డైలీ సీరియల్

ఎప్పుడె ప్పుడు?-18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అంతా వెంటనే సర్దుకుంటుంది.. ఓ పరిష్కారం కాలమే చూపిస్తుంది’’ అన్నాడు కిరణ్.
‘‘కాలం కాదు మా ప్రేమే చూపిస్తుంది’’ అన్నాడు నిహార్.
కొన్ని పనులకు ఫలితం ఎప్పుడో కనిపిస్తుంది. కొన్ని పనులకు మాత్రమే వెంటనే తెలుస్తుంది. చేసే ప్రతి పనిని తపస్సులా చేస్తే ఫలితం మనకు దాదాపుగా తెలుస్తుంది. మనసు పెట్టి చేసే పనులు, మన మనసుకు నచ్చకపోయినా చేసే పనులు, మనీ కోసం చేసే పనులు.. ఆయా పనులు వాటి ఫలితాలు మన నిజాయితీమీద వ్యక్తిత్వంమీద ఆధారపడి ఉంటాయి.
ఇష్టం లేని పనులు చేయడం ఎంత కష్టమో తెలిసింది. ఇష్టమైన వ్యక్తులకు దూరంగా ఉండడం ఎంత నరకమో అర్థమైంది. సినిమాల్లో నటిస్తే డబ్బు వస్తుంది. పేరు వస్తుంది. తృప్తి వస్తుంది. కానీ జీవితంలో నటిస్తే..
నిశ్చలకు ఫోన్ చేయకుండా ఉండలేకపోయాడు. ఎలా..? ఆ రోజంతా ఫోన్ చేసుకోకుండా ఉండాలని అనుకున్నారు కానీ తాను నిశ్చల గొంతు వినాలి. లంచ్ కూడా సరిగ్గా చేయలేదు. ఎలా?
ఆఫీసునుంచి బయటకు వచ్చాడు. నిశ్చల గొంతు వినాలి.. నిశ్చల అన్నం తిన్నదో లేదో కనుక్కోవాలి.. దగ్గరలో పబ్లిక్ టెలిఫోన్ బాక్స్‌లు ఎక్కడా కనిపించలేదు. మొదటిసారి టెక్నాలజీమీద కోపమొచ్చింది. సెల్‌ఫోన్స్ వాట్సప్‌లు వచ్చేక పబ్లిక్ టెలిఫోన్స్ కొట్టుకుపోయాయి.
ఇంటికి వెళ్లి నిశ్చలను చూడాలన్నంత కోరిక కలిగింది. ఇష్టం పాదరసం లాంటిది. దాని ఆపడం, పట్టుకోవడం ఎవరితరమూ కాదు. అతనలా ఆలోచిస్తూ ఉండగానే సడెన్‌గా పావని గుర్తుకు వచ్చింది. ఒక్క క్షణం అతని మనసు తేలికైంది.
తన కళ్ళకు పావని పాతాళభైరవిలా కనిపించింది.
ఆ ఆలోచన రావడంతో పావనికి ఫోన్ చేశాడు.
***
నిశ్చల మనసు సునామీ వచ్చిన సముద్రంలా వుంది. నిహార్ పదే పదే గుర్తుకొస్తున్నాడు..
‘‘లంచ్ చేసాడో.. లేదో..? తను అన్నం తినకుండా ఉంటానని అతను కూడా తిని ఉండడు..’’ అనుకుంది. అది నిజం కూడా.. అందుకే పావనికి చెప్పింది- ఈ రోజు లంచ్ బాక్స్ నిహార్‌కు కూడా కలిపి ఇవ్వమని. అలాగే కిరణ్‌కు ఫోన్ చేసింది.. నిహార్ లంచ్ చేసేలా చూడమని. కానీ ఆమె అంచనా నిజమైంది. నిహార్ లంచ్ చేయలేదు. చేసినట్టు నటించాడు. అలా తిన్నట్టు చేశాడంతే..
భవిష్యత్తులో బాగుండాలని వర్తమానాన్ని వ్యర్థం చేసుకుంటుందా?
ఆమె ఆలోచనలు కొనసాగుతుండగానే.. పావని వచ్చింది. పావనిలో కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.. ఎన్నడూ లేని ఉత్సాహం కనిపిస్తోంది. పావని వస్తూనే నిశ్చలను గట్టిగా వాటేసుకుంది. కళ్ళ నిండుగా నీళ్ళు తిరిగాయి..
‘‘్థంక్యూ థాంక్యూ థాంక్యూ సో మచ్ నిశ్చలా.. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.. నా సంతోషాన్ని వ్యక్తం చేయడానికి భాష సరిపోదేమోననిపిస్తుంది. కష్టం తర్వాత వచ్చే సుఖం అనుభవంలోకి వస్తుంది. పశ్చాత్తాపం కలిగించే ఆనందం అనుభవంలోకి వస్తుంది. చాలా రోజుల తర్వాత నేను కిరణ్ సంతోషంగా గడిపాము. పెళ్ళైన కొత్తలో కన్నా సంతోషంగా.. అపుడు ఆకర్షణ మాత్రమే ఉందేమో.. అపుడు ఫిజికల్ నీడ్ మాత్రమే మమ్మల్ని కొంతకాలం హ్యాపీగా వుంచిందేమో.. ఇపుడు మా మధ్య వున్న మెచ్యూర్డ్ లవ్ అనిపిస్తోంది’’ అంది పావని.
‘‘గుడ్.. మీ లైఫ్ ఇలానే ఉండాలనే నేను అనుకున్నాను..’’ అంది మనస్ఫూర్తిగా నిశ్చల.
‘‘కానీ మీ లైఫ్ ఇలా ఉండాలని నేను అనుకోలేదు నిశ్చలా... నువ్వు ఫ్యూచర్ టెన్స్ అని ముందుకు వెళ్లావు.. కొన్ని రోజుల్లో నిహార్ చిక్కిపోయాడు. పందేనికి కూడా నీతో దూరంగా ఉండలేకపోయాడు. అతని కళ్ళల్లో తడి.. ఆ తడిలో నీ మీద అతనికున్న ప్రేమ కనిపిస్తున్నాయి’’.
‘‘కేవలం నీమీద వున్న ప్రేమవల్లే అతను ఇలా ఉంటున్నాడు’’ చెప్పింది పావని.
‘‘అవును.. అందుకే ఈ పందేనికి చెక్ పెట్టాలని అనుకుంటున్నాను’’ అంది నిశ్చల.
‘‘వాట్?’’ సంతోషం, ఆశ్చర్యం రెండూ కలిసిన ఫీలింగ్.
‘‘అవును.. ఒక్కో చుక్క ఒడిసిపడితే సముద్రం నిండేసరికి ఎంతోకాలం అవుతుంది. కుంభవృష్టి కురిస్తే.. రోజులు చాలు.. ప్రేమ నమ్మకం నిజాయితీ అర్థం చేసుకునే వ్యక్తిత్వం, ఆలోచన.. ఇవన్నీ బలంగా ఉంటే.. ఆ ఎప్పుడెప్పుడు.. ఇపుడే వస్తుంది.. సర్జికల్ స్ట్రైక్‌లా.. మెరుపు వేగంగా.. మీ జీవితంలో మార్పు వచ్చినట్టు...
ఈ మాటలు నిశ్చల మాట్లాడ్డానికి ముందు ఓ సంఘటన నిశ్చల ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది. సంవత్సరంపాటు ఇలా ఉండాలి? మనిషి ఆలోచించడానికి, మారడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయ నిబంధన అవసరమా? అనుకుంది. నిహార్‌కు తనమీద వున్న ప్రేమ, నిహార్‌కు దూరంగా తను ఇలా ఉండడం.. ఉదయం జరిగిన సంఘటన ఆమెను ఇలా ఆలోచించడానికి సిద్ధం చేసింది.
పొరపాటున డీప్ ఫ్రీజర్‌లో వాటర్ బాటిల్ పెట్టింది.. మొత్తం గడ్డ కట్టింది. చల్లదనం గాఢతవల్ల వెంటనే గడ్డ కట్టింది.

-సశేషం

-తేజారాణి తిరునగరి