డైలీ సీరియల్

వ్యూహం-54

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్షణాల్లో భయం కుప్పకూలిపోయింది’’ అన్నాడతను సెల్‌లో రికార్డు అయిన ఫొటోను అరిఫ్‌కు చూపిస్తూ.
ఆ బాంబు పేలుళ్ళకు కారకులు పోలీసువాళ్ళే! చేతిలో ప్లంగర్ పట్టుకుని రెడ్ బటన్ నొక్కుతున్నవాడు స్కందకు తెలిసినవాడే అయివుంటాడు. వాడి మొహంలో ఆంధ్రావాళ్ళ పోలికలు వున్నాయి.. ఈ ఫోటో కాపీలు తీసి కోర్టుకు సమర్పించుదాం! స్కందమీద, గోయల్‌మీద కేసు పెడతాను. వాళ్ళనే ఎక్యూజ్డ్‌గా చూపిస్తాను అఫిడవిట్‌లో. వీళ్ళిద్దరి సంగతి నాలుగైదు సంవత్సరాల తరువాత చూస్తాను.. అప్పటికి అంతా సర్దుకుంటుంది.. అప్పుడు వాళ్ళిద్దరూ యాక్సిడెంట్స్‌లో చనిపోయినట్లు టీవీ చానల్స్‌లో వార్త వస్తుంది’’.
‘‘ఇప్పుడే వాళ్ళను ఖతమ్ చెయ్యొచ్చు కదా!’’
‘‘ఇప్పుడొద్దు.. ఇప్పుడు అందరి దృష్టి మనమీద వుంది. వాళ్ళకు ఏ అపాయం జరిగినా పోలీసుల దృష్టి మనమీద వుంటుంది.. అసలే ఇప్పుడు నేను ఎన్నో సమస్యల్లో చిక్కుకుపోయాను.. ప్రస్తుతం మనం మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న చిన్న వాళ్ళమీద దృష్టి పెడదాం! చిన్నవాళ్ళంటే పెద్దగా లైమ్‌లైట్‌లో లేనివాళ్ళు! ముందు డాక్టర్ లోహితను మర్డర్ చెయ్యాలి! నెక్స్ట్ ఆ కాశీగాడు.. ఆ బాస్డర్డ్ మన రహస్యాలు స్కందకు చేరవేస్తున్నాడు.. ఉయ్ మస్ట్ ఫినిష్ దె ఇమ్మిడియెట్లీ!’’ అన్నాడు అరిఫ్.
***
లోహితను అరిఫ్ మనుషులు చంపెయ్యాలనే ప్రయత్నంలో వున్నారని కాశికి తెలిసింది.. అది అతనికి పూర్తిగా నచ్చని విషయం.
.. ఆ తరువాత తనను టార్గెట్ చేస్తారు.. వాళ్ళకు అనుమానం వస్తే ఎవరినీ వొదలరు..
లోహిత క్వార్టర్స్ దగ్గరకు వచ్చేడు కాశి.
రాత్రి జరిగిన సంఘటన చెప్పింది అతనికి. ఆ సంఘటన చెబుతుంటే ఆమెకు దుఃఖం పొర్లుకు వచ్చింది.
‘‘డాక్టరుగా రెండు చోట్ల ఉద్యోగాలు వచ్చాయి.. ఒకటి గవర్నమెంటు హాస్పిటల్లో అసిస్టెంట్ సివిల్ సర్జెన్‌గా, మరొకటి హైదరాబాద్‌లో కామినేని హాస్పిటల్లో.. ఆ రెండూ వదులుకుని ఇక్కడ డాక్టరుగా చేరాను. మా అమ్మ చెబుతూనే వుంది.. ‘హాయిగా గవర్నమెంటు డాక్టరుగా పనిచెయ్యి!’ అని.. ఆమె మాటలు విన్పించుకోకుండా ఎక్కువ జీతానికి ఆశపడి ఇక్కడ చేరాను.. డాక్టరుగా ఇతరులకు ప్రాణాలు పోయవలసిన నేను, నా ప్రాణాలు కాపాడుకునే స్థితికి చేరుకున్నాను.. ప్రతిక్షణం ఏదోక గండం నన్ను వెంటాడబోతూ వుంది.. ఎలా బయట పడతానో!’’ అంది లోహిత కళ్ళు తుడుచుకుంటూ.
