డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు..4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తండ్రి ప్రార్థనకు, తల్లి కన్నీళ్ళకు ఈ యువకుడి ముందు ఏ విలువ లేకుండా పోయాయి. వాళ్ళలో ఒక చిన్న ఆశ ఉంది. ఎవరికి తెలుసు కఠోరమైన ఆర్మీ ఇంటర్‌వ్యూలో సందీప్ రిజెక్టయిపోతే చాలు, అంతకన్నా ఇంకేం కావాలి. ఎంతైనా కోమటివాడి కొడుకేగా. మేధస్సు ఎంత ఉన్నా, పోటీలో నెగ్గినా, అసలు పోటీలో ఏం గెలుస్తాడు? జుట్లు, గూర్ఖాల ఎదురుకుండా శారీరక శక్తి పోటీలో నిలబడగలుగుతాడా! వాళ్ళల్లా పరుగెత్తగలుగుతాడా! ఇంత సాత్వికమైన తిండి తిని, సరే.. పోనీ వాడి మనస్సు చెప్పినట్లుగా చెయ్యనీ! కాని ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయినప్పుడు తెలుస్తుంది, అబ్బాయిగారికి అసలు సంగతి. ఆత్మవిశ్వాసం.. ఆత్మబలం.. ఇంకా ఏవేవో కూస్తున్నాడే.. అవన్నీ ఒక్క దెబ్బకి పారిపోతాయి.. ఆర్మీ భూతం పారిపోతుంది. ఈ ఆశే అంత అండగా ఉండే కుందేలును చేయి జారిపోకుండా అనునిత్యం ఇంటిల్లీపాదీ ప్రయత్నం చేస్తోంది.
దాదాపు పది రోజులు ఇంటర్వ్యూలు జరుగుతునే ఉన్నాయి. రిటర్న్ వోరల్ రెండు రకాల ఇంటర్‌వ్యూలు. ఇక ఇంటిలిజెన్స్ టెస్ట్‌ల గురించి చెప్పనక్కరలేదు. రీజన్-లాజిక్‌ల పరీక్ష జరుగుతుంది. ఐక్యూ టెస్ట్, ఎన్నో మనోవిజ్ఞానానికి సంబంధించిన పరీక్షలు.. టీమ్ స్పిరిట్‌ని పరిరక్షించడానికి ఎన్నో గ్రూప్ ఇంటర్‌వ్యూలు, గ్రూప్ ప్రోజెక్ట్, గ్రూప్ యాక్టివిటీస్, గ్రూప్ డిస్కషన్, ఎక్స్‌టెంపోర్ కాంపిటీషన్.. ఈ పరీక్ష ఎందుకంటే మీరు ముందుగా ఆలోచించకుండా మీ ఆలోచనలను మీరు అభివ్యక్తి చేయగలుగుతారా! స్ట్రాంగ్‌గా చేయగలుగుతారా! లేకపోతే తడబడుతూ చెబుతారా?
అన్నింటికన్నా పెద్ద టెస్ట్- ఫిజికల్ టెస్ట్.. శారీరక సామర్థ్యం, ధైర్యసాహసాలు.. మీరు పరుగెత్తుతున్నారు, ఎదురుగుండా కాలవ.. మీరు భయపడలేదు కదా!
చిన్నవి, పెద్దవి కొండలు ఎక్కాక, ఊపిరి పీల్చుకున్నాక సందీప్‌కి తెలిసింది అసలు హిమాలయాలు ఎదురుగుండా ఉన్నాయని. త్రీ ఏజెన్సీల కలయిక. అందరు కలిసి కూర్చుంటారు. దీంట్లో ఉత్తీర్ణుడైతే ఫైనల్. మెడికల్ టెస్ట్‌కి ఫిట్ అయినట్లు. సందీప్ బాచ్‌లో ముప్ఫై మూడు మంది కాండిడేట్లు ఉన్నారు. కానీ కేవలం ముగ్గురు మాత్రమే ఫైనల్ రౌండ్‌కి చేరగలిగారు. సగంమంది అసలు సెమీ ఫైనల్‌కి కూడా రాలేదు.
ఇక ఇప్పుడు లాస్ట్ టెస్ట్.. మెడికల్ టెస్ట్. అన్ని టెస్ట్‌లలో పాస్ అయ్యాడు కానీ ఒక టెస్ట్‌లో మాత్రం బండి ఆగిపోయింది. ముక్కులోని ఎముక వంకరగా వుంది కానీ ఇది పెద్ద ఆటంకం ఏమీ కాదు. నెలలోపల మైనర్ సర్జరీ చేయించుకోమన్నారు.
ఇంటికి రాగానే తమ్ముడు సిద్ధార్థని తీసుకుని ఆసుపత్రిలో చేరిపోయాడు. ఒక చిన్న ఆపరేషన్ చేయించుకున్నాడు. ఇప్పుడు ముక్కు సరిగా అయింది.
