డైలీ సీరియల్

సింధు నాగరికతలో ఓ ప్రేమకథ-5

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాస్సేపటికి మోరీ అక్కడకు వచ్చింది. తండ్రి కూతుళ్ళు వేరుగా మాట్లాడుకున్నారు.
తర్వాత మాజా ముందుకువచ్చారు.
‘‘ఏమంటుంది మోరీ?’’
‘‘నాకు మీ కుటుంబానికి సేవ చేయడం సమ్మతమే అమ్మగారు. కానీ నాకు సంగీత నృత్య కార్యక్రమాలలో పాల్గొనేందుకు, రోజువారీ సాధనకు అవకాశం అవసరం ఉంటుంది,’’ అంది మోరీ.
‘‘దానికి మేం ఏ లోటూ రానీయం. సాధనకు వెనక ఓ గది కేటాయిస్తాం. దాంట్లో అవకాశం దొరికినప్పుడల్లా సాధన చేయి. కార్యక్రమాల్లో మహారాజులా పాల్గొను. అవి రాత్రే కదా జరుగుతాయి. ఎక్కడైనా వెళ్లవలసినపుడు సెలవు ఇస్తాం’’.
‘‘చిత్తం. మాపై మీరంతలా కనికరిస్తూంటే నేను కాదని ఎలా అనగలను అమ్మగారు. మీ దయాదృష్టి నాపై పడడం నా మహాభాగ్యం’’ అంది మోరీ.
‘‘నువ్వు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం మా ఇంటిలోనే చేస్తావు. మేం ఏం తింటామో అదే తింటావు’’.
‘‘చిత్తం అమ్మగారు’’ అంది మోరీ.
లీబో సెలవు తీసుకుని వెళ్లిపోయాడు.
మాజా మోరీతో అంది, ‘మోరీ, నువ్వు చూస్తున్నావుగా ఇంటి అజమాయిషీ ఎంత కష్టసాధ్యమైన పనో. కొద్దిసేపు నేను చిలకలతో సరదాగా కాలక్షేపం చేద్దామన్నా, ఊళ్ళో స్నేహితురాళ్ళతో కబుర్లు చెప్పుకుందామన్నా, పాచికలు ఆడదామన్నా క్షణం తీరిక దొరకదు.’’
‘‘ఔను, అమ్మగారు, నే చూస్తూనే ఉన్నానుగా’’
‘‘నువ్వు ఆ రోజు ప్రధాన పూజారిగారు మన భవంతికి విచ్చేసినప్పటినుండి నువ్వు చాకచక్యంగా పనులు చేయంచకపోతే మాకు ఎంత ఇబ్బంది అయేది’’.
‘‘చిత్తం’’
‘‘నీకు ఇంకో విషయం కూడా చెప్పదలిచా. మీ నాన్న నీకు తగిన వరుడిని చూస్తే నీ పెళ్లి చేయించే బాధ్యత మాదే’’.
మోరీ చెక్కిళ్ళు మందారాలయ్యాయి.
కానీ పెళ్ళి తర్వాత కూడా నువ్వు మాతోనే ఉండాలి.
అలాగే అన్నట్టు తల ఆడించింది మోరీ.
‘‘నీ జీతం నెలకు రెండు వరహాలు’’
ఒక్క వరాహానే ఎక్కువ అనుకుంటుంటే తన జీతం రెండు వరహాలా. ఇన్నాళ్ళు పనిచేసిన నాన్నకు రెండు వరహాలే జీతం. అటువంటిది తనకు కూడా రెండు వరహాలా?
‘‘ఒక్క వరహా చాలు అమ్మగారు’’
‘‘నువ్వు మా ఇంటిలో పనిచేస్తున్నావు, దాంట్లోను నాకు సహాయకురాలుగా. నీ జీతం ఆ హోదాకు తగ్గట్టుండాలి’’
మోరీ మాట్లాడలేదు.
***
ఆ రోజు అజోడా తల్లితో ‘‘అమ్మా! ఈసారి కొండమీద సరస్సోత్సవం జరిగినపుడు అక్క వస్తుంది కదా. ఆమెకు ఇద్దామని ఓ కానుక కొన్నా. ఉండు, నీకు చూపెడతా..’’ అని తన గదిలోకి వెళ్లి ఓ చక్కని రంగు రంగుల వెండి పెట్టె తీసుకొచ్చాడు.
