డైలీ సీరియల్

ట్విన్ టవర్స్ 115

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందినట్లు వున్న ఉష చెంప చూసి తేజా కోపంగా వౌళిని కసిరింది. ‘నువ్వు షేవ్ చేసుకోకుండా ఉషని ముద్దు పెట్టుకోవద్దు. చూడు ఎంత కందిపోయిందో’’ అంది.
‘‘నీలాగే అది ఏమీ కంప్లైంట్ చెయ్యడంలేదు. నువ్వెందుకు కోప్పడతావు’’ అన్నాడు వౌళి. వౌళి భుజంమీద ఒక్కటి వేసింది తేజా! నవ్వుతూ వెళ్లిపోయాడు. మళ్లీ అలాంటి రోజులు వస్తాయా వాళ్ల జీవితాల్లోకి’’ మనసులో బాధగా అనుకున్నాను.
‘‘ఎప్పుడు డిప్రెస్‌డ్‌గా అనిపించినా, రుూ ఫొటో వంక చూడు. నీ బాధ్యత ఏమిటో నీకు గుర్తుకు వస్తుంది. నువ్వు ఎందుకు బతికి వుండాలో నీకు తెలుస్తుంది.
‘‘తేజా, స్వామి చిన్మయానంద ఏమనేవారో తెలుసా- భగవంతుడు అన్ని వేళలా అన్నిచోట్లా వుండలేడు. అందుకే అమ్మలను సృష్టించాడు’’ అని.
‘‘ఉషను ఎవరు ఎంత బాగా చూచినా, అది నీ ప్రేమకు సరికాదు. తల్లి సంరక్షణను ఎవ్వరూ రీప్లేస్ చెయ్యలేరు. అది మర్చిపోకు.
నీకు ముందు ముందు బోలెడు బాధ్యతలు వున్నాయి.
ఉషకి నడక నేర్పాలి. దాని వెనుక పరుగులెత్తాలి. దానితో సైకిల్ తొక్కాలి అన్నాను చిరునవ్వుతో. తేజా కూడా చిన్నగా నిట్టూర్చింది. సన్నగా చిరునవ్వు పెదిమలమీదకు వచ్చింది.
వౌళి ఆ ఫొటో తీసి తేజాకి కనపడేలా పెట్టాడు. అప్రయత్నంగా గడ్డం నిమురుకున్నాడు. తేజా వంక చూచాడు పలకరించే కళ్ళతో.
గది తలుపులు దాటుతూ వెనక్కి తిరుగుతూ అన్నాను. చూపుడువేలు తర్జన చేసి చూపిస్తూ, గుర్తుంచుకో 30 రోజులు మాత్రం నీకు టైము ఇస్తున్నాను. నీ బేబిని నువ్వు చూసుకుంటానికి లేదా నా బహుమతిని తీసుకుని నేను ఇండియా వెళ్లిపోతాను.. అన్నాను.
‘‘అచ్చం టీవీలో అత్తగారిలా కనిపిస్తున్నావు ఆంటీ!’’ అంది లత.
డాక్టర్స్ అంతా వెళ్లిపోయారు. మేము ఇంటికి వెళ్లడానికి ఎదురుచూస్తున్నాం. సావిత్రికి నాతో రావడమా! ఇంకొంచెం సేపు తేజా దగ్గరలో వుండాలో తేల్చుకోలేక సతమతమవుతుంది. మర్నాడు మళ్లీ మిచిగన్ వెళ్లిపోవాలి.
లోపలనుంచి మాటలు వినిపిస్తున్నాయి. ఎంతమందిలో వున్నా, నాకు వౌళి మాటలు వినిపిస్తూనే వుంటాయి.
‘‘అత్తయ్య మాటలు విన్నవా’’ అంటోంది తేజా వౌళితో.
‘‘నిజంగానే ఉషను తీసుకువెడ్తానంటారేమో!’’ అంది దిగులుగా!
వౌళి నవ్వాడు. నీ మొహం అన్నాడు చాలా ప్రేమగా! నిన్ను నీ కాళ్లమీద నువ్వు నిలబడే వరకూ, అమ్మ నిన్ను వదిలి వెళ్లదు. ఉషను అసలు తీసుకువెళ్లదు. ఊరికే, నిన్ను బెదరిస్తోంది’’ అని నవ్వాడు మామూలుగా. అయితే తేజ నా మాటలను పెద్దగా పట్టించుకునేది కాదేమో! మనసు బాగా బలహీనపడిపోవడంతో ప్రతి చిన్న మాట బాదర్ చేయడం మొదలుపెట్టింది.
క్లాసులు మిస్ అవుతున్నానని లత వెళ్లిపోయింది. సావిత్రి, మూర్తిగారు మిచిగన్ వెళ్లారు. సావిత్రి వెళ్లలేక వెళ్లలేక వెళ్లిపోయింది. వెడుతూ నా చేతులు పట్టుకుంది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
