డైలీ సీరియల్

ఎప్పుడె ప్పుడు?-17

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోరికలేని ఇష్టం.. స్వార్థం లేని ప్రేమ.. కాంక్షలేని కలయిక.. అక్కడ పరిమళాలు వెదజల్లుతోంది..
దంపతులారా ఆస్వాదించండి.
***
బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని నిద్రలేచింది పావని. చాలా రోజుల తర్వాత మనశ్శాంతిగా నిద్రపోయినట్టు అనిపించింది. పక్కనే కిరణ్ లేడు. నవ్వొచ్చింది అప్రయత్నంగా.. తమ డైలీ చార్ట్ ప్రకారం ఈపాటికి కిరణ్‌ను ఉతికి ఆరేయాలి.. ఆమె అలా ఆలోచిస్తుండగానే ‘గుడ్ మార్నింగ్’ అన్న వాయిస్ వినిపించింది. రెగ్యులర్‌గా వైస్ వాయిస్.. కాని ఈసారి హాయిగా వినిపిస్తుంది.. కాఫీ కప్పుతో వచ్చాడు..
‘‘అదేంటి కిరణ్ నేను చేస్తానుగా..’’ అంది పావని.
‘‘ఒక్క రోజు నేను చేస్తే లక్స్ సోప్‌లా అరిగిపోతానా.. ఫెయిర్ అండ్ లలీలాగా తెల్లబడుతానా?..’’ అన్నాడు.
ఒక్క క్షణం చివుక్కుమనిపించింది.. లాస్ట్ వీక్ ఇదే డైలాగ్ రివర్స్‌లో..
‘‘్భర్యకోసం కాఫీ చేస్తే అరిగిపోతారా? తారు రోడ్డులా నల్లబడుతారా?’’ విసుక్కుంది తను.
‘‘‘నేను మగాడిని.. నేనెందుకు చేయాలి పని.. అయినా ఇంట్లో ఖాళీగానే ఉంటావుగా?’’ కిరణ్ మాటలు.
‘‘సారీ కిరణ్.. మొన్న నోరు జారాను..’’ క్షమాపణ చెబుతున్నట్టు అంది పావని.
‘‘నో సారీ బిజినెస్... కావాలంటే నేనే ఈ ఉగాదికి శారీ తీసుకుంటాను?’’ అన్నాడు కిరణ్..
కలిసివుంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఇంత బావుంటుందా? అనుకుంది పావని.
***
నిహార్ బైక్ కిరణ్ ఇంటి ముందు ఆపి హారన్ కొట్టాడు. లోపల ఏ కురుక్షేత్ర సంగ్రామం జరుగుతోందో.. అనుకుంటూ..
నీట్‌గా రెడీ అయి.. అపుడే ప్యాక్ చేసిన కొరియర్‌లా బయటకు వచ్చాడు కిరణ్..
‘‘అదేమిట్రా.. అమూల్ బేబిలా తయారయ్యావు.. పద..’’ అన్నాడు బైక్ స్టార్ట్ చేస్తూ.
‘‘ఆగరా.. లోపలికిరా.. స్పెషల్ మెనూ’’ నవ్వుతూ అన్నాడు.
‘‘వద్దులేరా.. నీమీద కోపంతో కాఫీ పొడి దట్టంగా దట్టించి, పంచదార తగ్గించి ఇచ్చే కాఫీ.. పైగా రీరికార్డింగ్‌లా మీ అరుపులు..’’ నవ్వుతూ అన్నాడు లోపలకి వస్తూనే.
‘‘రా నిహార్.. మా నిశ్చల ఎలా వుంది..?’’ నవ్వుతూ పావని ఎదురువచ్చేసరికి తను రాంగ్ అడ్రెస్‌కు వచ్చానేమోనన్న ఫీలింగ్ కలిగింది నిహార్‌కు.