‘‘మీరేం భయపడకండి.. నేనున్నాను గదా! నాక్కూడా ఇక్కడ పని చెయ్యాలని అన్పించడంలేదు. అరిఫ్ ముఠాకు దూరంగా వెళ్లిపోవాలి! పది నిముషాలలో నేను రెడీ అయి కారు తీసుకొని వస్తాను.. కార్లో విజయవాడ దగ్గర్లో వున్న ఓ పల్లెటూరు వుంది.. అక్కడ నెల రోజులు ఉందాం! మనం ఎక్కడ వుంది అరిఫ్ మనుషులు తెలుసుకోలేరు. నెల రోజులు మనం కన్పించకపోయేసరికి చాలా దూరం పారిపోయి వుంటారనుకుంటారు.. మన విషయం పట్టించుకోరు.. క్షేమంగా ఇక్కడనుంచి బయటపడాలి! నేను మిమ్మల్ని ఇక్కడనుండి బయటకు తీసుకెళ్తున్నట్లు ఎవరికీ తెలియకూడదు. మీరూ రెడీగా వుండండి.. పది నిముషాల్లో వచ్చేస్తాను’’ అనేసి వెళ్లిపోయాడు కాశి.
కాశి వెంట వెళ్ళడం లోహితకు ఇష్టంలేదు.. కానీ తప్పదు! అతని సహకారం లేకుండా ఇక్కడనుండి బయటపడడం కష్టం!
ఇక్కడందరూ కాశీ అంటే భయపడతారు. డాక్టర్ అరవింద్‌కు అతను కుడి భుజం అని అందరికీ తెలుసు.. అతనితో కలిసి ముందు ఇక్కడనుంచి బయటపడాలి! సురక్షితమైన ప్రాంతం చేరుకున్నాక తను ఎక్కడ వున్నదీ స్కందకు చెప్పాలి. అతను వచ్చి తనను తీసుకువెళతాడు.. కాశిని వదిలించుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు...
స్కోడా కారు తీసుకువచ్చాడు కాశి.
‘‘ఈ కారులో మనం ఎంత దూరమైనా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయొచ్చు! ఈ కారు నాకు అరవింద్ కొనిపెట్టాడు. అదొక్కడే అతను నాకు చేసిన సహాయం’’ అన్నాడు కాశి.
తన బ్యాగులు కారు వెనుక డిక్కీలో పడేయబోయింది.
‘‘వొద్దు.. లగేజి కారు వెనుక సీట్లో పెట్టండి.. మీరు డిక్కీలో అడ్జెస్ట్ అయిపోండి.. కొంత దూరం పోయేక వెనుక సీట్లోకి వచ్చేద్దురుగాని.. ఇక్కడనుండి బయటకు వెళ్ళేటప్పుడు మీరు నాతో వస్తున్నట్లు ఎవరూ అబ్జర్వ్ చేయకూడదు.. అందుకే మిమ్మల్ని డిక్కీలో సర్దుకోండని అన్నాను’’
అతను చెప్పినట్లే చేసిందామె అటు ఇటు చూసి. చుట్టుప్రక్కల ఎవరూ లేరని నిర్థారణ చేసుకున్నాక డిక్కీలో వొత్తిగిలి పడుకుంది.
కారు స్టార్టు చేశాడు కాశి.
మెయిన్ గేటు దగ్గరకు రాగానే కావాలనే కారు ఆపాడు. కారు దగ్గరకు వచ్చి కాశికి సెల్యూట్ కొట్టారు సెక్యూరిటీ సిబ్బంది. కారులో తనొక్కడే వెళ్తున్నాడని వాళ్ళందరూ అనుకోవాలి.
హాస్పిటల్ నుంచి కొంతదూరం వచ్చేక లోహిత డిక్కీలోనుంచి ముందు సీటులోకి వచ్చేసింది.
కారు భద్రాచలం నుంచి పాల్వంచ వైపు దూసుకుపోతూ వుంది. లోహితను హాస్పిటల్ నుంచి ఎవరూ చూడకుండా బయటకు తీసుకువచ్చానని కాశి సంబరపడ్డాడు కాని, ఆ కారును మరో కారు అనుసరిస్తూ వుంది.
లోహితను డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో పడేసిన వాళ్ళే ఆ కారులో వున్నారు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ లోహితను హత్య చేసే ఉద్దేశంలో వున్నారు వాళ్ళు.
పాల్వంచ దగ్గరకు రాగానే పెట్రోల్ బంక్ దగ్గర కారు ఆపాడు. టాంక్ నిండా ఆయిల్ నింపించాడు. మనీ పే చేశాక రెండు నిముషాలు లిలాక్స్‌డ్‌గా వుండాలనుకున్నాడు. సిగరెట్ తాగాలన్పించింది. పెట్రోల్ బంక్ దగ్గర సిగరెట్ తాగితే ఊరుకోరు.. బంక్ వెనుక వైపున్న ఖాళీ స్థలంలోకి వెళ్లి సిగరెట్ వెలిగించాడు.
ఇంకా ఉంది

అలపర్తి రామకృష్ణ