డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 11

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
వ్యాయామం, ఆటల సమయం అయ్యాక వాళ్ళకి సినిమా చూపించారు. సినిమా చూడడం వాళ్ళకి తప్పనిసరి. కాని సినిమా చూసేటప్పుడు వాళ్ళు అటు ఇటు చూడకూడదు. ఆడపిల్లలవైపు అసలే చూడకూడదు. ఒకసారి సినిమా నాయిక బదులు నిజమైన హీరోయిన్‌ని మనసారా చూసాడు. అంతే, అతడికి పెద్ద శిక్ష పడ్డది. రోజంతా అలసిపోయాక తన స్నేహితులందరు విశ్రాంతి తీసుకుంటున్నారు. కాని ఈ సమయంలో అతడికి వీపు మీద రాళ్ళతో నిండిన బస్తాలు మోస్తూ పరుగెత్తాల్సి వచ్చింది. కఠోరమైన దినచర్య తరువాత అంతో ఇంతో విశ్రాంతి దొరుకుతుంది అని అనుకునే తరుణంలో కఠిన శిక్షను అనుభవించాల్సి వస్తుంది. ఇటువంటి సమయంలో అతడు ఎంతో ఉదాసీనంగా అయిపోతాడు. కళ్ళల్లో నీళ్ళు నిండాయి. ఇక్కడనుండి బయటపడు అన్న ఆలోచన వస్తుంది. కాని అంతరంగం నుండి ఒక కంఠం వినిపిస్తుంది. ‘నేను ఒక సైనికుడిని, నేను చివరివరకు ధైర్యంగా నిలబడాలి’ తను వెనకడుగు వేయలేడు. వేయకూడదు కూడా...
సందీప్ స్నేహితుడు పరమజీత్ పరిస్థితి ఇంకా ఘోరం. అతడు పంజాబీవాడు సర్దార్. పొడుగు జుట్టు, బాగా పెరిగిన గడ్డం.. దగ్గర హెయిర్ డ్రైయర్ కూడా లేదు. అందువలన పెరెడ్‌కి కాని, పిటి కాని వెళ్లాల్సి వచ్చినపుడు తరచుగా ఆలస్యం అవుతుంది. త్వరగా బయలుదేరాలని పరమజీత్ ఎంతో ప్రయత్నం చేస్తాడు.
త్వరత్వరగా పగిడీ (తలపాగా) కట్టుకోడానికి ప్రయత్నిస్తాడు. ఒక్కొక్కసారి తలపాగా కట్టడానికి కుదరదు. విప్పుకుపోతుంది. అట్లాగే గడ్డానికి కట్టే బట్ట కూడా ఒక్కొక్కసారి సరిగా నిలవదు. అతడితోపాటు ఉండే సైనికులకు అతడిమీద కోపం వచ్చినపుడల్లా వాళ్ళు ఈ వెధవ గడ్డం కట్ చేసేసేయి, ఈ జుట్టు కత్తిరించి పడేసేయ్ అంటూ ఉంటారు. మళ్లీ పగిడీ కట్టుకునే సరికి పరమజిత్‌కి ఆలస్యం అవుతుంది. అతడి మన మొత్తం బాచ్‌కంతటికీ ఆలస్యం అవుతుంది. అందరికి శిక్ష పడుతుంది. కాని ఒకళ్ళు కూడా పరమజిత్ వలన ఆలస్యం అయిందని చెప్పనే చెప్పరు.
ఆర్మీలో టీమ్ స్పిరిట్‌ని ఉగ్గుపాలతో పెడతారు. అందరితో కలిసి ఉండాలి. తన టీమ్, తన కమాండర్ తన దేశానికి అన్నింటికన్నా ఎక్కువ గౌరవం ఇవ్వాలి.
నిజానికి ఇవన్నీ అతడికి ఎంతో ఇష్టమైనవే.
వెపన్ ట్రైనింగ్ ఇచ్చినపుడు ఎంతో థ్రిల్‌గా ఫీల్ అయ్యాడు. కోమట్ల సంతానం. అతడి చేతుల్లో త్రాసు, రాళ్ళు బదులు రైఫిళ్ళు, గుళ్ళు. ఒకవేళ అతడి నాయనమ్మ చూస్తే అంతే, ఆవిడ గుండె పగులుతుంది.
అతడికి రైఫిల్ ట్రైనింగ్ ఇచ్చారు. యుద్ధంలో ఏ విధంగా రైఫిల్‌ని ఉపయోగించాలో నేర్పించారు. అతడి చేత గొయ్యి తవ్వించారు. ఆర్మీ శాంతికాలంలో కూడా సైనికులు యుద్ధ సమయంలో ఉండే విధంగానే ఫీల్ కావాలి అని ఈ విధంగా నేర్పిస్తుంది. ఇట్లా చేయడం మన యుద్ధ సమయంలో సైనికులు శాంతిగా యుద్ధం చేయగలుగుతారని ఆర్మీ ఉద్దేశ్యం అయి ఉంటుందని అతడు అనుకున్నాడు.