‘‘మీరే ఇక్కడ లేకపోతే వీళ్లేమయిపోయేవారో’’ అంది.
సావిత్రి పెదిమలమీద చెయ్యి వుంచి ఆపేశాను.
‘‘అందరిని చూడాల్సింది ఆపైవాడు. మనం కాదు’’ అన్నాను.
రోజు చాలా మెల్లగా నడుస్తోది. తేజా కాలు చాలా మెల్లిగా, ప్రోగ్రెస్ అవుతుంది. పొద్దునే్న ఆఫీసుకు వెళ్ళే లోపలే, హాస్పిటల్‌కి వెళ్లి అక్కడనుండే ఆఫీసుకు వెళ్ళేవాడు. మళ్లీ ఆఫీసు నుండి హాస్పిటల్‌కి వెళ్ళేవాడు. నేను రోజూ వెళ్లడానికి కుదరడంలేదు. ఉషని ఎవరితోనో వుంచాలి. అది అంత సులువు కాదు. అందుకని శని, ఆదివారాలు మాత్రమే చూస్తున్నాను. ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నాను.
తేజ మనసులో ధైర్యం పుంజుకోవడానికి, హాస్పిటల్ సపోర్టు గ్రూప్ రోజూ మాట్లాడుతూనే ఉన్నారు.
రుూ విధ్వంసంలో పాలు పంచుకున్న బాధితులకు కౌన్సిలింగ్ చేస్తున్నాను. ఎన్నివేల కుటుంబాలు ఒక్కసారిగా దుఃఖపూరితమయిపోయాయో! ఇంకా దొరకని శరీర విభాగాలని డిఎన్‌ఏ పరీక్షలలో గుర్తింపు తేవాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రతిరోజు జరుగుతున్న విషయాలు టీవీలో చూపిస్తూనే ఉన్నారు. ఎందుకనో తెలియదు ఆ భవనాలు కూలిపోయిన ప్రదేశాన్ని మాత్రం గ్రౌండ్ జీరో అని సంబోధిస్తున్నారు.
ఒక్కసారి అమెరికా ఆలోచనా విధానం మారిపోయింది. ప్రతి విషయంలో అప్రమత్తత పెరిగింది. ప్రతిచోటా సెక్యూరిటీ పెరిగిపోయింది. ఏ క్షణాన్నైనా దాడి జరగవచ్చనే భావం పెరిగిపోయింది. పైగా, రుూ విధంగా జరిపింది మేమే అంటూ పబ్లిక్‌గా ఎనౌన్స్ చేయించారు ఒక విప్లవకారుల గ్రూప్.
ఎంత జననష్టం.
ఎంత ధననష్టం.
అమెరికా లాంటి దేశాలు కాబట్టి త్వరగా పుంజుకుంటాయి.
నా జీవితం ఒక్కసారిగా గందరగోళం అయినట్లనిపిస్తోంది. ఏమిటో నాకే అర్థం కాని రెస్ట్‌లెనెస్. ఎందుకో అర్థం కాదు. ఏ ఒకటీ యిది అని చెప్పడానికి లేదు. పరాయి దేశంలో జరిగిన ఒక విధ్వంసం- నా జీవితాన్ని టచ్ చేస్తుందని నేనెన్నడూ అనుకోలేదు.
ఇంతవరకు నా సమస్యలు అన్నీ కేవలం వ్యక్తిగతం. ఆ సమస్యలు కూడా, అది నా సమస్య అని అనుకున్నంత కాలమే బాధించాయి. ఒక్కసారి నిర్ణయం పూర్తికాగానే క్రమక్రమంగా మరుగున పడిపోయాయి.
కాని ఇవాళ సమస్య- నా కొడుకుది. వాడి భార్య ఆస్పత్రిలో ఉండిపోయింది. మామూలుగా మనిషి అవుతుందో లేదో తెలియదు. మానసికంగా, శారీరకంగా దెబ్బతిన్నది. అప్పుడే చాలామంది న్యూస్‌పేపరు వాళ్లు, టెలివిజన్ వాళ్ళు, తేజాని ప్రత్యక్షంగా తన ఎక్స్‌పీరియెన్స్ గురించి చెప్పమంటున్నారు. కాని వౌళికి అప్పుడే ఇష్టం లేదు. యిప్పుడిప్పుడే కొంచెం రిలాక్స్ అవుతున్న తేజా మళ్లీ ప్రతి చిన్న డిటెయిల్‌ని గుర్తుతెచ్చుకుంటే మంచిది కాదని.
డాక్టర్స్ విభిన్న అభిప్రాయాలు వెల్లడించారు.

-ఇంకా ఉంది

రమాదేవి చెరుకూరి