డైలీ సీరియల్

బడబాగ్ని-24

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఓకె.. ఫ్రెండ్స్.. ఐ థింక్ వియ్ విల్ క్రేక్ ద నట్.. బీ కేర్‌ఫుల్.. అరుణ్ జల్దీ పూర్తిగా రికవర్ కా.. మరి వెళ్ళొస్తా.. బై రాహుల్..’’ కమల్ వెళ్లిపోయాడు.
తరువాత ఒక్కొక్కరుగా వాళ్ళు ముగ్గురూ బస్‌స్టాండ్ దగ్గర కలసి.. ట్రైనింగ్ సెంటర్‌కి ఉదయం ఐదు గంటలకల్లా చేరిపోయారు.
***
రాత్రంతా నిద్రలేమివలన రూం చేరిన వెంటనే కాస్త ఫ్రెష్ అయి నిద్రపోయారు.. పడుకునే ముందు ఖాళీగా ఉన్న అమర్ బెడ్ చూస్తే ముగ్గురి మనసులూ బాధతో నిండిపోయాయి.. తాము బెట్ కట్టుకుని అడవికి వెళ్లడం అనేది యాదృచ్ఛికం.. అలా వెళ్లకపోయినా మృత్యువు ఏదో రూపంలో అమర్‌ని కబళించేదే.. ఎందుకంటే అతను ఏదో తెలియని మర్డర్ కేసుకి ప్రత్యక్ష సాక్షి.. కనీసం.. అది జరిగిన వెంటనే.. ‘యిదీ విషయం’ అని అతను తమతో సంప్రదిస్తే.. కలసి ఏంచెయ్యాలో ఆలోచించేవాళ్ళు. లేదా ఆ విషయం వెంటనే పోలీస్ వ్యవస్థకి అప్పచెప్పేవారు.. అతను ఆ విషయం దాచడంవలన ఎంత అనర్థం జరిగిపోయింది.. తనూ పోయాడు, పాపం ఇంద్రజిత్.. వాళ్ళకి తను ఎలా దొరకిపోయాడో.. ఏ లూప్ హోల్ అతనిని వాళ్లకి సరెండర్ చేసిందో.. అలా ఆలోచనలలోనే నిద్రలోకి జారుకున్నారు వాళ్ళు.
అలా పడుకున్న వాళ్ళు మధ్యాహ్నం రెండు గంటలకి కేర్ టేకర్ వచ్చి లేపేదాకా లేవలేదు.. స్నానాలు గట్రా చేసి ఫ్రెష్ అయి లంచ్‌కి వెళ్లిన వాళ్లకు అక్కడ సాహూ సార్ కనబడి, వీళ్ళు విష్ చేస్తే పలకరించాడు.
‘‘వాట్ బాయ్స్... బాగా డిస్టర్బ్ అయి అలసిపోయి ఉన్నారని ఈవేల్టికి వదిలేశా.. యింక రేపటినుంచి బుద్ధిగా క్లాసెస్ అటెండ్‌కండి.. అయినదేదో అయింది.. ఇంక ఎటువంటి అడ్వెంచర్స్ చెయ్యక ట్రైనింగ్ పూర్తిచేసుకు వెళ్లండి.. పైనుంచి మీ మీద డిసిప్లినరీ ఏక్షన్ తీసుకోమని ఆర్డర్స్ వచ్చినా అసలే.. ఈ గొడవల్లో డిస్టర్బ్ అయి వున్న మిమ్మల్ని యింకా బాధపెట్టడం ఎందుకని నేనే వాళ్లని బ్రతిమాలాను.. అటువంటిదేం వద్దని. ఎందుకైనా మంచిది ఇంకా కొన్నాళ్లు బయట తిరగకండి.. నాకు చెప్పకుండా సెంటర్ దాటి బయటకు వెళ్లకండి.. ఓ.కె..
‘‘ఎస్ సర్..్థ్యంక్యు వెరీమచ్ సర్...’’ ముగ్గురూ కోరస్‌గా అన్నారు.
మర్నాడు సాయంత్రం క్లాస్‌లు అయిపోయిన తర్వాత తనకి ఫోన్ చేసిన అనే్వష్‌ని రాహుల్ బాగా కోపడ్డాడు.
‘‘మీమీద.. మీ ఫోన్ కాల్స్.. మూమెంట్స్ అన్నింటిమీదా నిఘా ఉంటుంది. మీరు ఈ విషయం మర్చిపోయి మామూలుగా ఉండండి.. ఇది నేను.. కమల్ చూసుకుంటాం.. ఏదైనా అవసరం ఉంటే మేం కాల్ చేస్తాం.. కానీ మీరు అక్కడ అందరితో మామూలుగా ఉంటూ ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూడండి.. యిక ఫోన్ చెయ్యకు.. ఈ కాల్ డిలీట్ చేసెయ్ వెంటనే..’’
