డైలీ సీరియల్

బంగారుకల- 21

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాళ్లంతా ‘నభూతో న భవిష్యతి’ అన్నట్లు విజయనగర రాజధాని హంపీ పట్టణాన్ని నిర్మిస్తున్న మయులా అన్నట్లున్నారు. ప్రతి ఒక్కరి మనసుల్లో సంకల్ప దీక్ష, నేత్రాల్లో కళాకాంక్ష ద్యోతకమవుతున్నాయి.
శిల్పాచార్యులు మళ్లీ కొనసాగించారు.
‘‘రంగమండపం పూర్తయింది. ఇంకా విరూపాక్ష దేవాలయ కల్యాణ మండపం, మహాగోపురం పూర్తికావాలి. కృష్ణస్వామి ఆలయం, హజారా రామాలయం, నాగలాపురంలోని విఠోభా ఆలయానికి కళాకృతుల బాధ్యతను నరహరివర్మకు అతని శిష్యులకు అప్పగిస్తున్నాను’’
నరహరివర్మ లేచి శిల్పాచార్యునికి కృతజ్ఞతగా వందనం చేశాడు.
మహోన్నత శిలపై తలపెట్టిన ఉగ్ర నరసింహమూర్తిని రామప్పే తీర్చిదిద్దాలి.
కాళహస్తిలో నూరుస్తంభాల మండపాన్ని, గోపురాన్ని చిన్నప్పకు అప్పగించాం.
చిదంబరంలో ఉత్తర గోపురాన్ని వరదయ్య పూర్తిచేస్తాడు.
శ్రీకృష్ణరాయప్రభువు తిరుమల శ్రీవేంకటేశుని గుడి ముంగిట నిర్మింప తలపెట్టిన వేయిస్తంభాల మండపం, గర్భగుడి, వినాయక రథం, మూలగోపురం, వీటన్నిటి నిర్మాణం పూర్తికావస్తున్నది. అక్కడ అత్యద్భుత కళాకృతుల పర్యవేక్షణ స్వయంగా మేమే చేస్తున్నాం.
శ్రీశైలంలో మండపం, గోపురం మల్లయ్య చూస్తాడు.
అరుణాచలంలో వేయిస్తంభాల మండపం, పదకొండు అంతస్తుల గోపురాన్ని శివన్న దగ్గరుండి శిల్పీకరిస్తాడు.
శిల్పాచారులవారి వింగడింపుకు శిల్పులంతా హర్షాతిరేకాన్ని ప్రకటించారు.
‘‘కాలం ప్రవాహం లాంటిది. విజయనగర సామ్రాజ్య శిల్పులు చరిత్రలో మహనీయులుగా నిలిచిపోయే సువర్ణావకాశం దక్కింది. ఇదంతా పంపాపతి కృప. భావితరాల వాళ్లు మనం తీర్చిన కళామందిరాలు చూసి పులకాంకితులు కావాలి.
ఈ శిల్పారామ సౌందర్యదీప్తుల వల్ల రాయలవారి కీర్తి చిరస్థాయిగా నిలిచిపోవాలి. హంపీలోని విఠల మందిరం, రాతిరథాలకు స్వయంగా మేమే ఉలిసేవలను అందిస్తున్నాము. ఇంక మీరంతా వెళ్లి మీ పనులలో నిమగ్నంకండి. మీకు కావలసిన ఏర్పాట్లు అన్నీ జరిగాయి’’ అని అందరికీ సెలవిచ్చి పంపాడు శిల్పాచార్యుడు.
అపర విష్ణువు అయిన శ్రీకృష్ణదేవరాయల కీర్తిచంద్రికలను యుగాల పాటు శాశ్వతం చేసే కార్యక్రమానికి ఇది నాంది. రాజ్యం ఎంత సంపన్నవంతమైనా కాల చరిత్రలో ఏది నిలుస్తుందో చెప్పలేం. కానీ హింపీ శిలలు పాడుతున్న ఆ శిల్పరాగం మాత్రం శాశ్వతంగా నిలుస్తుందని శిల్పాచార్యుడికి తెలుసు. దూరంగా ఎవరో బైరాగి ఏకతార మీటుతూ పాడుకుంటున్నాడు.
‘‘రాయి రాయి అంటూ
రాతలే రాసేవు
రాయి రాత తెలియుడయ్యా!
........నరుడా!’’
తత్వం పాడుకుంటూ బైరాగి వెళ్లిపోతున్నాడు. అతడు విజయనగర సామ్రాజ్య కీర్తి కావ్యాన్ని లిఖిస్తున్న బ్రహ్మలా కన్పిస్తున్నాడు.

