డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 38

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నువ్వెవరో, నేనెవరో అన్నట్టుగా పదిమంది ముందూ ఉన్న ఆమె.. ఇక్కడ ఇలా ఒంటరిగా ఉండవలసి వచ్చేసరికి- తన స్ర్తిత్వాన్ని తనే విశే్లషించుకునే గందగోళంలో పడి.. తనలో మగాణ్ణి ఆకర్షించే లక్షణాలు అసలున్నాయా, లేవా? అని తన అంతశే్చతనలోని ఆలోచనల్ని నిర్మొహమాటగా బయపెట్టే ధైర్యం తెచ్చుకుంది’’.
‘‘చూడండీ.. మీ మనసులోని సంఘర్షణ నాకర్థమైంది. మీరడిగారు కాబట్టి చెప్తున్నాను, మరోలా అనుకోకండి.
మిమ్మల్ని బస్‌లో మొదటిసారి చూడగానే సాధారణంగా అందరు మగాళ్లూ అనుకనే విధంగానే ‘ఎవరోగానీ చాలా బావుందీవిడ!’ అనుకున్నాను.
మీ పక్కన కూర్చుందుకు మీరొప్పుకుంటే బావుణ్ణనుకున్నాను. నా మనసులోని కోరికకు తగినట్టే బస్‌లో మీ పక్కన తప్ప మరెక్కడా ఖాళీ లేదు.
మధ్యలో అప్పుడప్పుడూ మీతో మాట కలపాలని అనిపించినా మీరేమనుకుంటారోనని ఆ ప్రయత్నం చేయలేదు. పెళ్ళైనవాడికైనా, పెళ్లికానివాడికైనా మగాడనేవాడికి స్ర్తిపట్ల ఆకర్షణ ఉండడమనేది సర్వసాధారణం.
ఎవరైనా ఇది కాదన్నారంటే.. వాళ్లు మహానుభావుల కోవలోకే వస్తారు తప్పకుండా. అటువంటి వాళ్లకు నా అభినందనలు!
బస్ ఆగిపోయిన తర్వాత.. మిమ్మల్ని ఈ హోటల్ గదిలోకి తీసుకొచ్చేవరకూ నేను చాలా మానసిక సంఘర్షణను అనుభవించాను.
నేనేం మాట్లాడినా వేరే అర్థం స్ఫురించే అవకాశం వుంది కనుక సాధ్యమైనంతవరకూ వౌనానే్న ఆశ్రయించాను.
ఒక మగాడూ, ఆడదీ ఇష్టపడి శారీరకంగా కలసినంత మాత్రాన ఇద్దరిలో ఎవరి శీలమూ పోయినట్టు కాదు.
శీలమనేది మనసుకు సంబంధించినది. శారీరక కలయిక అనేది శరీరానికి సంబంధించిన ఒక భౌతిక అవసరం. ఆ భౌతిక అవసరాన్ని ప్రేరేపించేది మనసే అనే విషయం అందరూ ఒప్పుకుని తీరాల్సిన వాస్తవం.
ఆకలి వేస్తే అన్నం తినడానికీ, కోరికపుడికే తీర్చుకోవడానికీ పోలికేవిటీ అనొచ్చు. కానీ వౌలికంగా మనం చేసే పనులన్నిటినీ నియంత్రించేది మెదడే!
మనందరమూ కొన్ని అసంకల్పితంగా చేసే పనులూ ఉన్నాయి. కానీ అలా అసంకల్పితంగా మనం చేసే వివిధ రకాల పనులు కూడా ‘ప్రతిసారీ తనను ఇబ్బంది పెట్టకుండా దినచర్యలో ఒక భాగంగా చేసుకుపొమ్మని మనసు ఆదేశించడం వల్ల జరుగుతున్నవే!
అందుకే ఒకరంటే ఒకరికి ఇష్టంలేని ఎంతోమంది భార్యాభర్తలు కూడా అసంకల్పితంగానే శారీరకంగా కలుస్తూ సంసారాలు చేస్తున్నారు.
నావరకూ వస్తే సమాజం సృష్టించిన శీలం అనే పదం మీద ప్రత్యేకంగా నాకెటువంటి పవిత్రమైన భావమూ లేదు.
ఒక మనిషిమీద ఇష్టం పెంచుకుని అతడు లేదా ఆమెను గురించిన శృంగారపరమైన ఆలోచనలతో గడిపే వ్యక్తి ఆయా వ్యక్తులతో శారీరకంగా కలవకపోయినా సమాజం సృష్టించిన ‘శీలం’ అనే పదాన్ని కోల్పోయినట్టే నా దృష్టిలో.
విధివశాన ఎదుటివారి ఇష్టంతో నిమిత్తం లేకుండా శారీరక కలయిక జరిగినంత మాత్రాన శీలం పోయిందనే భావన కంటే మూర్ఖమైన, అనాలోచితమైన ఆలోచన కూడా ఏదీ లేదు నా దృష్టిలో’’ అన్నాడతడు.
విస్ఫారిత నేత్రాలతో అతడు చెప్పేదాన్ని మంత్రముగ్ధలా విన్న సామ్రాజ్ఞి అతణ్ణి అభినందన పూర్వకంగా చూసి ‘‘మీరు మాట్లాడిన మాటలు వింటోంటే ఒక పూర్తి జీవిత కాలానికి సరిపడా అనుభవాన్ని పొందినట్టుగా అనిపిస్తోంది నాకు.
మీరా సోఫాలో ఇబ్బంది పడుతూ మునగదీసుకుని పడుకోనఖ్కర్లేదు. ఇలా వచ్చి ఈ రెండో మంచంమీద దుప్పటి కప్పుకుని హాయిగా పడుకోండి.
నేను పక్కనున్న మంచంమీద ఎటువంటి ఆలోచనలూ లేకుండా సుఖంగా నిద్రపోతాను. నన్ను ఉదయం నిద్ర లేపే బాధ్యత మాత్రం మీదే!’’ అని గదిలోని లైట్ స్విచ్ ఆఫ్ చేసి మంచంమీద పడుకుని నిద్రలోకి జారుకుంది సామ్రాజ్ఞి.
ఉదయం స్నానాదికాలు ముగించుకుని బస్ కోసం ఎదురుచూస్తూ నిలబడి ఉన్నప్పుడు అడిగింది అతణ్ణి, ‘‘నా మనసులో మగాళ్లపట్ల వున్న దురూహల్ని ఏరిపారవేసిన మీకు నా కృతజ్ఞతలు!
ఒక పనిమీద పుట్టింటికి వెళ్దామని బయల్దేరాను. నేను కానీ బోధి వృక్షం క్రింద జ్ఞానోదయమై, సిద్ధార్థుడు బుద్ధుడైనట్టుగా మీ మాటలు లోకాన్ని ఎలా చూడాలో నాకు నేర్పాయి.
నేను తిరిగి బయల్దేరిన చోటికే వెళ్లిపోతున్నాను. నా పేరు మీకూ, మీ పేరు నాకూ ఇప్పటివరకూ తెలియకపోవడం, మనం నిజమని చెప్పినా ఎవరూ నమ్మని నిజం. నా పేరు సామ్రాజ్ఞి. మీ పేరు.?
‘‘గౌతమ్’’ అని అప్పుడే అటుగా వస్తోన్న బస్ ఎక్కి, ఫుట్‌బోర్డ్ మీద నిలబడి చేయి ఊపాడతడు.
11
ఆదరాబాదరాగా భుజానికి వ్రేళ్లాడుతోన్న బ్యాగ్‌తో మెయిన్ గేట్‌లోంచి లోపలికి ప్రవేశించిన సామ్రాట్‌కు గేటుకు ఎడమవైపున వరసగా వేసి ఉన్న కుర్చీల్లో రెండు చేతులూ ఒకదానితో ఒకటి పట్టుకుని ఒద్దికగా కూర్చున్న సాహిత్య కనిపించడంతో ఆనందం గుండెల్లోంచి వెల్లువలా తన్నుకొచ్చిందతడి మొహంలోకి.
ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం రైల్లో బెర్త్‌లు రిజర్వ్ చేయించి ఆమెకు తెలియచేసిన క్షణంనుంచీ అతడి మనసు ఉద్విగ్నతతో కొట్టుకులాడుతోంది.
ఏ క్షణాన్నైనా, ఏ కారణంవల్లనైనా తమ ప్రయాణం ఆగిపోతుందేమోననే ఆలోచన అతణ్ణి స్థిమితంగా ఉండనీయలేదు సామ్రాట్.
తన ప్రతిపాదనకు ఒప్పుకున్న సాహిత్య తీరా సమయం వచ్చేసరికి ఏ కారణం చేతైనా మళ్లీ వెనుకాడుతుందేమోననే సంశయమూ అతడి మనసును దొలుస్తూ వచ్చింది.

-ఇంకా ఉంది

సీతాసత్య