డైలీ సీరియల్

సింధు నాగరికతలో ఓ ప్రేమకథ-21

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అజోడా జరిగింది వివరించాడు.
‘‘నిజం చెప్పాలిగా, దొరగారు. నాకు నిజంగా మీమీద బాగా కోపం వచ్చింది. కానీ ఆ కోపం ఒక సంగీత విన్యాసానికి దారి తీసిందిలెండి. జనం ఆ గళ విన్యాసాల్ని ఘనంగా ఆదరించారు.’’
‘‘అలాగా, ఏమిటి దాని విశేషం?’’
‘‘ఒక విషాదభరిత గానం నృత్యహేలగా మారి జనాల హృదయాలకు గిలిగింతలు పెట్టడం. ఇంతకీ జుంబాకి ప్రమాదం లేదు కదా?’’
‘‘అబ్బే, మామూలు దెబ్బే. ప్రయాణం చేయగలడని వైద్యుడు చెప్పాడు కానీ కొద్దిరోజుల తర్వాత చేయొచ్చు’’’.
కార్యక్రమం ముగిసాక ఇద్దరూ రహదారి వైపు నడుస్తున్నారు ‘రేపు ఉదయం కూడలి వద్దకు వస్తున్నావుగా! లేక నేను చేసిన పొరపాటుకు క్షమాపణ వేడుకోమంటే వేడుకుంటా’’.
‘‘మీరెందుకు క్షమాపణ అడగడం? అడగవలసింది నేను. ముందు నా కోపానికి కారణం చెప్పండి’’
‘‘నేను ఆలస్యంగా రావడం’’
‘‘అది వేరే చెప్పాలా? అసలు కారణం మీ చెవిలో చెప్పాలి’’.
‘‘ఇక్కడెవరూ లేరుగా, చెప్పు’’
‘‘నాకు సిగ్గుగా ఉంటుంది. చెవిలో చెప్తా’’ అని అతడి చెవిలో ‘నా ప్రాణం మీ ప్రాణంతో పెనవేసుకుంది దొరగారు’ అంది.
అజోడా నవ్వి ‘ఔను, అది నిజమే! మన సంబంధం ఈ జన్మది కాదు. జన్మజన్మలది అని అనిపిస్తుంది. అలా కాకపోతే మా అమ్మ నాన్నలు ప్రధాన పూజారిగారి మనవరాలిని చేసుకోమని ఎంత వత్తిడి చేస్తున్నా నేను దాటవేస్తూ వచ్చానే! ఎందుకని? నీకోసం అని’’.
‘‘అది సరే కానీ మనం వెళ్ళబోయే అమ్మవారి కోవిలలో ఊడలు దిగిన విశాలమైన చెట్టు కానీ ఉందా? దానికిందే అమ్మవారి కోవెల వుందా?’’
‘‘ఔను. ఆ మర్రి చెట్టుకు గుడ్డ పీలిక కట్టి మొక్కుకుంటారట. మొక్కు తీరాక తిరిగి వచ్చి ఆ పీలికను విప్పి నదిలో పారించాలట. మనం కట్టిన పీలికని పోల్చలేం కదా! అందుకు అక్కడ కట్టున్న ఏదో పీలికను విప్పి పారించాలట. ఇంతకీ మర్రి చెట్టున్నట్టు నీకెలా తెలుసు?’’
‘‘నేను మా అమ్మా నాన్నలకు అక్కడే దొరికానండి. నది మధ్య దీపంలో కోవిలకి జాతరకు వచ్చి బిడ్డకోసం మర్రిచెట్టుకు గుడ్డ పీలిక కట్టిందట మా అమ్మ. ఆ ప్రదేశంలోనే నేను దొరకగానే పీలకని విప్పి నదిలో పారాచిందట’’.
‘‘ఐతే నీ జన్మస్థలానికి మనం రేపు వెళుతున్నాం. మనం ఒకటి కాదు రెండు పీలికల్ని కట్టాలి’’.
‘‘అలా అయితే మీరు నన్ను రెండుసార్లు పెళ్ళాడతారా?’’ అంది నవ్వుతూ.
‘‘అబ్బే, మన పెళ్ళాయ్యాక మనం ఒక పీలిక విప్పి నదిలో పారించుదాం.. రెండో పీలిక మనకు మొదటి బిడ్డ పుట్టాక పారించుదాం’’.
మోరీ కొద్దిగా నవ్వి ‘‘బాగుంది మీ వరస. ముందు మన పెళ్లి కానీయండి’’ అంది సిగ్గుతో.
‘‘పిల్లలు ఎలాగూ పుడతారనేగా నీ ఉద్దేశ్యం?’’
‘‘అబ్బా నన్ను ఉడికిస్తున్నారు. మీతో మాట్లాడను’’ అంది ఆమె వయ్యారంగా.
‘‘సరే బిడ్డలూసు ఎత్తను. రేపు పెందరాళే రా. ఇది కొంచెం దూర ప్రయాణం.’’
‘‘ఇవాళ మీరే ఆలస్యం చేశారు’’ అంది మోరీ.
‘‘ఔను. నేనే ఆలస్యం చేశా. గుంజీలు తీయమంటావా’’ అడిగాడు అజోడా గుంజీలు తీయడానికి సిద్ధమవుతూ.
‘‘నేను నిన్న ఇక్కడకు ఆలస్యంగా వచ్చినందుకు నేను కూడా మీతో గుంజీలు తీయాలిగా! మనిద్దరం గుంజీలు తీస్తుంటే అందరూ చూసి విరగబడి నవ్వుతారు. మనం బయలుదేరడం కూడా ఆలస్యం అవుతుంది, పదండి’’ అని బండి ఎక్కబోతూంటే ‘‘మహారాణీ, ఈ దాసుడు ఉండగా ఏలినవారికి ఎందుకు శ్రమ?’’ అని ఆమెను ఎత్తి బండిలో కూచోబెట్టాడు.
ఆమె గలగలా నవ్వుతూ ‘‘దాసుడి సొంతలాభం కూడా వుందిగా’’ అంది. అజోడా కూడా పకపకా నవ్వాడు.
సాగు పనులకు వెళుతున్న కోడె రైతులు, రైతు పడతులు ఆ చిలకా గోరింకల్లా పయనిస్తున్న జంటని చూస్తూ కళ్ళతో పలకరించారు.
మోచేతులకు తావీజులున్న ఆ పడతులు రహదారి పక్కనున్న రావి చెట్టు వద్దకు వెళ్లి భక్తితో మొక్కారు. దుష్టశక్తిని ఎదిరించే రక్షక శక్తిని రావిచెట్టు కాపాడుతుందని వారి నమ్మకం. రక్షక శక్తికి ప్రతిగా ఎద్దు కానీ మేక కానీ పాము కానీ అయితే దుష్టశక్తి పులి అని వాళ్ళ భావన.
వాళ్ళు గుండ్రపటి రాళ్ళు, ఒక రాయిలో చొచ్చుకుపోయిన మరో రాయి మొదలగు ప్రజనన అవయవాల ప్రతీకలను కొలుస్తారు. తర్వాత తర్వాత ఇవి శివ పార్వతి రూపాలైన శివలింగంగా మారిందేమో!
దారికి పక్కకగా ఓ ముసలమ్మ నడిచి సేద తీరుతోంది. మోరీ అవ్వని చూసి అజోడాతో ‘‘ఈ అవ్వని ఎక్కించుకోండి. ఆమె ఎక్కడ దించమంటే అక్కడ విడిచిపెడదాం’’ అంది మోరీ.
‘‘నీ శరీరమే కాదు నీ మనసు కూడా బంగారమే. నా ప్రియమైన మోరీ, నీ కోరిక నాకు ఆదేశం లాంటిది. ఓ అలాగే’’ అని బండి అవ్వ వద్ద ఆపి ‘‘ఏం అవ్వా! ఎక్కడికి వెళతావు? రా బండిలో కూర్చో’’ అన్నాడు.
‘‘మా ఊరు, మీరు వెళుతున్న వైపే రెండు యోజనాల దూరంలో ఉంది. నాయనా, నన్ను నీ బండిమీద తీసుకువెళితే మిమ్మల్ని దీవిస్తా’’
‘‘అలాగే రా అవ్వా’’ అని అజోడా బండి దిగి ముసలమ్మను బండి ఎక్కించాడు.
అవ్వ బండిలో కూచుని ‘‘ఏం మనవరాలా, పిల్లలు లేరా?’’ అని అడిగింది మోరీని.
మోరీ జవాబు చెప్పలేక తటపటాయిస్తూంటే అజోడా ‘పిల్లలకేం అవ్వా, నువ్వు దీవిస్తే పుట్టరా ఏమిటి?’’ అన్నాడు.
‘‘పండింటి పిల్లవాడు తొందరగా మీ ఒళ్ళో కేరింతలు కొడుతూ సందడి చేయాలని దీవిస్తున్నా. మీరు ఎక్కడకు వెళుతున్నారు?’’
అజోడా అమ్మవారి దీవికని చెప్పాడు.
‘‘ఐతే తప్పక కడుపునిండా పిల్లలు పుడతారులే’’ అంది అవ్వ. మోరీ సిగ్గుతో మొహం చాటుచేసుకుంది.
అసలు విషయం చెబితే బాగుండదని అతడూ, ఆమె ఊరుకున్నారు. కానీ అజోడా మోరీని ఆట పట్టించడానికి ‘‘అవ్వా, మా మొక్కు ఎంతకాలం తర్వాత తీరుతుందంటావు?’’ అని అడిగారు.
‘‘వెంటనే తీరుతుంది మనవడా’’ అంది బోసినవ్వు నవ్వుతో. - ఇంకాఉంది

-పులిగడ్డ విశ్వనాథరావు