6
మనస్సును శాంతపరచుకోటానికి మంజరికి ఒకే ఒక మార్గం మిగిలింది. అది వివిధ శిల్ప సుందర దృశ్యాలను చూసి సమ్మోహనంగా నర్తించటం. ఆ రోజు ఉదయమే మంజరి భూగర్భ ప్రసన్న విరూపాక్ష దేవాలయానికి బయలుదేరింది.
దేవాలయ ప్రాంగణం చేరి నిరంతరం నీటిలో నిమగ్నమై ఉండే విరూపాక్షుని సందర్శించింది. ఈ స్వామిని కొలిచినవారి మనస్సు పరమ ప్రసన్నవౌతుందిట. మంజరికీనాడు స్వామి దర్శనం పరమానందాన్ని కల్గించింది.
భూగర్భ ప్రసన్న విరూపాక్ష మందిరం కృష్ణరాయలు పట్ట్భాషిక్తుడైన సందర్భంగా పునరుద్ధరణకు నోచుకున్నది. భూమట్టానికి దిగువగా వున్న ఈ దేవాలయం తూర్పు అభిముఖంగా రెండు పెద్ద గోపురాలతో గంభీరతను ప్రసాదిస్తోంది. ధ్వజస్తంభం, మహామండపం, గగనదీపస్తంభం, పలు మండపాలతో శోభాయమానంగా అలరారుతున్న ప్రసన్న విరూపాక్ష దేవాలయానికి ఉత్తర దక్షిణ దిక్కుల్లో చతురస్రాకారపు బలమైన స్తంభాలతో విశాలమైన మండపాలనేకమున్నాయి. మహామండపం నుంచి అర్థమండపం, షట్కోణాకారంతో ఉన్న మండపం నీటిలోనే వుంది.
తీక్షణ కుంభంగల పెద్ద విగ్రహం. కల్యాణమండపాలను దాటింది మంజరి. ఆ దేవాలయ శిల్పకళా వైభవం ఆమెలో పరమ భక్త్భివాన్ని మేల్కొలిపింది. ప్రసన్న విరూపాక్షుని ఎదుట మహామండపంలో ముద్రపట్టి నృత్యరీతిలో శివారాధన చేస్తున్నది మంజరి.
పరమేశ్వరా దేవా జగదీశ్వరా!
......................... మమ్ముకృప జూపి కాపాడు శివశంకరా!
ఆమె పరవశంతో భక్త్భివంతో నర్తిస్తున్నది. శివకైంకర్యమయిన ఆ నృత్య సమారాధనకు పరమ శివుడు కూడా పరమానందంతో నర్తిస్తుంటే స్వామి జటాజూటం నుంచి గంగ తొణికలాడిందేమోనన్నట్లు చిరుజల్లు ప్రారంభమైంది. గుడి ప్రాంగణంలో జల్లుల స్వర విన్యాసంతోబాటు వీరేంద్రుని అట్టహాసానికి ఆమె ఒళ్లు జలదరించింది. చుట్టూ పరికించి చూసింది.
సిల్కు ధోవతి, ఆపైన జరీ అంగరఖా పట్టు కండువా ముత్యాల పేర్లు ధరించి కన్నుల్లో కుటిలత్వం నింపుకున్న వీరేంద్రుడు ఆమె ఎదుట నిలిచాడు.
‘‘అమ్మారుూ.. బాగు బాగు’’ మరోసారి విచిత్రంగా నవ్వాడు.
‘‘మీరా’’ ఆమె భయాందోళనతో ఒకడుగు వెనక్కి వేసింది.
‘‘జగన్నాథ! అంత భయమెందుకు? నీ నృత్యకౌశలం గురించి విన్నామేగానీ చూసింది లేదు. చిన్నాదేవి నృత్యంలో శృంగారం పాలు ఎక్కువట గదా. ఆమె నృత్యాన్ని చూసే అవకాశాన్ని రాయలు మాకివ్వలేదు. ప్చ్ ఏం చేద్దాం! జగన్నాథ’’.
‘‘ఏమిటీ మాటలు? వారిప్పుడు దేవేరులు. అలా మాట్లాడరాదు’’.
‘‘హు! ఏం దేవేరి? ఒక దేవదాసి ఎన్నటికీ దేవేరి కాలేదు. ఆ దాసీ పుత్రుడు కృష్ణదేవరాయలకు ఆమె తగిన దేవేరియే! దేవేరి అంటే మా గజపతుల పుత్రి అన్నపూర్ణాదేవే’’
‘‘మీరిట్లా మాట్లాడడం తగదు. రాయలవారి తల్లిగారు వీరనరసింహ రాయలవార్కి చాలాకాలంగా పుత్ర సంతతి లేదు.

- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి