డైలీ సీరియల్

దూతికా విజయం-83

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహుశా సావిట్లోకి వెళ్లినపుడు, పంచాంగం కూడా తిరగేసి, ఇది సుముహూర్తమనే విషయాన్ని కూడా తెలుసుకొని ఉండొచ్చు. ఆ ప్రశ్న అడిగితే ఏమంటాడో?
ఇప్పుడొక కొత్త ఊహ ఆమె మనసులో మెరిసింది. ఈ వీరభద్రుణ్ణి ఏడిపించేందుకూ, ఈ ప్రస్తుత పరిస్థితి నుంచి బైటపడేందుకూ ఎంతైనా ఉపయుక్తమయ్యే ఊహ ఇది.
చప్పున లేచి దూరంగా జరిగి, అతన్ని వారిస్తూ, తాను చెరగు మాపుకున్నానంటే! ఇంత నిష్ఠగల బ్రాహ్మణుడు, విధి నిర్ణయానికి తలవొగ్గి దూరం జరుగుతాడు. తనను బహుశా ఈ స్థితిలో ముట్టడు. తన కన్యాత్వాన్ని భద్రంగా తిరిగి రాణివాసానికి తీసుకుని వెళ్లవచ్చు. తాత్కాలికంగా తానీ ప్రమాదం నుంచి బైటపడటం సాధ్యం కావచ్చు.
కాని తరువాతైనా వీరభద్రునితో పని పెట్టుకుంటే అతనికి లొంగక తప్పేదెట్లా? పురుషుణ్ని దయతలచని ప్రకృతి, నెలకు మూడు రోజులే స్ర్తికి ఆ రక్షణను ఇచ్చింది. మిగతా ఇరవై ఏడు రోజులూ ఆమెను పురుషుని పరం చేసింది. ప్రకృతికి కూడా పురుషుడంటే ఎంత వ్యామోహం! ప్రకృతి కూడా స్ర్తియేనాయె!
ఈ క్రియాకాండలోని ప్రతి చిన్న కదలికా, చివరకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా అనేక ప్రణయ శృంగార మహాకావ్యాలను గానం చేస్తూనే వున్నవి. కవులు వర్ణించే ఆ ప్రణయానుభూతి వారి భావాలకు లొంగక, భాషకు వొంగక అన్యాయమైపోయిందనే విషయం తాను ఇప్పుడిప్పుడే అర్థం చేసుకోగలుగుతోంది. కవుల భావాలకూ, భాషలకూ నిజమైన స్వరూపం రక్తమాంసాలతో ప్రత్యక్షమైనప్పుడే కదా తానా భావాలలో దాగిన అనుభూతి విశ్వస్వరూపాల్ని ఆకళింపు చేసుకోగలుగుతోంది?
‘మాయామయం!’ అని వేదాంతులు అన్నారంటే ఎంత మాయ ఇందులో ఇమిడివున్నదో, మరొక మాయకాయంతో కూడనిదే తెలియదు కదా! శరీరం ద్వారా ప్రవేశం లభిస్తేనే కాని ఆత్మను జేరటం సాధ్యమవదేమోననీ, ఇంతకుమించిన సుఖకరమైన అడ్డదారి మరొకటి ఉండదనీ అనిపిస్తోందిప్పుడు.
ఈ సరస సమరంలో ఎవరు గెలిచారనే ప్రశ్న లేదు. గెలుపు ఇద్దరిదీ అవాలి; లేదా ఓటమి కూడా ఉభయులకూ సంబంధించిందిగానే ఉంటుంది. ఇలాంటి విలక్షణ యుద్ధం మరొకటి లేదేమో? ప్రమాదకరమని పొరబడిన రుూ రణం ప్రమోదకరంగా పరిణమించి, విసిరి విసిరిపారేస్తే కొసరి కొసరి కోరికలను కొండల మీదికి పాకిస్తోంది!
ఇంతమాత్రానికే అరగని, కరగని, విరగని, తరగని తన యవ్వన లావణ్యాలను కొల్లగొట్టుతున్నాడీ వీరభద్రుడు. ఐతే అతనికి తెలియకుండానే తనూ అతన్ని దోచుకోవటంలేదా?
తన్మయత్వంతో మూర్ఛపర్యంత వౌతున్నట్లున్నది. ఈ అనుభవాన్ని మాటల్లో ఇతరులకు చెప్పగలగటం మాటటుంచి, తనకు తానే చెప్పుకొనే స్థితి కూడా లేదు. మాటలు ఎంత తూచి, తూచి, ఏర్చి, కూర్చి, పేర్చినా రుూ అనుభూతిని విశదీకరించలేక, భావాన్ని భంగపరుస్తవి. భాషాజ్ఞానం సహాయపడనేరదు; అనుభవాన్ని అనుభవించి తెలుసుకోవలసిందే కానీ, విని, చదివి అర్థం చేసుకోవటం కుదరదేమో? అనుభవం!! దానికదే సాటి కదా!
క్షణాల్లో తన వ్యక్తిత్వమే మారిపోయింది. తగుదునని కర్తగా వచ్చి, కర్మగా మారిపోయింది. చుట్టూ నిర్మించుకున్న నిగ్రహ కవచం, నిప్పు తగిలిన మైనమల్లే కరిగిపోగా, వీరభద్రునికి ఆ నగ్న రూపాన్ని ప్రవేశించటం నల్లేరుమీది బండి నడకయింది.
తన వ్యక్తిత్వమంతా వాయు పదార్థంగా మారి, మాయమవగా, ఏర్పడిన శూన్యమవగా, అది పూరించబడి మరో కొత్త వ్యక్తిత్వం, చిత్రమైనది రూపొందింది!
