డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 33

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిమ్మల్ని నలుగురి ముందూ నిలబెడతాను. మీరు తప్పొప్పుకుని నా కాళ్లూ, గడ్డమూ పట్టుకున్నా మిమ్మల్ని క్షమించే ప్రశే్న లేదు’’ అంది సామ్రాజ్ఞి.
‘‘ఆ నిర్ణయమేదో ఇప్పుడే తీసుకుని నా మానాన నన్ను వదిలేయవచ్చుగా!’’
‘‘అలా ఎలా కుదురుతుంది? పండు పక్వానికి రావాలంటే సరైన సమయం రావాలి కదా!’’
‘‘ఆరోజు కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను నీలానే. ప్రస్తుతానికి నన్ను వదిలేస్తే నా పని చూసుకుంటాను’’.
‘‘సరే.. ఎన్ని రోజుల ప్రయాణమో తెల్సుకోవచ్చా పోనీ!’’ అంది సామ్రాజ్ఞి.
‘‘మొగుడు పొరుగూరు వెళ్తోంటే అవసరమైనవన్నీ తానే సర్ది ప్రేమగా సాగనంపుతుంది ఏ భార్య అయినా. అది నీకు అలవాటు లేని అవుపోసన కాబట్టి నువ్వా ప్రయత్నం చేయలేదు, సరే!
నేను బట్టలు సర్దుకుంటోంటే పక్కనే చూస్తూ కూర్చున్నావు గానీ నేను ఏమేం సర్దుకుంటున్నానో, నేను సర్దుకున్న సరంజామా నేనెన్ని రోజులు ఇబ్బందిపడకుండా పొరుగూళ్ళో గడిపేందుకు సరిపోతుందోననే విషయాన్ని కూడా గ్రహించే ప్రయత్నం చేయకపోగా.. ‘ఎన్నిరోజుల ప్రయాణ’మని చాలా యాంత్రికంగా, ఎటువంటి స్పందనా లేకుండా చాలా మామూలుగా, పరిచయం లేని మనుషులు అడిగినట్లుగా అడిగావు నువ్వు.
అంటే నేను రెండ్రోజుల్లో తిరిగొచ్చినా, నెల్లాళ్లలో తిరిగొచ్చినా, అసలు రాకపోయినా నీకు ఒకటే! అటువంటిప్పుడు నా ప్రయాణం ఎన్ని రోజులో తెల్సుకుని ఏం చేస్తావు? మీ అమ్మనడిగి నన్ను ఇంట్లో కట్టిపడేసేందుకు కొత్త ఉపాయాలేమైనా తెల్సుకుంటావా?’’ అన్నాడు సామ్రాట్ వెటకారంగా.
‘‘నేనేం మాట్లాడినా విపరీతర్థాలు తీసే మీతో సయోధ్యగా ఉండలనుకోవడం ముమ్మాటికీ తప్పే!
మీరెక్కడికి ఊరేగితే నాకెందుకు? ఎవరితో తిరిగితో నాకెందుకు? మీరన్నట్టు నెల రోజుల తర్వాత కాదు, సంవత్సరం తర్వాత వచ్చినా నేనేం పట్టించుకోను. మీకెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు.
త్వరలోనే తప్పొప్పుకుని మీరు నా ముందు నిలబడే రోజు వస్తుంది. ఆ రోజుకోసం నాకంటే మీరే ఎక్కువగా ఎదురుచూస్తారు తప్పకుండా’’ అంది సామ్రాజ్ఞి.
‘‘అదీ చూద్దాం. ఎవరు ఎవరి దారిలోకి వస్తారో!’’ అన్నాడు సామ్రాట్, సర్దడం పూర్తిచేసిన బ్యాగ్‌ను పక్కనపెడుతూ.

10
‘‘మేడమ్.. నేనిక్కడ కూర్చోవచ్చా?’’
తనను పలకరించిన వ్యక్తివైపు తేరిపార చూసింది సామ్రాజ్ఞి. తర్వాత తాను కూర్చున్న సీటు పైనుంచి తల తిప్పి బస్ నలువైపులా పరికించి చూసి తన పక్కన ఉన్న సీటు తప్ప ఇంకెక్కడా ఖాళీ లేకపోవడంతో ‘‘ఊ’’ అని కిటికీవైపు మరికొంచెం జరిగి సర్దుకుని కూర్చుంది ఆమె.
‘్థంక్స్’ అని తన చేతిలోని బ్రీప్‌కేస్‌ను లగేజ్ రాక్‌లో సర్ది ఆమె పక్కన కూర్చున్నాడతడు.
అప్పటికే టికెట్ తీసుకుని ఉండడంతో పవిట భుజం చుట్టూ తిప్పి కప్పుకుని, కిటికీలోంచి బయటకు చూడసాగింది సామ్రాజ్ఞి.
ఆమె పక్కన కూర్చున్న వ్యక్తి కనుకొసలనుంచి ఆమెను గమనిస్తూ సాధ్యమైనంతవరకూ ఆమెకు తగలకుండా తన సీట్లో బుద్ధిగా సర్దుక్కూర్చుని బస్‌లో ఉన్న జనం వైపు దృష్టిసారించాడు. బస్‌లో ఓ మగాడి పక్కన కూర్చుని ప్రయాణించడం అదే ప్రథమం. కాకపోయినా ఎందుకో ఇబ్బందిగా అనిపించింది ఆ క్షణాన. అతడు బుద్ధిగానే తన పక్కన కూర్చున్నా అతడు వెళ్లాల్సిన ఊరి పేరు చెప్పి టికెట్ తీసుకున్నపుడు ఆమె మనసులోనే నిట్టూర్చింది, ‘ఈ రాత్రంతా ఈ మానవుడి పక్కనే కూర్చుని ప్రయాణించాలా?’ అని.
తన అదృష్టం బావుండి వేరే సీటు ఏదైనా ఖాళీ అయి దానిలోకి తనంతట అతనే మారిపోతే గానీ తను సుఖంగా ప్రయాణం కొనసాగించలేననిపించిందామెకు.
ఆమె తన ఆలోచనల్లో మునిగి ఉండగానో బస్ పూర్తిగా నిండిపోవడమూ, కనీసం పది పదిహేనుమంది సీట్లు లేక నిలబడడమూ, బస్ బయల్దేరడమూ జరిగాయి.
ఎక్కడా ఆగకుండా రెండున్నర గంటలసేపు ప్రయాణించిన తర్వాత బస్ ఒకచోట ఆగింది. డ్రైవరూ, కండక్టరూ దిగడంతో బస్‌లోని జనమంతా బిలబిలా దిగారు.
వారితోపాటు సామ్రాజ్ఞి పక్కన కూర్చున్న వ్యక్తి కూడా దిగాడు. సామ్రాజ్ఞికి దాహంగా వుంది. తనూ దిగుదామనుకుని తటపటాయిస్తూ ఎటూ తేల్చుకోలేక అలానే కూర్చుంది.
చివరకు ఇహ దాహార్తి తట్టుకోలేక దిగుదామనుకునేలోగా కండక్టర్ బస్ ఎక్కి, ‘‘రైట్ పోనీయ్ గురూ!’’ అని డ్రైవర్‌ను తొందర చేశాడు.
ఉస్సురని నిట్టూరుస్తూ ఉండిపోయిన సామ్రాజ్ఞి ముందు చేయి చాపి ‘తీసుకోండి’ అన్నాడామె పక్క సీటులోని వ్యక్తి.
తల తిప్పి పక్కకు చూసిన ఆమెకు తన పక్క సీటు వ్యక్తి చేతిలో సీలు చేసిన కూల్‌డ్రింక్ డబ్బా కనిపించింది.
‘‘చనువు తీసుకుంటున్నానని మరోలా అనుకోకండి. బయట చాలా ఎండగా ఉంది. నిజానికి నాకూ దాహంగా ఉండే క్రిందికి దిగాను. మీకూ దాహంగా ఉండి ఉంటుందనుకుని మీకోసమే తెచ్చానిది. మరోలా భావించకుండా తీసుకోండి’’ అన్నాడతడు. అప్పటికే దాహంతో నోరెండిపోయి నాలుక పిడచ కట్టినట్టుండడంతో పెదాలు విడీ విడనట్టుగా నవ్వుతూ, ‘‘్థంక్స్’’’ అని అప్రయత్నంగా ఉంటూ అతడి చేతిలోంచి కూల్‌డ్రింక్ డబ్బానందుకుని సీల్ తెరచి గటగటా త్రాగింది. తర్వాత పర్స్ తెరిచి యాభై రూపాయల నోటు తీసి అతడికందించబోయింది.
‘‘్ఛ..్ఛ.. దాహంతో వున్న తోటి ప్రయాణికురాలికి ఆ మాత్రం సాయం చేయడానికి నేను తగనా?’’ అన్నాడతడు ఇబ్బందిగా మొహం పెట్టి.

-ఇంకా ఉంది

సీతాసత్య