డైలీ సీరియల్

పంచతంత్రం--7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాక్‌నుంచి తేరుకోగానే ఆలోచించాడు. నిరంజన్ దగ్గర బ్లాక్‌మనీ చాలా ఉంది. అది అంతా ఐదువందలు, వెయ్యి రూపాయల నోట్లలో ఉంది. తన దగ్గర ఉన్న పాత నోట్లని కొత్త నోట్లుగా మార్చటానికి పథకం వేసాడు. అంత డబ్బు మార్చటం తన ఒక్కడివల్ల కాదు. అతడు తన అసిస్టెంట్స్ సహాయం తీసుకోవాలి అనుకున్నాడు. నిరంజన్ చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారం తాలూకు లెక్కలు చూసే ఆడిటర్ ఒకడు ఉన్నాడు. అతడి సలహాలు కూడా తీసుకున్నాడు నిరంజన్.
తర్వాత తన అసిస్టెంట్స్‌తో ఒక మీటింగ్ ఏర్పాటుచేసాడు నిరంజన్.
వాళ్లకు తలాఒకటి చొప్పున డబ్బుతో నిండిన గోనె సంచీ ఇచ్చి చెప్పాడు.
‘‘ఒక్కొక్క గోనె సంచిలో కోటి రూపాయలు ఉన్నాయ్. అన్నీ రద్దుఐపోయిన నోట్లు. వీటిని అర్జెంటుగా డబ్బు చేసుకోవాలి... మనకు ఎక్కువ టైం లేదు... మరో కొద్దిరోజుల్లో ఇవి చిత్తు కాగితాలుగా మారిపోతాయి. ఇప్పటికే చాలామంది మురిక్కుంటల్లో, పాడుపడ్డ బావుల్లో, నోట్లు పారేస్తున్నారు. తగలపెట్టేస్తున్నారు. మనం ఆ పని చెయ్యవద్దు... జాగ్రత్తగా వినండి!’’
అంటూ ఆ డబ్బును క్యాష్ చేసుకునే రకరకాల పద్ధతులను వాళ్లకు వివరించి చెప్పాడు.
వాళ్ళు ఆ గోనె సంచులు తీసుకుని వెళ్లిపోయారు.
అలా డబ్బు సంచులతో వెళ్లిన వాళ్లలో బాల్‌రాజ్ అనే గుండా కూడా ఉన్నాడు.
కాని అతడికి రెండు సంచులని ఇచ్చాడు నిరంజన్.
నిరంజన్‌కు బాల్‌రాజ్ ముఖ్య అనుచరుడు.
నిరంజన్ దగ్గర డబ్బుతో నిండిన గోనె సంచులు చాలా ఉన్నాయ్.
వాటిల్లోనించి తనుకూడా ఒక గోనె సంచీ తీసుకుని, దాన్ని కారు డిక్కీలో వేసుకుని బయలుదేరాడు నిరంజన్.
* * *
నిరంజన్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసే బాల్‌రాజ్ నేరుగా తన ఇంటికి వెళ్ళాడు. తన అసిస్టెంట్స్‌తో మీటింగ్ ఏర్పాటుచేసాడు. వాళ్లకు తలాకొంత డబ్బు ఇచ్చి-
‘‘ఈ డబ్బులు తీసుకు వెళ్లి, బ్యాంకుల్లో ఎక్స్‌చేంజ్ చెయ్యండి.... చేయించండి. అడ్డా కూలీలనీ, అడుక్కుతినే వాళ్ళనీ, ఆవారా గాళ్లనీ పోగుచెయ్యండి వాళ్ళకి కూలి డబ్బులు ఇవ్వండి. వాళ్ళకు తలా రెండు వేలు ఇచ్చి, ఏ పోస్ట్‌ఆఫీస్ దగ్గిరో, బ్యాంకు దగ్గిరో క్యూలో నిలపెట్టించి ఎక్స్‌చేంజ్ చేయించండి.’’ అంటూ చెప్పాడు.
వాళ్ళు ఆ డబ్బు తీసుకుని వెళ్లిపోయారు.