వార్, వెపెన్ ట్రైనింగ్‌ల తరువాత ఇప్పుడు ఫారెస్ట్ ట్రైనింగ్ మొదలయింది. అన్నింటికన్నా ఎంతో థ్రిల్ కలిగించేది.
అన్నింటికన్నా భయంకరమైనది.
ఈ సమయంలోనే తన శరీరం మెల్లి మెల్లిగా ఆర్మీ కఠోర దినచర్యకు అలవాటుపడిపోతోందని అతడికి అనిపించింది. ఆర్మీ మాన్ పోస్టింగ్ ఎక్కడైనా అవుతుంది. కాశ్మీరం నుండి కన్యాకుమారిదాకా, 46 డిగ్రీల మైనస్ నుండి 46 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. మండుటెండకి, ఎముకలు కొరికే చలికి, అన్ని పరిస్థితులకు వాళ్ళు అలవాటుపడాలి. అందుకే ఈ ట్రైనింగ్ ఇస్తారు.
ఒకసారి ఒక పెద్ద అడవికి తీసుకువెళ్ళారు. ఆర్మీ వాళ్ళు అతడిని అక్కడే వదిలేసారు. ‘ఇక నీ భోజనం ఏర్పాటు నువ్వే చూసుకోవాలి’ అని చెప్పారు. ఈ సమయంలోనే అతడు అడవిలో రకరకాల చెట్లని, రకరకాల పూలని చూసాడు. ఎన్నో రకాల ఆకులను చూసాడు. ఆకుల సౌందర్యం అద్వితీయం. రంగు రంగుల ఆకులు. ఏ అదృశ్యహస్తం ఈ చిత్రాన్ని గీసిందో, రంగులు వేసిందో, ఇవి ఒక అద్భుత దృశ్యం. అన్ని రంగులను ఈ చిత్రంలో నింపేసింది. ఇప్పటిదాకా అతడు కేవలం పూలు మాత్రమే ఎంతో అందంగా ఉంటాయని ఎన్నో రంగులలో ఉంటాయని అనుకునేవాడు. కాని ఆకులు కూడా ఇంత అందంగా ఉంటాయా! ఇన్ని రకాలు.. ఇంత సౌందర్యం.. ఈ ఆకుల గారడీ నుండి ఇంకా బయటపడలేదు. ఇంతలో అడవిలోని ప్రతి ఆకును ముట్టుకోవడం అపాయం అని దురద, రోగాలు వస్తాయన్న సంగతి తెలుసుకున్నాడు.
ఒకసారి చెట్టుపైకి ఎక్కాలని ఆజ్ఞాపించారు ఆర్మీ ఆఫీసర్లు. అతడు ఇంకా పైదాకా ఎక్కనే ఎక్కలేదు. అతడి సీనియర్ మరొక అతడికి కూడా చెట్టు ఎక్కాలని ఆజ్ఞాపించడం అయింది. అతడు అనుకోకుండా అదే కొమ్మను పట్టుకుని ఎక్కసాగాడు. ఆ కొమ్మనే సందీప్ కూడా పట్టుకుని వేళ్లాడుతున్నాడు. కింద నుండి ఒక్కసారిగా కొమ్మ ఊగడం వలన సందీప్ ధన్‌మని కింద పడ్డాడు.
కాని ఆశ్చర్యం! అంతపైనుండి కిందపడ్డా అతడికి ఏమీ కాలేదు. తన శరీరాన్ని ఉక్కులా తయారుచేసింది ఆర్మీ అని అనుకుంటూ చిరునవ్వు నవ్వాడు. కాని ఆ తరువాత వారం బాక్సింగ్ పోటీలో పాల్గొనాల్సి వచ్చింది. ఈ టఫ్‌నెస్, చిరునవ్వు అన్నీ మటుమాయం అయ్యాయి.
ఈ పోటీలో పాల్గొనడానికి అతడు శారీరకంగా కాని మానసికంగా కాని సిద్ధంగాలేడు. కాని మనస్సును చంపుకునే ప్రయోగశాల ఆర్మీ. అందుకే అంత కఠోరమైన దినచర్య, రకరకాల పరీక్షలు. అతడి వంశంలో ఎవరూ కనీసం ఎదుటివాళ్ళను ఒక్క దెబ్బ వేసి ఎరుగరు. ఇక బాక్సింగ్ గురించి చెప్పాలా! గతం, వర్తమానం అతడిని విడిచిపెడుతున్నాయి.

-ఇంకా ఉంది

టి.సి.వసంత