డైలీ సీరియల్

పంచతంత్రం--24

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1960వ దశకంలో రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా పనిచేసిన ఎస్.్భతలింగం హయాంలో ఎస్.్భతలింగం సంతకంతో విడుదల అయిన ఒక రూపాయి నోటు ఇపుడు పదివేల రూపాయల నుంచి పాతికవేల రూపాయలు ధర పలుకుతోంది. సీరియల్ నెంబర్ చివర 786 లేదా 786 768 అంకెలు గల పాత, కొత్త నోట్ల ధర చాలా ఎక్కువ ఉంది. అదేవిధంగా సీరియల్ నెంబర్ చివర 123, 1234, 999, 9999, 555, 666 ఇలా ఏదో ఒక ప్రత్యేకత ఉన్న పాత, కొత్త నోట్లు కూడా ఎక్కువ ధర పలుకుతున్నాయి.
విదేశాలలో ఐతే పాత నోట్లు, స్టాంపులు, పెయింటింగ్స్ మాత్రమే కాదు పాత కూల్ డ్రింక్స్ సీసాల మూతలు, పాత సినిమా, బస్సు, రైలు, ఓడల టికెట్లు, ఫుట్‌బాల్ మ్యాచ్ టిక్కెట్లు పాత, సినిమా పోస్టర్లు, వ్యాపార ప్రకటనల పోస్టర్లు, గ్రామఫోన్ రికార్డులు, భూమిమీదకు దూసుకువచ్చి పడిన ఉల్కల శకలాలు, డైనోసార్ గుడ్లు, ఒకటేమిటి సమస్తం వ్యాపార వస్తువులుగా మారిపోయాయి. చాలామంది సంపదను డబ్బు, బంగారం, వజ్రాలు, స్థలాలు, పొలాల రూపంలోనే కాక వివిధ రూపాల్లో దాచుకుంటున్నారు.
గోపిక ఏదో ఆలోచించి, కార్తీక్ పోన్ చేసింది. వెంటనే కార్తీక్ లైన్‌లోకి వచ్చాడు.
‘‘నీ దగ్గర పాత కరెన్సీ నోట్లు ఉన్నాయా? .. వాటి ధరలు వింటే నీకు కళ్లు తిరుగుతాయి’’
‘‘వాటి ధరల గురించి నాకు తెలుసు.. నా దగ్గర పాత నోట్లు ఏమీ లేవు. మరో పది నిమిషాల తర్వాత అందరం కాన్ఫరెన్సులో మాట్లాడుకుందాం’’ అంటూ చెప్పి ఫోన్ కట్ చేశాడు కార్తీక్.
సరిగ్గా పది నిమిషాల తర్వాత కార్తీక్, అతడి ఫ్రెండ్స్ అందరి మధ్యా టెలిఫోన్ కాన్ఫరెన్స్ ఏర్పాటు అయింది. కార్తీక్ అందరితో చెప్పటం ప్రారంభించాడు.
‘‘ఇప్పటికి రెండుసార్లు రిజిస్ట్రేషన్స్ పోస్ట్ఫున్ అయ్యాయి. ఇక ఆ బాల్‌రాజ్‌ని ఆపటం కష్టం.. నేను ఇపుడే ఒకసారి చూశాను. నా దగ్గర వున్న ఆ బాల్‌రాజ్‌గాడి ఫోన్‌కి సిగ్నల్స్ వస్తూనే వున్నాయి. వాడు కొత్తసిమ్ము తీసుకోలేదు. ఇంకా నాకోసం ట్రై చేస్తూనే ఉన్నాడు. నేనూ, గోపికా డ్రోన్‌లో ఆ బాల్‌రాజ్‌గాడూ, వాడి అనుచరుల మాటలు విన్నపుడు పండిట్ అనే వాడి గురించి వాళ్ళు చెప్పుకున్నారు. నన్ను ట్రాక్ చెయ్యటానికి వాడి హెల్ప్ తీసుకుంటున్నాడు బాల్‌రాజ్. బాల్‌రాజ్‌నీ, వాడి అసిస్టెంట్స్ బైరాగి, పఠాన్లనూ, నిరంజన్‌నీ మనం ఫాలో అవ్వాలి.. గుర్తుపెట్టుకోండి, పొట్టిగా ఉన్నవాడు బైరాగి, పొడుగ్గా ఉన్నవాడు పఠాన్. ప్రస్తుతం ఆ బాల్‌రాజ్‌గాడు పఠాన్ ఇంట్లో ఉంటున్నాడు.. నేను నిరంజన్ సంగతి చూసుకుంటాను. ఎస్‌ఐ మహేంద్రను హరీష్, బైరాగిని రవి, పఠాన్‌ని జైరాం ఫాలో అవ్వాలి. మనకు మరిన్ని డ్రోన్స్ కావాలి ఆ విషయం గోపిక చూసుకుంటుంది’’ గోపిక చెప్పింది.
‘‘నేను వెంటనే మందాకిని కలుస్తా. తనని మొన్న కలిసినపుడు చూశాను తన దగ్గర చాలా డ్రోన్స్ ఉన్నాయ్..’’
‘‘ఓకె! నీకు అవి దొరకగానే మమ్మల్ని కాంటాక్ట్ చెయ్యి..!’’ అని గోపికతో చెప్పి, మిగిలిన వాళ్లతో ‘‘ఇక మనం వెంటనే బయలుదేరుదాం’’ అంటూ సంభాషణ ముగించాడు కార్తీక్.
నిరంజన్ ఇంటి దగ్గరలో ఉన్న ఒక ఇరానీ కేఫ్‌లో కూర్చుని ఉన్నాడు కార్తీక్. కాసేపటికి స్వంతగా కారు డ్రైవ్ చేసుకుంటూ బయటకు వస్తున్న నిరంజన్ అతడికి కనిపించాడు. వెంటనే నిరంజన్‌ని ఫాలోఅవ్వటం ప్రారంభించాడు కార్తీక్.
పఠాన్ ఇంటికి కొద్దిదూరంలో ఉన్న టిఫిన్ బండి దగ్గర నిలబడి సాధ్యమైనంత మెల్లగా ఊతప్పం తింటున్నాడు జైరాం. అంతకుముందు ఒక ప్లేటు ఇడ్లీ, ఒక దోశ తినేసాడు జైరాం. టిఫిన్లతో అతడికి కడుపు నిండిపోయింది.
ఆ పక్కనే ఉన్న చాయ్ దుకాణంలో ఉస్మానియా బిస్కెట్స్ తింటూ, చాయ్ తాగుతున్నాడు రవి.
పఠాన్ ఇంటి బయట పార్క్‌చేసి ఉంది బాల్‌రాజ్ జీప్. ఆ పక్కనే ఒక మోటార్ సైకిల్ కూడా పార్క్‌చేసి ఉంది. దాంతో తమకు కావలసిన మనుషులు అక్కడే ఉన్నారు అని, జైరాం, రవిలకు అర్థం అయింది.
రవి ఎదురుచూసీ, చూసీ విసుకుపుట్టి జైరాంకి ఫోన్‌చేసాడు.
టిఫెన్ బండి దగ్గర ఉన్న జైరాం ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు.
రవి చెప్పాడు. ‘‘పిచ్చ బోర్ కొడుతోంది? టైంపాస్ అవటం లేదు.’’
జైరామ్ ఊతప్పాన్ని తుంచి, నోట్లోపెట్టుకుంటూ, చాయ్ దుకాణంలో ఉన్న రవివైపు చూసాడు. చాయ్‌లో ఉస్మానియా బిస్కెట్లు నంజుకుని తింటున్నాడు రవి.
వెంటనే అడిగాడు ‘‘ఉస్మానియా బిస్కెట్లు లాగిస్తున్నావు కదా? ఆ బిస్కెట్లకు ఆ పేరు ఎలా వచ్చింది నీకు తెలుసా?’’
రవి చెప్పాడు ‘‘తెలియదు!’’
‘‘ఐతే చెప్తా విను! హైదరాబాద్‌ను పరిపాలించిన చివరి నిజాం రాజు ‘మీర్ ఉస్మాన్ అలిఖాన్’కు కొంచెం తియ్యగా, కొంచెం కారంగా ఉండే బిస్కెట్స్ తినాలి అనిపించిందట. దాంతో ఆయనకోసం ఉస్మానియా బిస్కెట్స్ ప్రత్యేకంగా తయారుచేశారట. తర్వాత ఆరోజుల్లో ఉస్మానియా హాస్పిటల్‌లోని పేషంట్లకు కూడా ఉస్మానియా బిస్కెట్స్ ఇచ్చేవాళ్ళుట. ఆ హాస్పిటల్‌లోని డాక్టర్స్ కూడా ఉస్మానియా బిస్కెట్స్ తినటం మొదలుపెట్టారుట. ఆ తర్వాత నగరంలోని ఇరానీ కేఫుల్లో ఉస్మానియా బిస్కెట్‌లను తయారుచేయటం మొదలైంది. అలా క్రమక్రమంగా అవి జనంలోకి అందుబాటులోకి వచ్చి, ఇప్పుడు ఇలా నీ పొట్టలోకి చేరాయి.’’
రవి ఏదో అడగబోయాడు. అదే సమయంలో పఠాన్ బయటకువచ్చి జీప్ స్టార్ట్ చేయటం జైరాం చూసాడు. వెంటనే ‘‘వాడు వచ్చాడు!’’అంటూ చెప్పి ఫోన్ కట్ చేసాడు జైరాం.

--జి.వి.అమరేశ్వరరావు