డైలీ సీరియల్

బడబాగ్ని-51

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంతో కీలకమైన, ఈ కేస్ సాల్వ్ చేయడంలో ఉపకరించిన సమాచారం సేకరించి.. ఆ ప్రయత్నంలో తన ప్రాణాలు పోగొట్టుకున్న కమల్‌కి నీరాజనం అర్పిస్తూ.. ఈ కేస్ సాల్వ్ చెయ్యడంలో తమ వంతుగా అడుగడుగునా రాహుల్‌కి సహాయమందించి తోడుగా నిలిచిన మన యంగ్ ఆఫీసర్స్‌కి అభినందనలు ప్లస్ వారికి దొరికిన ఈ అమూల్యమైన అవకాశాన్ని సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించమని కోరుతున్నాను..’’
కోర్టు అంతటా నిశ్శబ్దం అలముకుంది. జడ్జిగారు ఇవ్వబోయే తీర్పు వినటంకోసం అందరూ చెవులు రిక్కించి సిద్ధంగా ఉన్నారు. జడ్జిగారు తీర్పు వ్రాయటం మొదలుపెట్టారు.
అలసటగా కనులు మూసుకున్న రవీంద్ర సాహూ రెప్పల వెనుక ఏవేవో జ్ఞాపకాలు.
***
ఇల్లు వదిలిన సాహూ పిచ్చివాడిలా ఎక్కడెక్కడో తిరిగాడు. ఎవరైనా పెడితే తిని, లేకుంటే పస్తులుండి, బికారిలా తిరుగుతున్న అతను ఓసారి చాలా రోజులు తినకపోవటంతో ఎర్రటి ఎండలో కళ్ళు తిరిగి రోడ్డుమీద పడిపోయాడు.
ఆ సమయంలో అక్కడే వున్న బిజినెస్ మాగ్నెట్ మల్‌హోత్రా అనే ఆయన సాహూ పరిస్థితికి జాలిపడి, చేరదీసి తనతో పాటుగా ఢిల్లీకి తీసుకుపోయి అతన్ని మామూలు మనిషిగా చేశాడు. తానెవ్వరూ లేని అనాథను అని చెబితే నమ్మి, తన ఆస్తిపాస్తులను, తల్లిదండ్రులను ఓ తుపానులో కోల్పోయాననీ, దయతలచి తనకేదైనా పనిప్పిస్తే చేసుకుంటూ, చదువుకుంటానని, బాగా చదివి ఐపిఎస్ అవటమే తన జీవిత లక్ష్యం అనీ చెప్పిన సాహూ మాటలు నమ్మి ఆశ్రయం ఇవ్వటమే కాక అతనికో బ్రతుకు తెరువు చూపించి సహాయం చేశాడాయన.
వాళ్ళ అభిమానంతో మెల్లమెల్లగా తన పాత జీవితపు జ్ఞాపకాలను మరుగుపరచుకుంటూ, చదువులో తన విశిష్ట ప్రతిభను చూపి, సివిల్స్ వ్రాసి ఐపిఎస్ అయ్యాడు.
అప్పుడు జరిగిన పోలీస్ ఎంక్వయిరీలో అతను చిన్నతనంలోనే ఇల్లు విడిచి పారిపోయి వచ్చేసిన సంగతి బయటపడకుండా మల్హోత్రా దంపతులు పెద్ద మనసుతో చిన్నపిల్లవాడిగా ఉన్నప్పటినుండీ సాహూని తామే పెంచుకుంటున్నామని, అతను తమ బిడ్డేనని చెప్పి ఆ కష్టాన్ని గట్టెక్కించారు. అలాంటివారు తనకి తారసపడటం, తాను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమోనని భావిస్తూ వారిని దైవ సమానంగా భావించి, సేవించుకోవాలనుకునేసరికి ఒక రోడ్ ప్రమాదంలో వాళ్ళు కూడా తనకు దూరమైపోయారు ఆరని దుఃఖాన్ని తనకు మిగిల్చి.
