డైలీ సీరియల్

ట్విన్ టవర్స్-116

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌళి బాగా నలిగిపోతున్నాడు. ఇల్లు, ఆఫీసు, హాస్పిటల్, తేజా మనస్థితి అన్నీ వాడిని బాగా వత్తిడి చేస్తున్నాయి.
వాటన్నిటిమధ్య ఉష నా బాధ్యత అయిపోయిది. అది తలచుకుంటుంటే- జీవితం మళ్లీ చర్విత చరణం అవుతుంది అని అనిపిస్తోంది. వౌళి బాధ్యత అంతే. వాడి అమ్మమ్మా, తాతమ్మ అత్తయ్యలమీదే వుండేది’’. వాళ్ళందరితో నన్ను పోల్చుకుంటే చాలా బాధ అనిపించేది. నేను వాళ్లకు ఎంత బాధ్యత అయిపోయాను అని.
వీటన్నింటికి తోడు మధ్య మధ్యలో రఘురామ్ జ్ఞాపకాలు- ఎంత వదుల్చుకుందామన్నా వదలడంలేదు. అవుట్ ఆఫ్ సైట్ - అవుట్ ఆఫ్ మైండ్ అవడంలేదు. ఇప్పుడు వున్నదే మైండ్‌లో దాన్ని ఎలా దూరం చేసుకోలో తెలియడంలేదు. చివరిరోజు తేజా గదిలో చూచినపుడు మనిషిలో చాలా మార్పు కనిపించింది. మొదటి రోజుతో పోల్చి చూస్తే మనిషేదో పోగొట్టుకున్నవాడిలా వున్నాడు. మనిషిలో ఒక రకమైన విచారం తొంగి చూస్తున్నది. అతని తాలూకు ఎవరో పోయారని వౌళి అన్నాడు. ఎవరయి వుంటారు? ఎవరో ఆప్తులు- భార్యనా? ఆమెకేం పని వుంటుంది వరల్డ్ టవర్స్‌లో? ఆవిడ కూడా రీసెర్చి ఆవిడే కదా! పిల్లలా?
ఉలిక్కిపడ్డాను. రఘురాంకి వేరే పిల్లలు వున్నారా? ఎందుకో ఆ ఆలోచన మనసుకు తృప్తి కలిగించలేదు.
అంతలోనే అనుకున్నాను. ఎందుకు వుండకూడదు. పెళ్లిచేసుకున్నపుడు పిల్లలు ఎందుకు వుండరు?
నిద్ర, ఆలోచనలమధ్య- రాత్రి దిగజారుతోంది. ఉష ఏడుపు, వౌళి అడుగులు చప్పుడు, నా నిద్ర పూర్తిగా పోయింది. నేనూ లేచాను. వౌళి రాత్రిళ్ళు నన్ను లేవద్దంటాడు. ‘పగలంతా నువ్వే చూస్తున్నావు. రాత్రిళ్లు నువ్వు లేవకు’ అంటాడు.
‘‘నువ్వు పనులు అన్నీ చేస్తుంటే నాకు చాలా గిల్టీగా వుందమ్మా!’’
చిన్నగా నవ్వి ఊరుకున్నాను.
‘‘నువ్వేదో సరదాగా ఉషతో కొద్ది నెలలు గడిపి వెళ్లిపోతావనుకున్నాను. చివరకు, దాని బాధ్యత అంతా నీమీద పడింది’’ నిట్టూర్చాడు.
వౌళి ఒళ్లో పాలు తాగుతున్న ఉష, వౌళి మాటలు అర్థమయినట్లు, పాలు తాగడం ఆపి నవ్వింది. ఇప్పుడు బాటిల్‌తో పాలు తాగడానికి ఇదివరకులా పేచీ పెట్టడంలేదు.
‘‘నీ మాటలకు నేనే కాదు నీ కూతురు చూడు ఎలా నవ్వుతోందో’’ అన్నాను. వౌళి కూడా దానివంక చూచాడు. నోట్లో బాటిల్‌ని కదిలించాడు తాగమన్నట్లు.
అది గబగబా పాలు తాగడం మొదలుపెట్టింది. ‘‘అనవసరమయిన ఆలోచనలతో మనసు పాడుచేసుకోకు. ఇంత దారుణం జరిగినప్పుడు, నేను నీతో వున్నాను. లేకపోతే ఎంత క్షోభించేదానినో’’ అన్నాను. ‘‘మనవాళ్లని మనం చూసుకోవడం ఒక ఘనం కాదు’’ అని ఇంకా ఏదో అనబోతూనే వున్నాను.
పైనించి ధమ్ అని చప్పుడు వినిపించింది. ఏదో ఎత్తునుండి కింద పడ్డట్టుగా.
