డైలీ సీరియల్

ట్విన్ టవర్స్-20

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కనీసం ఇప్పుడు మనం ఒకేచోట కూడా లేము. లేకపోతే నా చదువు, నీ చదువు కూడా చెడుతుంది. మనం దగ్గర అవ్వడం ఇంకా దూరమయిపోతుంది’’.
అతని ధోరణిలో అతను చెప్పుకుపోతున్నాడు. ఒక్కదానికి సమాధానం ఇవ్వలేదు. ఇవ్వాలనిపించలేదు.
చివరగా అన్నాడు ‘‘ఆలస్యం చేయకు కల్యాణి. ఇట్ ఈజ్ వెరీ టైమ్ సెన్సిటివ్. ఐ యామ్ వెరీ సూన్. నాకు తెలుసు నువ్వు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఇరుక్కున్నావు’’ అన్నాడు. అది మాత్రం చాలా సిన్సియర్‌గా వినిపించింది.
‘‘్భయంగా ఉందా’’ అన్నాడు.
‘‘అవును’’ అన్నాను.
‘‘్భయపడకు. అన్నీ సరి అవుతాయి. ధైర్యంగా ఉండు.. ఫోన్ అమ్మకు ఇవ్వు. ఉంటాను. ఐ మిస్ యు అన్నాడు.
‘‘నేను కూడా’’ అని తలుపు తెరిచి మా అత్తగారి వంక చూచాను. ఆవిడకు ఫోన్ అందించి పైకి వెళ్లాను మళ్లీ.
మనసు పరిపరి విధాలా పోతోంది. ఎంత సులువుగా, ఎంత త్వరగా నిర్ణయం తీసుకోగలిగాడు.
నేనెందుకు ఇంత మధనపడుతున్నాను. ఈ వార్త తెలిసినప్పటినుండి రఘు ఏమంటాడో అని కనీసం ఒక వెయ్యి సార్లయినా అనుకున్నాను.
అతనికి కనీసం నా అభిప్రాయం అడగాలని అయినా అనిపించలేదా ఈ నిర్ణయం చేసేముందు? కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఈ కళ్ళు ఒకటి- వాటికి వేరే పనేం లేదు. మనసులో ఏం భావం మెదులుతే వాటిని బయట పెట్టేందుకు మాత్రం సంకోచించవు.
అమ్మ మేడమీదకు వచ్చింది. నేనెలా ఉన్నానో అని. అమ్మను చూడగానే అన్నాను. విజయవాడ వెళ్లిపోదాం అని.
‘‘వెడదాం. ఎవరో చాలా పెద్ద డాక్టర్‌గారు వస్తున్నారుట నిన్ను కలవలడానికి’’ అంది.
భయం భయంగా చూశాను.
‘‘్భయపడాల్సింది ఏమీ లేదు. ఆవిడ నీతో మాట్లాడటానికి, నీకు ధైర్యం చెప్పడానికి వస్తున్నారు అంతే!’’
‘‘క్రిందకు వస్తావా’’’ అంది.
‘‘రాను’’ అన్నాను.
తను వెళ్లిపోయింది.
డాక్టర్ వసుంధర అంటే చాలా పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్న డాక్టర్. ఆవిడ చాలా పేరున్న హాస్పిటల్‌కి చీఫ్. అటువంటి ఆవిడని, అంత త్వరగా ఇంటికి రప్పించగలుగుతున్నారంటే మా మామగారి పరపతి తెలుస్తూనే ఉంది.
కొద్దిసేపట్లో డాక్టర్‌గారు పైకి వచ్చారు. ఆమె వెనకే మా అత్తగారు, అమ్మ వచ్చారు.
కిటికీ దగ్గరనుండి వెనక్కి తిరిగాను. తలుపు దగ్గర నుంచున్న ఆవిడ చాలా గంభీరంగా కనిపించింది. ఏళ్ళ తరబడి వైద్యంలో మునిగిపోయినట్లు ఆవిడ ప్రొఫెషనలిజం తెలుపుతోంది. పొడుగ్గా ఉంది. బొద్దుగా ఉంది. అక్కడక్కడ నెరసిన వెంట్రుకలు వయసును తెలుపుతున్నాయి. కాని, ఆమె ముఖంలో తొణికసలాడే విజ్ఞానం బహశా రోగులకి కాన్ఫిడెన్స్ ఇస్తుందేమో!