చూస్తూండగానే వారం రోజులు గడిచిపోయాయి.. ట్రైనింగ్ ఆ రోజుతో ఆఖరు.. అందరికీ సర్ట్ఫికెట్స్ వచ్చేశాయి.. ఫర్దర్ పోస్టింగ్స్‌కి ఎవరికి అలాట్ అయిన స్టేట్స్ డిజిపి కార్యాలయానికి వాళ్లు రిపోర్టు చెయ్యాలి.. అనే్వష్‌కి కేరళ, అజిత్‌కి ఆంధ్ర.. అరుణ్‌కి హిమాచల్‌ప్రదేశ్ పడ్డాయి..
ఇక ముగ్గురి దుఃఖానికి, బాధకి అవధి లేదు.. అమర్‌ని పొట్టన పెట్టుకున్న వాళ్ళు అంతు చూసే వీలే లేదా.. రాహుల్‌కి బెదిరింపు కాల్స్ వచ్చాయి.. ఈ విషయం ఇంతటితో వదిలెయ్యక.. పరిశోధన.. గాడిద గుడ్డు అంటే.. నీకు అమర్‌కి పట్టిన గతే పడుతుంది జాగ్రత్త! అని రాహుల్ ఆ జాబ్ వదిలేసి, ఊరు వదిలేసి వెళ్లిపోయాడు.. వెళ్లే ముందు కోర్టుకి వెళ్లి.. ‘‘తనకి ఇంకో మంచి ఆఫర్ వచ్చింది, యింట్లో తల్లి కూడా గొడవ పెడుతోంది.. ఇలాంటి గొడవల్లో తలదూర్చద్దని, సో.. సారి టు సే.. తను యింక ఈ కేసులో ఎటువంటి సహాయం అందించలేకపోతున్నందుకు.. అని చెప్పాడు.
కమల్ ఈ వారం రోజుల్లో చాలా విషయాలు సేకరించాడు..
వారం వెనక్కి వెడితే.. అతను ముందుగా రీసెంట్‌గా జనవరి నెలలో హత్యగావించబడిన.. రోహిత్ ఊరు విజయవాడ వెళ్లి వాళ్ల వాళ్లని కలిశాడు.. చేతికందిన కొడుకు దుర్మరణానికి కుమిలిపోతున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చి.. తను ఆ కేసులో హంతకుల్ని పట్టుకోవడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ అని చెప్పి రోహిత్ చదివిన కాలేజ్.. అతని ఫ్రెండ్స్ వివరాలు సంపాదించాడు.. అయితే ఆ ఫ్రెండ్స్‌లో యింతకుముందు హతమైన ముగ్గురు పేర్లు లేవు..
అతను నిరాశ చెందకుండా రోహిత్ చదివిన కాలేజీకి వెళ్ళేడు.. అతని బేచ్‌మేట్స్ వారి పేర్లు, వివరాలు అడిగాడు.. కాలేజ్ వాళ్ళు ముందు చెప్పకపోయినా యితని ఐడెంటిటి చూసి, రోహిత్ హత్యకు గురయ్యాడని, ఆ ఎంక్వైరీలో భాగంగా ఇదంతా చేస్తున్నామని చెబితే, చాలా కోపరేట్ చేశారు. అయితే వాళ్ళ చదువులైపోయి చాలా ఏళ్ళు గడిచిపోయిన కారణంగా వాళ్ళ క్లోజ్‌ఫ్రెండ్స్ ఎవరూ... వాళ్ళు ఎలా ఉండేవారూ, ఆ కాలేజ్ డేస్‌లో ఎప్పుడైనా, ఏవైనా చెప్పుకోదగ్గ గొడవలూ, అల్లర్లలో వున్నారా అనే విషయాలు చెప్పలేకపోయారు.
వాళ్లకి కృతజ్ఞతలు చెప్పి.. ఆ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫేస్ బుక్ నుంచి కొంతమందిని కాంటాక్ట్ చేసిన కమల్ వాళ్ళలో రోహిత్‌కి చాలా క్లోజ్.. అని తెలిసిన మహేష్ అనే అతనిని ఒప్పించి.. అతనిని కలవడానికి హైదరాబాద్ వెళ్ళాడు.
కమల్ తాజ్ ఇంటర్నేషనల్ రూం తీసుకుని, విజయవాడ నుంచి సరాసరి కారులో అక్కడే దిగాడు.. మహేష్‌కి తను వచ్చి తాజ్‌లో దిగినట్టు ఫోన్ చేశాడు. మహేష్ తను ఒక బిజినెస్ మీట్‌లో ఉన్నానని చెప్పాడు.

-ఇంకా ఉంది

- మీనాక్షి శ్రీనివాస్