సందీప్ ఉరకలు వేస్తున్న ఉత్సాహం చూసి తండ్రికి మళ్లీ కరెంటు షాక్ తగిలింది. ఓ పెద్ద నిట్టూర్పు విడిచాడు. వీడి నెత్తిపైన ఆర్మీ భూతం కూర్చుని ఉంది. ఇక ఇప్పుడు వెనక్కి లాగడం చాలా కష్టం. ఓ హనుమా! నీకు ఒకటింబావు కిలో అసలు నేతితో తయారుచేయబడ్డ లడ్డూలను నైవేద్యంగా పెడతాను. వాడికి ఆర్మీలో ఉద్యోగం రావద్దు.. దేవుడా నేను చేతులెత్తి మొక్కుతున్నాను దేవుడా.. వాడికి మిలటరీలో ఉద్యోగం రావద్దు.. రావద్దు..
ఆ రోజు సాయంత్రం మిలటరీలో ఉద్యోగం వచ్చిందని లెటర్ వచ్చింది. అంతే ఆ ఇంట్లో మరో భూకంపం వచ్చింది. ఆ పత్రం ఆ ఇంటికి మృత్యుపత్రం అయింది. సందీప్ బరువెక్కిన వాతావరణాన్ని కొంత సరిచేయడానికి ప్రయత్నించాడు- ‘‘నాన్నగారూ! నేను నా జీవితంలో మొదట్టమొదటిసారిగా కర్మభూమిలో ఆకాశం అంత ఎత్తున ఎగరడానికి ప్రయత్నిస్తున్నాను. మీరు సంతోషపడాల్సింది పోయి బాధపడుతున్నారా! ఇది శోకపర్వం కాదు నాన్నా ఆనంద పర్వం..’’
శేఖర్‌బాబు కంఠం వణికింది. ఆర్ద్రమైన శబ్దాలు కంఠం నుండి వెలువడ్డాయి. ‘‘నీవు ఉవ్వెత్తున ఎగురుదామనే అనుకుంటున్నావు కదా! అందుకే ఇటువంటి అర్థం పర్థంలేని డైలాగులు. నీవు భావుకతతో పరుగెత్తుతున్నావురా! నీలో ఆవేశం తప్పితే వివేకం లేదురా! నిజానికి ఆర్మీ అంటే హద్దులున్న ఆకాశంరా! అక్కడ నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ఉవ్వెత్తున ఎగరలేవురా! నీ రెక్కలు కత్తిరించేస్తారురా! అప్పుడు నీవు ఏమీ చేయలేవు. తెగిన రెక్కలతో ఏ పక్షి అయినా అంత ఎత్తున ఎగురగలుగుతుందా! నువ్వు స్వేచ్ఛ విహంగానివి కాలేవురా!’’
శేఖర్‌బాబు కళ్ళ ఎదురుకుండా 1971లో జరిగిన బంగ్లాదేశ్ యుద్ధం కదలాడసాగింది. అంతటా బీభత్సం.. హాహాకారాలు.. చనిపోయిన సైనికులు.. గాయపడ్డ సిపాయిలు.. ఆకాశం.. భూమి.. రక్తసిక్తం.. ఆ దృశ్యాలు కళ్ళ ఎదురుగుండా ప్రేతాల్లా నృత్యం చేస్తూన్నాయి. కళారనృత్యం.. ఎంతోమంది సైనికులు మళ్లీ వెనక్కి తిరిగి రాలేదు. ఒకవేళ ఎవరైనా వచ్చినా గాయాలతో... ఖండిత అవయవాలతో..
ఆయన మనస్సు బరువెక్కింది. మళ్లీ ఒకసారి కొడుకు వైపు ఆర్ద్రతగా చూసాడు.. మరొకసారి సందీప్‌కి నచ్చచెప్పాలని ప్రయత్నం చేశాడు- ‘ఒకవేళ ఆర్మీ జీవితం నచ్చపోతే సం.లో తిరిగి వస్తానని నాకు నచ్చచెబుతున్నావు కనా! సందీప్ ఒక సత్యం తెలుసుకో, ఒకసారి ఇక్కడినుండి వెళ్లిపోతే మళ్లీ తిరిగి రావడం అసంభవంరా! నేను ఎంతో ప్రపంచాన్ని చూసానురా! నేను కష్టాలనీ, కన్నాళ్లనీ, ఈతిబాధలనీ ఔపోసన పట్టానురా! ఒకసారి ఏ అల యినా సరే పైకెగిసిపోతే ఇక మళ్లీ పుట్టిన చోటుకి రాలేదురా! ఇకముందు నీ ఎదుట ఉన్నదంతా సముద్రమే. ఆర్మీ అంటే అర్థం- చావు, వినాశనం, అశాంతి, రక్తపాతం, ఆర్తనాదం.. ఒకసారి బాగా ఆలోచించుకోరా!’’

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
- ఇంకా ఉంది

టి.సి.వసంత