తనను ప్రేమించటమనేది, ఆ ప్రేమించిన వ్యక్తి తాలూకు చరిత్ర; తాను ప్రేమించటమనేది తన చరిత్ర. కాని తాను ప్రేమించి, ప్రేమించబడటమనేది తన విజయమే అవుతుంది! దీన్ని ప్రేరేపించి విజయవంతంగా నడవగలిగిన వీరభద్రునికి తానెంతైనా కృతజ్ఞత చూపవలసే వుంటుంది.
సుఖం కోసం సర్వకాల సర్వావస్థల్లోనూ ప్రతి ప్రాణీ అవిరామ అనే్వషణ చేస్తూనే వున్నది. అనేక ప్రయోగాలను చేసి సుఖపడదామనే ప్రయత్నాలు జరుగుతూనే వున్నది. ఒక్కటీ సక్రమంగా కుదరక, కుదిరినా అంచనాల ప్రకారం సుఖం దక్కక జీవితమే అసంతృప్తికరంగా ఉంటూన్నది!
అనుభవంలో తప్ప ఆ సుఖం తెలిసిరాదు. తాను కోరింది ఇది కాదనే భావం అప్పుడు కలిగినా ప్రయోజనం లేదు. మరో కొత్త ప్రయోగం చేయవలసిందే కాని ఇంకో దారి లేదు.
ఉదాహరణకు- తన అవస్థ తాను పడి, రాణికి రుూ వీరభద్రుని పొందును సమకూర్చగలిగినా, ఆమె ఎంతవరకూ సుఖపడగలదో తెలియదు. సిద్ధాంతానికీ, ప్రయోగఫలితానికీ ఉండవలసిన తారతమ్యం అనూహ్యం!
అలాంటిది యాదృచ్ఛికంగా సిద్ధాంత, ప్రయోగాలే కాక సత్ఫలితాలు కూడా వెనువెంటనే అయాచితంగా తనకిప్పుడు లభ్యమైనవి. ఈ వీరభద్రుడు తనను కోరటం కేవలం తన దురదృష్టమనిపించిందప్పుడు. ఇప్పుడు ఇదంతా తన అదృష్టమనే నమ్మవలసి వస్తోంది. ఏది అదృష్టమో, ఏది దురదృష్టమో కూడా తెలుసుకోలేని అయోమయావస్థలో కూడా జీవితాన్ని దొర్లిస్తున్నానేమో అనిపిస్తోంది!
రాణి వింత కోర్కెను విని ఆమెకు పిచ్చి పట్టి ఉండాలని తాను భావించింది. ఇప్పుడు తెలుస్తోంది- రాణి ఎంత యథార్థంగానూ, సరిగ్గానూ ఆలోచించగలిగిందో! ఆమె ప్రోద్బలమే లేకుంటే ఈ దివ్యానుభూతి తన చేయి జారిపోయేది కదా!
రాణి ఆశించినదాన్ని, తాను ఎంత ప్రయత్నించినా దక్కించుకోలేదు; తాను కోరకుండానే ఆ మాటకొస్తే ఎంత నిరాకరించినా తనకిది దక్కింది- విధి వైపరీత్యమే అయి ఉండాలి మరి!
రాణి కోర్కెను తానప్పుడు ఎంతో చులకనగా చూసింది. ఇప్పుడు తెలుస్తోంది, అదెంత తీవ్రరూపాన్ని దాల్చేందుకు యోగ్యమైనదో, ఎంత గాఢంగా, గూఢంగా కోరదగిందో, ప్రాణాలను సైతం ఎదురొడ్డి, సాధించదగిందో ఏదైనా తనదాకా వస్తేనే కాని తెలియదనటంలోని రహస్యం ఇదేనేమో?
ఈ కామం ఇంత శక్తివంతమైనది ఎందుకనో కూడ ఆమెకు ఇప్పుడిప్పుడే అర్థవౌతున్నది. మిగతా ఏ అనుభూతిలోనూ పంచేంద్రియాలూ ఒక అన్వయంతో పాల్గొనవు; ఆ ఇంద్రియాలన్నీ ఒకేసారి అనుభూతిని పంచుకోవు. అందుకని కదా కామోపశమనానికి మానవుడు తహతహలాడేది!
మన్మథుణ్ణి పూ విలుకాడనీ, పంచబాణుడనీ అంటారు. బహుశా అతనా పంచబాణాలనూ గురిచూసి, సరిచేసి పంచేంద్రియాలమీదా వేయగల ధీరుడు కనుకనే పంచబాణ నామం సార్థకమై ఉండాలి
మహాసముద్ర మధ్యంలోని దావానలపు వేడికి, ఆవిరయ్యేటంతగా వేడి ఐన నీరు తాడి ఎత్తు ప్రమాణంలో అలలుగా లేచి వొడ్డున తాకి, విరిగి గట్టుమీది నుంచి పొంగి ప్రవహించి, కరిగి, తిరిగి వెనక్కు వెళ్లిపోయే విధంగా వీరభద్రుడు శరీరంలో మంచి ఉద్రేకపుటలలు తెరలు తెరలుగా తెర్లుతూ వెలువడూతున్నవనే విషయం సరస్వతికి స్పష్టంగా తెలుస్తూనే వున్నది.
తను వచ్చిన పనేమిటి- ప్రస్తుతం తాను వహించిన పాత్ర ఏమిటనే ఊహ మనసులోకి రాగానే ఈ వెధవ మనసు విజయాలను కలగాపులగం చేసి, విషతుల్యం చేస్తూన్నదనిపించింది.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు