డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-31

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ప్రభూ దొంగను దొంగే పట్టగలడు కదా! ప్రణయారాధకురాలిగా నేను, ప్రణయారాధకుని మనఃస్థితిని తెలుసుకోలేనంత పిచ్చిపిల్ల ననుకున్నారా?’
తనకు దొరికింది ముడిరత్నమనుకున్నాడు సీజర్. కాని, రుూమె మెరుగులు దిద్దుకొని, ధగధగా మెరిసిపొయ్యే రత్నమేనని గ్రహించాడు. అంతేకాదు, వజ్రం వజ్రాన్ని కోయగలదంటారు. ఆ విధంగా రుూమె సాంగత్యంతో తాను మెరుగులు దిద్దుకోవలసిన అవసరమున్నదని ఆయన గ్రహించాడు.
‘‘రాణీ! ఐతే భోజనానికి వెళ్దామా?’’
‘‘చిత్తం- ప్రభూ!’’ అని ఆమె వినయపూర్వకంగా తల వంచింది.
***
రోజు రోజుకూ పరిస్థితులు విషమిస్తున్నవి. ఈ సంగతులు తెలిసి కూడా సీజర్ అంటీ అంటనట్లు ఊరుకున్నాడు. తన సైనికులు అసంతృప్తి చెందారనీ, రోమ్‌కు తిరిగి వెళ్ళేందుకు తొందర పడుతున్నారనీ ఆయనకు తెలుసు. ఐతే ఇక్కక తాడో పేడో తేల్చుకోకుండా రోమ్‌కు తిరిగి వెళ్ళేటంత పిరికిపంద కాదు తాను! అసలు వెళ్ళాలన్నా ఎలా వీలవుతుంది?
తనూ, తన సైనికులూ రుూ కోటలో దాదాపు బందీలుగా ఉన్నారు. తమకు ఆము స్వేచ్ఛను సంపాయించుకునేందుకు, తమ బలం చాలదు. బైటినుంచి సహాయం రావాలి. అటు రోమ్ నుంచీ, ఇటు ఆక్రమిత సిరియానుంచీ ఆశాజనకమైన వార్తలు రావటంలేదు. తన అధికారాన్ని కాదనే సాహసం ఎవ్వరికీ లేదు. అయినప్పుడు అనవసర కాలయాపన ఎందుకు జరుగుతుందో సీజర్‌కు అంతుపట్టలేదు.
అయ్యేదేదో అవుతుందని సీజర్ మొండికెత్తాడు. గంభీరంగా ప్రతిదీ దిగమింగుతున్నాడే కాని, తీవ్రంగా ఆలోచించలేకపోతున్నాడు. అటు ఈజిప్షియన్లు కూడా యుద్ధ సన్నాహాలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నారే కాని, యుద్ధం మాత్రం ప్రకటించలేదు. రోమన్‌ల పరాక్రమాల తాలూకు కథలు విని ఉండటమే వారకి పిరికిమందు పెట్టింది. ఈనాటికీ సీజర్‌ను బందీగా కాకుండా ప్రభువు వలెనూ, రారాజువలెనూ, అత్యంత గౌరవనీయుడైన అతిథివలెనూ సత్కరిస్తునన్నారు. రెండు సింహాలు పోరాడటానికి తయారయే ముందు శక్తినీ, ఆవేశాన్ని పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుంది- వారి ధోరణి.
‘‘మనమంతా ఇక్కడ, రుూ కోటలో బంధించబడ్డాము. కాని నాకు మాత్రం రెండు బంధాలు. మొదటిది ఈజిప్షియన్ సైన్యలు బంధించినది. ప్రయత్నించితే వాటినుంచి బైటపడగలను. కాని, రెండోది=- ఈ రాచకన్య బంధం! దీని నుంచి మాత్రం ఈ జన్మలో నేను స్వేచ్ఛ నాశించను- అది అసంభవం కూడాను!’’ అన్నాడాయన ఒకనాడు క్లియోపాత్రాతో.
ఆమె తన అందచందాలకు గర్వపడుతోంది. సీజర్ లాటి మహా పురుషుణ్ని కొంగున ముడేసుకోగలిగింది. తాను అసామాన్యురాలననే సంగతి ఆమె కూడా గ్రహించింది.
‘‘మీతోపాటు బందీగా ఉండటమే నేనూ ఆశిస్తున్నాను ప్రభూ! మన జీవితాలు ఒకే సమాధిలో అంతమయ్యే వరమిమ్మనినా కులదేవతల్ని ప్రార్థిస్తున్నాను స్వామీ!’’ అన్నదామె.
ఇలాంటి మాటల్లో ఆ రెండు మానవ హృదయాలు కరిగి, కన్నీరై, మున్నీరుగా అనేక రాత్రులు గడిపినవి. ఐతే ఆ ప్రణయ పిపాసకులకు కన్నీరే పన్నరుగా పరిణమిస్తున్నది.
ఒకనాడు భోజనంలో విషం కలిపి పంపబడింది. సీజర్ ప్రాణమే తన ప్రాణంగ బావించే క్లియోపాత్రా తెలివిగా, ముందా భోజనాన్ని ఒక బానిస చేత తినిపించింది. వాడు అక్కడే చచ్చాడు.
‘‘నా ప్రాణాలను కాపాడావు రాణీ!’’ అన్నాడు సీజర్.
‘‘కాదు ప్రభూ! నా ప్రాణాలమీది తీపే నన్ను కాపాడుకునేట్లుచేసింది- అంతే!’’’ అన్నదామె.
ఈజిప్షియన్ రాజ్యాంగమంతా పొథినస్ చేతిమీదుగానే నడపబడుతోంది. రోమన్ సర్వాధికారి ప్రాణాలకు ఎసరుపెట్టినవాడు బతికి బైటపడడం కల్ల. ఇక విచారణంటూ జరగకుండానే, పొథినస్‌ను చంపమని సీజర్ ఆజ్ఞలిచ్చాడు. కాని, సేనానులు అభ్యంతరం చెప్పారు.
‘‘మనకు తగిన సహాయమంటూ రాలేదు. అదృష్టవశాత్తూ ఈజిప్షియన్‌లు యుద్ధాన్నింకా ప్రకటించలేదు. మన మీ సమయంలో చెయ్యి చేసుకొని పొథినస్‌ను సంహరిస్తే, అల్లకల్లోలం కాగలదు!’’ అన్నారు వారు.
‘‘ఇది నా ఆజ్ఞ! ఎదురుచెప్పే సాహసం ఎవరికున్నది?’’ అన్నాడు సీజర్, నిప్పులు కురిపిస్తూ.
సీజర్‌కు ఎదురుచెప్పే సాహసముండాలంటే, సీజర్ లాటివారే కావాలి. కనుక మారు మాట్లాడకుండా సేనా నాయకులుపొథినస్‌ను వధించి వచ్చారు.
ఈ సంఘటనతో అలెగ్జాండ్రియా ఉడికిపోయింది. ప్రతి ఈజిప్షియనూ రోమన్‌ల మీద పగ తీర్చుకోవాలనే ఉద్రేకపడుతున్నాడు. పొథినస్ మరణంతో ఈజిప్షియన్ రాజ్యాంగం కార్యాలు కుంటినడకలో పడినవి. టాలమీకి ఏమీ తెలియదు. వాడి ఆశలన్నీ క్లియోపాత్రా మీదనే ఉన్నవి. క్లియోపాత్రా తనకు మరి దక్కదని తెలుసు. కనీసం సీజర్‌ను చంపగలుగుతే, తన కసి తీరుతుంది. అంతకు మినహా వాడికేం అక్కర్లేదు. కాని సీజర్‌ను చంపటం మాటలతో అయేది కాదని ప్రతివారికీ తెలుసు!
