డైలీ సీరియల్

దూతికా విజయం-89

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నేనా?’’ అని ఒక్కక్షణం ఆలోచించి ‘‘అక్కుపక్షిని సరేనా?’’ అన్నాడు వీరభద్రుడు.
అతని చమత్కారానికి సరస్వతి నవ్వు ఆపుకోలేకపోయింది.
‘‘అంతేకాదు సరూ’’ అన్నాడు వీరభద్రుడు. ‘‘నిశ్చయమైన విషయానే్న నమ్మే తత్వమున్నవాణ్ణి నేను. అందరిలాగా ఒకే దెబ్బకు రెండు పక్షులు పడాలని నేను కోరను. నాకు ఆశ వున్నది; కాదనను. కానీ దురాశ లేదు. అందుకని ఒకే పక్షికి రెండు దెబ్బలు అనే దానిమీద నాకు గాఢ నమ్మకం.. అప్పుడైతే ఆ పక్షి తప్పకుండా పడుతుంది కదా!’’
ఆ మాట వినగానే వెనె్నముక మీద చురుకైన దెబ్బ తగిలినట్లయిందామెకు. సరిగ్గా ఇదే సూత్రాన్ని అనుసరించాలని తాను అనుకున్నది. తన అభిప్రాయాలకూ, వీరభద్రుని ఊహలకూ చాలా సామ్యమున్నది. తత్వానికి సరిపడే దాంపత్యమిది అనిపించిందామెకు.
‘‘మీ తత్వం తెలుస్తూనే ఉన్నది లెండి. మీరేం వివరించి చెప్పక్కర్లేదు’’.
‘‘అంత గ్రహించ గలిగేదానివి నా మనసేమిటో నేను చెప్పకుండానే ఎందుకు తెలుసుకోలేవో అర్థమవటంలేదు!’’’
సరస్వతి వౌనం వహించింది. ఇప్పుడు వీరభద్రుడికి ఏం చెప్పీ లాభం లేదని తేల్చుకున్నది. రేపు తాను రాక తప్పదు. రాణి వ్యవహారం ఏమైనప్పటికీ, తనకే రావాలని మనసు పీకి, పీడిస్తోంది.
వాన ఆగిపోయింది. వీరభద్రుడు దొడ్డివైపు వున్న తలుపు తెరిచి ‘వేగుచుక్క పొడిచింది!’ అన్నాడు.
తాను బయలుదేరి వెళ్ళేందుకు సమయమైనదని సరస్వతి గ్రహించింది.
‘‘నేను చెప్పలా వాన ఆగుతుందని!’’ అన్నాడు వీరభద్రుడు.
‘‘మీరు త్రికాలజ్ఞులు కదా!’’ అని సరస్వతి పరిహాసమాడింది.
‘‘సరూ! ముతె్తైదువకు ఇద్దామంటే కొంపలో పళ్ళు, ఫలాలు లేవు సరికదా తాంబూలం కూడా లేదు. రేపు సరంజామా అంతా జేరుస్తాను..’’ అని, కుంకుమభరిణె తీసి, కొంచెం కుంకుమ రెండు వేళ్ళ నడుమ ఉంచి, సరస్వతి పాపిటలో చారగా ఉండేట్లు వేశాడు వీరభద్రుడు. ఆమె వారించాలని ప్రయత్నించి విఫలమైంది.
‘‘ఏమిటిదంతా? ఈ అలంకరణ దేనికీ?’’ అన్నది సరస్వతి రుసరుసలాడుతూ.
‘‘సౌభాగ్యవతివయ్యావు సరస్వతీ! బ్రాహ్మణ ఆశీర్వాదంతో జరిగిన ఈ కుంకుమ పూజ నిన్ను కలకాలం ముత్తయిదువుగా ఉంచుతుంది. ఇప్పుడు మరో పురుషుడు ఎవరైనా నీ వెంట పడాలనుకున్నా, ఈ గుర్తులు చూసి, పరదార కనుక దూరంగా ఉండాలని తెలుసుకుంటాడు; లేదా నీ అందచందాలకు దాసానుదాసుడై, ఒకవేళ నీ వెంటపడ్డాడో, నీ పాపిటలోని కుంకుమ ఎరుపును మరిపించేవాడి రక్త్ధారలతో భూదేవికే కుంకుమ దిద్దుతాను!’’ అన్నాడు వీరభద్రుడు.
‘‘మీ ప్రతాపాన్ని ప్రకటించుకునేందుకు కుంకుమ అలంకరించి నన్ను ఊరేగిస్తున్నారన్నమాట!.. రహస్యాన్ని దాచటం బొత్తిగా మీ వొంటికి పడదా యేం? బాగుంది వరస! కన్యననే చెప్పుకోవలసిన పరిస్థితుల్లో నా నోటిమాట అవసరం లేకుండానే ఈ బహిరంగ ప్రకటన ఒకటా?’’ అని ఆమె ఆ కుంకుమను తుడిచేసేందుకు ప్రయత్నించింది.
వీరభద్రుడు ఆమె చెయ్యి పట్టుకొని వారిస్తూ ‘‘అపచారం! సుమంగళివిగా మనవలసిన మగువ, శుభసూచకమైన కుంకుమను తడిచివేయరాదు’’ అన్నాడు.
రాణివాసానికి వెళ్ళగానే తుడిచేద్దామని సరస్వతి నిశ్చయించుకున్నది.
‘‘అద్దమూ, దువ్వెనా ఉన్నదా?’’’ అన్నది.
