డైలీ సీరియల్

యమహాపురి 46

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగు ఆప్షన్సిచ్చి అందులో ‘వేము’ కూడా ఇచ్చారు. అది మన పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి కాదు. ఎవరికో ఒకరికి పదివేల రూపాయల బహుమతి ఇవ్వాలని వాళ్ల ఉద్దేశ్యం. ఎందుకో మనకి సాయపడాలని అత్తయ్యకి అనిపించింది. శాస్త్రానికన్నట్లు ఓ షరతు పెట్టింది. రహస్యమని పెద్ద హడావుడి చేసి - నేను అవలీలగా చెయ్యగల పని నాకు అప్పగించింది. ఇక మన కష్టాలు తీరినట్లే అనుకో అమ్మా!’’ అన్నాడు.
‘‘ఆ పనేమిటో చెప్పరా- రహస్యం కాపాడతానని అమ్మమీద ఒట్టు కూడా వేశానుగా’’ అన్నాడు గోపాల్ కుతూహలం అతణ్ణి తినేస్తోంది.
‘‘ఎవరికీ చెప్పనని అమ్మమీద ఒట్టు నేనూ వేశాను- అత్తయ్య దగ్గిర. ఐనా అంత ఆత్రమెందుకు? పనైపోయాక రేపు సాయంత్రంలోగా అన్నీ నీకే తెలుస్తాయిగా’’ అన్నాడు రాజా.
***
‘‘ఆ మర్నాడుదయం లేచి స్నానం చేసి ఎక్కడికో వెళ్లాడు అన్నయ్య. మరి వెనక్కి రాలేదు’’ అన్నాడు గోపాల్.
ఉన్నట్లుండి దుఃఖం వచ్చి అతడి గొంతు పూడుకుపోయింది.
శ్రీకర్ గోపాల్‌నే చూస్తున్నాడు కానీ వేరే ఆలోచనా ప్రపంచంలోకి వెళ్లిపోయాడు.
ఒక జగదానందస్వామి ఏరి కోరి వేదికమీదకి పిలిచి రాజాని దీవించాడు.
ఈ దీవెన మహిమ ఏమిటో కానీ- చెడ్డదైన జయమ్మలో ఒక్కసారిగా మార్పొచ్చింది. రాజా కుటుంబానికి సంబంధించి సకల బాధ్యతలూ తనే తీసుకుంటానంది. రాజాకి ఏదో పని అప్పగించింది. ఆ పనిమీద వెళ్లిన రాజా మరి వెనక్కి రాలేదు. ఏమయ్యాడు రాజా?
రాజాని సుందరం గుర్తుపట్టాడు. అతడు శివగిరి కొండపై దేవుణ్ణి దర్శించుకొచ్చి ఓ బిచ్చగాడికి విషాహారం పెట్టి చంపేశాడు. సుందరానికి దొరికినట్లే దొరికి పారిపోయాడు. రాజా బిచ్చగాణ్ణి ఎందుకు చంపేశాడు.
అది జయమ్మ ఆదేశం అనుకుందామంటే- హత్య చెయ్యమనడం దైవకార్యం ఎలా ఔతుంది? ఒకవేళ జయమ్మకది దైవకార్యమే ఐనా- రాజా కూడా ఆ పని చెయ్యడానికి మరాలోచన లేకుండా సంతోషంగా ఎలా ఒప్పుకున్నాడు? తన వారితో జయమ్మ తనకి చెప్పినది చాలా సులభమైన పని అని ఎందుకు చెప్పాడు?
అతడు అప్పటికే హత్య చెయ్యడం చాలా సులభమనుకునే మనఃస్థితికి చేరుకున్నాడా?
ఇంతకీ ఈ జగదానందస్వామి ఎవరు? ఆయనకీ దీవెనల కార్యక్రమమేమిటి? జయమ్మ వంటి చెడ్డ మనిషిలో కూడా క్షణాలమీద మార్పు తేగల మహిమ ఆ దీవెనకు నిజంగా ఉందా? లేక ఆయన మాఫియా మనిషా? జయమ్మ, రాజాల్లో ఒకరు లేక ఇద్దరూ కూడా ఆ మాఫియాలో భాగమా? అసలా మాఫియా ఏం చేస్తోంది?
శ్రీకర్‌కి బుర్ర వేడెక్కింది.
‘‘సార్! ఇదీ విషయం. నేనిదంతా పోలీసులకి చెప్పానని తెలిస్తే- నన్నూ, అమ్మనీ బ్రతకనివ్వదు అత్తయ్య. తెలిసినవీ, చూసినవీ చెప్పాను తప్ప చెప్పింది ఋజువుకి నా దగ్గిర సాక్ష్యాలేం లేవు. అందుకే నా పేరు బయటకు రాకుండా అన్నయ్య ఆచూకీ తెలుసుకోవాలని మిమ్మల్ని కోరడానికి వచ్చాను’’ అన్నాడు గోపాల్.
