డైలీ సీరియల్

దూతికా విజయం-99

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరస్వతిని ఎంతో గర్వం ఆవహించింది. జఘనాలను విలాసంగా, వయ్యారంగా కదుపుతూ, బిగీ బింకం ఉండి పరిపూర్ణ రూపాన మొనలుదేరిన రొమ్ములను ముందుకు విసిరి వేస్తూ, చూపుల్లోనే సవాలు చేసే ఘన స్వాగతాలను పొందుపరిచి, అలవాటైన వీరభద్రుడు సైతం హఠాత్తుగా చూస్తే తన ప్రేయసేనా అని క్షణం నిర్ఘాంతపోయి, కొత్త రూపురేఖలు దిద్దుకున్న ఈ సుందరాంగి తనదేననే ఊహలో పరవశుడయ్యే విధంగా ప్రవర్తించి, సఫల ఐనదామె.
తదనుగుణంగా వీరభద్రుడు ఆమెను కాలు కింద పెట్టనీయదలచలేదన్న విధంగా రెండు చేతుల మీదా ఎత్తుకొని ముద్దాడుతూ మోసుకొని పోసాగాడు.
ఈ ఉదయం తాను వెళ్ళేప్పుడు రాత్రి భోజనం విషయమే ఆమెకు గుర్తుకు రాలేదు. ఆ సంగతి చెప్పకుండానే వీరభద్రుడు ఎలా గ్రహించి వంట పూర్తిచేసి ఉంటాడో ఆమె ఊహించలేకపోయింది. ఇంత కుశాగ్రబుద్ధి గల నాయకుడు తనకు లభ్యపడటం నిజంగా తన అదృష్టమే!
వంటింట్లో ఎదురుబొదురుగా రెండు పీటలు దగ్గర దగ్గరగా వేసి ఉన్నవి. ఒక పెద్ద అరిటాకు మడిచి దానిమీద ఖాళీ మరచెంబు అమర్చబడి వున్నది. ఈ అరమరికలో రహస్యం ఏమిటో ఆమెకు తెలియలేదు.
మరచెంబు నిండా నీరు నింపాక, వడ్డన సామగ్రి అంతా దాపులో వుంచి, వీరభద్రుడు సరస్వతిని ఒక పీట మీద కూర్చోబెట్టి ఎదురు పీటమీద తాను కూర్చున్నాడు.
‘‘ఒకే విస్తట్లోనా?’’ అన్నది సరస్వతి వీరభద్రుని పథకం అర్థమై.
‘‘తప్పేమిటి సరూ! ఒకే కంచం, ఒకే మంచం అన్నారు!’’
‘‘వొద్దండీ.. తప్పు..’’
‘‘నా ఎంగిలి నీకు పనికిరాదా?’’
‘‘మీరు ఉత్తమ కులజులు.. బ్రాహ్మణులకు.. నా బోటిదాని ఎంగిలి..’’
‘‘కులగోత్రాల ప్రస్తావన ఇక్కడ వద్దు. నీ అధర మాధుర్యంలో తోచని ఎంగిలి, భోజన సమయంలో అడ్డుపడుతుందా?’’
ఇక ఆమెను మాట్లాడనీయకుండా వీరభద్రుడు వడ్డన పూర్తిచేశాడు. వంటకాల రుచి వాటి నుంచి వెలువడే ఘుమఘుమలే తెలియజెపుతూన్నవి. పాయసమూ, గారెలు, పిండి వంటలు కూడాను!
వీరభద్రుడు కలిపి ముద్దలు చేసి సరస్వతి నోటికి అందిస్తూంటే, ఆమె కూడా ముద్దలు కలిపి, ముద్దులు నంజి, వీరభద్రునికి ఆరగింపు చేయసాగింది.
‘‘అబ్బ! నేనింక తినలేను!’’ అని ఆమె మూతి ముడుచుకుంటే, వీరభద్రుని ముద్దుతో పెదవులు విడివడగా, సరస్వతి నోటిలోకి ఒక్కో ముద్దే జొరబడసాగింది.