మా అత్తగారు నన్ను పరిచయం చేశారు. మా ‘కొత్త కోడలు’ అంటూ..
‘‘సారీ మీ పెళ్లికి రాలేకపోయాను. చాలా పని తొందరలో’’ అంది ఆవిడ.
కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా దొల్లాయి. ‘నేను కూడా ఇక్కడ ఉండచ్చా’ అడిగింది అమ్మ సంకోచంగా.
తప్పకుండా! మీ ఇద్దరూ ఉండచ్చు. మీ అమ్మాయి ఇష్టం అంది డాక్టర్ గారు తొలిసారిగా నా భావాలకు విలువ ఇస్తూ.
అమ్మ నా వంక చూచింది. వద్దన్నట్లు తల ఊగించాను. అమ్మ ఉండటం నాకు ఇష్టమే. కాని అమ్మ ఉండిపోతే ఆవిడ వెనక అత్తగారు ఉండిపోతుంది. అది నాకు ఇష్టం లేదు. ఆవిడ అభిప్రాయం అప్పుడే వెల్లడైంది. తలుపు చేరవేసి ఇద్దరూ వెళ్లిపోయారు.
మరో సందర్భంలో అయితే కంగ్రాట్యులేషన్స్ అంటూ అభినందించేదానిని. కానీ ఇపుడు పరిస్థితి వేరుగా ఉంది కదా! అయినా ఆ రోజు వచ్చినపుడు నాకు అవకాశం వస్తుందనే అనుకుంటున్నాను. అంది చిరునవుతో- పరిచయ వాక్యాలలా. ఆవిడ సమయం వృధా చేసే మనిషిలా లేదు.
నేను ఆవిడ వంక చూచి, తల దించుకుని, నా చేతి వేళ్ళ వంక చూసుకుంటూ నుంచున్నాను. అరచేతిలో గోరింటాకు వెలసిపోయినా గోళ్లమీద నిలిచిపోయింది. కొద్దిగా గోరు పెరిగి చంద్ర వంక ఆకారంలో గోర్లు ఎర్రగా కనిపిస్తున్నాయి.
అప్పుడే గుర్తువచ్చినట్లు, కూర్చోండి అని బల్లముందున్న కుర్చీ ఆవిడ వైపుకు తోశాను.
ఆవిడ కూర్చుంటూ ‘నువ్వూ కూచో’’ అన్నారు.
మంచం చివరగా కూర్చున్నాను. మా ఇద్దరిమధ్య వాతావరణం తేలిక చెయ్యలని కాబోలు, నా చదువు, రఘు అమెరికా ప్రయాణం గురించి ఏవేవో ప్రశ్నలు వేస్తూ వచ్చారు.
గోడమీద ఉన్న రఘు గ్రాడ్యుయేషన్ ఫొటో చూపిస్తూ- ‘‘మీ ఆయన పుట్టింది నా చేతుల్లోనే తెలుసా’’ అంటూ నవ్వింది.
నేను నవ్వాను. ఎందుకో కొంచెం తేలికగా అనిపించింది ఆవిడతో మాట్లాడటానికి.
‘‘్భయపడకు. నేనిక్కడకు డాక్టర్‌గారాలేదు. చూడు నా చేతులు.. ఖాళి.. నో స్టెతస్కోప్.. నో గ్లోవ్స్. నేను మీ అత్తగారికి, మామగారికి ముందుగా స్నేహితురాలిని, తరువాతే డాక్టర్ని’’ అంది.
‘‘రఘు ఏం సూచిస్తున్నాడో నాకు తెలుసు. నీకేమనిపిస్తోంది’’ అడిగింది.
మొదటిసారిగా ఒక వ్యక్తి నా మనసులో ఏముందో అని అడిగింది. నాకూ ఆలోచనలు ఉన్నాయని తలచినది.
ఆ భావనే నాకు బలాన్ని ఇచ్చింది. ధైర్యాన్ని ఇచ్చింది.
తల అడ్డంగా ఊగించాను. ఏమీ అనుకోనట్లు ‘‘నాకు ఇక్కడికి వచ్చేదాకా మరో ఆప్షన్ ఉన్నట్లే తెలియదు. తెలిశాక అది రైటో కాదో అనిపిస్తోంది’’ అన్నాను మెల్లిగా.
‘‘చాలా నిర్ణయాలు రైటు, రాంగ్ అని చెయ్యరు. పరిస్థితుల ప్రభావాలు నిర్ణయం చేస్తాయి’’ అంది.
‘‘మీరు ఇటువంటివి చాలా చేశారు కదా!’’ అడిగాను.
తల ఊగించింది అవునన్నట్లు.
‘‘మీకు ఏమీ అనిపించదా?’’ చూచింది.
అర్థం కానట్లు చూచింది.

-ఇంకా ఉంది

రమాదేవి చెరుకూరి