డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 66

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
సలామ్‌వాలేకుమ్ సందీప్,
నేను జీవితాన్ని అర్థం చేసుకోవడంలో చాలా పొరపాటు చేశాను. మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో కొంత పొరపాటు చేశాను. కాశ్మీర్, స్వతంత్రం, మతం మొదలైన వాటి గురించి అర్థం చేసుకోలేకపోయాను. ఈనాటివరకు నా జీవితం పొరపాట్లు, యాతనలు, మోసాలు మొదలైన వాటితో నిండిపోయింది. నువ్వు పైన ఉన్న జైలు అడ్రస్ చూసి భయపడకు. అసలు నేను చేయని నేరానికి వాళ్లు నాకు శిక్ష వేశారు.
నేను మా ఇంట్లో ఉగ్రవాదులకు నీడనిచ్చానన్న అనుమానంతో నన్ను జైల్లో పడేసారు. అసలు ఇదంతా ఎట్లా జరిగింది? అసలు ఈ కథకు బీజం ఆనాడే పడ్డది. జమీల్ భారుూని హిందుస్తానీ ఆర్మీ చంపినపుడే పడ్డది.
జమీల్ భాయి చంపబడ్డాక మా ఇల్లే కూలిపోయింది. కోపాలు, ఉద్రేకాలు శిథిలాలు, కన్నీళ్లు మొదలైనవాటితో నిండిపోయింది. మూడు నెలలకే అమ్మ చనిపోయింది. అమ్మ తరువాత అబ్బూ కూడా ఎక్కువ రోజులు బతకలేదు. ఇంట్లో నేను, హమీద్ ఉండేవాళ్లు. మాతోపాటు ఆకలి, రాబడి ఒక్కపైసా లేదు. నిరాశ నిస్పృహలు.
ఈ సమయంలో ఒక రోజు అబ్దుల్ రషీద్ మా ఇంట్లో జిహాదీలకు రక్షణ ఇవ్వడానికి అండర్‌గ్రౌండ్ గది కట్టిస్తే ఇదే విధంగా డబ్బులు అందుతాయని చెప్పాడు. నేను గొంతు చించుకుని అరిచాను. ఏ ఇంటి గోడలైతే ఒకటి రెండు కాదు మూడు శవాలను చూశాయో ఆ ఇంట్లో చస్తే ఇట్లా జరగనివ్వను. ఈ పాపపు సొమ్ము అక్కరలేదు. కాని ఆకలి దగ్గర ధైర్యం ఉండదు. వివేకం ఉండదు. ఆకలి మనిషికన్నా గొప్పది. ఆకలి పాతాళంకన్నా లోతైనది. ఆకలి సూర్యుడుకన్నా తేజోవంతమైనది. ఈతి బాధలతో బాధపడుతున్న హమీద్ దీన్ని జయించలేకపోయాడు.
పోలీసులకు సందేహం కూడా రాదు. అప్పుడప్పుడు ఎటు జిహాదీలు మన ఇంటికి వస్తూనే ఉన్నారు. ఎటు మనలని బాధపెడుతూనే ఉన్నారు అని వాడన్నాడు. అసలు ఆకలి ఇంత భయంకరంగా భయపెడుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. తమ్ముడు కడుపు నింపుకోవడానికి ఏదైనా చేయడానికి తయారయ్యాడు.
కొన్ని వారాలలో అండర్‌గ్రౌండ్ గది తయారైంది. నేను అమ్మ చనిపోయాక నీకు ఇచ్చిన మాట ప్రకారం స్కూల్‌కి వెళ్లేదాన్ని. చదువుమీదే దృష్టిపెట్టేదానిని. మరుసటి సంవత్సరం నాకు కాలేజీలో ఎడ్మిషన్ దొరుకుతుందని అనుకున్నాను. ఒక రోజు మధ్యాహ్నం స్కూల్ నుండి వచ్చాక హమీద్ ఐదుగురు మనుషులకు అన్నం వండమన్నాడు. కింద అండర్‌గ్రౌండ్‌లో వున్న ఉగ్రవాదులకు భోజనం పెట్టమని అడుగుతున్నాడని నేను అర్థం చేసుకున్నాను. మిన్ను విరిగి మీద పడ్డట్లనిపించింది. నేను చస్తే వండనని మొండిపట్టు పట్టాను. హమీద్ అన్నం తీసుకువస్తానని కోపంగా బయటికి వెళ్లిపోయాడు. నేను చదువుకోవడం మొదలుపెట్టాను. వెనక నుండి ఎవరో నా నోట్లో రుమాలు కుక్కాడు. నన్ను ఇద్దరు బలలవంతంగా కిందకి లాకెళ్ళారు. అక్కడ వాళ్లందరు ఒకరి తరువాత ఒకరు నా మీద...