‘‘మీకో నమస్కారం.. చాలు.. కడుపు.. నిండిపోయింది!’’
‘‘అప్పుడే కడుపా?’’ అన్నాడు వీరభద్రుడు పక్కవాటుగా చిలిపిగా చూస్తూ.
సరస్వతికి పొలమారింది. వొళ్లంతా ఒక్కసారిగా తీవ్రంగా జలదరించింది. ఎంతో సిగ్గుపడిపోయి ముడుచుకొనిపోతే వీరభద్రుడు ఆమెను పొదివి పట్టుకొని తల మీద చిన్న దెబ్బవేశాడు.
‘‘ఏం, వంట బాగాలేదా? పదార్థాలు రుచిగా లేవా?’’ అన్నాడు వీరభద్రుడు, మాట తప్పించి ఆమెను బిడియం నుంచి రక్షిద్దామని.
ఈ చిలిపివాడు వాటం చూసి ఏదో విధంగా తనను ఏడిపిస్తూనే ఉన్నాడు. నాయకుని తెలివి ఈ ప్రయోగాల ద్వారా తనను గాయపరుస్తూ ఆనందంలో ముంచుతూనే వున్నది. తానిప్పుడు అతన్ని ఎదుర్కోలేదు; దానికీ సమయం రావాలి. అంతవరకూ తాను ఉడుక్కోకుండా ఉంటే అప్పుడే అతను కూడా ఈ విధానం నిష్ప్రయోజనమని మిన్నకుంటాడు.
అసలే విశేషమూ జరుగని విధంగానే ప్రవర్తించాలనుకున్నది. వీరభద్రుడన్న మాట కడుపులోంచే దూసుకొచ్చినట్లయి ముక్కు దగ్గర చిరుచెమట్లు పట్టినాయామెకు.
తాను ప్రతిరోజూ రాజభవనంలో రకరకాల మాంసాహారాలతో రాజభోజనమే చేస్తూంటుంది! అంతకన్నా రుచిగల పదార్థాలు ఈ భూ వలయంలోనే ఉండవని ఆమె నమ్మింది. వెధవ శాకాహారాలనే తక్కువ అభిప్రాయం ఇంతకు ముందు దాకా ఆమెకు దృఢంగా ఉండేది. ఈ భోజనంతో తన అభిప్రాయం తల్లకిందులైపోయిందని ఆమె గ్రహించక తప్పలేదు. వంటకాల రుచులతో, అవి వడ్డించబడిన విధానమూ, ఆదరణతో, అనురాగంతో తినిపించే ప్రియుని సన్నిధిలో రాజ భోజనాన్ని మరిపించే ఈ దివ్య భోజనపు రుచిని వెల్లడించేందుకు ఆమెకు మాటలే కరువైనవి.
ఐనప్పటికీ వీరభద్రుణ్ని ఏడిపించే ఉద్దేశంతో ‘‘మొగాళ్ల వంట ఏం బాగుంటుందిలే!’’ అన్నదామె.
‘‘అట్లాగా? తద్దినపు బ్రాహ్మడల్లే తెగ తిని ఇప్పుడు తెగడుతున్నావా? వంటకాల రుచి, తినటాన్నిబట్టే ఉంటుందంటారు. వంటలో మగవాళ్ళదే పైచేయి, అందుకనే నలపాకం, భీమపాకం అన్నారు. నాది భీమపాకమేని అనేకులు ఒప్పుకున్నారు!’’
‘‘్భమబలమని ఒప్పుకొని ఉంటారు!’’
‘‘రెండూనూ.. రెంటినీ అనుభవపూర్వకంగా అనుభవించినదానివి నీకు నేను వేరే చెప్పాలా? వంట చేతనైన భర్త దొరకటం నీ అదృష్టమనుకోవేం?’’’
‘‘కుట్టు పని కూడా చేతనైన భర్త అనలేదు నయం!’’
‘‘‘అది చేసే చూపాను కదా సరైన గుడ్డ ఉంటే కుట్లు సరిగ్గా పడతాయ్!’’’
‘‘అబ్బ!.. ఇంక చాలండీ.. లేద్దాం..!’’ అన్నదామె, తేపుతూ.
‘‘ఈ గడ్డ పెరుగు ముద్ద పారేయవచ్చునా? మీగడ కూడా వున్నది. ఇది చివరి ముద్ద’’ అని ఆ కొసరు కూడా ఆమె ఆరగించే వరకూ వీరభద్రుడు వదలలేదు.
వీరభద్రుడు ఎంగిలాకు ఎత్తబోతుంటే ఆమె వారించి, ‘‘ఆడదాన్ని నేనిక్కడ ఉండగా తిన్న విస్తరి మీరు ఎత్తుతారా? పురుషుడనే అహమన్నా అడ్డు రాలేదా? విన్నవాళ్ళు నేనేమో మిమ్ము కొంగున ముడి వేసుకున్నానని అనుకోరా? మీరుండండి. నేను ఎత్తేస్తా!’’ అని వీరభద్రుణ్ణి అవతలికి నెట్టి ఆమే ఆకు ఎత్తి శుభ్రం చేసింది.
‘‘ఇక శయన గృహానికి’’ అన్నాడు వీరభద్రుడు.
‘‘నా శరీరం బరువెక్కి పోయింది. నేను లేచి నిలబడే స్థితిలో కూడా లేను..’’ అని సరస్వతి ఆక్కడే కూలబడింది.
‘‘నీవు నడవాల్సిన పనేముంది రాణీ! నీ ప్రత్యేక వాహనమైన నేనిక్కడ ఉండగా!’’ అని వీరభద్రుడు ఆమెను అవలీలగా ఎత్తుకొని వెళ్లి మంచంమీద కూలేశాడు. ఈ కొత్తది ఎంత మెత్తని పక్కో అప్పుడు కాని సరస్వతికి బాగా అర్థమవలేదు.
సుఖసౌఖ్యాలు ఎక్కడ లభ్యపడుతవో తెలియక, ప్రపంచమంతా పర్యటించవలసిన పనిలేదు తనకు. ఈ పట్టణంలోనే తనకు తెలిసిన ఈ జంట- ఈ గదిలో ప్రణయమే పరుపులుగా తయారైన ఈ శయ్యమీదనే తన సుఖ సౌఖ్యాలు కేంద్రీకరించబడి ఉన్నవని తెలుసామెకు!
కప్పురపు విడియాలు, తాంబూల సేవనా మొదలైనవి పూర్తయినవి.
‘‘ఈ ఫలహారాలన్నీ తిందామనే!’’ అన్నది సరస్వతి.
‘‘ఒక రాత్రివేళ ఆకలైతే ఎలా? ఆ చెంబు నిండా పాలు కూడా ఉంచాను.. పంచదార చిలకలు కావాలా?’’
‘‘నాకేం వద్దు బాబూ! రేపు కూడా భోజనం అక్కర్లేకుండా తినిపించారు!’’ అన్నది సరస్వతి.
‘‘తిన్నది అరిగేట్టు కష్టపడాలి రాణీ! అప్పుడు తిన్నదానికి ఒక ప్రయోజనమూ ధన్యతా ఏర్పడుతవి.’’
అనంగ రంగమంతా ప్రతిఫలించే ఆ అద్దాన్ని గూర్చి సరస్వతి తన అభ్యంతరాన్ని వెల్లడించింది. ఇప్పుడు దాన్ని తొలగించేందుకు వీలులేకుంటే, కనీసం ఒక దుప్పటన్నా దాని మొహాన కప్పమన్నది. కాని వీరభద్రుడు వినలేదు.

- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు