డైలీ సీరియల్

పంచతంత్రం -- 2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఆ కామెంట్ చేసింది నేను కాదు’’ అంటూ కార్తీక్ ఎంత చెప్పినా ఆ అమ్మాయి వినలేదు. గుడికి వచ్చిన భక్తులు చుట్టూ మూగారు.. నానా గొడవా జరిగింది. చివరకు కార్తీక్, వేణు అక్కడినుంచి ఎలాగోలా బయటపడ్డారు.
***
కార్తీక్ ముఖంలో మారుతున్న భావాలను గమనించిన గోపిక అన్నది.
‘‘గుర్తుకొచ్చిందా?.. ఆ సమయంలో నేను కూడా అక్కడే ఉన్నాను.. నన్ను నువ్వు గమనించలేదు’’.
‘‘మీరు పొరపాటు పడుతున్నారు..!’’ అంటూ కార్తీక్ ఏదో చెప్పబోయాడు. గోపిక అతడు చెప్పబోయే మాటలు వినటానికి ప్రయత్నించలేదు.
‘‘ప్లీజ్! నాతో మాట్లాడొద్దు!’’ అంటూ చెప్పి ఆ పక్కనే వున్న ఆగివున్న ఆటో ఎక్కింది గోపిక.
ఆటో ముందుకు కదిలింది.
ఆమె వెళ్లిన తర్వాత రెండు నిమిషాల వరకూ కార్తీక్ తేరుకోలేకపోయాడు. తేరుకున్నాక అతడికి గుర్తుకువచ్చింది- హైదరాబాద్‌కు వెళ్లవలసిన బస్ టికెట్స్ ఆమె వద్దే ఉన్నాయి.
‘‘ఓ.. షిట్!’’ అనుకున్నాడు కార్తీక్.
***
‘‘తోతారాం భన్వర్‌లాల్ జ్యూవెలర్స్ యజమాని భన్వర్‌లాల్ బంగారం, వజ్రాల వ్యాపారంలో కోట్ల రూపాయలు సంపాదించాడు. పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడిన వెంటనే భన్వర్‌లాల్‌కు జరగబోయేది ఏంటో అర్థం అయింది. వెంటనే అతడు షాప్ షట్టర్లు దించేశాడు. బయట వెలుగుతున్న గ్లో సైన్‌బోర్డు లైట్స్ ఆర్పేశాడు. చూసినవాళ్లకు షాప్ మూసేసినట్లు అనిపిస్తుంది, కానీ లోపల వర్కర్లు పనిచేస్తూనే ఉన్నారు. షాపునకు వెనకవైపునుంచి మూడో కంటికి తెలియకుండా ఎంటర్ అవుతున్నారు. బాగా డబ్బున్న కస్టమర్లు సూట్‌కేసులనిండా, గోనె సంచులనిండా వెయ్యి ఐదువందల నోట్లతో వస్తున్నారు. బంగారం, వజ్రాలు కొంటున్నారు. ముప్ఫై నుంచి నలభై శాతం చొప్పున రేట్లు పెంచి బంగారం, వజ్రాలు అమ్మేస్తున్నాడు భన్వర్‌లాల్.
ఇలా ఆ రాత్రి వేళ చీకటి వ్యాపారం మంచి జోరుమీద ఉండగా భన్వర్‌లాల్ జేబులో ఉన్న 32 జిబి యాపిల్ ఐ ఫోన్ మోగింది.
భన్వర్‌లాల్ ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు. అవతలి నుంచి సిఐ దుర్గారావు మాట్లాడుతున్నాడు. దుర్గారావు గొంతు వినగా ఎలర్ట్ అయ్యాడు భన్వర్‌లాల్.
‘‘్భయ్యా! నా దగ్గిర ఫైవ్ సిఆర్ ఉంది. అన్నీ బిగ్ నోట్స్.. వాటిని తీసుకుని కొంత డైమెండ్స్, కొంత బిస్కెట్స్ ఏర్పాటుచెయ్’’ అంటూ చెప్పాడు దుర్గారావ్.
