డైలీ సీరియల్

బడబాగ్ని-50

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పుడో చేసిన నేరాలకి కాదు.. వాళ్ళు యిప్పటికీ చాటుమాటుగా అవే నేరాలు చేస్తున్నారు. సంఘంలో పెద్ద మనుషులుగా చెలామణీ అవుతూ చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తూ.. అందుకే వాళ్ళకి ఇంకా యింకా తప్పులు చేసే అవకాశం ఇవ్వకుండా చంపేసేను.. వాళ్ళకేదో అన్యాయం జరిగినట్టు యింత రాద్ధాంతం చేస్తున్నారే.. యిరవై ఏళ్ళుగా నేను అనుభవిస్తున్న నరకానికి ఏమంటారు.. కళ్ళెదుట జరిగిన ఘోరానికి తట్టుకోలేక అయినవారికి దూరమై, తెగిన గాలిపటంలా, పిచ్చివాడిలా తిరిగాను.. కొన్నాళ్లకి నన్ను నేను నిలవరించుకుని అష్టకష్టాలు పడి చదువు పూర్తిచేశాను.. సమాజంలో యిలాంటివి జరగకుండా అరికట్టాలనీ.. ఏదో చెయ్యాలనే తపనతో ఐపిఎస్ అయ్యాను.. కానీ ఏమీ చెయ్యలేనని అర్థం అయ్యాక నా మార్గంలో నేను అలాంటి నేరాలు చేసిన వాళ్ళని ఏరిపడేయడం మొదలుపెట్టా. నేను చేస్తున్న వాటిని నిరూపించలేక, నన్ను ఆపలేకా నా చర్యలకి సంకెళ్ళు వేసి నన్ను యిక్కడ పడేసారు..
అన్నీ మరిచిపోయి అందరిలా బతుకుదామని ఎంతో ప్రయత్నించా.. పెళ్లీ, సంసారం. కానీ అనుక్షణం ‘రవీ.. రవీ’ అన్న మల్లిక అరుపులే వినపడుతున్న నాకు సంసారం.. అందరిలాటి జీవితం ఎలా.. సాధ్యం కాలేదు.. నన్ను యింత క్షోభకి గురిచేసి వాళ్ళు మాత్రం ఆనందంగా గడుపుతున్న వాళ్ళని చూశాక నాలో పగ, ప్రతీకారం బయటకొచ్చాయి.. వాళ్ళ గురించి ఆరా తీశా.. పైకి మాత్రం పెద్దమనుషులు, అందుకే ఎక్కడ సాక్ష్యం లేకుండా, ఆధారాలు లేకుండా వాళ్ళని ఫినిష్ చేసేశా.. అందుకు నే బాధపడడంలేదు.. సిగ్గుపడడంలేదు.. అసలు వాళ్ళ కుటుంబాలని అంతం చేసి వాళ్ళకి బ్రతికి ఉండగానే నరకం చూపాలనుకున్నా. కానీ నాలో ఉన్న వివేకం ఆ పని చెయ్యనివ్వలేదు.. తప్పు వీళ్ళు చేస్తే.. వీళ్ళని శిక్షించడానికి వాళ్ళని చంపడం అమానుషం అనిపించింది.
అనుకోకుండా రోహిత్‌ని చంపడం అమర్ చూసేశాడు.. అందుకే తప్పని తెలిసినా త్పనిసరి పరిస్థితులలో అతనిని చంపాలని డిసైడ్ అయ్యా.. అనుకోకుండా వాళ్ళు అడ్వెంచర్ పేరుతో అవకాశం కల్పించారు. వాళ్ళు నలుగురు మంచి స్నేహితులు కనుక అమర్ నా విషయం వాళ్ళకి చెప్పేసి వుంటాడు.. కనుక ఎప్పటికైనా వాళ్ళతో నాకు ప్రమాదం అని అమర్‌ని చంపి ఆ నేరం అజిత్‌మీద వేస్తే మిగతా యిద్దరినీ ఎలాగో అలాగ ఫినిష్ చెయ్యడం పెద్ద పనికాదు అనుకున్నా. అయితే యింతలో ఇంద్రజిత్ తన తోటి మహిళా ఆఫీసర్‌ని హెరాస్ చెయ్యడం నా కంటబడింది.. వాడు యిప్పుడే యిలా ప్రవర్తిస్తే.. ట్రైనింగ్ పూర్తయి పోలీసు ఆఫీసర్ అయితే..
అధికారం యిచ్చే పొగరుతో వాడు ఇంకెన్ని నేరాలు చేస్తాడో. వాడిని ఫినిష్ చెయ్యాలని డిసైడ్ అయ్యా.. కాకపోతే వాడి చేత వీళ్ళని చంపించి అందులో వాడిని యిరికించి ఆ రకంగా వాడికి స్పాట్ పెడదామనుకున్నా. వాడిని బ్లాక్‌మెయిల్ చేసి వాడి చేతే అమర్‌ని చంపించి.. ఆ నేరం అజిత్‌మీద పడేలా ప్లాన్ చేశా..
అక్కడితో వూరుకుంటే నన్ను పట్టుకోవడం ఎవరితరమూ కాదు, విషయం వీళ్ళకి తెలుసేమో అన్న అపోహలో అరుణ్, అనే్వష్‌ల జోలికి వెళ్ళడమే నేచేసిన పెద్ద తప్పు. అక్కడే నేను దొరికిపోవడానికి అవకాశం ఇచ్చినది.. దానితో కమల్, రాహుల్ సీనులోకి ఎంటర్ అయ్యారు. కమల్ అవడానికి క్రైం రిపోర్టర్ అయినా అతనికి ఒక మంచి పోలీస్ ఆఫీసర్‌కి వుండవలసినంత ధైర్యం, సాహసం ఒక డిటెక్టివ్‌కి వుండవలసినంత నేర్పరితనం వున్నాయ్. అతను మహేష్‌ని కలవడం చూసిన నాకు యింక నేను దొరికిపోవడం తప్పదు అని అర్థం అయి.. అందుకే అతనినీ, మహేష్‌నీ ప్రమాదం అనిపించేలా చంపక తప్పలేదు.. కానీ రాహుల్ ప్రవేశించి మొత్తం కథ క్లైమాక్స్‌కి తెచ్చాడు.. అతనిని అభినందిస్తున్నా.. హంతకుడిని పట్టుకోవడం అనేది తనకి ఎంతమాత్రం సంబంధం లేకపోయినా, బాధ్యతాయుతమైన పౌరుడిగా స్పందించి కష్టనష్టాల కోర్చి అతను ఈ కేస్ సాల్వ్ చేశాడు.. అదే ప్రయత్నం మన పోలీసులు చేసి వుంటే ఈ కేసు ఎప్పుడో సాల్వ్ అయ్యేది. ఏ క్లూస్ దొరకలేదని వాటిని మిస్టీరియస్ మర్డర్స్‌గా క్లోజ్ చేశారో, అవే క్లూస్ ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి అతను కనిపెట్టాడు. నిజానికి పోలీస్ యంత్రాంగానికున్న అధికారం, అనే్వషించడానికున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లకు.. ఎలాంటి కేసులనయినా సాల్వ్ చేయగలదు, చిత్తశుద్ధి వుంటే.. క్షమించండి.. యిది ఎవరినీ విమర్శించడానికో, కించపరచడానికో అనడంలేదు.. అస్తవ్యస్తమైపోతున్న వ్యవస్థని చూసి బాధతో అంటున్నా.. అమర్, కమల్‌ల కుటుంబాలనూ, ఆత్మీయులను క్షమాపణలు అడుగుతున్నా..’’ అతని ఆవేదనాభరిత ఉద్వేగతపూరిత మాటలకి కోర్టు మొత్తం నిశ్శబ్దమైపోయింది.
ముందుగా తేరుకున్న లాయర్ భగవాన్...
‘‘మిలార్డ్, మిస్టర్ సాహూ నేరం ఒప్పుకున్నందువలన.. ఏ పరిస్థితులలో చేసినా నేరం నేరమే కనుక.. అతను ఈ ఇరవై ఏళ్ళుగా అనుభవించిన మానసిక క్షోభని పరిగణనలోకి తీసుకుని మానవతా దృక్పథంతో అతనికి సాధారణ జీవిత ఖైదు వేయవలసిందిగా కోర్టువారిని కోరుకుంటున్నా.. ఎంతో చాకచక్యంతో ఈ కేస్ సాల్వ్ చేసిన ప్రొ.రాహుల్‌ని అభినందిస్తున్నాను.

-ఇంకా ఉంది

- మీనాక్షి శ్రీనివాస్