డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 37

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**

ఈనాడు అందరు జీవితాన్ని ఒక యుద్ధంగా అనుకుని జీవిస్తున్నారు. కెరియర్ కోసం రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. పరుగు.. పరుగు.. అసలు ఇప్పుడు జీవితంలో ఏ ఒక్క గొప్ప పురుషుడు తటస్థపడడు. అసలు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలన్న ఆలోచనే ఎవరి దగ్గరలేదు. రకరకాల అందమైన పక్షులు లేవు. సంగీత సాహిత్యాలు లేవు. ఆట పాటలు లేవు. సమాజ సేవ చేసే ఆదర్శమూర్తులు అసలే లేరు. ఒకే ఒక కిటికీ ఉంది, కెరియర్. అది లేకుండా పోయింది కనక తన గొంతును తానే నులుముకున్నాడు.’’
‘‘అన్నయ్యా! ఈ ఫిలాసఫీ తరువాత. ముందు అసలు అనూప్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో చెప్పు’’.
సిద్ధార్థకి జీవితం అంటే ఏమిటో, జీవితంలో వచ్చే ఎత్తుపల్లాలను ఎట్లా స్వీకరించాలో జీవితపు పరమ పద సోపానపటంలో ఎగరేసే నిచ్చెనలూ ఉంటాయి. పడదోసే పాములు ఉంటాయి. వాటిని ఎట్లా అధిగమించి జీవించాలో, జీవితానికి అర్థం ఏమిటి? వీటన్నింటిని గురించి చెప్పాలనుకున్నాడు సందీప్.
‘‘సిద్ధార్థా! నేను తత్వం చెప్పడంలేదు. మనిషి జీవితంలో ఒకసారి ఫెయిల్ అయితే అమూల్యం అయిన జీవితాన్ని బలిపెడతాడా? అనూప్ విషయం చూడు. అనూప్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ జీవించాలి అన్న దృఢ నిశ్చయం ఉండి ఉంటే, పరీక్షలో తప్పినందుకు ఆత్మహత్య చేసుకోడు. ఏ వ్యక్తిలోనైనా సరే దృఢ సంకల్పం అనే వేళ్ళు లోతుగా పాతుకుపోవాలి. అసలు అనూప్ చివరి సంవత్సరంలో ఉన్నాడు. కేవలం ఒక్క సబ్జెక్టులో తప్పాడు. గత రెండు, మూడు సెమిస్టర్లలో అతడు అదే సబ్జెక్టులో ఫెయిల్ అవుతున్నాడు. అతడికి డిగ్రీ తప్పకుండా వస్తుంది అన్న ఆశ ఉంది. అందుకే ఇంటివాళ్ళకు ఈ విషయం చెప్పలేదు. కాన్వకేషనల్ సమయంలో రమ్మనమని తన ఇంటివాళ్ళకు చెప్పాడు. ఎంతో ఉత్సాహంగా వాళ్ళందరు వచ్చారు. రోజంతా కొడుకుతో ఉన్నారు. సాయంత్రం రెస్టారెంట్‌కి తీసుకువెళ్ళాడు. కొంచెం సేపట్లో వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. రెండు మూడు గంటల దాకా రాకపోతే వాళ్ళు అతడి హాస్టల్‌కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే భయంకరమైన దృశ్యాన్ని చూశాడు. అనూప్ ఫాన్‌కి వేళ్ళాడుతున్నాడు. టేబుల్‌మీద సూసైడ్ నోట్ ఉంది. దానిమీద నాలుగే శబ్దాలు రాసి ఉన్నాయి. ‘మీ అయోగ్య పుత్రుడు- క్షమించండి’- సిద్ధార్థ నేను చెప్పేది ఒకటేరా , జీవితం కేవలం ఉత్తీర్ణత, అనుత్తీర్ణతలపై ఆధారపడి లేదు. వీటికన్నా పైమెట్టులో ఉంటుంది. యోగిలా మనం జీవితంలోని ఎత్తుపల్లాలను స్వీకరించాలి. నేను కొత్తగా ఆర్మీలో చేరినప్పుడు ఇక్కడి కఠోరమైన దినచర్య, కఠోరమైన క్రమశిక్షణ చూసి భయపడి పారిపోవాలనుకునేవాడిని. కాని నా లోపలి నుండి ఏదో కంఠం వినిపించేది. నువ్వు ఒక సైనికుడివి. సైనికుడెప్పుడు వెనుకంజ వేయడు. పారిపోడు. ఈ కంఠం నాకెంతో ధైర్యాన్ని ఇచ్చింది. నన్ను నేను సంభాళించుకున్నాను. ఆ రోజుల్లో నా టేబుల్‌పైన అబ్రహం లింకన్ ఫొటో పెట్టుకున్నాను. అబ్రహం లింకన్ జీవితాంతం పోరాడుతునే ఉన్నాడు. ఆయన పదిహేనుసార్లు ఎలక్షన్లలో ఓడిపోయాడు. పద్దెనిమిదోసారి గెలిచాడు. ఆయన జీవించాడు. ఓడిపోయినంత మాత్రాన ఎవరు ఆత్మహత్య చేసుకోలేదు’’-
అన్నదమ్ములిద్దరు లోకం గురించి, తమ కుటుంబం గురించి, భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకుంటున్నారు. ఆ తాళ లయలలో తమని తాము మరచిపోయారు. నౌకరు గొణుక్కోవడం వినిపించింది. దాదాపు రెండు రోజుల నుండి సిద్ధార్థ అతడితో ఉండటం వలన కొంత అలవాటయింది. కాని అసలు ఈ విధంగా డిప్రెషన్ వచ్చినవాడిలా మాట్లాడటం ఏదైనా మానసికమైన రోగమా! లేక ఇది అతడి అలవాటా? తెలుసుకోవాలనుకున్నాడు. బయటికి వెళ్ళడానికి సందీప్ తయారవుతున్నాడు. ‘అన్నయ్యా! చపరాసీ, మైధ్యూ జార్జ్ ఎప్పుడు చూసినా తనలో తను బడబడా మాట్లాడుకుంటూ ఉంటాడు. ఎవరెవరినో తిడుతూ ఉంటాడు. వీడితో మాట్లాడి జీవితం గురించి చెప్పి వాడిని ఆరోగ్యవంతుడిగా మనం తయారుచేయలేమా?’ అని అన్నాడు సిద్ధార్థ.
సందీప్ పెద్దగా నవ్వాడు. ఎన్నో సంవత్సరాల తరువాత ఇట్లా నవ్వాను అని అతడికి అనిపించింది. కొంచెంసేపు మైథ్యూ జార్జ్ వంక జాలిగా చూసాడు. పెద్దగా నిట్టూర్పు విడుస్తూ అన్నాడు. ‘ఏం చెప్పను సిద్ధార్థ! ప్రతివాళ్ళ జీవితం కష్టాలు కన్నీళ్ళ సురంగం. ఒక పెద్ద మహాగాధ. నేను రాకముందు ఏ మేజర్ ఇంట్లో పని చేసాడో, ఆ మేజరు భార్య ఇంటి పనంతా చేయించుకునేది. తన బట్టలు సైతం ఉతికించుకునేది. లంగా, బ్రా, పాంటీలను కూడా ఉతకమనేది. వాటిని ఉతికి ఉతికి ఒకరకంగ పిచ్చివాడయ్యాడు. ఏమీ చేయలేడు. అందువలన బాత్‌రూమ్‌లో మేజర్ భార్య గురించి బూతులు రాయడం మొదలుపెట్టాడు. మేజరు భార్యకు చీమైనా కుట్టలేదు కాని వీడిమీద కఠినంగా యాక్షన్ తీసుకున్నారు. అప్పటినుండే పిచ్చివాడిలా మాట్లాడటం మొదలుపెట్టాడు. వాడి మాటల్లో మాటిమాటికి కవిత అన్న పేరు వస్తుంది. మేజరు భార్య పేరు కవిత.
సిద్ధార్థ ఎంతో భావుకుడయ్యాడు. ‘‘అన్నయ్యా! నిజం చెప్పు. నువ్వు ఇక్కడ ఆనందంగా ఉన్నావా? ఈ ఆర్మీ ఉద్యోగం నీకు సంతోషాన్ని ఇస్తోందా? ఈ ఇరవై నాలుగు గంటల్లో అసలు నా నరాలు తెగిపోతున్నాయా అని అనిపిస్తోంది. అబ్బ ఇంత టెన్షన్ ఎట్లా భరిస్తున్నావు? ఈ గొడవలు.. హింస.. చావు.. భయం..’’
సందీప్ మాట మార్చడానికి ప్రయత్నించాడు. ‘‘నువ్వు వచ్చినప్పటినుండి ఈ నాలుగు గోడల మధ్యే ఉన్నావు. అందుకే నీకిట్లా అనిపిస్తోంది. నారాయణ్‌నాగ్, డల్‌ఝీత్, ముగల్ బాగ్ చూద్దాం’’-

- ఇంకా ఉంది

టి.సి.వసంత