డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-33

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘రోమన్ ప్రభుత్వం తరఫున, రోమన్ సామ్రాజ్యానికి సర్వాధికారినైన నేను-జూలియస్ సీజర్, రుూ కింది విషయాలను వివరిస్తూ, ఈనాడు రుూ ఆజ్ఞాపత్రాన్ని విడుదల చేస్తున్నాను.
‘‘అనేక సంవత్సరాలుగా రోమ్‌కూ, ఈజిప్టుకూ మైత్రి ఉన్నది. రోమ్ ఈజిప్టునుంచి ఆశించిందేమీ లేదు. ఈజిప్టు కష్టాల్లో వుండగా నిలబడి, దేశంలో శాంతిభద్రతలు నెలకొల్పేందుకుగాను రోమ్ ఎంతో సహాయపడుతూ వచ్చింది.
‘‘ఔలటీస్ టాలమీ పరిపాలనా సమయంలో, ఆయన రోమ్‌లో ఉండగా, ఆయన పెద్ద కూతురు బెరినైస్, తండ్రి బతికి ఉండగానే అక్రమంగా రాజ్యాన్నాక్రమించింది. న్యాయాన్యాయాలను విచారించిన రోమన్ ప్రభుత్వం న్యాయ స్థాపనకు బద్ధ కంకణాన్ని ధరించి, తిరిగి ఔలటీస్ టాలమీని ఈజిప్టు పరిపాలకుడిగా గుర్తించి పంపింది. దేశద్రోహ రాజద్రోహ నేరాలకు గాను బెరినైస్‌కు ఉరిశిక్ష విధించబడింది. ఔలటీస్ టాలమీ బతికి ఉన్న కొద్ది సంవత్సరాలుగా ప్రజారంజకంగా పరిపాలించాడు.
‘‘ఆయన మరణానంతరం ఆయన పెద్దకొడుకు అర్సినొయ్ టాలమీకి, కుమార్తె క్లియోపాత్రాకూ వివాహం జరిగింది. వీరిద్దరూ కలిసి శాంతి భద్రతలో ఈజిప్టు పరిపాలనను కొనసాగిస్తారు కదా అని అటు రోమూ, ఇటు ఈజిప్టు కూడా ఆశించినవి. కానీ, వారిద్దరికీ పొత్తు కుదరలేదు. వంశాచారానుసారంగా అక్కకూ, తమ్మునికీ వివాహమైతే జరిగింది కానీ, ఆ పెళ్లి క్లియోపాత్రాకు ఇష్టంలేదు. రాజవంశంలో పుట్టినా, సామాన్య మానవుకుండేపాటి హక్కన్నా ఆమెకు లేకపోయింది.
‘‘ఇది ఆమె వ్యక్తిగత విషయం గనుక, దీన్ని గూర్చి చర్చించటం అసందర్భమే అవుతుంది. కాని పరిపాలనలో చీలికలంటూ ఏర్పడగానే దేశంలో అశాంతి ఆరంభమైంది. బలవత్తరమైన టాలమీ ప్రభుత్వం క్లియోపాత్రాను దేశ బహిష్కారం కావించింది.
‘‘ఇక్కడి పరిస్థితులిలా ఉండగా, రోమ్‌లో కూడా విషమ స్థితి ఏర్పడింది. సర్వాధికారిగా ఉన్న పాంపే, నిరంకుశంగా పాలిస్తూ నియంతగా అయ్యాడు. ప్రజల పక్షం వహించి, వారి హక్కుల కొరకై పోరాడిన నేను జయించాను. ప్రజాస్వామ్యం నిలబెట్టబడింది.
‘‘ఓడిపోయిన పాంపే ఈజిప్టు వస్తే, నిన్న మొన్నటిదాకా సర్వాధికారీ, రోమన్‌లకు పూజ్యుడూ ఐన ఆయన్ను టాలమీ ప్రభుత్వం ఏ విధంగా గౌరవించిందీ మీ అందరికీ తెలుసు. ఇందువల్ల విజయలక్ష్మిని చేపట్టిన నేను మెచ్చుకుంటానని పాపం టాలమీ ప్రభుత్వం పొరబడింది. ఒకవేళ నేనే ఓడిపోయి, ఈజిప్టు గడ్డమీద కాలుంచినట్లయితే, నా శిరస్సు కూడా కోట గుమ్మానికి వేళాడగట్టేవారే కదా! ఈ విధంగా టాలమీ ప్రభుత్వం రోమన్ ప్రభుత్వానికి ద్రోహం చేసింది. దానికీ నేను ఓర్చాను. ఎలాగైనా టాలమీకీ, క్లియోపాత్రాకూ దాంపత్యం ఏర్పరచి, ఈజిప్టు పాలనను వారికి అప్పగించి, నా దారిన నేను పోదామని ఆశించాను. ఐతే క్లియోపాత్రా, టాలమీతో సఖ్యతగా ఉండేందుకు ఒప్పుకోలేదు. ఆమెను బలాత్కరించటం ఎంత అన్యాయమో, అక్రమమో మీకు తెలియకపోదు.
‘‘ఐనప్పటికీ ఎలాగైనా వీరిద్దరిమధ్యా రాజీ కుదుర్చుదామనే నేను విశ్వప్రయత్నం చేశాను. ఈ మంతనాలు జరుగుతున్న సమయంలో, నామీద విషప్రయోగం జరిగింది. నీ ఇంటికి అతిథిగా వచ్చిన వాడికి, కూలిపోతున్న నీ గృహాన్ని పునరుద్ధరిద్దామని ఆశించేవాడికి జరిగిన మర్యాద ఇది! ఇంతతో పోక, కోటలో నన్నూ, నా అనుచరుల్నీ బంధించాలనీ, మమ్ము మట్టి చేయాలనే దురుద్దేశంతో టాలమీ ప్రభుత్వం ముట్టడి చేసింది. ఇక ప్రాణరక్షణార్థం యుద్ధం చేయక తప్పలేదు.
‘‘క్లియోపాత్రాను టాలమీ ప్రభుత్వం దేశద్రోహిగా గుర్తించింది. ఆమెకు కూడా ఈజిప్టు సింహాసనంలో హక్కున్నదనే సంగతి మీరందరూ అంగీకరిస్తారు కదా! కేవలం తన హక్కును కాపాడుకునేందుకు ఆమె ప్రయత్నించటం న్యాయ సమ్మతం కాదా? యుద్ధ ప్రకటనలో నన్నూ క్లియోపాత్రాను ఒక పక్షం చేసి, ఉభయులూ దేశద్రోహులనే ప్రచారం జరిగింది.
‘‘నా దారిన నేను పొయ్యేవాణ్ణే, కాని ఔలటీస్ టాలమీ రోమన్ ప్రభుత్వానికి ఋణపడి ఉన్నాడు. రోమన్ సర్వాధికారినైన నేను, ఆ ఋణాన్ని వసూలు చేసుకోలసిన అవసరం ఉన్నది. దానికొరకై నేను ఈజిప్టు వస్తే వీరు నా ప్రాణాలకే ఎసరు పెట్టేందుకూ, నాకే ద్రోహం చేసేందుకూ నడుం కట్టారంటే, ఇది మిత్రద్రోహంగాక మరేవౌతుంది?
‘‘టాలమీ ప్రభుత్వం రోమ్ పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తించింది. నేను క్లియోపాత్రా పేరుమీదుగా ఈజిప్టు దురాక్రమణకు సిద్ధమయ్యానని దుష్ప్రచారం చేసింది. నిజమేమిటంటే నామీదనే అన్యాయంగా కత్తికట్టి, రోమన్ సామ్రాజ్యానే్న కూలద్రోసేందుకు టాలమీ ప్రయత్నించాడు.
‘‘సంవత్సరం పైగా సాగిన ఈ యుద్ధంలో అటు రోమూ, ఇటు ఈజిప్టు కూడా చాలా నష్టపడినవి. ఇతర నష్టాలను పూరించుకోవటం సాధ్యం కావచ్చునేమో కాని, ప్రపంచలోకెల్లా గొప్పదైన గ్రంథాలయం బుగ్గయింది. ఆ లోటును మనమెవ్వరం పూరించలేము. శతాబ్దాల తరబడి, ఏర్చి కూర్చబడిన మానవ మేధస్సు గుప్తపరచబడిన ఆ గ్రంథాలయ నాశనం, నిజంగానే మానవ వినాశనం. ఇందుకు రోమన్ ప్రభుత్వ పక్షాన నేనెంతో విచారిస్తున్నాను. మనమందరకూ ఇదొక తీరని లోటును చేకూర్చిందనేందుకు సందేహం లేదు.