‘‘బావుంది పావని.. అగ్నిపర్వతంలా వుండే నువ్వు లైట్‌హౌస్‌లా మారావేమిటి? నవ్వుతూ అనేలోపే.. కిరణ్ లోపలినుంచి టిఫిన్ తీసుకువచ్చాడు.. వేడి వేడి పొగలుకక్కే ఇడ్లీ..’’
‘‘అదేమిట్రా.. మీ ఇంట్లో టిఫినా? నూడుల్స్.. లేదంటే కాఫీ, టీ గట్రాలు’’ ఆశ్చర్యపోతూ అడిగాడు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ క్షణం పడదని చాలా రోజులుగా చూస్తోన్న నిహార్‌కు తెలుసు.
‘‘చాల్లే జోకులాపరా... పావని ఇడ్లీ బాగా చేస్తుందని తెలుసు కదరా.. ఓ పట్టు పట్టు’’ అన్నాడు.
అలానే చూస్తూ ఉండిపోయాడు.
‘‘అదేం లేదు నిహార్.. పాపం కిరణే చట్నీ తనే చేశాడు.. ఏదో కిరణ్ హెల్ప్ చేశాడు కాబట్టి ఇడ్లీ మల్లెపువ్వుల్లా వచ్చాయి.. మినప్పప్పు సగం, ఇడ్లీరవ్వ సగం కలిపితే ఇడ్లీలు మెత్తగా ఉంటాయన్న ఐడియా కిరణ్‌దే!’’
‘‘ఆహా.. అలానా.. మీ ఇద్దరికీ ఆరోగ్యాలు బాగానే ఉన్నాయా?’’ అడిగాడు.
‘‘ఆరోగ్యాలే కాదు.. మా టైం కూడా బావుంది.. ఎందుకంటే మేము ఫాస్ట్ టెన్స్‌లో వున్నాం.. ఫ్యూచర్ టెన్స్‌లో కూడా ఇలాగే ఉండాలని డిసైడ్ అయ్యాం..’’ నవ్వుతూ కిరణ్ వైపు చూసి అంది పావని. ‘యా’ అన్నాడు పావని దగ్గరికి వచ్చి కిరణ్.
‘‘హూ.. మేము వరెస్ట్ టెన్స్‌లో అదే ఫ్యూచర్ టెన్స్‌లో వుండి చచ్చాం కదా..’’ గొణుక్కున్నాడు తనలో తనే నిహార్.
ఇంకా నిహార్ షాక్‌లోనుంచి కోలుకోనే లేదు.. టిపిన్ చేసి బయటకు వస్తుంటే మరో షాక్.. పావని కిరణ్‌కు టిఫిన్ బాక్స్ ఇచ్చింది.
‘‘నిహార్ నీక్కూడా కలిపే బాక్స్ సర్దాను.. అందులో వడియాలు విడిగా పెట్టాను.. కాస్త కిరణ్‌కు గుర్తుచేయి.. ఒక్కోసారి పాపం మర్చిపోతాడు’’ అంది.
ఇదే పావని ప్రీవియస్ డైలాగ్ ఎన్నోసార్లు తనకు బాగా గుర్తు.
‘‘పాపం కిరణ్‌కు లంచ్ సర్దకపోతే ఎలా?’’ తన సింపతి కిరణ్‌మీద
‘‘ఏం పర్లేదు నిహార్.. ఎక్కడో తింటాడు. మటన్ బిర్యానీలు, చికెన్ బిర్యానీలు.. అంత అమాయకుడేమీ కాదు. మాయకుడు..’’ ఒళ్ళు మంట కిరణ్ మీద పావనికి.
‘‘గతంలోకి వెళ్లి వర్తమానాన్ని అందంగా మార్చుకుంటున్నారు’’ అనుకున్నాడు నిహార్.. ఇలానే ఉంటే వారి భవిష్యత్తు కూడా బావుంటుంది.. ఉండాలి కూడా.. మనస్ఫూర్తిగా కోరుకున్నాడు నిహార్.
ఇద్దరూ ఆఫీస్‌కు బయల్దేరారు..
***
10
లంచ్ టైంలో ఇద్దరూ బయటకు వచ్చారు. లంచ్ చేస్తుంటే మొదటిసారి కిరణ్ కళ్ళలో కన్నీళ్లు చూసాడు నిహార్.
‘‘ఏమిట్రా ఏమైంది’’ అడిగాడు నిహార్.
‘‘ఏం లేదురా పాపం పావని.. నాకోసం ఇవన్నీ ప్రిపేర్ చేసింది. పెళ్లయిన కొత్తలో ఇలానే చేసింది. కానీ నేను అపుడు తనను గుర్తించలేదు. చిన్న కాంప్లిమెంట్ కూడా ఇవ్వలేదు.. తను తిన్నదో లేదో..’’ అంటూనే పావనికి ఫోన్ చేశాడు.
‘‘పావని ఐ మిస్ యు. లంచ్ చేస్తుంటే నువ్వే గుర్తొచ్చావు.. ప్రతి ఐటెం చాలా బాగుంది.. నువ్వు తిన్నావా పావనీ..?’’ లాలన ప్రేమ ఇష్టం అన్నీ కలగలిసిన గొంతుతో అడిగాడు.
‘‘నువ్వే గుర్తొచ్చావ్ కిరణ్.. నువ్వు తింటున్నావో లేదోననుకున్నాను. నువ్వు నా గురించి ఆలోచిస్తూ, నేను చేసిన వంటను పొగుడుతుంటే.. నేను తిన్నానో లేదోనని కనుక్కుంటూ ఉంటే ఎంత బావుందో.. థాంక్యూ కిరణ్.. మిస్ యు’’ అటువైపు నుంచి పావని..
‘‘సాయంత్రం పైవ్ థర్టీకల్ల నీ ముందు వుంటాను.. బయటకు వెళ్దాం’’ అన్నాడు కిరణ్.
‘‘వర్క్ ఉంటే వద్దులే కిరణ్.’’ అంది పావని.
‘‘అలానే వాళ్ళ సంభాషణ వింటూ వుండిపోయాడు. ఎప్పుడెప్పుడు సంవత్సరం గడుస్తుందా అని ఎదురుచూడ్డం తనవల్ల కాదనుకున్నాడు. తథాస్తు దేవతలు ‘ఎస్.. యూ ఆర్ కరెక్ట్’’ అన్నారు.
***
లంచ్ చేశాక నిహార్ చేతులు పట్టుకుని అన్నాడు కిరణ్.
‘‘చాలా థాంక్స్‌రా.. నీకూ నిశ్చలకు.. పెళ్లయ్యాక జీవితం ఇంత బావుంటుందని, పెళ్ళై సంవత్సరం దాటినా తెలియనే లేదు.. ఒకోసారి కళ్ళకు గంతలు కట్టుకుని బ్రతుకుతాము. నిశ్చల నువ్వు కలిసి ఫాస్ట్ టెన్స్‌లోకి మమ్మల్ని పంపించేవరకూ తెలియలేదు.. ప్రెజెంట్ టెన్స్‌లో ప్లెజెంట్‌గా ఎలా బ్రతకాలో... ప్రతీ క్షణం ఇలానే బ్రతికితే చాలనిపిస్తుంది..’’ ఎక్సయిట్ అయిపోతూ అన్నాడు కిరణ్.
‘‘నాకూ చాలా సంతోషంగా ఉందిరా... కాకపోతే మేము ఫ్యూచర్‌టెన్స్‌లో ఉండడమే బాధగా వుంది.. నాకోసం కాదు.. నిశ్చల కోసం.. నన్ను కొన్ని విషయాల్లో ఎవాయిడ్ చేయాలన్నా, కామెంట్ చేయాలన్నా తెగ బాధపడిపోతుంది.. నాకు కావాలనే లంచ్ ప్రిపేర్ చేయలేదు.. తనుకూడా ఇపుడు తినదు.. అందుకే నాకు తినాలనిపించలేదు..’’ నిహార్ అన్నాడు.
-సశేషం

-తేజారాణి తిరునగరి