డైలీ సీరియల్

బడబాగ్ని-29

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరే నేను ఎప్పుడు రాను, యిప్పుడు మీతో రానా.. లేకపోతే తరువాత రానా..’’
‘‘ఎప్పుడో ఎందుకు రేపు నాతో రండి.. ఫ్లైట్‌లో వెళ్లిపోదాం.. ఈ కేసు ఎంత త్వరగా తేలితే అంత మంచిది..’’
‘‘కానీ నేను మీతోబాటు ఉండను.. ఎందుకంటే.. ఒకవేళ అతను నన్ను గుర్తుపడితే అతనికి కచ్చితంగా మన ప్లాన్ తెలిసిపోయే అవకాశం ఉంది.. కానీ మీ భద్రతకి ఏమీ భయం లేదు. ఆ పూచీ నాది.. మీరు మామూలుగా అతను అక్కడ ఉన్నట్టు ఎరగనట్టే, ఎవరినో కలవడానికి వెళ్లి అతనక్కడ కనబడితే పలకరించినట్టే ఉండండి.. మామూలు కుశల ప్రశ్నలు వెయ్యండి.. పాత విషయాలేలీ మాట్టాడకండి.. మిమ్మల్ని అనుక్షణం నీడలా వెన్నంటి కాపాడే అరెంజ్‌మెంట్స్ చేసే బాధ్యత మాత్రం నాదే. అందులో ఏ మాత్రం సందేహం వద్దు. నిశ్చితంగా ఉండండి..
ఒక్క విషయం, మీరు ఏ మాత్రం అతనికి అనుమానం కలిగేలా ప్రవర్తించినా అతను మనకి దొరకడు సరికదా జాగ్రత్తపడిపోతాడు. ఇక ఎప్పటికీ దొరకడు.’’.
‘‘సరే రోట్లో తలపెట్టాక రోకటి పోటుకు వెరచేదేం ఉంది? అన్నింటికీ మీరున్నారనే ధైర్యం.. మీరు ప్రయణానికి కావలసిన ఏర్పాట్లు చెయ్యమంటారా?’’ అడిగాడు.
‘‘మీరు మామూలుగా మీ టికెట్ మీరు తీసుకోండి.. నా టికెట్ నేను తీసుంటా.. ఒకరికొకరు తెలియనట్టే ఉందాం ప్రయాణంలో కూడా.’’
మహేష్‌ని అర్జెంటుగా ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేయమని చెప్పి పంపించేశాక జరిగినది చెప్పడానికి రాహుల్‌కి ఫోన్ చేశాడు. కమల్ చెప్పేది వినకుండా ‘‘నేను క్లాసులో ఉన్న అరగంటలో చేస్తా’ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. పోనీ ఈ విషయం అనే్వష్‌కి చెబుదామని ఫోన్ చేస్తే బిజీ వచ్చింది. అతనికి ఉత్సాహం ఆగట్లేదు. మనసంతా ఏదో సాధించాను అన్నట్టు ఉరకలు వేస్తోంది’’.
బాగా అలసిపోయాను, నిద్ర వస్తోంది. కాసేపు విశ్రాంతి తీసుకుని అప్పుడు చెప్తానులే వాళ్లకి’’ మనసులోని ఉత్సాహాన్ని అదుపు చేసుకుంటూ అనుకున్నాడు.
ఎంత బిజీ అయినా, ఎంత అలసిపోయినా ఎప్పటి విషయాలు అప్పుడు రిపోర్ట్ తయారుచేసుకోవటం అతను ఆ జాబ్‌లో చేరినప్పటినుండీ చేసుకున్న అలవాటు.. ఏమిటీ సడెన్‌గా ఇంత మత్తు వస్తోంది.. బహుశా ఇన్నాళ్ల టెన్షన్ తీరినందుకేమో.. ఈ రాహుల్ ఒక్కడు.. ఎప్పుడు అర్జంట్ అనుకున్నా దొరకడు.. అమ్మో ఒకలాంటి మైకం వస్తోంది.. లేచి ముఖం కడుక్కుని ఈ రిపోర్ట్ ఫైల్ చేసేసి పడుకోవాలి.
