డైలీ సీరియల్

ట్విన్ టవర్స్-118

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంకేమనాలో అతనికి తోచినట్లు లేదు. వౌనంగా వుండిపోయాడు.
నాకేం అడగాలో నాకూ తోచలేదు. ఫరవాలేదు, సాటివారికి ఆ మాత్రం సాయం చెయ్యాలి కదా ఎవరైనా’’ అన్నాను.
అతనివంక సూటిగా చూశాను. చాలా చిన్నవాడు. అప్పుడే బిజినెస్ నడుపుతున్నాడు.
‘‘పద్మ భర్త నేను క్లాస్‌మేట్స్‌మి. వాడు నా బిజినెస్‌లో చాలా చేదోడువాదోడుగా ఉండేవాడు. కొద్ది నెలల క్రితమే పెళ్లి చేసుకు వచ్చాడు.
చాలా పెద్ద ట్రాజెడీ. ఎలా సమర్థించాలో నాకు అర్థం కావడంలేదు’’ అన్నాడు దిగాలుగా.
వౌనంగా చూశాను.
‘‘రుూ ట్రాజెడీ జరిగినప్పటినుంచి, అతని క్రింద పనిచేసే వారు చిన్నవాళ్లు తప్ప, కాస్త పెద్దవాళ్లతో మాట్లాడటానికి అవకాశం దొరికినట్లు లేదు. నన్ను చూడంగానే మొదలెట్టాడు.
‘‘నా ఆఫీసు పనిమీదే కాలిఫోర్నియా బయలుదేరాడు రమేష్. ఆ విమానంలో సజీవ దహనం అయిపోయాడు. తలచుకుంటేనే బాధనిపిస్తుంది. మా అందరికీ యిలా వుంటే- అతని భార్య సంగతి చెప్పడానికి ఏముంది’’ అన్నాడు.
‘‘ఒంటరిగా వుండనివ్వకండి కొంతకాలం’’ అన్నాను.
‘‘అదే ప్రయత్నిస్తున్నాను. ఆ అమ్మాయిలంతా నా కంపెనీకి పనిచేసేవాళ్లే. వాళ్ళు వంతులవారీగా చూస్తున్నారు. చూడాలి ఏవో ఏర్పాట్లు’’ అంటూ లేచాడు.
మరోసారి థాంక్స్ చెప్పి వెళ్లిపోయాడు. ఇంట్లో టీవీకి ఎదురుగా కూచుని, తన భర్త ఎక్కిన విమానం కాలిపోతోందంటే ఎంత బాధాకరమయిన విషయం.
దేశంలోకి వచ్చి ఎక్కువ రోజులు కాలేదు. రుూ దేశంలో ఎలా బతకాలో కూడా ఇంకా నేర్చుకోలేదు. మనసు బాధగా మూలిగింది. ముందు జీవితాన్ని తలచుకోవడానికి భయపడింది.
ఆ రాత్రి, ఎందుకో మనసు బాగా కలవరపడసాగింది. వౌళి, ఉష నిద్రపోతున్నారు.
పైన ఆ అమ్మాయితో ఎవరన్నా వున్నారో లేక వంటరిగా వుందా? అక్కడున్న పిల్ల కూడా ఈ పిల్ల వయసుదే! ఆ పిల్ల నిద్రపోతూంటే- రుూ పిల్ల ఏం చేయడం లేదు కదా.
మెల్లిగా లేచి బయటకు వచ్చాను. పైకి వెళ్లి ఆ అపార్ట్‌మెంట్ దగ్గరగా వెళ్లి మెల్లిగా తలుపుమీద నా చెవులు వుంచాను, లోపల ఏమైనా తెలుస్తుందేమోనన్నట్లు అని వినడానికి ప్రయత్నించాను.
టీవీ కాబోలు ఇంకా వినిపిస్తోంది. దానితోపాటు ఏవో మాటలు వినిపిస్తున్నాయి. క్రిందకు వచ్చేశాను. తేలిగ్గా నిట్టూర్చి మంచంమీద వాలాను.
మనసు పరిపరివిధాలా పోతోంది. ఆలోచలన్నీ తేజామీదే తిరుగుతున్నాయి. తేజా రికవరీ చాలా స్లోగా వుంది. కాలుకు మరో ఆపరేషన్ చెయ్యాలన్నారు.
ఇన్ని చేస్తున్నా ఎటువంటి ఫలితం వుంటుందో చెప్పలేమనే అంటున్నారు. అసలు కాలే తీసేయాలేమో అనుకున్నవాళ్ళు ఆపరేషన్స్‌తో ప్రయత్నిస్తున్నారు. తేజా మనసులో ఆ భయం ఒకటి. ట్విన్ టవర్స్ జ్ఞాపకాలు ఆమెను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఎప్పటికి మామూలు అవుతుందో.