భన్వర్‌లాల్‌కు దుర్గారావ్ గురించి బాగా తెలుసు. దుర్గారావ్ పరమ కిరాతకుడు. భన్వర్‌లాల్ ఏరియాలోనే సిఐగా పనిచేస్తున్నాడు దుర్గారావ్.
భన్వర్‌లాల్ వినయంగా చెప్పాడు.
‘‘్భయ్యా!... నీకు మేటర్ తెలుసు..... ఇన్‌కమ్‌టాక్స్, సేల్స్‌టాక్స్, కమర్షియల్ టాక్స్, కస్టమ్స్, ఎక్సయిజ్, రెవిన్యూ, ఇంటెలిజెన్స్, సెంట్రల్ డైరెక్ట్ టాక్సెస్... వీళ్లతోపాటు మీ పోలీసులు... అంతా పక్కాగా ఉంటేనే బిజినెస్ చేయటానికి భయంగా ఉంది. ఐదు కోట్లు బడా కరెన్సీ అంటే చాలా కష్టం భయ్యా!... పైగా ప్రతి ట్రాన్‌శాక్షన్‌కూ ఆధార్, పాన్ అడుగుతున్నారు... అంతా పక్కాగా లేకపోతే నేను బొక్కలో ఉంటా.’’
‘‘ఓకే! మార్కెట్ రేట్ మీద థర్టీ పర్సెంట్ ఎక్స్‌ట్రా తీసుకో... ఆధార్, పాన్.. అన్ని నేను చూసుకుంటా. మా మనుషులు నిన్ను కలుస్తారు.’’
‘‘్భయ్యా! కానిస్టేబుల్స్‌ని యూనిఫామ్‌లో పంపించవద్దు. సివిల్ డ్రెస్‌లో పంపించు’’ అన్నాడు భన్వర్‌లాల్.
‘‘మా మనుషులు అంటే కానిస్టేబుల్స్ కాదు’’అంటూ పెద్దగా నవ్వాడు దుర్గారావ్.
ఆ తర్వాత గంట సేపటికి ఓ పది మంది వ్యక్తులు ఆధార్, పాన్ కార్డ్స్‌తో, డబ్బులు నింపిన గోనె సంచులతో వచ్చి భన్వర్‌లాల్‌ని కలిశారు. వాళ్ళు అంతా పచ్చి నెత్తురు తాగే గూండాలు, రౌడీలు.
***
సమయం ఉదయం ఏడు గంటలు అవుతోంది.
విజయవాడ బస్‌స్టాండ్‌లోకి అడుగుపెట్టాడు కార్తీక్. భుజానికి వేలాడుతున్న బ్యాగ్ సవరించుకుంటూ వేగంగా ముందుకు కదిలాడు.
ఏడున్నర బస్‌కి గోపిక టికెట్స్ కొన్న విషయం కార్తీక్‌కి గుర్తుంది. అడ్డదిడ్డంగా నడుస్తున్న జనాన్ని తప్పించుకుంటూ హైదరాబాద్ వెళ్లే బస్సులు ఆగేచోటకు చేరుకున్నాడు. వోల్వో బస్సులను వదిలేసి, డీలక్స్ బస్సులవైపు నడిచాడు. ఒక్కొక్క బస్సులోకీ వెళ్లి పాసింజర్లను పరిశీలించసాగాడు. వాళ్లల్లో అతడికి గోపిక కనిపించలేదు.
ఐతే అక్కడే ఒక స్తంభం చాటున నిలబడి ఉన్న గోపిక అతడిని పరిశీలిస్తోంది. అతడు ఈసారి తాము ప్రయాణించబోయే బస్‌లోకి ఎక్కటం గమనించింది. రెండు నిమిషాల తర్వాత అతడు నిరాశగా బస్సు దిగి టికెట్ కౌంటర్లవైపు చూశాడు.
చాంతాడు అంత ఉంది క్యూ.
గోపిక దాక్కుని ఉన్న స్తంభానికి ఇటుపక్క ఖాకీ యూనిఫామ్ వేసుకుని ఉన్న ఒక డ్రైవర్ నిలబడి ఉన్నాడు. అతడిని అడిగాడు కార్తీక్.
‘‘సర్! సెవెన్ థర్టీ హైద్రాబాద్ బస్సు.....’’
బస్ వైపు చెయ్యి చూపుతూ అన్నాడు డ్రైవర్ ‘‘ఇదే... ! టికెట్స్ ఐపోయాయి. నేనే డ్రైవర్‌ని...! ... కరెక్ట్ టైంకి బయలుదేరుతుంది.’’
వాళ్ళ మాటలు గోపికకు వినపడుతున్నాయి.
‘‘సర్! నాతోపాటు ఒక అమ్మాయి కూడా ఇదే బస్సు ఎక్కాలి. టికెట్ తన దగ్గిరే ఉంది. తను ఇంకా రాలేదు. కాసేపు బస్సు ఆపుతారా?’’
‘‘ఒక అమ్మాయా? మీకు తెలియదా ఎవరో??’’
‘‘తెలుసు సార్!.. నిన్ననే కలిశాం.’’
డ్రైవర్ అనుమానంగా చూస్తూ అడిగాడు.
‘‘తెలుసా? నిన్ననే కలిసారా. టికెట్ తన దగ్గిరే ఉందా?’’
‘‘అవును....! తను నా మరదలు...! చాలారోజుల తర్వాత నిన్ననే కలిశాం.’’
ఆ సమాధానంతో చాటుగా వింటున్న గోపిక షాక్ అయింది.
‘‘బస్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా రెండు నిమిషాలే టైం ఉంది. వేరే బస్‌కి ట్రై చేసుకోండి’’అంటూ చెప్పి, డ్రైవర్ బస్ ఎక్కి ఇంజిన్ ఆన్ చేసాడు.
నిరాశగా కౌంటర్లవైపు కదిలాడు కార్తీక్. అతడు అలా కదలగానే పిల్లర్ చాటునుండి ఇవతలకు వచ్చి వేగంగా బస్సువైపు పరుగుతీసింది గోపిక.
సరిగ్గా ఆమెకు వ్యతిరేక దిశలో నడుస్తున్న కార్తీక్‌కు ఎదురుగా ఉన్న కూల్ డ్రింక్స్ షాప్ అద్దాలలో కనపడింది గోపిక వెనుక భాగం. టైట్ బ్లూ జీన్స్, ఎల్లో టీ షర్ట్‌లో ఉంది గోపిక. ఎతె్తైన గుండ్రటి జఘనాలు, సన్నటి నడుముతో వెనుక వైపునుంచి కూడా గోపిక చాలా అందంగా ఉంది. ఆమె భుజాన ఎరుపురంగు షోల్డర్ బ్యాగ్ వేలాడుతోంది. కార్తీక్ అనుమానంగా వెనక్కి తిరిగి చూసాడు. అప్పటికి బస్సులోకి ఎంటర్ అవుతున్న గోపిక ప్రొఫైల్ అతడికి కనపడింది. వెంటనే ఆమెను గుర్తుపట్టాడు కార్తీక్. ఆమె ఎక్కగానే బస్సు కదిలింది. అప్పటికి బస్ ఇంకా వేగం పుంజుకోలేదు. కార్తీక్ వేగంగా పరుగుతీసాడు. బస్ డోర్ పక్కనే ఉన్న రాడ్ పట్టుకుని ఫుట్‌బోర్డు ఎక్కేశాడు.
అప్పటికి గోపిక తన సీట్ దగ్గిరకు చేరుకుంది. ఆమె షోల్డర్ బ్యాగ్‌ను ఓవర్‌హెడ్ క్యారియర్‌లో పెట్టి, వెనక్కు తిరిగి ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఎదురుగ్గా నిలబడి ఉన్నాడు కార్తీక్.
గోపిక తనను చూడగానే ‘‘హాయ్’’ అంటూ విష్ చేసాడు. గోపిక విసురుగా తన సీట్లో కూర్చుంది.
-సశేషం

-జి.వి.అమరేశ్వరరావు