శ్రీకర్ అతణ్ణి జాలిగా చూసి ‘‘నీ పరిస్థితి నాకర్థమైంది. నువ్వు సరైన చోటకే వచ్చవు. ఈ కేసు - నేను, నా బృందం టేకప్ చేస్తాం. ఐతే- ఆ బృందంలో నువ్వూ వున్నావు’’ అన్నాడు.
గోపాల్ భయంగా, ‘‘నేను పోలీసుల బృందంలోనా? నా పేరు బయటకొస్తే..’’ అని ఏదో అనబోతూండగా.. ‘‘నా బృందం ప్రత్యేకత ఏమిటంటే- అందులో పోలీసులే ఉండాలని నియమం లేదు. బృందంలో ఎవరెవరు ఉన్నారో- నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు. బృందంలో సభ్యులకి కూడా అంతా ఒకరికొరు తెలియరు. అదీ నా పరిశోధనా విధానం’’ అన్నాడు శ్రీకర్.
గోపాల్ తేలికగా నిట్టూర్చి, ‘‘ఐతే ఇప్పుడు నేనేం చెయ్యాలి సార్?’’ అన్నాడు.
‘‘ఇన్నాళ్ళూ నువ్వు మీ ఇంట్లో ఓ కుటుంబ సభ్యుడివి. ఈ రోజు నుంచీ నా మనిషివి. ఈ కేసుకి సంబంధించి కొత్తగా ఏం తెలిసినా నాకు తెలియజేస్తూండు’’ అంటూ అతడికి తన కార్డిచ్చాడు శ్రీకర్.
సరేనని గోపాల్ లేవబోగా, ‘‘అన్నట్లు ఇపుడు మీ అమ్మగారికెలా వుంది?’’ అన్నాడు శ్రీకర్.
‘‘ఏమో సార్! ఒకటి రెండుసార్లు అత్తయ్య అమ్మని డాక్టరుకి చూపించింది. ఆపరేషన్ అర్జంటు కాదంటోంది. ఎంత నమ్మాలో తెలియడంలేదు. కానీ అమ్మ ఆరోగ్యం గురించి నాకు బెంగగా వుంది’’ అన్నాడు గోపాల్.
శ్రీకర్‌కి గుండె బరువెక్కింది. ‘‘సరేలే, నువ్వెళ్లొచ్చు’’ అన్నాడు గోపాల్‌తో.
గోపాల్ వెళ్లిపోయాక అతడు మళ్లీ ఆలోచనలో పడ్డాడు.
ఒకపక్క బిచ్చగాడి హత్య. ఒక పక్క రాజా పలాయనం. ఒక పక్క అప్పూ వ్యవహారం. ఒక పక్క తులసి కిడ్నాప్. ఒక పక్క నరకపురి. ఒక పక్క జగదానందస్వామి దీవెన.
వీటన్నింటినీ కలిపే లంకె ఏదైనా ఉన్నదా? అది వెదకటానికి తానేం చెయ్యాలి?
అప్పుడతడికి గుర్తొచ్చింది- అందర్నీ విడివిడిగా దీవించిన జగదానందస్వామి రాజాని మాత్రం ఓ అమ్మాయితో కలిపి జంటగా దీవించాడు. ఆయనలా ఎందుకు చేశాడు? ఆమె ఎవరు?
ఆమె, రాజా ప్రేమికులా? లేక పరిచయస్థులా, లేక స్వామి కారణంగా ఒకరికొకరు పరిచయమయ్యారా?
వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ వేదిక దిగినట్లు యోగి చెప్పాడు. అంటే ఆ రోజుకి ఒకరితో ఒకరు మాట్లాడుకోరాదన్న నియమం వాళ్లకి వర్తించదు. ఆ యువతి ఎవరో కానీ- రాజా ఏమయ్యాడో ఏం చేశాడో ఆమెకి తెలియొచ్చు! ఇప్పుడామె ఆచూకీ తెలుసుకోవాలి, ఎలా?
8
సుమారు యాభై గదులున్న భవనం. చుట్టూ ప్రహరీ. మధ్యలో గేటు. గేటుముందొక దర్వాన్. అప్పుడొకామె అక్కడకొచ్చింది. ఆకుపచ్చ చీర, అదే రంగు జాకెట్. బొట్టు, గాజులు, జోళ్ళు- అన్నీ మ్యాచింగ్.
దర్వాన్ లేచి నిలబడి ఆమెకి సెల్యూట్ చేశాడు.
‘‘నా పేరు వసంత’’ అందామె.
‘‘ఎవర్ని కలవాలి మేడమ్’’ అన్నాడు దర్వాన్.

ఇంకా ఉంది

వసుంధర