మేమిద్దరం ఉలిక్కిపడ్డాం. తల ఎత్తి పైకి చూశాం.
వౌళి మొహం భయం కమ్మేసింది. తెల్లగా పాలిపోయింది. గబగబా ఉషతో అపార్టుమెంటు బయటకు వచ్చాడు నా చెయ్యి కూడా పట్టుకుని.
ఒకటే ఆలోచన మళ్లీ ఏ విఘాతం జరగలేదు కదా అని.
బయట అంతా చాలా ప్రశాంతంగా వుంది. కారిడార్‌లో సన్నగా లైట్లు వెలుగుతున్నాయి. పక్కగా విండోలోంచి క్రింద పరుగెడుతున్న కార్లు కనిపిస్తున్నాయి.
ఎక్కడా ఎవరికీ ఏం జరిగినట్లు కనిపించలేదు. బలంగా నిట్టూర్చాను.
అంతలోనే వౌళి ఉషను నా చేతులలో వుంచి గబగబా పక్కగా వున్న మెట్లమీంచి పై అంతుస్థులోకి వెళ్లాడు.
ఆశ్చర్యంగా వాడివంకే చూచి, నేను కూడా ఎలివేటర్ ఎక్కి పైఅంతస్తులోకి వెళ్లాను.
నేను వెళ్లేటప్పటికి వౌళి ఒక అపార్టుమెంటు ముందు నిలబడి తల వంచి చెవి తలుపులు దగ్గరగా వుంచి ఆగిపోయాడు.
లోపల నుంచి ఎక్కిళ్ళు వినిపిస్తున్నాయి. ఆ అపార్టుమెంటు సరిగ్గా వౌళి అపార్టుమెంటు పైన. అందుకే చుట్టుప్రక్కల అంతా నిశ్శబ్దంగా వుండేటప్పటికి అక్కడేమయినా జరిగిందేమోననిపించి వుంటుంది.
మునివేళ్ళతో తలుపు కొట్టాడు. ఎటువంటి స్పందనా లేదు. డోరు నాబ్‌ని గట్టిగా తిప్పేటప్పటికి తలుపు తెరుచుకుంది. లోపల సరిగ్గా గట్టిగా వేసుకున్నట్లు లేదు.
లోపలకు అడుగుపెట్టకుండానే, అక్కడ దృశ్యం చూచి ఇద్దరం అవాక్కయిపోయాము.
రూమ్‌లో లైటు వెలుగుతోంది. లోపల ఓ పిల్ల నేలమీద కూచుని మోకాళ్లలో తల పెట్టుకు ఏడుస్తోంది. పక్కనే సోఫామీదకి విరిగి పడిపోయిన ఫ్యాన్ కనిపిస్తోంది. ఫ్యాన్‌కు వేలాడుతున్న చీరకొంగు, మరోకొస ఆ అమ్మాయి వడిలో ఉంది.
ఆ క్షణంలో ఆ అమ్మాయి అక్కడేం చేయబోయిందో అర్థమయిపోయింది. నేను తల ఎత్తి చూచాను. ఫ్యాన్ వూడిపడిన చోట విరిగిపడ్డ సీలింగ్ కనిపిస్తోంది.
వౌళి మెల్లిగా తలుపు దగ్గరగా వేశాడు. నేను ఉషని వౌళికి అందించాను. మెల్లిగా ఆ అమ్మాయి పక్కకు వెళ్లి భుజంమీద చేయి వేశాను.
అంతే! ఆ అమ్మాయి దుఃఖం వరదలా ఉదృతంగా తన్నుకు వచ్చింది. కాసేపు ఆ అమ్మాయిని ఆ విధంగా ఏడవనివ్వడం తప్ప మరో దారి వుందనిపించలేదు.
కొద్ది నిముషాల తరువాత భుజంమీద చేతులు వేసి లేవదీసి కుర్చీలో కూచోపెట్టాను. పక్కనే వున్న కిచెన్‌లోంచి గ్లాసులో మంచినీళ్ళు తెచ్చి ఇచ్చాను.
ఆ కిచనంతా గందరగోళంగా వుంది. పొద్దుటినుంచి తాగిన కాఫీ కప్పులు సగం సగం కాఫీతో పడి వున్నాయి.
అక్కడ ఏం జరుగబోయిందో అడగాల్సిన పనిలేదు. ఎందుకు అన్నదే ప్రశ్న. కాని దాన్ని అడిగే సమయం కాదప్పుడు.
వౌనంగా తల ఎత్తి వౌళి వంక చూచాను. వాడుకూడా అయోమయంగా చూస్తున్నాడు.
‘‘పక్కన నైబర్స్ ఎవరినైనా లేపుదామా! క్రింద గార్డుని కాని?’’అన్నాను. -ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి