డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 34

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**

కానీ ఇవాళ మొదటిసారి ఆర్మీ కాంప్, కాశ్మీర్‌లోని అల్లకల్లోల వాతావరణం. డెడ్ అయిన ఫోను, అన్నయ్యలోని సంవేదనా శూన్యం-అంతా కలిపిన కాక్‌టేల్ అతడిని భయపెట్టింది. బాధపెట్టింది. బాధతో మనోవ్యధతో అక్కడే చాలాసేపు కూర్చున్నాడు. బ్రేక్‌ఫాస్ట్ భోజనం టైమ్ కూడా దాటిపోయింది. మధ్యలో అతడు లేచి సందీప్ ఇచ్చిన మొబైల్‌తో ఫోను చేసి ఆ సాయంత్రం ప్లైట్‌ని కాన్సిల్ చేయించాడు.
సందీప్ సాయంత్రం దాదాపు ఆరు గంటలకు ఆపరేషన్ సర్చ్ పూర్తి అయిందని ప్రకటించి హెడ్ క్వార్టర్స్ భూషణ్‌కి బయలుదేరాడు. అనవసరంగా జరిపిన ఆపరేషన్‌వలన రెండు రాత్రులలో ఒకసారి కొండపైన, మరొకసారి కిందకి నడుస్తూ ఆందోళన చెందుతూ అలసిపోయాడు. మనస్సులో ఈ ఆపరేషన్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇంతకుముందు కూడా ఎన్నో సార్లు ఇట్లా జరిగింది. వచ్చిన వార్తల ప్రకారం టీమ్‌ని పరిగెత్తించాడు. నిజానికి సివో వాళ్ళు సైనికులు జాగృతిగా ఉండాలని చురుగ్గా చేయాలన్న ఉద్దేశ్యంతో కూడా ఇట్లా చేస్తూ ఉంటారు. సందీప్ అలసిపోయాడు. మెల్లి మెల్లిగా ఆర్మీ పట్ల పెంచుకున్న అతడి ఇష్టం తగ్గసాగింది. నషా మెల్లిగా దిగసాగింది. తమ్ముడు సిద్ధార్థతో కూడా కలిసి ఉండలేకపోయాడు. ఒకప్పుడు సిద్ధార్థ నీడలా ఉండేవాడు. పెద్ద వాళ్ళైయ్యాక జీవితం చేజారిపోయింది. ఆలోచన జ్వాలాముఖిలో కొట్టుకపోతున్నాడు. ఇంత బాసిజమ్ ఆర్మీలో లేకపోతే ఒక ఆదర్శమైన సంస్థ అయి ఉండేది సైనిక రంగం. పీస్ పోస్టింగ్ అయినా సరే ఫీల్డు పోస్టింగ్ అయినా సరే ప్రతీ చోటా బాసిజం ఉంది. కాకపోతే తీరుతెన్నులు వేరు. అసలు ఎవరు తయారుచేసారు ఈ ఆర్మీ సామంత చరిత్రని? ఇంగ్లీషు వాళ్ళ సమయం నుండి అవే రూల్స్, అవే చట్టాలు. ఇప్పటికీ అవే నడుస్తున్నాయి.
సందీప్‌కి రాంచీ పోస్టింగ్ అప్పుడు జరిగిన ఒక సంఘటన, బాస్ తనకు చేసిన ఘోరమైన అవమానం గుర్తుకు రాసాగాయి. ఈ కొత్త ప్రపంచంలో అడుగుపెట్టిన రోజులు అవి. ప్రతీ సైనికుడికి యాన్యుయల్ కాన్‌ఫిడెన్షియల్ రిపోర్టు తయారుచేయబడుతుంది. దానిని ఆధారం చేసుకునే అతడికి ప్రమోషన్ దొరుకుతుంది. ఎసిఆర్‌లో అతడి పనితీరు, నడవడిక గురించిన రిపోర్టు తయారుచేయబడుతుంది. యూనిట్ కమాండింగ్ ఆఫీసరు ఈ రిపోర్టు రాస్తాడు. అంటే అతడి భవిష్యత్తు, తల్లిదండ్రులు, భాగ్యవిధాత అన్నీ కమాండింగ్ ఆఫీసరే. ఆ ఆఫీసరు సంతోషిస్తేనే సైనికుడికి భవిష్యత్తు ఉంటుంది. అందువలన ప్రతీ ఆఫీసరు పైఆఫీసరు కింద నలిగిపోతాడు. అతడి ఒత్తిడికి తట్టుకోగలగాలి. ప్రతి పైఅధికారి కింద వాడిని తన చెప్పు చేతులలో ఉంచుకుంటాడు.
