డైలీ సీరియల్

సింధు నాగరికతలో ఓ ప్రేమకథ-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ భవంతి వాస్తు సౌందర్యంతో కళకళలాడుతోంది. అజోడా నగరంలో ఆమోద గృహంలో మిత్రులతో కలిసి పాచికలాట ఆడి మద్యం సేవించి రాత్రి కాస్త పొద్దుపోయాక ఇంటికి వచ్చి నిద్రించాడేమో పెందరాళే మెళుకువ రాలేదు. పరిమిత మోతాదుల్లో మద్యపానం ఆ సమాజంలో మామూలే. అజోడా తల్లి మాజా ‘‘ఇవాళ పండుగ రోజురా నాన్నా. స్నానోత్సవానికి కొండపై స్నానాగారానికి వెళ్లాలి. స్నానాగారంలో స్నానం చేసి అమ్మవారి దర్శనం చేసుకుని రావాలి కదా!’’ అంది.
‘‘ఔనమ్మా. ఇవాళ పండుగ కదా. నాన్నగారు వెళ్ళారా?’’
‘‘ఆయన ఇతర నగర ప్రముఖులతో ముందే వెళ్లిపోయారురా.’’
‘‘ఔను. ఇదిగో నేనూ స్నానాగారానికి బయలుదేరుతున్నా’’ అని తుండుగుడ్డ, ఉత్సవ వస్త్రాలు తీసుకుని బండిలో బయలుదేరాడు.
ఆ బండికి రెండు ఎడ్లు పూన్చారు. బండికి నాలుగు మూలల్లో నాలుగు రాటలు, వాటిపై కప్పు ఉన్నాయి. బండి నడిపేవాడు కూచోడానికి ముందు చోటుంది చక్రాలకు ఆకులు లేవు. రెండు మూడు చెక్కిన కొయ్య పలకలతో చక్రాలు తయారుచేశారు.
బండి వీధులు గుండా వెళ్లి కొండ వద్ద ఆగింది. అక్కడ బళ్ళల్లోంచి జనం దిగుతున్నారు. కొంతమంది కాలినడకన వస్తున్నారు. ఆ ప్రదేశం జనసమ్మర్దంతో కోలాహలంగా వుంది.
కొండమీద 400 గజాల పొడవు, 200 గజాల వెడల్పుగల భవనం ఉంది. భవనం చుట్టూ ఊరేగింపునకు ఖాళీ జాగా వుంది. కొండ కింద నివాసాలు, అంగళ్ళ వీధులు ఉన్నాయి.
ఆ భవనానికి పక్కగా సార్వజనీన స్నానాగారం ఉంది. దానికి మూడు వైపులా బట్టలు మార్చుకోవడానికి గదులున్నాయి. మధ్యన కొలను ఉంది.
అజోడా బండి దిగి మెట్లెక్కి స్నానాగారానికి వచ్చాడు. అక్కడ ఒక గదిలో ధరించిన వస్త్రాలని విడిచిపెట్టి ఒక వస్త్రాన్ని మొలకు చుట్టుకుని మెట్టు దిగి కొలనులో స్నానం చేస్తూ ప్రార్థనలు చేశాడు. తర్వాత గదిలోకి వెళ్లి ఉత్సవ విగ్రహాలు ధరించి కోవెలలోకి ప్రవేశించాడు.
‘కోవెలలో ఓ అమ్మాయిని అమ్మవారిగా పెద్ద బొట్టు, నగలు, పట్టువస్త్రాలతో శృంగారించి ఆసనం మీద కూర్చోబెట్టారు. అందరూ వచ్చి ఆమెకు భక్తిశ్రద్ధలతో మొక్కుతున్నారు. ఆమె చేతులెత్తి దీవిస్తోంది. సజీవ దేవుళ్ళను పూజించడం ఆనాటి ఆచారం. ఇళ్ళల్లో మాత్రం చిన్నపాటి విగ్రహాలను ఆరాధించేవారు. కోవెలలో ఇతర భక్తులతో కలిసి అజోడా కూడా ప్రార్థనలు చేశాడు.
కోవెల బైటకు వస్తూండగా అజోడాకు మోరీ ఎదురైంది ఆమె కూడా స్నానాగారంలో స్నానం చేసి వస్తోంది. తల వెంట్రుకలను వదులుగా వెనక్కు కట్టుకుంది. ఆ వదులు ముడితో పువ్వులు తురుముకుంది. మెడలో పూలదండ ఉంది. మొలకు తెల్లని వస్త్రం చుట్టుకుంది.
అలంకారాలు లేకపోయినా తల ముడిలో పువ్వులతోనూ, మెడలో పుష్పహారంతోనూ కణ్వమహర్షి ఆశ్రమంలో పెరుగుతున్న శకుంతలా ఉంది. ఆమెను చూసి చిన్నగా నవ్వాడు అజోడా. ఆమెకు అభిమానుల హాస పలకరింపులు అలవాటే. ఆమె కూడా మందహాసం చేసింది.
‘‘ఆ రోజు నృత్యగానం చేస్తున్న మిమ్మల్ని చూసి మంత్రముగ్ధుడినయాను. ఈ రూపంలో కూడా మీరు దివి నుంచి భువికి దిగి వచ్చిన అప్సరసలా ఉన్నారు’’ అన్నాడు అజోడా. ఆమె గలగలా నవ్వి ‘‘మీ వంటి అభిమానుల దయ కానీ నేను అంత కళాకారిణిని కాదు, సౌందర్యవతినీ కాదు’’ అంది వినమ్రంగా.
‘‘మీ మత్స్యాకారపు విశాల నైనాలు, వర్షాకాలపు మెరుపుల్లాంటి మందహాసం, మీ ముఖాన్ని సూర్యుని వలె తేజోవంతం చేస్తున్నాయి.
‘‘మీరలా పొగుడుతూంటే నేనేం చెప్పాలో తెలియడంలేదు. ధన్యవాదాలు మాత్రం తెలియజేస్తున్నా’’.
‘‘మెరుపులు చిందిస్తున్న మాణిక్యానికి తన విలువ తెలుస్తుందా చెప్పండి? అది సరే కానీ మళ్ళా మీ నృత్యగాన కార్యక్రమం ఎప్పుడో చెప్తారా?
‘‘అమ్మవారి ఉత్సవాలు వస్తున్నాయి కదా! వాటిలో పాడుతా’’
‘‘అవి నాలుగు పక్షాల తర్వాత కదా. అంతవరకూ మీ కంఠం వినే అవకాశం దొరకదా?’’
‘‘ఇంతకీ మీ పరిచయం చెప్పారు కాదు’’’.
‘‘మాకు వస్త్రాలు, తైలాలు తయారుచేసే కార్మాగారాలున్నాయి.. మేం..’’
‘‘అలాగా! మా నాన్నగారు చేనేత వస్తక్రారుడు. చేనేత కర్మాగారంలో ప్రధాన కార్మికుడు.’’
‘‘అలాగా? పేరు?’’
‘‘లీబో’’
‘‘ఐతే మీరు మా లీబో అమ్మాయా? చాలా సంతోషం. ఆయన మా ఉద్యోగే’’.
‘‘అంటే మీరు హనోడా గారి అబ్బాయి అజోడాగారన్నమాట. మా నాన్నగారు మీ ఇద్దరినీ పొగుడుతూంటారు’.
‘‘మీరు..’’
‘‘మీరు అన్ని విధాలా నాకంటే పెద్ద. మాకు ప్రభువులు. నన్ను నువ్వు అనండి..’
‘‘సరే.. నీ అభిమానులంతా ఆ రోజు నిన్ను మోరీ అని పిలిచారు కాబట్టి నువ్వు నీ పేరు చెప్పక్కరలేదు’’.
‘‘అంతా మీ దయ’’
‘‘అన్నట్టు నువ్వు చాల ఆరితేరిన చిత్రకారిణివి అని చేనేత వస్త్రాలమీద ఆకృతుల్ని నువ్వే సృష్టిస్తావని లీబో అంటూంటాడే’’.
‘‘చిత్తం’’
‘‘అంటే నువ్వు సాటిలేని గాయిని, నర్తకే కాదు చిత్రకారిణివి కూడానా?’’
‘‘మా నాన్నగారు మీ నాన్నగారిని పెద్దయ్యగారు అనీ, మిమ్మల్ని చిన్నయ్యగారని అంటూంటారు. తమరి పరిచయం అవడం నా అదృష్టం. సరే, వెళ్లి దర్శనం చేసుకుంటా. అదిగో నా స్నేహితురాలు నా కోసం ఎదురుచూస్తోంది’’ చిన్నయ్యగారు.
ఆమె వెళ్లినవైపే చూస్తూ నిలబడ్డాడు అజోడా.
అజోడా తల్లి మాజా అమ్మవారి భక్తురాలు. ఆమె నిత్యం ఉదయమే లేచి స్నానాదులు చేసి ఇంటిలో చిన్న ఇష్టదైవం విగ్రహం ముందు భక్తి పాటలు పాడుతూ పూజ చేసేది. ఆమె పాటగత్తె కాదు. - ఇంకాఉంది

-పులిగడ్డ విశ్వనాథరావు