తనను పెద్ద ఆఫీసరుగా చూడాలనుకున్న తండ్రి ఆశ తీరి తాను పోలీస్ ఆఫీసరుగా అయిన రోజు అతను పొందిన ఆనందం ఇంతా అంతా కాదు. తాను దూరమైన నాటినుండీ, ఎందుకు దూరం అయ్యాడో, ఎక్కడ ఉన్నాడో, ఎలా ఉన్నాడో అసలున్నాడో లేడో అని తనకోసమే అలమటించే తల్లిదండ్రులను ఆశ్చర్యానందాలలో ముంచి తేల్చాలనే ఉద్దేశ్యంతో తాను డ్యూటీలో చేరేముందు అన్ని సంవత్సరాల తరువాత తన ఊరికి వచ్చిన అతనికి అంతులేని ఆశాభంగంతో పాటు భరించలేనంత విషాదమూ కలిగింది.
తమ ఇంటికి వెళితే ఎవరో కొత్తవారు, తండ్రి గురించి అడిగితే తాము నాలుగేళ్లుగా అక్కడే ఉంటున్నామని ఆ పేరుగలవాళ్ళెవరూ తమకు తెలియదనీ చెప్పారు.
తనకు చిన్నప్పుడు చదువు చెప్పిన మాష్టారిల్లు తమ ఇంటి దగ్గరనే ఉండటంతో వారింటికివెళ్లిన రవీంద్ర సాహూని ఆ మాష్టారు మొదట చీదరించుకున్నా, తను ఇంట్లో చెప్పకుండా వెళ్లిన అప్పటి పరిస్థితులు వేరని, స్నేహితులనుకున్నవారే చేసిన మిత్రద్రోహానికి తలవంచి తట్టుకోలేక, అలా వెళ్లిపోవలసి వచ్చిందనీ తను ఎక్కడెక్కడో తిరిగి ఒక మహానుభావుడి దయవలన బాగా చదువుకొని, ఐపియస్ ఆఫీసర్ అయ్యానని, అందుకే ఆ విషయం తన తల్లిదండ్రులకు చెప్పి, వారిని తనతో తీసుకువెళ్ళడానికి వచ్చానని.. దయచేసి వాళ్ల చిరునామా చెప్పమని కన్నీళ్లతో అడిగిన సాహూకి చెప్పలేక చెప్పలేక జరిగిన విషయాన్ని చెప్పారు ఆ మాష్టారు.
ఆనాటి రాత్రి, మర్నాడు కూడా ఇల్లు చేరని కొడుకు గురించి రవీంద్ర సాహూ తల్లీ, తండ్రీ చాలా కంగారుపడి కాలేజీలో అడిగితే, పరీక్షలైపోయి, అంతా నిన్ననే వెళ్లిపోయారని చెప్పారు. స్నేహితులను అడిగితే తమతో ఇంటికి వెళ్తున్నట్టే చెప్పాడని చెప్పారు. నెలరోజులపాటు కొడుకు జాడ కోసం పోలీస్ స్టేషన్ చుట్టూరా కాలికి బలపం కట్టుకు తిరిగిన సాహూ తండ్రికి కాలేజీ తిరిగి తెరిచిన తరువాత ఎవరో అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులూ ఇంటిమీదకువచ్చి తమ కూతురిని లేపుకెళ్లిపోయాడంటూ నానా రభసా చేస్తే, ఆ అవమానం.. అంతకంటే ఎక్కువ నమ్మిన కన్నకొడుకు చేసిన నిర్వాకం తట్టుకోలేక ఆ తల్లీ తండ్రీ ఇంట్లోనే ఉరి వేసుకు మరణించారనీ.. ఇంట్లో సామాను అంతా ఆయనకు అప్పులిచ్చిన వాళ్ళు పట్టుకుపోయారని చెప్పాడాయన.
అది విన్న సాహూ.. కుప్పకూలిపోయి.. గుండె పగిలేలా రోదించాడు.. తన మల్లికని దారుణంగా, చంపినదే కాక చనిపోయిన ఆమెమీద వాళ్లు జల్లిన బురద, తల్లిదండ్రులకు జరిగిన అవమానం, అది తట్టుకోలేక వాళ్ళు మరణించడం జరిగింది...

-ఇంకా ఉంది

- మీనాక్షి శ్రీనివాస్