దాంట్లోంచి బంగారం హారం తీశాడు. ఆ హారంలో బంగారు రేకు బిళ్ళలున్నాయి. బిళ్ళల్లో లోతు రేఖాకృతులను చిత్రించి వాటిలో తెల్లని లేహ్యం నింపారు.
‘‘చాలా చక్కగా ఉంది. దీన్ని అక్కకే ఇవ్వు’’.
‘‘అదే ఆలోచించా అమ్మా. సరస్సోత్సవానికి చాలా వ్యవధి ఉంది. ఆ వర్తకుడిని ఇటువంటిదే మరో హారం తెమ్మంటా. ఈలోగా మోరీకి ఇస్తే సంతోషిస్తుంది.
‘‘ఇటీవలే నేను దానికి బంగారు కంకణాలు ఇచ్చాను కదా. మళ్లీ నువ్వు కూడా అంత విలువైన కానుక ఇవ్వాలా?’’
‘‘అమ్మా! నేనీ హారం ఆమె చేస్తున్న చాకిరీకి ఇవ్వడంలేదు. ఆమె గాన మాధుర్యానికి మెప్పుకోలుగా ఇస్తున్నా.
‘‘నీ ఇష్టం నాకూ ఇష్టమేరా’’ అంది మాజా నిర్లిప్తంగా.
ఆ రోజు ఉదయం పూజలో అజోడా పాల్గొని పూజ అయ్యాక ‘మోరీ నాతో రా’ అన్నాడు. మోరీ అజోడాను అనుసరించింది.
హనోడా ఏమిటి విశేషం అని మాజా వైపు చూశాడు.
‘అజోడా దాని పాటకి ఏదో కానుక ఇస్తాడట.
ఔనులే. ఆమె సంగీతానికి ఎంత విలువైన కానుకిచ్చినా తక్కువే అన్నాడు హనోడా.
అజోడా, మోరీ వెళ్ళాక భర్తవైపు చూసి మాజా మితం తప్పితే అమృతమైనా విషం అవుతుందట. మనం దాన్ని మరీ అలా నెత్తిన పెట్టుకుంటే ఆమె కళ్ళు కూడా నెత్తికెక్కవచ్చు అంది.
‘‘ఔను మాజా, నువ్వు అన్నది నిజమే. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి’’.
అజోడా మోరీని బైట నిలబడమని చెప్పి, గదిలోంచి వెండిపెట్టె తెచ్చి ఇచ్చి ఆమె చేతిలో పెట్టాడు.
‘‘నీ సంగీత నైపుణ్యానికి లెక్క కట్టడం అసంభవం. ఐనా చంద్రునికి ఓ నూలుపోగులా ఈ కానుకని ఇస్తున్నా. స్వీకరించు మోరీ’’ అన్నాడు.
ఆమె మందహాసం చేసి ‘‘మీ కుటుంబం నా సంగీతం పట్ల చూపుతున్న ఆదరణ, మీ ప్రశంసలు నాకు వెలలేని కానుకలు. ఈ కానుక కూడా ఎందుకు చిన్నయ్యగారూ?’’ అంది.
‘‘అలా అనకు మోరీ. ఈ కానుక నీ సహజ సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తుంది.
‘‘తమరి దయ’’ అని ఆమె కానుక తీసుకుని వెళుతూ వుంటే ‘‘రేపు నువ్వు దీన్ని ధరించి రావాలి’’ అన్నాడు.
ఆమె కళ్ళల్లో వెలుగుతో నెమ్మదిగా ‘చిత్తం’ అంది.
మర్నాడు మోరీ ఆ హారంతో బాటు చేతులకు కడియాలు, చెవులకి కమ్మలు పెట్టుకుని తలకు పూలున్న నీలిరంగు శిరోవేష్టం కట్టుకుని వచ్చింది. అజోడా కానుకగా ఇచ్చిన హారం ఆమె బిగువైన ఆచ్ఛాదన లేని రొమ్ముల మధ్య సన్నని ధ్వనితో ఊగిసలాడుతోంది.
ఆమె మాజా వద్దకు వచ్చి వినమ్రంగా వంగినమస్కారం చేసింది. ఆమె సౌందర్యాన్ని మెడలో హారాన్ని గమనించింది కానీ కేవలం తల ఆడించి ఊరుకుంది మాజా.
ప్రాతఃకాలపు అర్చన అయాక మోరీ తన దైనందిన పని ఆరంభించింది. వంటగది పక్క గదిలోకి పెద్ద కుండల్లో పాలు వస్తాయి. - ఇంకాఉంది

-పులిగడ్డ విశ్వనాథరావు