హమీద్ తల కొట్టుకుని కొట్టుకుని ఏడ్చేసాడు. నా కాళ్లు పట్టుకుని క్షమాపణ అడిగాడు. నేను అవమానాలు భరించాను. మానం పోయినా ధైర్యంగా నిలబడాలనుకున్నాను. కాని ఇంతలో హమీద్ పిచ్చివాడిలా ప్రవర్తించాడు. ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది. ఈలోపల ఎవరో పోలీసులకు మా గురించి ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 3, 2008న సాయంత్రం మా ఇంటిపైన రైడ్ చేసారు. మమ్మల్ని అరెస్టు చేసి కిష్త్‌వాడా జైల్లో పడేసారు.
సందీప్! ఈనాడు నా బతుకు బండలయ్యాక అన్నీ అర్థం చేసుకున్నాను. ఎంత పొరపాటు చేసానో తెలుసుకున్నాను. నీవు నాకు చేయూతనివ్వాలనుకున్నావు. నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు. కాని ఆ రోజు మా బతుకులు నాశనం కావడానికి ఎవరు కారణమో అర్థం చేసుకోలేక పిచ్చిదానిలాగా ప్రవర్తించాను. ప్రవర్తించడానికి కారణం అప్పటి పరిస్థితులు వాటినే కళ్లముందు జరిగే వాటినే నమ్మాను. కాని ఈనాడు నన్ను సర్వనాశనం చేసింది మా వాళ్లే చేశారు.
ఉగ్రవాదులు నిర్దాక్షిణ్యం నన్ను నాశనం చేశారు. నిన్ను నేను నమ్మలేకపోయాను. నేను చేసిన పొరపాటుకు ఎంతో పశ్చాత్తాపం పడ్డాను. నువ్వు నాకు ఎంతగానో చెప్పావు. 1947 నుండి ఇవాళ్టిదాకా అరాచక రాజనీతిని, కుతంత్రాలను తెలుసుకోవాలని, స్వతంత్ర కాశ్మీర్ మాట కాని, ఉగ్రవాదుల ప్రశ్నలను కాని మనం ఏ మాత్రం లెక్కచేయకూడదని, మంచి మనుషుల్లా బతకాలని, మళ్లీ కాశ్మీరులు- హిందుస్తానీల మధ్య స్నేహం పెరగాలని చెప్పావు. కాని అసలు నీవు చెప్పిన వాటిని గురించి నేను ఆలోచిస్తేగా!
ఆ సమయంలో నాకెందుకట్లా అనిపించిందో తెలియదు కాని నీలో ఒక ప్రేమికుడు కాదు ఒక అబద్దాలకోరు మాట్లాడుతున్నాడనిపించేది. ఆత్మ శాంతి కోసం, ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్న ఉద్దేశ్యంతోనే నీవు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నానని నాకు అనిపించించేది. ఎందుకంటే అప్పుడు మా మనస్సులలో ఒకభావం అనేది లేనేలేదు.కాని పోలీసులు వారిని చూస్తే నాకు భయం. వాళ్లు మా మీద జరిపే అత్యాచారాలు ఇన్నా.. అన్నా.. మా పట్ల ఎంతో క్రూరంగా ప్రవర్తించేవారు. పోలీసులు తలుపు తడితే చాలు గుండెలు దడదడలాడతాయి. వాళ్లు పోలీసులే అని మాకు తెలుస్తుంది.

- ఇంకా ఉంది

టి.సి.వసంత