డైలీ సీరియల్

వ్యూహం-55

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదేళ్ళ కుర్రాడు చెక్కతో చేసిన బొమ్మలు తెచ్చి కారులో కూర్చున్న లోహితకు చూపించాడు. కారు దిగి రెండు నిముషాలు ఆ కుర్రాడితో మాట్లాడాలన్పించింది ఆమెకు.
కారు దిగింది లోహిత.
వెనుక వస్తున్న కారు ఆమె ప్రక్కన ఆగింది. కారులో కూర్చున్న వ్యక్తి మిర్రర్ కిందకు దింపి బాటిల్ వున్న యాసిడ్ ఆమె మీద పోసే ప్రయత్నం చేశాడు. రోడ్డుమీద వెళ్తున్న పోలీసు పెట్రోల్ వ్యాన్ చూసి కారు నడుపుతున్న రెండో వ్యక్తి కారు ఆపకుండా స్పీడ్ పెంచాడు.
యాసిడ్ చల్లే ప్రయత్నం చేసిన వ్యక్తి గురి తప్పింది. సడన్ జర్క్‌కు ఆ యాసిడ్ కారు నడుపుతున్న వ్యక్తిమీద కొద్దిగా వొలికింది. శరీరం మీద యాసిడ్ పడటంతో ఆ బాధ ఓర్చుకోలేక కేకలు పెట్టాడు.
కారు ఆపితే ఓ చిక్కు. అందరూ గుమిగూడతారు. డ్రైవర్ కేకలు పెడుతుండడంతో ఏమైందని యక్ష ప్రశ్నలు వేస్తారు. యాసిడ్ ఎవరు చల్లారు? ఎందుకు? కారులో వున్న వ్యక్తిదగ్గర యాసిడ్ బాటిల్ ఎందుకు వుంది? కారు వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తికి కారు నడుపుతున్న వ్యక్తికి శతృత్వం వుందా?
ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టం.
పోలీసులు చూస్తే మరిన్ని కష్టాలు..
హాస్పిటల్ ఎక్కడ వుందానని వెతుక్కుంటూ వెళ్లిపోయారు వాళ్ళు కారులో.
తనమీద యాసిడ్ చల్లే ప్రయత్నం జరిగిందని లోహితకు తెలియదు. ఓ కారు స్లోగా తను నిలబడ్డ వైపు రావడం, ముందు సీట్లో కూర్చున్న వ్యక్తి ఏదో విసిరేసే ప్రయత్నం చెయ్యడం, డ్రైవర్ కేకలు పెట్టడం, కారు వేగంగా ముందుకు వెళ్ళడం గమనించింది కాని ఏం జరిగిందో ఆమెకు తెలియదు.
కాశి వచ్చేక కారులో కూర్చుంది లోహిత.
ఆమె చేతిలోని చెక్కబొమ్మ చూశాడు.
‘‘చెక్కబొమ్మలు అమ్మే అబ్బాయికి తల్లిదండ్రులు లేరట. పిన్నమ్మ దగ్గర ఉంటున్నాడట.. బొమ్మలు అమ్మితే భోజనం పెడుతుందట.. పండగలకు కొత్త బట్టలు కొనివ్వదట. చదువుకోవాలని వుందట.. స్కూలుకు వెళ్ళనివ్వదట’’ బొమ్మలు అమ్ముకునే కుర్రాడి గురించి చెప్పుకుపోతూనే వుంది.
అతని మనస్సులో ఎన్నో ఆలోచనలు గుమ్మడి పాదులా అల్లుకుపోతున్నాయి.
అతనికో వ్యూహం ఉంది.. అది విజయవంతమైతే అనాథాశ్రమం పెట్టి పేద పిల్లలకు అదుకోవాలని వుంది.
తనను డాక్టర్ అరవింద్ మోసం చేశాడు.. అతనికి బుద్ధి చెప్పాలి!
అతని పతనం తను కళ్ళజూడాలి.. అరవింద్‌ను అన్ని విధాలా దెబ్బతీయాలి! డబ్బు సంపాదించడమే అతని ధ్యేయం.. చివరకు అతనికి ఏమీ మిగల్చకుండా చేయాలి! బ్యాంకుల్లో కోట్ల డబ్బు వుందని గర్వంతో విర్రవీగుతున్నాడు! ఆ డబ్బు అతనికి కాకుండా చెయ్యాలి!
ఓ వ్యూహం అతని మెదడులో మెదిలింది.
ఒక్కొక్కరికి ఒక్కో వ్యూహం!
కాశి ఆసరాతో మృత్యుగహ్వారం నుండి బయట పడాలనుకుంది డాక్టర్ లోహిత.
