డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 19

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**

విధి, గ్రహశాంతి, స్వప్నాలు, చమత్కారాలు మొదలైన వాటిని కూడా త్రికరణశుద్ధిగా నమ్ముతారు. అతడికి జరిగిన ఒక సంఘటన గుర్తుకు వచ్చింది. అతడు ఒకసారి తన స్నేహితులతో గైంగ్‌టాక్ చూడటానికి వెళ్ళాడు. అక్కడ గైంగ్‌టాక్‌లో వున్న ప్రసిద్ధి చెందిన ఝాంగు సరస్సుకన్నా ఎక్కువగా బాబా గుడి పేరు విన్నాడు. గుడికి వెళ్ళాక అక్కడ గుడి వెనక వున్న చరిత్రను తెలుసుకుని ఎంతో ఆశ్చర్యపోయాడు. ఆ గుడి 23 పంజాబీ రెజిమెంట్ సైనికుడు హరభజన సింగ్ జ్ఞాపకార్థం కట్టారు. ఒక సైనికుడి స్మృతిలో సైనికులు కట్టించిన గుడి ఇది. భారతదేశంలో ఇటువంటి గుడి ఒకటే ఉంది. గుడి ఎంతో అద్భుతంగా ఉంది. దీని వెనక నిర్మాణానికి సంబంధించిన చరిత్ర మరీ గొప్పగా ఉంది. 1968, అక్టోబర్ 4న సిపాయి హరిభజనసింగ్ కిరాణా సామాను తీసుకుని వెళ్తున్నాడు. మధ్యలో నదీప్రవాహంలో కొట్టుకుపోయాడు. అతడి శవం దొరకలేదు. కొన్ని రోజుల తరువాత తోటి సిపాయిల కలలో కనిపించి తనకొక గుడి కట్టించమని అప్పుడే తన ఆత్మకు శాంతి అని చెప్పాడు. గుడి నిర్మాణం పూర్తయింది. ఆ తరువాత ఆ సిపాయిల కలలో అతడు మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు. ప్రతి రెజిమెంట్, బ్రిగేడ్.. నాధూలా బార్డర్‌కి వెళ్ళిన ప్రతీవాళ్ళు తాము క్షేమంగా ఉండాలని ఆ గుళ్ళో మొక్కుకుంటారు. నేడు కూడా సైనికుల నమ్మకం ఏమిటంటే ఆయన మరణించలేదు. ఆయన ఇంకా వాళ్ళతోనే ఉన్నాడు. ఇప్పటికీ ప్రతినెలా జీతాన్ని ఆయన భార్యకు పంపిస్తారు. జీవించి ఉన్న సైనికుడిలా ఆయన పదవి కూడా పెరుగుతూ ఉంటుంది. ఆయనకు ఇంటికి వెళ్ళడానికి సెలవులు మంజూరు చేస్తారు. రైలులో రిజర్వుడ్ కంపార్ట్‌మెంట్‌లో ఆయన దుస్తులు బర్త్‌మీద పెడతారు. ప్రతీ సంవత్సరము ఆయన పుణ్యతిథి రోజున జీపు స్టీరింగ్ దానంతట అదే కదులుతుంది. బాబాయే దీన్ని నడుపుతారని వాళ్ళకి నమ్మకం.
గుడిలోపల హారతి ఇస్తున్నారు. కొందరు సైనికుల డ్రెస్‌లో ఉన్నారు. కొందరు ధోవతీ కుర్తా వేసుకున్నారు. వీళ్ళు పూజారి చేసే పని చేస్తున్నారు. ముఖ్యద్వారంపైన ఇట్లా రాసి వుంది- కర్మయే ధర్మం. నిజానికి ఈ దేశవాసులకు ధర్మమే ఆత్మ. డాక్టరవనీ, సిపాయి అవనీ, దక్షిణ బిహారులో ఉండే ఆదివాసీ- అందరు ధర్మాన్ని, ఈశ్వరుడిని నమ్ముతారు. ఎందుకంటే ధర్మంపట్ల ఉండే నమ్మకం, కర్మ సిద్ధాంతం కొంతవరకు మనిషిని భయం నుండి విముక్తుడిని చేస్తాయి. ఎదురైన పరిస్థితులను స్వీకరించి గుండె దిటవు చేసుకుని స్థితప్రజ్ఞుడయ్యేలా చేస్తుంది ధర్మం. బయట ఎంత ఉత్పాతం వచ్చినా సైనికుడు ఎదిరిస్తాడు. వీటికి ఎదురీది నిలబడగలుగుతాడు. కాని లోపల మానసాకాశంలో చెలరేగే అశాంతి, అల్లకల్లోలాన్ని ఎట్లా అణచుకోగలుగుతాడు. సైనికుడిలో ఆకాశగంగను స్థిరంగా ఉంచాలంటే ఏదో ఒక ఆధారం కావాలి. భగవంతుడు, ఆస్తికత ఏదైనా మంత్రం- ఏదైనా బోధివృక్షం.
ఆలోచనలు వలలో చిక్కుకున్న పక్షుల్లా గిలగిలా కొట్టుకుంటున్నాయి. అతడి మనస్సు బరువెక్కింది. అందమైన కాశ్మీరం- పూల రెక్కలు జల జలా రాలుతుంటాయి. అద్వితీయమైన సౌందర్యాన్ని ఇచ్చే ఈ భూమి, ఋషి కశ్యపుడు జన్మించిన ఈ భూమి, మనలని ఆలోచింపజేస్తుంది. అతడు ఆలోచిస్తూ కమాండింగ్ ఆఫీసర్ కర్నల్ కేదార్ ఆప్టే చేంబర్ వైపు వెళ్లాడు. ఇంకా అక్కడ ఎర్ర లైట్ వెలుగుతూనే ఉంది. ప్చ్.. ఇంకేం.. కలుస్తాను అనుకుంటూ వెనక్కి తిరిగాడు. మిలటరీ వాన్‌లో కూర్చున్నాడు. గార్డ్ కూడా ఎక్కాడు. గుడ్‌గాంవ్ అతడి పోస్టింగ్. అక్కడికి బయలుదేరాడు. అక్కడ చార్లీ కంపెనీకి అతడు కంపెనీ కమాండర్.
కాంపస్‌లో కాలు పెట్టాడో లేదో ఏదురుగుండా తమ్ముడు సిద్ధార్థను చూసాడు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ‘సిద్ధార్థా! ఎప్పుడు వచ్చావు? ఇంత హఠాత్తుగా.. వస్తున్నానని తెలియపరచలేదు. కాశ్మీర్‌లోకి ఇట్లా రాకూడదు. అది అపరాధం అవుతుంది’ తమ్ముడిని కౌగిలించుకున్నాడు.
‘ఎట్లా చెప్పను? ఇక్కడ మొబైల్ కూడా నడవదు కదా! నేను వచ్చి గంట అయింది. ఇక్కడే నిల్చున్నాను. ఇక్కడ గడ్డిమోపులు వీపుపైన మోస్తూ పోతున్న ఆడవాళ్ళని చూసి చూసి బోర్ కొట్టింది.
మేజర్ నవ్వాడు. ‘సరే పద.. నీకు అందమైన దృశ్యాలు చూపిస్తాను’.
‘‘మీవాళ్ళు ఏం మనుషులురా బాబూ! నేను మేజర్ సందీప్ తమ్ముడినని ఎంత మొత్తుకున్నా వాళ్ళు వినరే. వాళ్ళనే మాట ఒకటే.. మా దగ్గర ఆర్డర్ లేదు. లోపలికి ఎంట్రీ కావాలంటే మేజర్ సాహెబ్ రావాలంటారు. బాప్‌రే.. ఇంత సెక్యూరిటీయా. వీళ్ళకి ప్రతీ వ్యక్తి మిలిటెంట్ అనే అనిపిస్తాడా’’.
మేజర్ చిరునవ్వు నవ్వాడు. సిద్ధార్థలో కలిగిన ఆశ్చర్యం అతడికి తన వెనకటి రోజులని గుర్తుకు చేసాయి. పెద్ద ఇనుపద్వారం దగ్గర 15 అడుగుల పెద్ద మొద్దు కొయ్యని ఎత్తారు. ఇద్దరు అన్నదమ్ములు లోపలికి వెళ్ళారు. అక్కడ గార్డుకి సిద్ధార్థని పరిచయం చేద్దామనుకున్నాడు. ఇంతలో ఒక పఠాన్ అన్నమాటలు అతడి చెవిన పడ్డాయి. ‘‘అజహర్ సాహెబ్, ఎంతో తియ్యటి చెర్రీలు.. ప్రత్యేకంగా మీకోసమే తీసుకువచ్చాను’’- అతడు స్థానికుడు. కాశ్మీర్‌వాడు. దుకాణదారుడు. చేతిలో చెర్రీల పాకెట్ పెట్టాడు. కొనమని ప్రాధేయపూర్వకంగా అడిగాడు. ఏమీ మాట్లాడకుండా సందీప్ వంద నోటు అతడికిచ్చి పాకెట్ కొన్నాడు. సిద్ధార్థకి అంతా రహహ్యమయంగా అనిపించింది. ఈ సందీప్ అజహర్ ఎట్లా అయ్యాడు. అంటే వీళ్ళని పూర్తిగా మార్చేస్తుందా ఆర్మీ?

- ఇంకా ఉంది

టి.సి.వసంత