లేచి చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కుని లాప్‌టాప్ ముందు కూర్చున్నాడు. చకచకా తను డెహ్రాడూన్ నుంచి బయలుదేరిన దగ్గరనుంచీ చేసిన మొత్తం ఇనె్వస్టిగేషన్ విపులంగా వ్రాశాడు.. మహేష్ చెప్పినదంతా రికార్డు చేసిన ఆ మేటర్ బ్లూటూత్ ద్వారా లాప్‌టాప్‌లోకి పంపి సెపరేట్ ఫైల్‌లో వేసి వర్డ్ పెట్టి లాక్ చేశాడు.. ఏమిటిదీ ఎప్పుడూ లేనిది యిలా కళ్ళు మూతలు పడిపోతున్నాయ్.. తనకోసం, మహేష్ కోసం ఆర్డర్ చేసిన ఫుడ్ అలానే వుంది.. ఆకలివేస్తోంది కానీ లేవాలని అనిపించడంలేదు.. చాలా మగతగా ఉంది. అతి కష్టంమీద లేచి లాప్‌టాప్ ఆఫ్ చేసి తన బాగ్‌లో పెట్టి, వెళ్లి అలాగే మంచంమీద ఒరిగిపోయాడు.
అదేపనిగా ఫోన్ మోగుతోంది, వినబడుతోంది కానీ శరీరం, మెదడూ ఏదీ సహకరించడంలేదు.. ఏమిటీ పరిస్థితి.. ఎప్పుడూ ఇలా కాలేదే.. సంథింగ్ రాంగ్.. అతి కష్టంమీద సెల్ అందుకున్నాడు. చాలా మిస్డ్‌కాల్స్.. రాహుల్ చేస్తున్నాడు, అన్నిసార్లు చేశాడంటే ఏదో చాలా ముఖ్యమైన విషయం అయి ఉంటుంది.
అదేమిటో నిషా దిగట్లేదు ఎంతకీ, కళ్ళు మూతలు పడిపోయి ఇంకా తెరుచుకోవట్లే. లేవడానికి విశ్వ ప్రయత్నం చేసి మొత్తానికి మంచంమీద నుంచి దిగాడు. అవతల ఫోన్ చేస్తున్నది రాహుల్.
ఫోన్ ఎత్తి ‘‘రాహుల్ ఒక్క నిమిషం లైన్‌లో ఉండు’’ అని చెప్పి ముఖం కడుక్కుని, బాల్కనీలోకి తలుపు తీస్కుని వెళ్లాడు. రాహుల్ ఆరాటంగా వెయిట్ చేస్తున్నాడు అవతలిపక్క. ఎంతకీ ఫోన్ ఆన్సర్ చెయ్యకపోయేసరికి మళ్లీ పడుకున్నాడులే.. అనుకుని ఫోన్ కట్ చేశాడు.
***
‘‘ఒక్కమాట అడుగుతా ఏమీ అనుకోవుగా రాహుల్.. కబుర్లమధ్య అడిగాడు అనే్వష్.
‘‘అడుగు.. ఇంక ఆలస్యమెందుకూ’’ నవ్వుతూ అడిగాడు రాహుల్.
‘‘మరీ మరీ.. అది.. ఏం అనుకోవుగా..’’ మొహమాటంగా అడిగాడు.
‘‘మహానుభావా.. ఏమీ అనుకోను.. అడుగు..’’
‘‘నువ్వు ప్రియని ప్రేమిస్తున్నావా..’’ అడగలేక అడగలేక అడిగాడు.
‘‘అవును.. ఇందులో అనుకునేందుకు ఏం వుంది.. ఇంకా ఏమిటో అనుకున్నా.. ’’ సీరియస్‌గా చేతిలో వున్న పుస్తకం తిరగేస్తూ అన్నాడు.
‘‘తమ్ముడికి నిశ్చయమైన అమ్మాయిని, అది కూడా వాళ్ళిద్దరూ ఒకరినొకరు యిష్టపడుతున్నారని తెలిసీ అలా చెయ్యడం తప్పు కదూ..’’ ధైర్యం చేసి అడిగేశాడు
‘‘తమ్ముడికి నిశ్చయమైన అమ్మాయా.. ఓ అదా చంపేసావ్. వెనకటికి ఎవడో నీలాంటివాడే ఎర్రచీర కట్టుకున్నదల్లా నా పెళ్లాం అన్నాడట.. అలా ఉంది.. ప్రియ అంటే ఒక్క ఆ అమ్మాయేనా.. యింక ఆ పేరుతో ఎవరూ ఉండరా... నే ప్రేమించిన అమ్మాయి పేరు ‘స్వప్నప్రియ’, మా కాలేజ్‌లోనే ఇంగ్లీష్ లెక్చరర్.
మా పరిచయం తమాషాగా జరిగిందిలే.. ఒకసారి మా కాలేజీ పిల్లలతో పిక్నిక్‌కోసం జూ పార్క్‌కి వెళ్లాం..

-ఇంకా ఉంది

- మీనాక్షి శ్రీనివాస్