వీరభద్రుడు ఆ గదిలో వెతికి సగం విరిగిన దువ్వెనా, సగభాగమే వున్న అద్దం ముక్కా ఆమెకు అందజేశాడు.
ఆ వస్తువులు చూసి ఆమె విరగబడి నవ్వింది
‘‘వీటిని జాగ్రత్తగా ఉంచండి.. ఎప్పటికైనా పురాతనవస్తు ప్రదర్శనశాలకు అమ్మితే మంచి ధర వస్తుంది!’’ అన్నది.
‘‘నాకున్నవి అవీ.. అయినా వాడి గోళ్ళతో దువ్వెన కన్నా శిరోజాలు బాగా సర్దుకోవచ్చు! రేపు నీవు వచ్చేటప్పటికి అన్నీ మార్చేస్తాను చూస్తూండు’’ అన్నాడు వీరభద్రుడు.
‘‘రేపు నేను వస్తానని ఎవరన్నారు?’’ అన్నది సరస్వతి మొండి దువ్వెనతో చెదిరిపోయిన జుట్టును సరిజేసుకునేందుకు నానా అవస్థాపడి, అది లాభం లేదని గోళ్ళనే ప్రయోగించింది.
‘‘నేనే అంటున్నాను. నేననగా ఎవరు? నీ నిజ భర్తను. నా ఆజ్ఞను పాలించే మహాపతివ్రతవైన పడతివి నీవు’’
‘‘అబ్బో! చాలా దూరం వెళ్లిందే వ్యవహారం!’’
‘‘ఇంకా వెళ్తుందిలే.. భయపడకు.. రేపు చీకటిపడే వేళకే రా.. వీధి గుమ్మాన రానవసరం లేదు. దొడ్డి తలుపు దగ్గరేసి ఉంచుతాను. ఈ గది తలుపు కూడా దగ్గరేసి ఉంచి, నీ కోసం కళ్ళల్లో వొత్తులు వేసుకుని ఈ గదిలోనే కాచుకుని ఉంటాను. ఒకవేళ నేను ఇక్కడ లేకపోయినా నీవు లోపలికి వచ్చి విశ్రమించు. నేను త్వరలోనే నీకు దర్శనమిస్తాను. ఏం భయం లేదు తెలిసిందా?’’
‘‘తెలుస్తూనే వుంది. నేను రాను. నా కోసం మీరు కళ్ళల్లో వొత్తులు వేసుకుంటే, అవి మండేందుకు బహశా మీ శరీరంలోని కొవ్వంతా తైలమే ఇగిరిపోతుంది. అందుకని నాకోసం ఎదురుచూడొద్దు’’ అన్నది సరస్వతి నిశ్చయాన్ని సూచించే కంఠస్వరంతో.
‘‘అట్లాగా? ఎలా రావో చూస్తాను.. రాకపొయ్యావో నేనే రాణివాసానికి బయలుదేరవలసి వస్తుంది జాగ్రత్త!’’
‘‘జాగ్రత్తపడాల్సింది మీరు! ద్వారపాలకుల చేతుల్లోని వాడి ఆయుధాలకు బలికావలసి వస్తుందని మాత్రం గుర్తుంచుకోండి’’ అన్నది సరస్వతి.
‘‘మకరధ్వజుని వాడి శరాలకన్నా, ద్వారపాలకుల పదును తేరిన ఆయుధాలే నయంలే!’’
‘‘ఆ సంగతి త్వరలోనే తేల్చుకుంటారుగా- ఊహించి ప్రయోజనం ఏమిటి?’’ అన్నది సరస్వతి.
వీరభద్రుని ముఖం వెలవెలబోవటం గ్రహించిందామె.
‘‘సరూ నిజంగా రావా?’’ అన్నాడు వీరభద్రుడు దీనంగా.
‘‘రాను, ఇవాళ మీరు చేసిన మర్యాద చాలు!’’
‘‘నావల్ల అపచారాలు జరిగితే మన్నించు, నీవు లేకుండా బతకలేను!’’
తన మనసు కరిగిపోయే మాటలుగా తోచినవి ఆమెకు. ఐనా కూడా వీరభద్రుణ్ణి మరి కాసేపు ఏడిపిద్దామని ఆమె అన్నది. ‘‘అబ్బో! గాయపరచటం, ఆ తరువాత కట్లుకట్టి ఊరడించడం శతమర్కట స్వరూపులైన మీ బ్రాహ్మణులకు మర్యాదా, ఆచారమూ కాబోలు!’’
రాణివాసపు రమణులమీద తాను ప్రయోగించిన మాటల్నే తిప్పి తనమీద ఈమె విసిరివేసిందని వీరభద్రుడు గ్రహించాడు.
ఆమె మాటలకు జవాబు దొరక్క వౌనం వహించాడు.
సరస్వతి జుట్టు సరిజేసుకోవటం ఇంకా పూర్తికాలేదు. రవికె కుట్లు మరో రెండు టపటపమన్నవి.
‘‘ఈ రవికె రాణివాసం జేరేటంతవరకైనా వీపున ఉండేనా?’’ అన్నదామె స్వగతంలోవలె, నాయకునికి వినిపించేట్లుగా.
‘‘పోనీ మళ్లీ కుడతాను’’ అని వీరభద్రుడు ముందుకు వంగాడు.
‘‘అక్కర్లేదు’’ అని ఆమె అతన్ని చేత్తో దూరంగా తోసింది.
ఆమె అద్దంలో ముఖాన్ని చూసుకుంటూ ‘‘చూడండి.. ఎంత పనిచేశారో!
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు