డైలీ సీరియల్

పంచతంత్రం -- 9

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐతే ఇంటర్వ్యూ ఉండటంతో అర్జెంటుగా విజయవాడ నుంచి రావలసి వచ్చింది. కార్తీక్‌కు అప్పడప్పుడు గోపిక గుర్తుకు వస్తోంది. గుర్తుకు వచ్చినపుడుల్లా-
‘‘తన పేరుకూడా తెలియదు. ఫోన్ నెంబర్ తీసుకున్నా బాగుండేది’’ అని అనుకుంటున్నాడు కార్తీక్.
ఆ రోజు ఉదయం పది గంటలప్పుడు ఆ వీధి చివర కార్నర్‌లో ఉన్న ఇరానీ కేఫ్‌లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు కార్తీక్, అతడి ఫ్రెండ్స్ హరీష్, రవి, జైరాం. ఇప్పటివరకూ తన ఫ్రెండ్స్‌కు గోపిక గురించి కార్తీక్ చెప్పలేదు. ఈ రోజు ఎందుకనో వాళ్ళకి చెప్పాడు. అంతా విన్న తర్వాత-
‘‘తను నిన్ను లవ్ చేస్తుంది అనుకుంటా!’’ అన్నాడు రవి.
‘‘మనకు అంత సీన్ లేదు. ఐనా నాకు కనీసం తన పేరు కూడా తెలియదు. తనకూ నా వివరాలు తెలియవు’’ అన్నాడు కార్తీక్.
‘‘చెప్పలేం..! రాసిపెట్టి వుంటే మీరు మళ్లీ కలుస్తారేమో..!’’ అన్నాడు జైరాన్.
కార్తీక్ ఏదో అనబోయాడు. అంతలో అతడి దగ్గర ఫోన్ మోగింది. కార్తీక్ ఫోన్ తీసి చూశాడు. ఏదో కొత్త నెంబర్. కార్తీక్ ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు. అవతలి వైపు నుంచి ‘హలో!’ అంటూ ఒక అమ్మాయి గొంతు వినపడింది.
కార్తీక్ ఆశ్చర్యంగా అడిగాడు.
‘‘ఎవరు మీరు?’’
సమాధానంగా అటునుంచి వినపడింది.
‘‘నేను!’’
‘‘నేను అంటే..?’’
‘‘నేను..! నేను..!’’
‘‘నేనా?.. ఎవరండీ?’’
‘‘అబ్బా నేనేనండీ?’’
కార్తీక్ ఏదో అనుమానం వచ్చింది.
‘‘మీరు..! విజయవాడ..! బస్సు..!’’
‘‘అవును..! నేనే..!! మీతో ఒకసారి అర్జెంటుగా మాట్లాడాలి!’’
‘‘మాట్లాడుతోంది గోపిక అని తెలియగానే కార్తీక్ మనసు ఆనందంతో నిండిపోయింది. కార్తీక్ అడిగాడు ‘‘నా ఫోన్ నెంబర్ మీకు ఎలా తెలుసు?’’
‘‘మీరు ఆ బంగారయ్యగారికి మీ ఫోన్ నెంబర్ చెప్పారుగా? మీ సహజీవనం కామేశ్వరితోపాటు అపుడు నేను కూడా విన్నాను. మీ నంబర్ గుర్తుంచుకోవటం ఈజీ.. ఫ్యాన్సీ నెంబర్ కదా? ఇపుడ మీరెక్కడ ఉన్నారు?
కార్తీక్ తను ఎక్కడ ఉన్నాడో చెప్పాడు.
అవతలి నుంచి వినపడింది.
‘‘ఓకె.. మా ఇల్లు కూడా దగ్గరలోనే.. నేను ఒక పావు గంటలో అక్కడ ఉంటా!’’
కార్తీక్ ఫ్రెండ్స్‌కి ఫోన్లో మాట్లాడుతోంది గోపిక అని అర్థం అయింది.
‘‘తనేనా?’’ అడిగాడు జైరాం.
‘‘వారం తర్వాత కూడా నీ నంబర్ గుర్తుపెట్టుకున్నదంటే..’’
హరీష్ ఏదో అనబోతుండగా మధ్యలోనే అందుకుని అన్నాడు కార్తీక్.
‘‘నా నెంబర్ గుర్తుపెట్టుకోవడం ఈజీ..!’’
వాళ్ళు అలా మాట్లాడుకుంటూండగానే అక్కడికి ఒక స్కూటరు మీద గోపిక వచ్చింది.
ఆమెను చూడగానే కార్తీక్ కళ్ళు మెరిసాయి. కానీ ఆమె ముఖం ఎందుకనో వాడిపోయి ఉంది.
ఆమెను చూడగానే ‘‘హాయ్!’’ అంటూ విష్ చేశాడు కార్తీక్.
తను కూడా విష్ చేసింది.
తర్వాత కార్తీక్‌తో చెప్పింది ‘నా పేరు గోపిక!’
కార్తీక్ అన్నాడు ‘నా పేరు కార్తీక్!’
గోపిక అడిగింది.
‘‘ఏంటి? ఆ రోజు అలా అడ్రస్ కూడా చెప్పకుండా వెళ్లిపోయారు?’’
‘‘ఐడియా రాలేదు..! ఐనా మీరేంటి ఇక్కడ?’’ ఆశ్చర్యంగా అడిగాడు కార్తీక్.
‘‘వాసుదేవరావు గారు మీ నాన్నగారా?’’
కార్తీక్ ఆశ్చర్యంగా అడిగాడు.
‘‘అవును!’’
‘‘మీ డాడీ, మా డాడీ ఫ్రెండ్స్. మొన్న నేను మా డాడీతో పాత నోట్లు డిపాజిట్ చేయడానికి బ్యాంకుకు వెళ్లినపుడు చూసాను.. మీరు మీ డాడీని బ్యాంకు దగ్గర డ్రాప్ చేసి వెళ్లారు. తర్వాత మీ డాడీ మా డాడీ పలకరించుకున్నారు’’
‘‘ఓ..!’’
ఒక్క క్షణం ఆగి చెప్పింది గోపిక.
‘‘నేను మీతో పర్సనల్‌గా మాట్లాడాలి!’’.
అప్పుడు గుర్తుకు వచ్చింది కార్తీక్‌కి గోపికకు తన ఫ్రెండ్స్‌ని పరిచయం చేయలేదనే విషయం.
‘‘వీళ్ళు నా థిక్కెస్ట్ ఫ్రెండ్స్.. జైరాం, రవి, హరీష్’’
వాళ్ళను పరిచయం చేసాక అన్నది గోపిక.
‘‘నన్ను అండి అనవద్దు. నిన్ను కూడా అనను.’’
‘‘ఓకే...!’’
కొన్ని క్షణాలు ఆగి అన్నది గోపిక.
‘‘ఈ ఏరియాలో బాల్‌రాజ్ అనే వ్యక్తి ఉన్నాడు నీకు తెలుసా?’’
బాల్‌రాజ్ అనే పేరు వినగానే ఉలిక్కిపడి అన్నాడు కార్తీక్.
‘‘తెలుసు...! వాడు ఈ ఏరియా గుండా. ... ... ఆ హనుమాన్ టెంపుల్ పక్కనే వాడి ఇల్లు.’’
‘‘మాకు కొండాపూర్ దగ్గర ఐదొందల గజాల స్థలం ఉంది. ఆ స్థలాన్ని తనకు అమ్మమని ఆ బాల్‌రాజ్ బలవంతం చేస్తున్నాడు. ఆ స్థలం అమ్మి నాకూ, మా చెల్లికీ పెళ్లిచేయాలని. మిగిలిన డబ్బుతో ఒక అపార్ట్‌మెంట్ కొనుక్కోవాలి అని. మా నాన్న అనుకుంటున్నాడు.’’
కార్తీక్ అన్నాడు.
‘‘ఎలాగూ మీ నాన్న స్థలం అమ్మాలి అనుకుంటున్నాడుగా... అమ్మేయొచ్చుగా?... ... ఆ బాల్‌రాజ్‌గాడు తక్కువ రేట్ ఇస్తా అంటున్నాడా?’’
‘‘లేదు...! మార్కెట్‌రేటే ఇస్తా అంటున్నాడు.’’
‘‘మరి ఏంటి ప్రాబ్లమ్?’’
‘‘వాడు అన్నీ పాత నోట్లు... వెరుూ్య, ఐదొందల నోట్లు ఇస్తా అంటున్నాడు.’’
‘‘వాట్?’’
‘‘అవును...! వాడికి అమ్మకపోతే ఆ స్థలాన్ని కబ్జాచేసేస్తా అంటున్నాడు. బెదిరిస్తున్నాడు. నిజానికి పది సంవత్సరాల క్రితం వాడే ఆ స్థలాన్ని ప్లాట్స్‌చేసి అమ్మాడు. అప్పట్లో ఆ స్థలాన్ని మా నాన్నగారు వాడిదగ్గరే చాలా తక్కువ రేటుకి కొన్నారు. ఇప్పుడు అక్కడ గజం లక్ష రూపాయలు పలుకుతోంది. మొత్తం ఐదు కోట్ల రూపాయల ప్రాపర్టీ... ఆ స్థలం గురించిన విషయాలు అన్నీ వాడికి తెలుసు. వాడు ఇస్తానంటున్న ఐదున్నర కోట్ల రూపాయలను కొత్త నోట్లలోకి మార్చుకోవటం ఇంపాసిబుల్. ఆ డబ్బంతా పోయినట్టే...’’
ఈ మాట వినగానే కార్తీక్‌తోపాటు షాక్ అయ్యారు హరీష్, రవి, జైరాం.
జైరాం అనుమానంగా, భయంగా అన్నాడు.
‘‘మా ఫాదర్ కూడా వాడి దగ్గరే స్థలం కొన్నాడు. కాకపోతే కొండాపూర్ దగ్గర కాదు. కొండాపూర్ పక్కనే ఉన్న అలకాపురి కాలనీలో అక్కడ గజం అరవైవేలు పలుకుతోంది.’’
కార్తీక్, హరీష్, రవిలను ఉద్దేశించి చెపుతూ అన్నాడు జైరాం.
‘‘వీళ్ళుకూడా అక్కడే స్థలాన్ని కొన్నారు. మా పేరెంట్స్ అందరూ ఫ్రెండ్స్.’’
అంతా షాక్‌లో ఉండిపోయారు.
-సశేషం

-జి.వి.అమరేశ్వరరావు