వాళ్ళకి ఇవ్వగా ఇంకా చాలా డబ్బు మిగిలింది.
బాల్‌రాజ్ ఉంటున్న ఏరియాలోనే ఒక బ్యాంకు మేనేజర్ కూడా ఉంటున్నాడు. ఆయనతో బాల్‌రాజ్‌కు పరిచయం ఉంది. బాల్‌రాజ్ వెళ్లి ఆయనను బ్యాంకులో కలిసాడు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. ఆ బ్రాంచ్‌లో లోన్స్‌తీసుకున్న వారి వివరాలు బాల్‌రాజ్‌కు వివరించాడు బ్యాంకు మేనేజర్. ఆ బ్రాంచ్‌లో లోన్స్‌తీసుకున్న వాళ్లలో కృష్ణమూర్తి అనే వ్యక్తికూడా ఉన్నాడు.
కృష్ణమూర్తి తన ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టి, కూతురు పెళ్లికోసం, కొడుకు చదువుకోసం పదిహేను లక్షలు అప్పు తీసుకున్నాడు. సరిగ్గా వడ్డీతో సహా అది ఇప్పుడు మొత్తం ఇరవై లక్షలు అయింది. ఇప్పటికీ లోన్ నాలుగు లక్షలు తీర్చాడు. ఇంకా పదహారు లక్షలు బ్యాలెన్స్ ఉంది. ప్రతినెలా క్రమం తప్పకుండా బ్యాంకు ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లిస్తుంటాడు కృష్ణమూర్తి.
నేరుగా కృష్ణమూర్తిని కలిసి మాట్లాడు బాల్‌రాజ్.
కృష్ణమూర్తికి బాల్‌రాజ్ రెండు లక్షల నలభై వేల రూపాయల విలువైన పాత నోట్లు ఇస్తాడు. దాని మీద వడ్డీ చెల్లించనక్కరలేదు. ఆ డబ్బు బ్యాంకులో లోన్ కింద జమచేస్తాడు కృష్ణమూర్తి. బ్యాంకుకి చెల్లిస్తున్నట్లుగానే బాల్‌రాజ్‌కు నెలకు కొంత చొప్పున కడుతూ బాకీ తీర్చుతాడు కృష్ణమూర్తి. బాల్‌రాజ్‌కు కృష్ణమూర్తి రెండు లక్షలు చెల్లిస్తే సరిపోతుంది. ఆ రెండు లక్షలకు పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇవ్వాలి. కృష్ణమూర్తికి ఈ ట్రాన్‌శాక్షన్‌లో నలభైవేలు మిగులుతాయి.
బాల్‌రాజ్ తన దగ్గర ఉన్న బ్లాక్‌మనీని వైట్ చేస్తున్నాడు అని కృష్ణమూర్తికి అర్ధం అయింది.
రెండు లక్షల యాభైవేల రూపాయలకు పైన బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఇన్‌కమ్‌టాక్స్ వాళ్ళకు జవాబు చెప్పాలి. రెండు లక్షల యాభైవేల వరకూ డిపాజిట్ చే ఎవౌంట్ గురించి ప్రాబ్లమ్ లేదు. ఈ విషయం కృష్ణమూర్తికి తెలుసు. వెంటనే ఈ ప్రపోజల్‌కు ఒప్పుకున్నాడు కృష్ణమూర్తి.
తర్వాత తనకు బాల్‌రాజ్ ఇచ్చిన రెండు లక్షల నలభై వేలూ తీసుకుని బ్యాంకుకి వెళ్ళాడు కృష్ణమూర్తి. అక్కడ బాల్‌రాజ్‌తో డీల్ కుదుర్చుకున్నవాళ్ళు చాలామంది ఉన్నారు. బ్యాంకు మేనేజర్‌కి బాల్‌రాజ్ కొంత డబ్బు కమిషన్‌గా ఇచ్చాడు. దాంతో బ్యాంక్‌లో వాళ్ళ పని త్వరగా పూర్తి అయింది.