ఆ రోజుల్లో అతడికి సివోగా మణిపూర్‌కి చెందిన ఐ.హెచ్.చనమ్ ఉండేవాడు. అతడి ముఖారవిందం అందరినీ ఆకర్షిస్తుంది అతడు ఎంతో హుందాగా ఠీవిగా ఉండేవాడు. సందీప్‌కి అతడంటే చచ్చేటంత భయం. రాత్రి కలలో ప్రేయసికి బదులుగా అతడి ముఖమే కనిపించేది. ఎంతో క్రమశిక్షణతో ఉండే టేబుల్ మానర్స్‌ని, మహిళల పట్ల ఎంతో గౌరవంగా ప్రవర్తించే ఆర్మీలోని పైఆఫీసర్లు తమకింద పనిచేసే ఆఫీసర్ల సైనికుల పట్ల ఎంత ఫ్యూడల్ మెంటాలితో ఎంత కఠోరంగా ప్రవర్తిస్తారో అతడికి తెలిసింది. ఆ చిన్న సంఘటన తనని ఎంతో బాధపెట్టి భయపెట్టింది. దాన్ని మరచిపోవాలన్నా ఇప్పటిదాకా మర్చిపోలేకపోతున్నాడు.
లాంస్ నాయక్ జయదేవ్ సింహ్ సి.వో ముందు ఎంతో దీనంగా నిల్చున్నాడు. అతడి తండ్రి జబ్బు పడ్డాడు. పశు స్వభావం గల కర్నల్ సి.వో అతడికి సెలవులను సాంక్షన్ చేయలేదు.
సందీప్ జయదేవ్ సింహ్‌కి, సి.వోకి చెప్పి ఏ విధంగానైనా సెలవులు సాంక్షన్ చేసేలా చూస్తానని చెప్పాడు. సివోని ఎదిరించాలి అని మనస్సులో గట్టిగా అనుకున్నాడు.
ఇంతలో జరిగిన మరో సంఘటన సి.వో పాశవిక ప్రవృత్తిని బయలుపరిచింది. అతడి వ్యక్తిత్వపు పొరలు ఒక్కసారిగా బయటపడ్డాయి. సి.వోకి హెడ్ ఆఫీసు నుండి ఒక ఆర్డర్ వచ్చింది. కొత్తగా ఆఫీసరైనవారు ఆర్మీ నేతృత్వం గురించి ఏం ఆలోచిస్తున్నారు? దీనిని గురించి స్టడీ చేయాలని ఆర్డర్ ఇచ్చారు. సందీప్‌ని కూడా కామెంట్ చేయమని అడిగారు.
తను ఏం రాసాడో ఇప్పటికి సందీప్‌కి గుర్తు ఉంది. సి.వోతో కలిగిన అనుభవాలను ఆధారంగా చేసుకుని నిజాలను సందీప్ రాసాడు. ఆర్మీ ఆఫీసర్ల అంతరంగంలో ఉన్న సత్యం, శివం, మానవత్వం మొదలైన వాటిని వీళ్ళు అణిచేస్తున్నారు. వీళ్ళు ఈ విధంగా మానవత్వాన్ని అణిచివేయటంలోనే వాళ్ళు ఆర్మీలో తమ కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు. అసలు లీడర్ అంటే ఒక మంచి మాలిలా ఉండాలి. మానవత్వం అనే మొక్కకు నీళ్ళుపోసి పెంచాలి. లీడర్ అంటే టీమ్‌కి ఏ విధంగా ఆలోచించాలి, ఎట్లా మనిషిగా బతకాలి అని చెప్పే కాప్టెన్ కొత్త ఆలోచనలు, కొత్త సృజన, కొత్త ప్రయోగాలు చేయటం అతడి నైతిక కర్తవ్యం. ఆర్మీలోని ప్రతీ సీనియర్ ఆఫీసర్‌కి చురుకుగా పనిచేసే ఆఫీసర్లు కాదు డూ.. డూ.. బసవన్నలు కావాలి. వాళ్ళ తాళంమీదే అడుగు వేయాలి. వాళ్ళు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడాలి. ఎవరు ప్రశ్నించకూడదు. కేవలం అనుకరణ మాత్రమే చేయాలి. భగవద్గీత పుట్టిన ఈ దేశంలో ప్రశ్నలు వేయడం, సంవాదాలు జరపడం ఒక ఆరోగ్యమైన ఆచారంగా వస్తోంది. నిజానికి గీత అంటే ఏమిటి? కొన్ని ప్రశ్నలు, కొన్ని జిజ్ఞాసలు, ఆర్మీ లీడర్‌లకు అసలు ఏ శబ్దాలంటే మంటో అవి- ఎందుకు? ఏమిటి? ఎట్లా?

- ఇంకా ఉంది

టి.సి.వసంత