ఇంతకన్నా దృష్టాంతరాలెందుకు?
ఇలాటి పురుష నిర్మాతలైన ఈ చట్టాలను అతిక్రమించటం ద్వారా, తానిప్పుడు విజయాన్ని సాధించి, పురుషుడ్ని అవమానించిన కొత్త తృప్తినీ ఆనందాన్నీ పొందగలుగుతుంది. పురుషుణ్ణి కొంగున ముడేసి ఓ ఆట ఆడించి అతని అల్పత్వాన్ని రుజువు చేస్తుంది. ఈ కీలకం తెలుసుకోలేని మూర్ఖుడైన పురుషుడు స్ర్తిత్వానికి బలవుతాడు గాక! బలిపశువుగా భావించబడే వీరభద్రుడు ఆ కాంతి కిరణానికి వెనుకగా వున్నవాడి కోసం ఆమె ఆకలిగొన్న సివంగి వలె, బుసలుకొడుతూ వధ్యశిల దగ్గర మాటువేసి ఉన్నది. తన మనసులోని భావాలు తెలియరాకుండా, ఈ క్రతువు తనకెంతో ప్రీతికరమైనదనే ధోరణిని కనబరిచేందుకు, ఆమె తనసర్వశక్తుల్ని కూడగట్టుకున్నది.
ఒక చేతిలో దీపికా, మరో చేతిలో రాణి తన ద్వారా పంపిన బంగారు నాణాల మూట, ఒక తాళపత్ర గ్రంథమూ పట్టుకొని వీరభద్రుడు గదిలో ప్రవేశించాడు. ఆ దీపికా కాంతిలో వీరభద్రుని ముఖం ఉజ్వలంగా వెలుగొందుతోంది. ఆకలిగొన్న సివంగి తాననుకుంటే ఆకలితో నకనకలాడే సింహం ఈ వీరభద్రుడు అనిపించిందామెకు. ఏమైనప్పటికీ కామోద్రేకంతో కాగిపోతే కాయాన్ని చల్లార్చటం చతురురాలైన తనకంత కష్టసాధ్యమైనది కాదనే గాఢ విశ్వాసం ఆమెనింకా విడనాడలేదు.
వీరభద్రుడు దీపికను కుడ్యంలో గుచ్చాడు. తాళపత్ర గ్రంథాన్ని ఎక్కడ దాయాలా అని ఒక్క క్షణం ఆలోచించి, సరస్వతివైపు తిరిగి, ‘‘ఇదేమిటో తెలుసా?!’’ అన్నాడు ఆ గ్రంథాన్ని పైకెత్తి చూపుతూ.
‘‘తెలుసు - తాళపత్ర గ్రంథం!’’ అన్నదామె ముసిముసిగా నవ్వుతూ.
‘‘ఏం తెలివి!’’ అని దొప్పిపొడిచాడు వీరభద్రుడు. ‘ఏం గ్రంథమో తెలుసా?’
‘‘ఉహూఁ’’
‘‘వాత్స్యాయన కామసూత్రాలు. నీవు వచ్చేటప్పుడు ఇదే పఠిస్తున్నాను!’’
ప్రసిద్ధి చెందిన వాత్స్యాయన గ్రంథాన్ని తాను చదివే వున్నది. ఈ వీరభద్రుడు బహుశా అందులో వివిధ బంధనాలను గూర్చిన ప్రకరణం చదువుతూ, తాను వచ్చేటప్పటికి, ఊహామాత్రంగా విశేషోద్రేకాలకు గురవుతూ వుండి ఉండాలి. తాను ఎదురయ్యేటప్పటికి తనను తాను నిలదొక్కుకోలేక విరుచుకొని మీదపడే పర్యంతమై ఉండాలి. తనకు అనుకూలంగా ఉన్నదనుకున్న వాతావరణం క్షణంలో ప్రతికూలమైన కారణాల్లో ఇదొకటి!
తాను వాయు సొరంగాన్ని నాటితే అది అలివి తప్పి, పెంపొంది సుడిగాలయింది. కారకురాలు తానే కనుక, తానే సమర్థించాలి. అది సాధ్యం కానట్లయితే సుడిగాలిలో కొట్టుకొని పోయేందుకు సిద్ధమవాలి- అదే జరుగుతోందిప్పుడు.
‘‘బ్రహ్మచారులు చదువవలసింది కాదే’’
‘‘ఎల్లకాలమూ బ్రహ్మచర్యంలోనే ఉంటామనేమిటి? ఈ రాత్రే ఆ దీక్ష వదులుకుంటున్నాను.. తీరిగ్గా నీవు కూడా చదువు!’’
‘‘పాడు పుస్తకాలు!’’ అన్నదామె చీదరించుకుంటున్నట్లు.
‘‘అలాగా? ఆ పాడు పనులకోసమేగా మనందరం ఇంతగా తహతహలాడుతోంది? ఆ పాడు పనులచే కదా మనమంతా జన్మించింది! ఆ విషయాన్ని చదవటం మాత్రం కూడదు- ఔనా?’’
‘‘చదివితే ఏవౌతుందేం?’’ అన్నదామె కళ్ళు పెద్దవి చేసి, సవాలు చేస్తున్న ధోరణిని ప్రదర్శిస్తూ.
‘‘ఔనౌను’’ అన్నాడు వీరభద్రుడు ఆమె అంతరంగాన్ని గ్రహించి ‘‘కేవలం సిద్ధాంతరీత్యా తెలుసుకుంటే ఏం ప్రయోజనం? ప్రయోగించి చూడాల్సిందే కదా! మనిద్దరినీ ఏకాభిప్రాయమే సుమా!’’
త్వరలోనే ఏక శరీరవౌతుందనే ఊహ రాగానే సరస్వతికి వొళ్లు ఝల్లుమన్నది. తానీ వీరభద్రుని చేతుల్లో పడితే తిలలనుంచి బొట్లు బొట్లుగా తైలాన్ని పిండిన ఆ చేతులు, తన శరీరంలోని కొవ్వునంతనూ ఒక కొలిక్కి తెచ్చి ధారకట్టి కారేట్లుగా తైలాన్ని పిండడా? సుకుమారమైన తన ఈ దేహాన్ని మాంసపు ముద్దగా రూపొందించడా? ఇనప కడ్డీలనే వొంచివేసిన ఇతని బలప్రయోగంతో తన శరీరంలోని ఎముకలు ఫటఫటమని విరగవా? ఐతే ఇలాగే రాణిమీద కూడా రుూ బలప్రదర్శన జరిగితే, ఆమెకూ ఎంతో బాధ ఉండాలి కదా! ఆ ఊహ తనకి రాలేదంటే తానిప్పుడు ఊహించిన విధంగా శరీరం తుక్కుతుక్కవదనే అనుకోవాలి మరి! వీరభద్రుడు తాళపత్ర గ్రంథాన్ని భద్రంగా గూట్లో దాచాడు. ఆ తరువాత మూట విప్పి, అందులోంచి ఒక బంగారు నాణాన్ని చేతిలోకి తీసుకొని ఒకసారి పైకి ఎగరేసి, కిందపడకుండా చేతితో పట్టుకున్నాడు.
తనవైపే చూస్తూ, ఎంతో ఉత్సాహోద్రేకాలతో శయ్యవైపు రాసాగాడతను. సరస్వతి సర్దుకుని కూర్చుని పమిటను సరిగా లాక్కుంది. రవిక చిరిగినప్పటినుంచీ ఆమెకు ఎంతో చికాకుగా ఉన్నది. ఊసరవెల్లి వీపుమీద గీరుతూ పైకి పాకుతున్నట్లున్నది. ఇప్పుడు చేయగలిగిందీ లేదు. అందుకని తన సిగ్గునంతట్నీ కాపాడే భారాన్ని పమిటకే అప్పగించవలసి వచ్చింది.
వీరభద్రుడు ఆమె పక్కనే కూలబడ్డాడు; అరచేతిలో ఉంచుకున్న సువర్ణ ముద్రికను ముందుకు జాచి ‘చూడు’ అన్నాడు.
ఆమె ఒకసారి ముఖం అటు తిప్పి, క్రీగంట చూసి, వెంటనే ఇటు పక్కకు తిప్పుంది.
‘‘ఊ! సువర్ణ ముద్రిక!’’ అన్నదామె.
‘‘ఎందుకో తెలుసా?’’
ఆమె మాట్లాడలేదు.
‘‘నీవు గర్భాదానపు పెళ్లికూతురువి కదా!’’
ఆమె సిగ్గుతో కుంగిపోయింది.
‘‘కన్యను ముందుగా రాజుగారు ముట్టుకోవాలని శాస్త్రం ఘోషిస్తోంది. ఐతే మన ముసలి రాజుకు ఓపిక లేదు. ఈ కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా సాగేందుకు, శాస్తక్రారులు మరో ఉపాయాన్ని కనిపెట్టారు. శోభనపు వధువు చెంగునరాజు బొమ్మ వున్న సువర్ణ ముద్రికను కట్టడం ద్వారా రాజు గ్రహించినట్లే అవుతుందన్నారుగా! అందుకని- ’’ అని వీరభద్రుడు ఆమె పమిట పట్టుకొని లాగి, ఆ కొంగున ఆ సువర్ణ ముద్రికను గట్టిగా కట్టాడు.
బ్రాహ్మణుడైనందుకూ, సద్బ్రాహ్మణుడుగా జీవించేందుకూ ప్రయత్నిస్తున్నవాడల్లే అంతా సశాస్ర్తియంగా కర్మకాండ జరిపేందుకే తహతహలాడుతున్నాడు కాబోలీ వీరభద్రుడు!
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు