డైలీ సీరియల్

పంచతంత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త సీరియల్ ప్రారంభం
*
08-11-2016
మంగళవారం,
రాత్రి పదిగంటల సమయం.
అప్పటికి ఐదువందలు, వెయ్యి నోట్లను రద్దుచేసి దాదాపు రెండు గంటలు అవుతోంది.
విజయవాడ ఏలూరు రోడ్‌లో ఏపిఎస్‌ఆర్‌టిసి వాళ్ల టికెట్ కౌంటర్ ఒకటి ఉంది. టికెట్స్ కొనుక్కోవడానికి బస్టాండ్ వరకూ వెళ్లలేని వాళ్లకోసం ఆ కౌంటర్ ఏర్పాటుచేశారు. ఆ కౌంటర్ ముందు పొడుగ్గా, అందంగా వున్న ఓ యువతి నిలబడి ఉంది. ఆమె పేరు గోపిక. గోపికకు ఇరవై సంవత్సరాల వయసు వుంటుంది.
‘‘హైదరాబాద్‌కి ఒక టిక్కెట్ ఇవ్వండి!’’ అన్నది గోపిక కౌంటర్‌లోని వ్యక్తితో.
‘‘ఏ బండికి?’’ అన్నాడు కౌంటర్‌లోని వ్యక్తి.
‘‘రేప్పొద్దున మార్నింగ్ ఎయిట్‌లోపు చూడండి. రాత్రిపూట ప్రయాణం నాకు భయం, డ్రైవర్లు తాగి నడుపుతారు’’ అన్నది గోపిక.
ఆ మాటతో కౌంటర్‌లోని వ్యక్తి చురుగ్గా గోపిక వైపు చూసి, ‘చిల్లరుందా...?’’ అని అడిగాడు.
గోపిక పర్సులోంచి ఒక వెయ్యి రూపాయల నోటు, ఒక ఐదొందల నోటు తీసింది. వాటిని చూసిన వెంటనే ‘‘మేడం! డీలక్సు బస్సు టికెట్ మూడొందల పదిహేడురూపాయలు. వోల్వో అయితే ఐదొందల డెబ్భై నాలుగు. చిల్లరతీసుకురండి. లేకపోతే పక్కకు జరగండి!’’ అన్నాడు బుకింగ్ క్లర్క్.
గోపిక వేగంగా ఆలోచిస్తోంది.
తను అర్జెంటుగా హైదరాబాద్ వెళ్లాలి. చిల్లరకోసం చూసుకునే టైం లేదు. ఐదు వందలు ఇచ్చి డీలక్స్ బస్సు టికెట్ కొంటే మూడొందల పదిహేడు పోను నూట ఎనభై మూడు రూపాయలు వదులుకోవాలి. వెయ్యి నోటు ఇచ్చి, ఐదొందల డెబ్భై నాలుగు రూపాయలతో వోల్లో టికెట్ కొనుక్కుంటే నాలుగొందల ఇరవై రూపాయలు వదులుకోవాలి.
‘‘మేడం వెనక పాసింజర్లు వెయింటింగ్..! ఎన్నిసార్లు చెప్పాలి?’’ అన్నాడు క్లర్కు విసుగ్గా.
ఆ మాటతో గోపికకు కోపం వచ్చింది. అదే సమయంలో ఆమె వెనుక నుంచి.. ‘‘ఎక్స్‌క్యూజ్‌మీ.’’ అంటూ వినబడింది.
గోపిక వెనక్కి తిరిగి చూసింది. ఆమె వెనుక ఒక యువకుడు నిలబడి వున్నాడు. అతడి పేరు కార్తీక్. కార్తీక్‌కి పాతిక సంవత్సరాల వయసు వుంటుంది. పొడవుగా, బలంగా ఉన్నాడు కార్తీక్.
అతడు మెడకు మఫ్లర్ చుట్టుకుని ఉన్నాడు.
‘‘రెండు నిమిషాలు వెయిట్ చేయలేరా? ఇంకా నా ట్రాన్సాక్షన్ పూర్తికాలేదు’’ అన్నది గోపిక విసురుగా.
‘‘మేడం! నాది కూడా ఛేంజ్ ప్రాబ్లమ్. నేను కూడా రేపు హైదరాబాద్ వెళ్లాలి. చాలా అర్జంట్..! మీరు ఏమీ అనుకోకండా ఉంటే ఒక చిన్న రిక్వెస్ట్. నా దగ్గిర ఒక వెయ్యి నోటు, మూడు వంద నోట్లు ఉన్నాయ్. మీకు మూడు వందలు ఇస్తాను. వాటిల్లో రెండు వందలను మీ దగ్గిరున్న ఐదు వందలతో కలిపి రెండు టికెట్స్ కొనండి. ఒక్కో టికెట్ మూడు వందల యాభై పడుతుంది. అపుడు ఒక్కో టికెట్ మీద మనకు ముప్ఫై మూడు రూపాయల నష్టం వస్తుంది. హైదరాబాద్ వెళ్ళే లోపు మీకు ఇవ్వాల్సిన పదిహేడు రూపాయలు ఎలాగోలా ఇచ్చేస్తాను’’ అన్నాడు కార్తీక్ రిక్వెస్టింగ్‌గా.
గోపికకు ఆ ఆలోచన నచ్చింది. ఆమె ఆలోచించి చెప్పింది-
‘‘ఓ.కె...! కానీ మీరు బస్సులో నా పక్కన కూర్చోకూడదు!’’
‘‘కూర్చోను..! నేను కూడా కూర్చోవాలి అనుకోవటంలేదు. ఐ మీన్.. మా ఆవిడ చూస్తే ఊరుకోదు. కొంప మునుగుతుంది!’’ అన్నాడు కార్తీక్.
‘‘సరే!.. డబ్బులివ్వండి!’’ అన్నది గోపిక. కార్తీక్ ఆమెకు 300 ఇచ్చి, క్యూలోనుంచి పక్కకు జరిగాడు.
గోపిక ఆ మర్నాడు ఉదయం ఏడున్నర డీలక్స్ బస్సు ఇద్దరికీ టికెట్ కొని కార్తీక్ దగ్గరికి వచ్చింది.
అప్పటికి మెడకు చుట్టుకున్న మఫ్లర్ విప్పుతున్నాడు కార్తీక్.
విప్పిన వెంటనే అతడి ముఖం స్పష్టంగా కనపడింది.
అతడిని చూసి గోపిక షాక్ అయింది.
వెంటనే అతడివైపు కోపంగా చూసి ‘‘నువ్వా!’’ అంటూ అరిచింది
‘‘నేనే..! నేను.. నేను.. మీకు ముందే తెలుసా?’’ అన్నాడు కార్తీక్ ఆశ్చర్యంగా.
‘‘నిన్న బందర్ రోడ్డులో.. వేణుగోపాలస్వామి గుళ్లో.. అప్పుడే మర్చిపోయావా?’’ అన్నది గోపిక మరింత కోపంగా.
వెంటనే క్రితం రోజు జరిగిన సంఘటన కార్తీక్‌కి గుర్తుకువచ్చింది.
***
అప్పుడు సాయంత్రం ఆరు గంటలు అవుతోంది. విశాలమైన వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో ఓ పక్కగా నిలబడి వచ్చేపోయే జనాన్ని చూస్తున్నారు కార్తీక్, అతని మిత్రుడు వేణు. సరిగ్గా ఆ సమయంలో పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్న ఓ అమ్మాయి అటువైపుగా వయ్యారంగా నడుచుకుంటూ వచ్చింది. గుడికి వచ్చిన వాళ్లలో చాలామంది ఆ అమ్మాయినే చూస్తున్నారు. ఆ అమ్మాయిలో ప్రత్యేకంగా కనిపించేది ఆమె సన్నటి నడుము. అంత సన్నటి నడుమున్న అమ్మాయిలు అరుదుగా ఉంటారు.
ఆమెను చూస్తూ ‘‘అబ్బ! ఫిగర్ అదిరింది!’’ అంటూ కామెంట్ చేశాడు వేణు.
ఆ కామెంట్ ఆ అమ్మాయికి వినపడింది. వెంటనే ఆమె ఛటుక్కున వెనక్కు తిరిగింది. కార్తీక్ అది గమనించి వేణుతో అన్నాడు ‘‘ఒరేయ్!.. నీ పని ఐపోయింది!’’
ఒక్కసారిగా వేణుకి భయం వేసింది.
కాని.. ఆ అమ్మాయి నేరుగా కార్తీక్ దగ్గరకు వచ్చి.. ‘‘షటప్! పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తే మర్యాద దక్కదు జాగ్రత్త!’’’ అంటూ అరిచింది.
-సశేషం

-జి.వి.అమరేశ్వరరావు