నా జీవితంలో వంటరిదాన్నైపోయానన్న బాధా ఒక్కటే కాని బాధ్యతలు ఎక్కువగా లేవు. వౌళి కూడా ఎక్కువగా అన్నయ్య వదిన బాధ్యతే అయ్యాడు.
కాని యిప్పుడు వౌళి ఇంటి బాధ్యత అంతా నామీద పడింది. అందుకు నాకు భారం కాదు. కాని అది తృప్తి కలిగించడంలేదు. వౌళి జీవితంలో చాలా అలసిపోతున్నాడు. వాడి శ్రమలో కాస్త బాధ్యత వహించడం పెద్ద భారం కాదు. కాని ఇది కాదు నేను కోరుకున్నది. రుూ రెండోసారి అమెరికా రావడంలో అనుకున్నది ఒకటి, జరుగుతున్నది మరొకటి. హాయిగా మనవరాలితో కొద్ది నెలలు ఆడుకుని వెళ్లిపోతాననుకుని వచ్చాను.
పాపాయితో హాయిగానే ఆడుకున్నాను. అసలు కలలో కూడా ఊహించని సంఘటన. రఘురామ్‌ని కలవడం- అంతకంటే అనూహ్యం ట్విన్ టవర్స్ మనసులోకి వచ్చినపుడల్లా ఆకాశాన్ని అంటే మంటలు. పైనుంచి దూకేస్తున్న మనుషులు. పొగలు గమ్మిన ఆకాశం. నా మస్తిష్కంలోంచి పోవడం లేదు. బలవంతంగా కళ్లు మూసుకున్నాను.
***
ఈ వారం తేజా స్నేహితురాలు వచ్చింది ఉషని చూడటం కోసం. నేను కూడా వౌళితో హాస్పిటల్‌కి వెళ్ళాను. అప్పుడే తేజాని చూసి వారమయిపోతోంది.
గదిలోకి వెళ్ళేటప్పటికి విండోలోంచి బయటకు చూస్తోంది. పూర్వపు భయం ముఖంలోంచి తగ్గింది. కాని ఒక రకపు నిస్పృహ వదలడంలేదు. జ్ఞాపకాలు, హాస్పిటల్ వాతావరణం, ఆపరేషన్ తాలూకు నొప్పులు అన్నీ కృంగదీస్తున్నాయి. ఇక తొందరలో ఇంటికి పంపుతారేమో! ఎంతయినా ఇంటి వాతావరణం వేరు!
ఇంటినించి తెచ్చిన వేడి వేడి ఇడ్లి సాంబారు ఇచ్చాను. ‘‘చల్లారే లోపల తినేయ్’’ అన్నాను.
తల ఊగించింది.
ఎలా వుంది ఒంట్లో, నిద్దరపడుతోందా?
అవును, కాదన్నట్లు తల వూపింది.
‘ఉష ఎలా వుంది’’ అంది.
‘‘బాగుంది. చక్కగా పాలు తాగుతోంది. నిద్రపోతోంది. ‘షి రుూజ్ ఎ గుడ్ బేబి’ అన్నాను. దానికి కూడా తెలుసు నాకు ఎక్కువ ట్రబుల్ ఇవ్వకూడదని’’ నవ్వాను.
తేజా కూడా నవ్వబోయింది. ‘‘అందరికి తెలుసు. తెలియంది నా ఒక్కదానికే’’ అంది. కళ్ళంబడి బొటబొటా నీళ్లురాలిపడ్డాయి.
‘‘తేజా!’’ అన్నాను. దగ్గరకు వెళ్లి భుజాల చుట్టూ చెయ్యి వేస్తూ, నువ్వెప్పుడు ట్రబుల్ కాదు. ప్లెజర్. అలా ఆలోచించకు అన్నాను, తుడుచుకోవడానికి టిష్యూ ఇస్తూ! కాలు నొప్పి ఎలా వుంది అన్నాను మాట మారుస్తూ.
‘టోలరబుల్’ అంది.
‘‘మీ అమ్మ వస్తున్నారు. నీకు కొంచెం బాగుంటుంది ఆమె వస్తే! దిగులు పడకు’’.
‘‘అలా అని కాదు..’’ అని ఏదో అనబోయింది.
‘‘లేదు తేజా. కొన్ని సందర్భాలలో అమ్మ సమక్షంలో దొరికే స్వాంతన, భర్త దగ్గర కూడా దొరకదు’’ అన్నాను.
ఇడ్లి తీసి, చెంచా, సాంబారు ఇచ్చాను. వౌళి జేబుకి వున్న ఉష ఫొటో చూపించాడు.
‘‘కొంచెం పెరిగింది కదూ!’’ అన్నాడు.
-ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి