డైలీ సీరియల్

పంచతంత్రం - 35

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంటనే పక్కకి దొర్లుతూ, చేతులు పైకి లేపి నాటు తుపాకులకు పని చెప్పారు బాల్‌రాజ్, పఠాన్.
వడగళ్ళలా దూసుకుపోయాయి బుల్లెట్స్.
గురిచూసి తుపాకి పేల్చాడు బైరాగి.
అతడి తుపాకి నుంచి వెలువడిన బుల్లెట్ మహేంద్రకు వెనుక వైపున వున్న రాతిబండకు తగిలి, రివర్స్ అయి మహేంద్ర వీపులో దూసుకుపోయాయి. గుండెకు సెంటీమీటర్‌లో ఆగింది.
బైరాగి షార్ప్ షూటర్.
మహేంద్ర కెవ్వుమని అరిచాడు.
ఇక తను ఎంతోసేపు బతకడు అనే విషయం మహేంద్రకు తెలుస్తోంది. అతడికి భార్యా పిల్లలు గుర్తుకువచ్చారు. ఏడుపువస్తోంది. బుల్లెట్ దిగిన చోట నొప్పిగా వుంది. ఒక్కసారిగా అతడిలో కసి ముంచుకువచ్చింది. పళ్ళ బిగువన బాధ భరిస్తూ, శక్తినంతా కూడదీసుకుని-
‘‘ఒరే.. ! బైరాగీ!... మీ వాళ్ళు తుపాకులు తెస్తున్నారని చెప్పలేదేంద్రా?’’ అంటూ పెద్దగా అరిచి తలవాల్చేశాడు.
ఆ అరుపు వినగానే తమ పక్కనే పడుకుని వున్న బైరాగివైపు అనుమానంగా చూసాడు బాల్‌రాజ్.
వెంటనే బైరాగి-
‘‘లేదన్నా!.. నాకేం తెలియదు..!’’ అంటూనే ఛటుక్కున బాల్‌రాజ్ వైపు రివాల్వర్ ఎయిమ్ చేసి ట్రిగ్గర్ లాగాడు. అంతకంటే వేగంగా రియాక్ట్ అయ్యాడు బాల్‌రాజ్. అతడు పేల్చిన బుల్లెట్ బైరాగి నుదుటిన రంధ్రం చేసింది. బైరాగి తల వాల్చేశాడు.
బైరాగి పేల్చిన బుల్లెట్ బాల్‌రాజ్ మెడకు అంగుళం లోతుగా గాయం చేస్తూ గాలిలోకి దూసుకుపోయింది.
జరిగేదంతా రాతి బండల చాటున దాక్కుని వున్న రవి, జైరాం, హరీష్ నోళ్ళు తెరచుకుని చూస్తున్నారు. సినిమాలో చూసే దృశ్యాలు వాళ్లకు కళ్ళముందు లైవ్‌లో కనపడుతున్నాయి.
అంతలో రవి దగ్గరున్న ఫోన్‌లోనుంచి ‘హలో!.. హలో’ అంటూ కార్తీక్ గొంతు వినపడింది.
అప్పటివరకూ లైన్‌లోనే ఉన్నాడు కార్తీక్.
ఉలిక్కిపడిన రవి-
బైరాగి, దుర్గారావ్, మహేంద్రలు హత్య చేయబడిన విషయం వివరించాడు.
అంతా విన్నతర్వాత-
‘‘బతికి ఉన్న ముగ్గురికీ నిరంజన్ చేసిన కుట్ర గురించి తెలుస్తుంది. వెంటనే వాళ్ళు రివెంజ్ తీర్చుకోవటానికి నిరంజన్ దగ్గరకు బయలుదేరుతారు. వాళ్ళని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నేను ఇంకా నిరంజన్‌ని ఫాలో అవుతూనే ఉన్నాను’’ అంటూ చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేశాడు కార్తీక్.
తమ శత్రువులు మరణించారు అని తెలుసుకున్న తర్వాత ఒక బండమీద కూర్చుని తమకు తగిలిన గాయాలకు హ్యాండ్ కర్చ్ఫీలతో కట్టుకున్నారు బాల్‌రాజ్, పఠాన్.
ఓ పక్కన భయంగా కూర్చుని ఉన్నాడు హరేరామ్. ఆ పక్కన పడి ఉన్నాయ్ రెండు సూట్‌కేసులు. మరోవైపు హరేరామ్ తెచ్చిన వజ్రాల బాక్స్ పడి ఉంది.
బాల్‌రాజ్ క్రోధంతో రగిలిపోతూ పక్కనే పడి వ్ను లావుపాటి రాయి అందుకుని దాన్ని సూట్‌కేసులమీద విసిరికొట్టాడు. సూట్‌కేసులు పగిలిపోయాయి. వాటిల్లో నుంచి బయటపడ్డాయి. పాత డైలీ పేపర్లు, చిత్తుకాగితాలు వాటిని చూసి బాల్‌రాజ్, పఠాన్, హరేరామ్‌లు షాక్ అయ్యారు.
డైమండ్స్ బాక్స్‌ని కూడా పగలకొట్టాడు బాల్‌రాజ్. అందులోనుంచి ఒక పెద్ద పర్సు బయటపడింది. ఆ పర్సు తెరిచి కొన్ని డైమండ్స్ బయటకు తీశాడు. వాటిని చూసి పఠాన్, హరేరామ్‌లు ఆశ్చర్యపోయారు.
అది గమనించాడు బాల్‌రాజ్.
‘‘పిచ్చివెధవల్లారా!.. ఇవి డైమండ్స్ కావు..!’’ అని అరుస్తూ, డైమండ్స్‌లా కనపడుతున్న వాటిని పక్కనే వున్న బండమీద పెట్టి, లావుపాటి రాయితో పగలగొట్టాడు.
డైమండ్స్‌లా కనపడుతున్న గాజు ముక్కలు పగిలిపోయాయి.
వెంటనే పెద్దగా అరిచాడు బాల్‌రాజ్.
‘‘ఎక్కడ్రా?.. ఆ నిరంజన్ గాడు ఎక్కడ?’’
ఈ మాటకు వౌనంగా, భయంగా కూర్చున్నారు పఠాన్, హరేరామ్.
బండరాళ్ళ చాటున దాక్కుని వున్న హరీష్, రవి, జైరాంలకు ఆ మాటలు వినిపించాయి.
వెంటనే జైరాం కార్తీక్ ఫోన్ చేశాడు. పరిస్థితి వివరించాడు.
వెంటనే సమాధానం చెప్పాడు కార్తీక్.
‘‘ఓకే!.. నువ్వు ఫోన్ పెట్టెయ్.’’
జైరాం ఫోన్ డిస్‌కనెక్ట్ చేసాడు.
నిరంజన్‌ను ఫాలో అవుతున్న కార్తీక్ తన దగ్గర ఉన్న బాల్‌రాజ్ ఫోన్ తీసి, ఆన్ చేసి, రింగ్ చేసాడు. పోచమ్మ టెంపుల్ దగ్గరున్న బాల్‌రాజ్ దగ్గర ఉన్న ఫోన్ మోగింది.
బాల్‌రాజ్ ఫోన్ తీసి చూసి-
‘‘ఇది నా ఫోన్ నెంబర్, ఆ ఫోన్ స్నాచర్‌గాడు.. లైన్లో ఉన్నాడు.’ అంటూ చెప్పాడు.
తర్వాత కాల్ రిసీవ్ చేసుకుని పెద్దగా అరిచాడు.
‘‘ఒరే!...నిన్ను వదలను... మర్డర్ చేస్తా...!’’అంటూ అరిచాడు.
‘‘వెర్రిపప్ప లాగా ఆ అరుపులేంట్రా?... దమ్ములేని వెధవా!’’అంటూ తిట్టి, ఫోన్ కట్‌చేసి స్విచ్‌ఆఫ్ చేశాడు కార్తీక్.
‘‘చెప్తా వీడి సంగతి...! ఆ పండిట్‌గాడిని వెంటనే కాంటాక్ట్ చేస్తా...!’’ అంటూ చటుక్కున ఆగాడు బాల్‌రాజ్. అతడికి ఏదో ఐడియా వచ్చింది.
వెంటనే అతడు పండిట్‌కి ఫోన్‌చేసాడు. వెంటనే లైన్‌లోకి వచ్చి చెప్పాడు పండిట్.
‘‘అన్నా!... మళ్ళీ ఆడి ఫోన్ ట్రాక్‌చెయ్యాలా?’’
‘‘వద్దు...! ఇప్పుడు నేను చెప్పే నంబర్ వెంటనే ట్రాక్ చెయ్యి...! చాలా అర్జంట్...! నీకు డబల్ పేమెంట్ ఇస్తా!.’’అని పండిట్‌కి నిరంజన్ ఫోన్ నంబర్ చెప్పాడు బాల్‌రాజ్.
సరిగ్గా పావుగంట తర్వాత పండిట్‌నుంచి ఫోన్ వచ్చింది.
‘‘నువ్వు చెప్పినవాడి ఫోన్ ట్రాక్ చేశా. వాడు కారులో వెడుతున్నాడు. ఎర్రచెరువు ఏరియాలో ఉన్నాడు... మరి నా పేమెంట్...?’’
‘‘ఇవాళ నైట్‌కి నేనే నీకు స్వయంగా ఇస్తా...’’అంటూ చెప్పి ఫోన్ కట్ చేసాడు బాల్‌రాజ్. తర్వాత అతడు దుర్గారావ్, మహేంద్రల శవాల దగ్గరకు వెళ్ళాడు. అక్కడ పడి ఉన్న రివాల్వర్లు తీసుకున్నాడు.

-సశేషం

-జి.వి.అమరేశ్వరరావు