* * *
కొద్ది సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరంలో ఒక జూనియర్ కాలేజీనీ, ఒక ఇంజనీరింగ్ కాలేజీనీ ప్రారంభించాడు కాళీప్రసాద్. అప్పట్లో అతను పెట్టుబడికోసం నిరంజన్‌ను ఆశ్రయించాడు. మొదట కాళీప్రసాద్‌కు కోటి రూపాయలు ఫైనాన్స్ చేసాడు నిరంజన్. ఆ తర్వాత మరికొన్ని కోట్లు పెట్టుబడిగా పెట్టి కాళీప్రసాద్‌కు పార్టనర్‌గా మారాడు నిరంజన్.
కాళీప్రసాద్‌ని తన దగ్గరకు పిలిపించుకుని, అతడితో చెప్పసాగాడు నిరంజన్.
‘‘పరిస్థితి నీకు తెలుసు.... క్రితం నెల స్టూడెంట్స్ పాత నోట్లతో ఫీజ్ పే చేశారు. ఆ డబ్బులు ఇప్పుడు పనికిరావు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. స్టూడెంట్స్‌ని రంగంలోకి దించు. వచ్చేనెల ఫీజు కింద జమ చేసుకుంటాం అంటావో, ప్రాక్టికల్స్‌లో మార్కులు తగ్గిస్తా అంటావా, సెమిస్టర్ ఎగ్జామ్స్‌లో మార్కులు కట్ చేస్తా అని బెదిరిస్తావో నాకు తెలియదు. ఒక్కో స్టూడెంట్‌కి రెండు వేలు పాత నోట్లు ఇచ్చి కొత్త నోట్లు తీసుకో. బ్యాంకుల దగ్గర క్యూలో నిలబడి వాళ్ల పాత నోట్లు తెచ్చి ఇస్తారు. లెక్చెరర్ల హెల్ప్ కూడా తీసుకో. వాళ్ళకి ఐదు నెలల జీతాలు పాత నోట్లతో ఇవ్వాళే చెల్లించు. వాళ్ళ తిప్పలు వాళ్ళేపడతారు.’’
అంగీకార సూచికంగా తల ఊపాడు కాళీప్రసాద్.
* * *
నిరంజన్ దగ్గర సెల్‌ఫోన్ మోగింది. వెంటనే అతడు ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు. అవతల నుంచి బాబూఖాన్ మాట్లాడుతున్నాడు. బాబూఖాన్ దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. బాబూఖాన్ చెప్పసాగాడు.
‘‘అన్నా! పెద్దనోట్లు రద్దుచేశారని విన్నాను.’’
‘‘అవును!’’
‘‘అన్నా జాగ్రత్తగా విను అన్నా!.... గల్ఫ్‌లో మన దేశం నుంచి వచ్చిన వాళ్ళు దాదాపు డెబ్భైఐదు లక్షలమంది పనిచేస్తున్నారు...వీళ్ళు అందరూ ఇండియానుంచి వచ్చేటప్పుడు, ఇండియన్ కరెన్సీ తెచ్చుకుంటారు. ఇక్కడి ఖర్చులకోసంవాటిని ఇక్కడి మనీ ఎక్స్ఛేంజి సెంటర్స్‌లో దిర్హామ్‌లుగా మార్చుకుంటారు. కానీ ఇప్పుడు మనీ ఎక్స్ఛేంజి చేస్తే శిక్ష పడుతుంది. గల్ఫ్ కంట్రీస్‌లో ఉన్న ఒక్కొక్క ఇండియన్ దగ్గర యావరేజిగా కనీసం పదివేల విలువచేసే పెద్ద నోట్లు ఉంటాయి. అంటే మొత్తం ఏడువేల ఐదు వందల కోట్లు. ఈ డబ్బు వాళ్ళు ఎక్స్ఛేంజి చేసుకోలేరు. చెల్లని నోట్లని ట్రాన్స్‌ఫర్ కూడా చేసుకోలేరు. ఒక రకంగా అవి చిత్తు కాగితాలు. ఆ చిత్తుకాగితాలే మనకు మిల్లియన్లు కుమ్మరిస్తాయి. ఆ చిత్తు కాగితాలను మనం కొనుక్కుంటాం.
-సశేషం

-జి.వి.అమరేశ్వరరావు