అందరూ అనుకున్నట్లే యుద్ధం ప్రకటించబడింది. ఇప్పటికీ సీజర్‌కు తగిన సహాయమంటూ రాలేదు. ఐతే అంతవరకూ యుద్ధం ఆగదుకదా! కోటలోని రోమన్ ఆక్రమిత ప్రాంతమంతా ఈజిప్షియన్‌లు ముట్టడించారు. బైటి ప్రపంచంతో అసలు సంబంధమంటూ ఉండకుండా చేసేందుకు వారు ప్రయత్నించారు. ఇంతవరకూ తెరల చాటున బందీగా ఉంటున్న రోమన్‌లు, ఇపుడు ఇనుప చువ్వల వెనుక ఉండిపోయినట్లయింది.
అటు ఓడరేవులో కూడా ముట్టడి జరిగింది. అక్కడ రోమన్‌లు తమ ఓడలను కాపాడుకునేందుకుగాను నానా అవస్థలు పడుతున్నారు. ఈ దృశ్యాలన్నీ సీజర్ రాజ ప్రాసాదం నుంచే చూడగలుగుతున్నాడు. తాను ఎలాగైనా ఓడరేవుకు కొంతమంది సైనికులను జేర్చుకోగలిగి, కొంత భాగాన్ని తన అధీనంలో ఉంచుకోకపోతే, ఈ రాజప్రాసాదమే తనకొక పిరమిడ్ అవగలదు. రేవులో తనవారు లేకుంటే దేవతలు కరుణించి ఒకటి రెండు రోజుల్లో తనకు బైటి సహాయాన్ని జేర్చగలుగుతే ఆ ఓడల్లోంచి సైనికులు దిగి భూమిమీదికి వచ్చేందుక్కూడా అవకాశం ఉండదు.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుండగా క్లియోపాత్రా చక్కని సలహా ఇచ్చింది. కోట వెనుకనుంచి, ఓడరేవుకు- ప్రస్తుతం రోమన్‌ల అధీనంలోవున్న భాగానికి జేరేందుకు రహస్య మార్గమొకటి వున్నది. ఈ విషయం రాజ వంశీయులకు మాత్రమే తెలుసు. టాలమీ ముట్టిబుర్రకు ఈ సంగతి గుర్తుండదు కనుక, ఆ మార్గంలోనుంచి తాము సురక్షితంగా వెళ్ళగలుగుతారని కూడా అతను ఊహించి ఉండడు. ఐతే పట్టపగలు అటుగుండా రోమన్ సైనికులు దాటుతే చాలా ప్రమాదం. ఎందుకంటే ఈజిప్షియన్ సైనికులే కనుక వీరిని చూస్తే బోనులోనుంచి వెలువడే చిట్టెలుకల్ని సంహరించడం ఎంత తేలికో వారు రుజూ చేస్తారు.
అందుకని అర్థరాత్రి సీజర్ తన సైనికులందరితోనూ రహస్య మార్గం గుండా ఓడరేవు జేరాడు. తన ఆరో ప్రాణమనుకునే క్లియోపాత్రాను కూడా వెంట తీసుకుని వెళ్ళాడు.
తెల్లారితే, తిరిగి యుద్ధం చేయవలసి వస్తే, రుూ సముద్రమంతా రోమన్ శవాలమయవౌతుందని సీజర్‌కు తెలుసు. అందుకని ఏదైనా మాయోపాయంతోనే ఈ యుద్ధంలో గెలవలేకపోయినా, కనీసం కొంతకాలంపాటు రుూడుస్తే రుూ లోపల పరిస్థితులు అనుకూలించవచ్చు.
అందుకని, తెల్లవారకముందే ఒక రోమన్ నౌకకు నిప్పటించి, ఈజిప్షియన్ నౌకల మధ్యకు తోయించాడు.
- ఇంకాఉంది -

ధనికొండ హనుమంతరావు