డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 43

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘పోనీలే.. నిరాశపడకు.. కార్యక్రమాన్ని నేనే ప్లాన్ చేస్తాలే!’’ ఈ ఊళ్ళో చూడ్డానికి కైలాసగిరి ఉంది, ఊడా పార్కుంది, సింహాచలనం గుడి ఉంది, సముద్రంలో తిరిగి రావడానికి ఫెర్రీ సదుపాయం ఉంది. బంగాళాఖాతాన్ని ఆనుకుని పొడవైన బీచ్ ఉంది. ముందుగా దైవదర్శనం చేసుకుని తర్వాత మిగిలిన చోట్లకు వెళదాం.
మనమేం చూశామన్నది ఇద్దరికీ అప్రధానమే కదా! ఎంతసేపు మనం కలిసి ఉన్నామనేదే మనిద్దరికీ గణనలోకి తీసుకోవలసిన విషయం కనుక.. ఎటువంటి నిరాశా నిస్పృహలనూ దరిచేరనీయకుండా మన కార్యక్రమం ప్రారంభించుదాం.. సో.. మొదటి అడుగు టిఫిన్ తినడం.
రూమ్‌కి తెప్పించుకుందామా? బయటకు వెళ్లితిందామా? అని నిన్నడగను. బయటకు వెళ్లి రెండు రోడ్లు తిరిగి.. బయటినుంచి మనకు ఏ హోటల్ నచ్చితే ఆ హోటల్‌లోకి దూరి మన అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’ అంటూ రూమ్ తాళం చెవులందుకున్నాడు సామ్రాట్.
టిఫిన్ ముగించుకుని ట్యాక్సీలో సింహాచలం బయల్దేరినపుడు దారిలో అన్నాడు సామ్రాట్, ‘‘గుడి కొండమీద వుంది. ట్యాక్సీలో గుడివరకూ వెళితే మనకు రావాల్సిన పుణ్యంలో కొంత తగ్గిపోతుంది కనుక ట్యాక్సీని కొండ క్రింద ఆపించి మెట్లెక్కి వెళదాం. సరేనా?’’ అని సాహిత్య వైపు చూసి, ‘‘సరే.. సరే.. నిన్నడగొద్దన్నావ్‌గా! నిర్ణయం నేనే తీసుకుంటాను’’ అని సింహాచలం చేరేక ట్యాక్సీని మెట్లదగ్గర ఆపించి ట్యాక్సీ దిగాడు.
రివ్వున వీస్తోన్న గాలికి ఎగురుతోన్న పవిటను సరిచేసుకుంటూ, ‘‘కొండపైకి చేరాలంటే ఎన్ని మెట్లెక్కాలి?’’ అంది సాహిత్య.
‘‘ఏమో.. ఇంతకుముందొచ్చానుగానీ మెట్లదారిలో ఎప్పుడూ వెళ్లలేదు. సుమారు వెయ్యి మెట్లుంటాయేమో!’’ అన్నాడు సామ్రాట్.
‘‘అమ్మో.. వెయ్యి మెట్లే!’’ అంది సాహిత్య అరచేతిని గుండెలమీద ఉంచుకుని.
‘‘్భయపడకు. నాకూ సరిగా తెలీదు. ఒకవేళ నువ్వు మెట్లెక్కలేకపోతే నిన్ను నేను ఎత్తుకుని తీసుకు వెళ్తాలే!’’ అన్నాడు.
‘‘ఆహా.. అందుకేనా పాపం.. మెట్లదారిని ఎన్నుకున్నావ్!’’ అంది సాహిత్య అతడి చెవి పట్టుకుని మెలిపెడుతూ.
‘‘ఇంకాస్సేపు తిప్పావంటే నా చెవి ఊడి నీ చేతిలోకి వస్తుంది.
అప్పుడు నీకే నష్టం. నన్ను ఎంత తిడదామనుకున్నా నీ తిట్లు నీకే తప్ప నాకెంత మాత్రమూ వినిపించవు.
‘‘అలాగా.. అయితే కాళ్లు విరగ్గొడతాను..’’ అంటూ కర్ర కోసం వెదుకుతున్నట్లుగా దగ్గర్లో ఉన్న చెట్ల క్రింద అటూ ఇటూ చూసింది.
‘‘తప్పైపోయింది. ఇక ఎప్పుడూ మాటల్లో హద్దుమీరను. ఒకవేళ మీరినా నువ్వు వేసే శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయను.
‘‘సరి.. సరి.. కబుర్లు తర్వాత.. మెట్లెక్కుతూ కూడా మాట్లాడుకోవచ్చు. మనమిలానే కబుర్లలో కాలక్షేపం చేస్తే కొండపైకి చేరేసరికి గుడి మూసేసి అందరూ ఇళ్లకు బయల్దేరుతారు. పద..’’’ అంటూ ముందుకు దారితీసింది సాహిత్య.
దాదాపు రెండు వందల మెట్లు ఎక్కాక.. ఆయాసం వచ్చి ఒక మెట్టుమీద కూర్చుంది సాహిత్య.
‘‘అప్పుడే అలిసిపోయారా రాణిగారు! కాళ్లు నొప్పి పుడుతున్నాయా.. నన్ను కాస్సేపు కాళ్లు వత్తమంటావా?’’ అంటూ ఆమె కూర్చున్న మెట్టు క్రింద ఉన్న మరో మెట్టుమీద కూర్చుని చేతుల్ని ఆమె కాళ్ల వైపు చాపాడు సామ్రాట్.
ఆమె ఠక్కున కాళ్లు దగ్గరకు లాక్కుని చేతుల్తో అతణ్ణి వారించింది.
‘‘ఏం నేను ముట్టుకుంటే నీ శరీరం అపవిత్రమైపోతుందా?’’’
‘‘ఒంటికి చేయి తగిలితేనే అపవిత్రమైపోయేటట్టయితే నావల్ల నువ్వూ, నీవల్ల నేనూ ఎప్పుడో అపవిత్రమైపోయినట్టే లెక్క!
పదిమందీ చూస్తోండగా ఆరుబయట నువ్వు నా కాళ్లు వత్తడమేమిటి? చూసేవాళ్లేమనుకుంటారో ఆలోచించొద్దా?’’ చిరుకోపంగా చూస్తూ అంది సామ్రాజ్ఞి.
‘‘పోనీలే.. కాసేపు విశ్రాంతి తీసుకో! నువ్వు అలుపు తీర్చుకున్న తర్వాతే మళ్లీ మెట్లెక్కుదాంలే’’ అన్నాడు సామ్రాట్.
వాళ్లలా మాట్లాడుకుంటోండగా మెట్లదారి పక్కనే వున్న ఓ చెట్టుమీది కోతి, కొమ్మమీద నుంచి మెట్లకటూ ఇటూ ఉన్న పిట్టగోడల్లో ఒకదానిమీదకు దూకి వాళ్లవైపు చూడసాగింది.
దానికళ్లు వాళ్ల మొహాల్నీ, చేతుల్నీ మార్చి మార్చి చూడసాగాయి. సామ్రాట్ బుగ్గలు పొంగించి కళ్లు పెద్దవి చేసి దానివైపు చూశాడు. వాళ్ల చేతుల్లో తినేందుకు ఏమీ లేకపోగా, దాన్ని రెచ్చగొడుతున్నట్టుగా సామ్రాట్ చేసిన అభినయాన్ని గమనించిన దానికి కోపం వచ్చి పళ్లు బయటపెట్టి, కనురెప్పలు పైకి లేపి కిచకిచలాడింది.
‘‘సాహిత్యా.. చూడు.. చూడు.. మీ అమ్మమ్మ ఎంత అందంగా నవ్వుతోందో?’’ అన్నాడు సామ్రాట్ కోతిని చూపిస్తూ.
అతణ్ణి కోపంగా చూసి, కోతివైపు పరికించి చూసిన ఆమె పెదాలు క్షణకాలంలోనే విచ్చుకున్నాయి. ‘‘జాగ్రత్తగా చూడు.. అది మీ అమ్మమ్మ కాదు.. మీ తాతయ్యే!’’ అంది.
కోతిని పరికించి చూసిన అతడికి ఆ కోతి ఆడదికాదనీ మగ కోతేనని అర్థమై మొహం చిన్నబుచ్చుకుని మెట్లెక్కడం ప్రారంభించాడు.
గుడిలో పెద్దగా జనం లేకపోవడంతో దర్శనం త్వరగానే అయింది. గుళ్లోంచి బయటకు వెళ్లేటపుడు ఒక రాతి స్తంభం దగ్గర జనం గుమిగూడి ఉండడం కనిపించి ఆసక్తిగా చూడసాగింది సాహిత్య.
ఆ స్తంభం చుట్టూ గుమికూడిన వాళ్లల్లోంచి ఒకో జంటా వచ్చి ఆ స్తంభానికి అటూ ఇటూ నిలబడి దానిని కౌగిలించుకుంటున్నట్టుగా చేతులూ రెండు చాపి స్తంభాన్ని పట్టుకుంటే అక్కడే ఉన్న దేవాలయానికి సంబంధించిన ఒక మనిషి ఉత్తరీయం లాంటి ఒక పొడవైన గుడ్డను ఆ జంట చుట్టూ తిప్పి స్తంభాన్నీ, వాళ్లనూ కలిపి బంధించినట్టుగా వదులుగా ముడివేసి కొన్ని క్షణాల తర్వాత మళ్లీ ముడివిప్పాడు.

-ఇంకా ఉంది

సీతాసత్య