‘‘ఈ యుద్ధకారణంగా దేశంలో కరువు కాటకాలేర్పడినవి. టాలమీ ప్రభుత్వం నిరంకుశంగా, నిర్దాక్షిణ్యంగా యుద్ధమనే పేరుతో దేశ స్వాతంత్య్రం కొరకూ, దేశ రక్షణ కొరకూ అని చెప్పుకుంటూ, అక్రమంగా ప్రజలనుంచి అనేక కొత్త పన్నులు వసూలు చేసింది. ప్రజలను పీడించుకొని తిన్నది. ఐతే, దేశానికి వచ్చిపడిన ప్రమాదమేమిటి? అసలు యుద్ధం ఎందుకు ఆరంభమైంది?మన మైత్రికి భంగం కలిగించిందెవరు? కయ్యానికి కాలు దువ్విందెవరు?
‘‘టాలమీ ప్రభుత్వం ఆపాదించినట్లు, మాకు ఈజిప్టును ఆక్రమిద్దామనే ఉద్దేశ్యం లేదనే సంగతి ఇపుడే రుజూ చేస్తాము. నిజానికి యుద్ధంలో గెలుచుకున్న ఈజిప్టు రోమన్ సామ్రాజ్యంలోనే కలిసిపోవాలి. కాని.. దురాక్రమణ పద్ధతిని నిరసిస్తున్నాము. కనుక ఈనాడు ఈజిప్టును సర్వస్వతంత్ర రాజ్యంగా గుర్తిస్తున్నాము.
‘‘ఐతే టాలమీ ప్రభుత్వాన్ని మేము క్షమించలేము. ఆ ప్రభుత్వమే అమాయకులైన మా ప్రజల్ని ఎంతో బాధించింది. ఈనాడు మేము మీ పట్ల చూపుతూన్న సుహృద్భావానికి టాలమీ ప్రభుత్వానికి అర్హత లేదు. కాని, క్లియోపాత్రా రోమన్ మైత్రిని విడనాడక, రోమన్ ప్రభుత్వం పట్ల తన విశ్వాసాన్ని రుజూచేసింది. ఆమె మీకీ విధంగా స్వాతంత్య్రాన్ని సంపాదించిందని ఈజిప్షియన్‌లు గుర్తిస్తారు గాక!
‘‘టాలమీ ప్రభుత్వం దేశ క్షేమానికి భంగం కలిగించింది. టాలమీ దేశద్రోహి అనేందుకు సందేహం లేదు. అతను ఈజిప్టుకూ, రోమ్‌కూ కూడా పరమ శత్రువయ్యాడు. దేశద్రోహ నేరానికిను అతన్ని ఉరి వేస్తున్నాము.
‘‘లోగడ ఔలటీస్ టాలమీ తమ్ముడు- సిరియా ప్రభువు కూడా రోమన్‌ల మైత్రిని అసందర్భంగానూ, అక్రమంగానూ కాలదన్నాడు. ప్రతిఫలంగా సిరియా రోమన్ సామ్రాజ్యంలో కలిసిపోవటం జరిగింది. ఐతే, రుూనాడు క్లియోపాత్రా చూపిన విశ్వాసానికి కానుకగా, సిరియాను ఈజిప్టులో కలుపుతున్నాము. రోమన్‌ల స్నేహ భావానికి ఇంతకన్నా తార్కాణం అవసరంలేదని భావిస్తున్నాము.
‘‘క్లియోపాత్రా చెల్లెలు యుద్ధంలో మరణించింది. టాలమీకి ఉరిపడబోతుంది. పోతే టాలమీ రాజవంశంలో మిగిలినవారిద్దరే ఉన్నారు. ఒకటి- క్లియోపాత్రా, రెండు ఔలటీస్ టాలమీ కడగట్టు సంతానం చిన్న టాలమీ. వీరిద్దరికీ ఈజిప్షియన్ సింహాసనానికి హక్కులున్నవి.

- ఇంకాఉంది -

ధనికొండ హనుమంతరావు