మాఫియా గ్యాంగుల ఆట కట్టించడానికి స్కంద ఎన్నో వ్యూహాలు పన్నుతున్నాడు. అతనికి తను మద్దతునివ్వాలి. అతనికి అండగా నిలబడాలి! అదీ ఆమె వ్యూహం! ఎప్పటికైనా స్వార్థం నశిస్తుంది.
గాఢాంధకారం అలుముకున్నా వెలుగు వెనె్నలవైపు సాగిపోవాలి. అదీ లోహిత ఆలోచన..
‘‘స్కూల్లో చదువుకునే రోజుల్లో ఎన్నో మంచి ఆశయాలు వుండేవి నాకు.. చివరకు మాఫియా గ్యాంగుల దగ్గర పని చెయ్యాల్సి వచ్చింది’’ అన్నాడు కాశి రోడ్డుప్రక్కన కన్పించిన హైస్కూలును చూసి.
‘‘మీ తప్పులు మీరు తెలుసుకున్నారు.. మంచి మార్గంలో నడవాలనుకుంటున్నారు.. మంచి రోజులు మీకు తప్పకుండా వస్తాయి’’ అంది లోహిత.
***
కారు విజయవాడ దాటుకుని మచిలీపట్నం రోడ్డుకు వచ్చింది ఊపిరి పీల్చుకుంది లోహిత. టెన్షన్ తగ్గింది.
‘‘అక్కడనుంచి బయటపడ్డాను.. హైదాబాద్‌లోని మా ఇంటికి వెళ్లిపోతాను. మా అమ్మా నాన్నల దగ్గరకు వెళ్లిపోతాను’’ అంది లోహిత.
‘‘మీ ఇంటి అడ్రెస్ అరిఫ్ గ్యాంగుకు తెలుసు.. అక్కడికి వెళితే నీకు అసలు భద్రత వుండదు.. మీ చెల్లెలు మీద అఘాయిత్యం చేయబోయారు. మర్చిపోయావా? మీ నాన్న చెయ్యి నరికేశారు.. గుర్తుంది కదా! నిన్ను బ్రతకనివ్వరు’’ అన్నాడు కాశి.
‘‘స్కందగారి ఇంటికి వెళ్ళితే ఎలా వుంటుంది?’’
‘‘మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.. స్కంద మెడమీద కత్తి వ్రేలాడుతూ వుంది.. అది ఎప్పుడు అతని మెడను కత్తిరిస్తుందో తెలియదు.. అతని ప్రక్కన నువ్వు చేరితే అరిఫ్ వాళ్ళ ఫోకస్ మీ మీదే వుంటుంది. కొన్ని నెలలు ఎవరికి కన్పించకుండా వుండటమే శ్రేయస్కరం! ఆ ఏర్పాట్లు నేను చేస్తాను.. నువ్వేం టెన్షన్ పడకు!’’
కారు హోటల్ దగ్గర ఆపాడు.
అతను టాయిలెట్ వైపు వెళ్లినపుడు మరోవైపు వెళ్లి స్కందకు ఫోన్ చేసింది.
‘‘ముంబైలో వున్నాను.. రెండ్రోజుల్లో వచ్చేస్తాను.. నువ్వెక్కడ వున్నా నేను వచ్చి కలుస్తాను.. నిన్ను సేఫ్ జోన్‌కు తీసుకువెళ్తాను.. అరిఫ్ గ్యాంగ్ పసిగట్టలేని ప్రాంతానికి తీసుకువెళ్తాను.. అక్కడ అందరిని కలుస్తావ్... ఇబ్బందులేమీ వుండవు.. మరో పది రోజుల్లో అరిఫ్ వర్గం మొత్తం కటకటాల వెనక్కు వెళ్లబోతుంది. ఇతర రాష్ట్రాల సహకారం తీసుకుంటున్నాం.. రెండ్రోజుల్లో నువ్వో శుభవార్త వినబోతున్నావ్.. ఇక నీకు విన్పించేవి అన్నీ తీపి కబుర్లే’’ అన్నాడతను.
‘‘సేఫ్ జోన్ అంటున్నారు.. ఎక్కడకు తీసుకు వెళ్తారు?’’’
‘‘అంతా సర్‌ప్రైజ్.. బీ హాపీ... ధైర్యంగా ఉండు.. కాశీలో నీకేం ఇబ్బందులు వుండవు.. నీకు అపకారం తలపెట్టిన వాళ్ళను అసహ్యించుకుంటాడు. అతని ఆపరేషన్‌లో అతను వున్నాడు.. వాళ్ళకు చెయ్యాల్సిన డామేజ్ అంతా చేస్తాడు. సరైన సమయంలోనే అతను బయటపడ్డాడు. అక్కడ వుంటే అతన్ని చంపేసేవాళ్ళు! నాతో మాట్లాడిన విషయం అతనికి చెప్పకు.. నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నది అతనిక్కూడా తెలియకూడదు’’ అన్నాడు స్కంద.

ఇంకాఉంది

అలపర్తి రామకృష్ణ