డైలీ సీరియల్

దూతికా విజయం-90

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుూ పెదవుల మీద వరసాగ్గా మీ పంటి గుర్తులు. ఎలా కందిపోయినవో!’’ అన్నది, చిమచిమలాడుతున్న పెదవులను నాలికతో రాచుకుంటూ.
ఇంతకుముందు రుూ బాధ తెలియలేదు; సరికదా మహదానందంగా వున్నది. ఆ ‘బాధానందం’లోంచి మొదటిదైన బాధ ఒక్కటే ఇపుడు ప్రత్యక్షమైంది.
వీరభద్రుడు చిరునవ్వు నవ్వుతూ ‘‘అది ‘మణిమాల’ అనే దంతక్షత ప్రయోగం ప్రేయసీ! ప్రియుడు తన జ్ఞాపకార్థం వేసిన ముద్రరా!’’ అన్నాడు.
‘‘రాణి అడుగితే ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియటంలేదు!’’
‘‘చెప్పు! మదన కదనంలో తగిలిన గాయాలి! వీరభద్ర విజయ చిహ్నాలని! కామదేవుని కామితార్థాలని! రాణి నీ రసికత్వానికీ, ఎదురాడి పోరాడగలిగినందుకూ ముఖ్యంగా ఆమె ప్రేరేపించిన రణ రంగంలో పాల్గొన్న ధీరురాలువి కనుకా, క్షతగాత్రివి కనుకా నీకు సల సేవలూ చేసి, గౌరవించక మానదులే! అనంగ రంగంలో ఆనందంతో, ఆత్రుతో ఆవురావురుమంటూ పాల్గొన్న అంగాలమీద పంచబాణుని నిశిత శరాలముద్రలే కాని వేరేమి కావని వివరించు. రసమయిగా పేర్కొన్న మీ రాణికి ఆ మాత్రం అర్థం కాకపోదులే.. అదంతా అలా ఉంచు, నీవు నా మీద ప్రయోగించిన దంత, నఖ క్షతాలూ, మెడమీద వాడి ఐన గోళ్లు దిగబడేట్లు పీకిన రక్కుల్ని గూర్చి నా మిత్రులెవన్నా అడుగుతే నేనేం చెప్పాలో?’’
‘‘చెప్పండి. వేటాడబోగా ఎదురు తిరిగిన ఆడపులి చేసిన గాయాలని! కామ రంగంలో భరతనాట్యమాడిన కామదేవుని పద చిహ్నాలని! మదవతి ఐన మగువ మాన మర్యాదల్ని మంటగలిపి, మలినపరచటంలో ముందు వెనుకల ఆలోచనే లేక మకరధ్వజుని నిశిత శరాల తాకిడికి అరమరికలు లేని మరకలని! దూతికా విజయానికి చెరగని గుర్తులని! వేటగాడు నిలబడి పోరాడి క్షతగాత్రులైనందుకు మీ మిత్రులు మెచ్చి మీకు సకలోపచారాలూ చేసి గౌరవిస్తారులెండి!’’ అన్నది సరస్వతి.
‘‘సరే.. దానికీ దీనికీ చెల్లు!.. పోతే మీ రాణి నా రసికత్వపు గుర్తులు చూసి, నన్ను మెచ్చుకొని నీ ద్వారా మరిన్ని బహుమతులు అందజేయక తప్పదులే!’’
‘‘రాణి బహుమానాలు అక్కర్లేదన్నారుగా!’’
‘‘ఆ బహుమతులకు ప్రతి బహుమానాలు కోరకుండా ఉంటేనే కదా. అవి నిజమైన బహుమానాలయ్యేది! అలాటివి మెచ్చి యిచ్చినవి స్వీకరించనన్నానా?’’ అన్నాడు వీరభద్రుడు.
‘‘అన్నీ మీకు వీలుగానే ఉండేట్లు చూసుకుంటారండీ!’’
సరస్వతి అంతా సర్దుకుని వెళ్ళేందుకు నిలబడింది.
‘‘రేపు ఎప్పుడొస్తావూ?’’ అన్నాడు వీరభద్రుడు.
‘‘రేపు రానని చెప్పలా? మాటిమాటికీ ఎందుకు అడుగుతారు?’’ అన్నదామె.
‘‘రావన్నమాట!’’
‘‘రాను.. రాను.. రాను!’’
‘‘నువ్వసలు ఇక్కణ్నుంచి ఎలా వెళ్తావో చూస్తాను. నువ్వు బైటికివెళ్తే కదా, మళ్లీ వస్తావో రావోననే అనుమానం! కదులు చూస్తాను!’’ అని వీరభద్రుడు రెండు చేతుల్ని జాపి అడ్డుగా నిలబడ్డాడు.
ఇదంతా నిజమేననుకుంటున్న వీరభద్రుని అమాయకత్వానికి సరస్వతి లోలోన నవ్వుకున్నది.
ముఖమంతా ఎర్రనయ్యే విధంగా చేసుకొని రోషాన్ని నటిస్తూ ‘ఏమిటీ దౌర్జన్యం? ఆడపిల్లలమీద అయితే ఒంటికాలుతో లేస్తారా? నన్నిక్కడ బందీని చేస్తే- నేనిక్కడికి బయలుదేరానని మా రాణికి తెలుసు. ఉదయానికల్లా రాణివాసానికి తిరిగి రాకపోతే ఆమె రాజభటుల్ని ఇక్కడికి పంపుతుంది, జాగ్రత్త!’’ అన్నది.
‘‘రాజభటుల్ని రానీ చూస్తాను.. అన్నట్టు ఆ రాజభటులు ఇంకా ఆ అరుగులమీదనే ఉన్నారేమో! వాన వెలిసిందిగా బహుశా వెళ్లిపోయి ఉంటారనుకుంటాను.. ఇక మీ రాణి పంపగా వచ్చే రాజభటులకు అసలు నీవు ఇక్కడికి ఎందుకొచ్చావో, నీ కథేమిటో, అన్నీ వివరంగా చెప్పుదువు కానీలే చూస్తాను!’’ అన్నాడు వీరభద్రుడు పట్టుదల సూచిస్తూ.
వీరభద్రుడు చెప్పింది చాలా సబబుగా ఉండటంవల్ల సరస్వతికి ఎదురాడే అవకాశం లేకపోయింది. కనుక విధిగా ధోరణి మార్చింది.
‘‘మిమ్ము బతిమాలుకుంటాగా! నన్ను వెళ్ళనివ్వండి!’’
‘‘అందితే జుట్టు, లేకపోతే కాళ్లూనా? ఇదీ రాచనగరు మర్యాదేనా!’’ అన్నాడు వీరభద్రుడు.
‘‘అవతల తెల్లారిపోతోంది. మీకేం సుఖంగా, భద్రంగా ఇంట్లో కూర్చుంటారు. నేనేమో రాచనగరుకు నడిచి వెళ్లాలి. ఎవరైనా చూస్తే ఎంత ప్రమాదమో చెప్పండి. ఆడకూతుర్ని అంత క్షోభ పెడుతున్నారు!’’ అన్నదామె నిష్ఠూరంగా.
‘‘అందుకే అసలు వెళ్ళొద్దంటున్నాను. ఇక్కడే ఉండిపో...!’’
‘‘నాకక్కడ ఉద్యోగం కదా! వెళ్లకుండా ఎలా!’’
‘‘ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి, ఇక్కడ ఈ గృహిణి ఉద్యోగాన్ని వెంటనే స్వీకరించు!’’
‘‘రాజులతో చెలగాటమా! మీకేం మతిపోయిందా! నన్ను ఎలా పోషిస్తారు! మీకే కొలువు లేక నానా బాధా పడుతున్నారు కదా!’
‘‘రవికెలు కుట్టయినా సరే సంపాయిస్తాను!’’
ఆమె పకపకా నవ్వి ‘‘ఈ మాత్రం దర్జీవాడు ఇంకెవరికన్నా దొరుకుతాడా? నా రవికె కనుక సరిపోయింది. ఇంకెవరినన్నా మీ రవికె కుడతాను విప్పి ఇవ్వండి అంటే మీ శరీరంలోని మట్టపల్లాలు సమ మట్టానికి వస్తవి. వెనకాల అప్పుడే ఎన్ని కుట్లు తెగినవో!’’ అన్నది సరస్వతి.
‘‘పోనీ ఏదో నా అవస్థ నేను పడి నిన్ను పోషిస్తానుగా! నిన్ను ఎప్పుడైతే ఇల్లాలుగా గ్రహించానో అప్పటినుండే నీ పోషణ బాధ్యత నాది. అందుకని నీవు ఇక్కడే వుండు!’’ అన్నాడు వీరభద్రుడు బతిమాలే ధోరణిలో.
‘‘ఇది తెల్లారేలోగా తేలేదేనా? మార్చుకునేందుకన్నా బట్టలు లేవు కదా! నా మాట విని నన్ను వెళ్లనివ్వండి. మళ్లీ వాన వస్తుందేమో!’’ అన్నది సరస్వతి.
‘‘ఇది ఇప్పుడు తేలదని నేనూ ఒప్పుకుంటనా. అందుకనే రేపు రాత్రికి రమ్మంటున్నాను. మనం మాట్లాడుకోవలసింది బోలెడు ఉన్నది. వస్తావా? రావా? చెప్పు’’
‘‘వొస్తాను!’’ అన్నదామె ఒక్కో అక్షరమే నొక్కుతూ.
‘‘అలా దారికి రా! నాకు తెలుసు సరూ! మగాడ్ని కనుక నీ మీద ప్రేమను దాచుకోలేక బైటికి కక్కాను. ఆడదానివి కనుక నీ గాఢానురాగాన్ని ఎంతో గూఢంగా హృదయంలో గూడుకట్టుకొని భద్రంగా దాచుకున్నావు! అవునా?’’ అన్నాడు వీరభద్రుడు.
వీరభద్రుడు సరిగ్గా గ్రహించినందుకు సరస్వతి కించపడింది. అయితే తన అభిప్రాయాన్ని పైకి చెప్పకుండానూ, అతని ప్రశ్నకు సూటిగా జవాబు ఇవ్వకుండానూ, ధోరణి మార్చింది.
‘‘మరి వెళ్ళిరానా!’’
‘‘రేపు చీకటి పడుతుండగానే వస్తావా?’’
‘‘ఊ’’
‘‘ప్రమాణం చెయ్!’’
‘‘నామీద అంత నమ్మకం లేదా?’’
‘‘ఎందుకైనా మంచిది. ప్రమాణం చేస్తే నీకేమన్నా ప్రమాదమా?’’’
‘‘ఊఁ’’ అని ఆమె విసుగు నటిస్తూ, వీరభద్రుడి చేతిలో చేయి వేసింది. ఆ చేతిని అలాగే ముందుకు లాక్కొని, ఆమెను బిగియార కౌగిలించుకొని వీరభద్రుడు ముద్దాడాడు. మళ్ళీ రెండు కుట్లు టపటపమన్నవి.
- ఇంకాఉంది