డైలీ సీరియల్

జ్వాలాముఖి... మంత్రాలదీవి -- 9

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయుడు ప్రమాదాన్ని పసిగట్టాడు.. విక్రముడి నిద్రమత్తు మెదిలింది. ఇద్దరూ జరుగబోయే ప్రమాదాన్ని నియంత్రించడానికి సంసిద్ధులయ్యారు. రాయంచ చిలుక ప్రమాదం ఎటువైపునుంచి వస్తున్నదో పసిగట్టడానికి గాల్లోకి ఎగిరింది. విహంగవీక్షణంతో వీక్షించింది.
దక్షిణం నుంచి ప్రమాదం దూసుకువస్తుందని పసిగట్టింది.
దక్షిణం వైపు పెద్దగాలి దుమారం. ఆ సుడిగాలిలో నుంచి కొన్ని వింత ఆకారాలు పుట్టుకొచ్చాయి. అవి విచిత్రమైన రూపంలో వున్నాయి. ఆకారాలు వాటికవే తోడేళ్లుగా మారాయి.. రాయంచ ఆ విపరీత దృశ్యం చూసింది. ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా వెనక్కి వెళ్లింది.
అప్పటికే పురవీధుల్లో నిశ్శబ్దం భయం అలుముకున్నాయి.. విపరీతమైన శబ్దాలు భయానకమైన రూపాలు.. మూగజీవాలు ప్రాణభయంతో వణికిపోతున్నాయి. పురవీధుల్లోని అన్ని ఇళ్ల తలుపులు మూసుకున్నాయి.
ప్రతిరోజూ ఈ భయానక అనుభవం వారికి ఎదురవుతూనే వుంది. పహారా కాసే సైనికులు భయపడుతూనే ఈ ఉత్పాతాన్ని ఎదిరించడానికి ముందుకు వచ్చారు. ఎన్నిసార్లు పోరాడినా ఫలితం శూన్యం అవుతూ వస్తుంది. ఒకసారి తోడేలు మరోసారి పులులు ఇంకోసారి సింహాలు ఎలుగుబంట్లు.. ఆయుధాలతో గాయపరిచినా చనిపోవడంలేదు.
ఒక్కసారిగా నలువైపులనుంచి తోడేళ్ల మంద పురవీధుల్లో బీభత్సం సృష్టించింది. ఇళ్ళలో కట్టిపడేసిన మేకలను ఆవులను గాయపరుస్తోంది.. ఈ భయంతోనే పుర ప్రజలు తమ ఇంట్లోనే కట్టేసుకుంటున్నారు.. సైనికులు తోడేళ్ళను ఎదుర్కొంటున్నారు.. వాటి శక్తి మామూలు శక్తిగా లేదు.. భీకరమైన కోరలు పొడుచుకువస్తున్నాయి.
రాయంచ విజయుడి భుజంమీద వాలింది.
‘‘మిత్రమా ఆ తోడేళ్ళు మాయాతోడేళ్ళు.. వాటికీ మంత్రశక్తి మాత్రమే విరుగుడు. గురుదేవుడు మీకు ఉపదేశించిన అస్త్రాలను ప్రయోగించండి’’ అని చెప్పింది.
అప్పటికే విజయుడి కరవాలం గాల్లోకి లేచింది. భయంతో వణికిపోతోన్న పురప్రజల నిస్సహాయత కనిపిస్తోంది. అతనిలోని క్షత్రియ పౌరుషం నిద్రలేచింది. రాజధర్మం గుర్తుకు వచ్చింది. తన కరవాలానికి పనిచెప్పాడు.
మరోవైపు విక్రముడు కూడా తన మిత్రుడి బాటలోనే చిచ్చరపిడుగులా చెలరేగిపోయాడు. దొరికిన తోడేలును దొరికినట్టే వేటు వేస్తున్నాడు. అయినా అవి తిరిగి దాడిచేస్తున్నాయి. విజయుడి కరవాలం తోడేలు తలను వేరుచేసింది. ఘడియల్లోనే తల అతుక్కుంది. రక్తంవచ్చేలా గాయం చేసినా తోడేళ్ళు అలసిపోవడం లేదు.. నేలమీద ఒరిగిపోవడంలేదు.
* * *
అలుపుసొలుపూ లేకుండా విజయ విక్రములు పోరాడుతూనే వున్నారు. తమ రాజ్యంలోకి వచ్చిన ఇద్దరు అపరిచిత వీరులు తమకు సాయంగా నిలవడంతో సైనికుల్లో మరి కాసింత ధైర్యం వచ్చింది.
ప్రయాణీకుడి మీద తోడేలు లంఘించింది. విజయుడు ఒడుపుగా ఆ తోడేలును గాల్లోనే పట్టుకుని తన శక్తినిప్రయోగించి దూరంగా విసిరివేసాడు.
నడిరాత్రి దాటింది.. మొదటిసారిగా తోడేళ్లు క్రమక్రమంగా అలిసిపోతున్నాయి. విజయుడు తన గురుదేవుడిని స్మరించుకున్నారు. అశ్వానికి ఉన్న అంబుల పొదిని తీసుకున్నాడు... గురుదేవుడు ఉపదేశించిన అస్త్రప్రయోగ మంత్రాలను పఠించాడు... యాత్రలను గాలిలోకి ప్రయోగించాడు.
గాల్లోకి వెళ్లిన అస్త్రాలు మంత్ర ప్రభావంచేత తోడేళ్ళ వైపు వచ్చాయి... అస్త్రాలు తోడేళ్ళ మీద దాడి ప్రారంభించాయి. తోడేళ్లు సరిహద్దు దాటేవరకు అస్త్రాలు నిరంతరం దాడిచేస్తూనే వున్నాయి.
మరోపక్క విక్రముడు పురవీధుల్లో వున్న రెండు కర్రలను చేతుల్లోకి తీసుకున్నాడు... ఆశ్రమంలో నేర్చుకున్న కర్రసాము గుర్తుచేసుకున్నాడు. రెండు చేతుల్లో రెండు కఱ్ఱలను గాల్లోకి తిప్పుతూ గాలిని చీల్చేలా కర్రలను ఒడుపుగా తిప్పుతున్నాడు... అతడి పరిసరాల్లోకి వచ్చిన తోడేళ్ళు కర్రసాము ధాటికి చెల్లాచెదురవుతున్నాయి. మరోవైపు అస్త్రప్రయోగం చేత తోడేళ్ళు పరుగులు తీస్తున్నాయి. సూర్యోదయానికి కొన్ని ఘడియల వ్యవధి వుంది. తోడేళ్ళగుంపు మహాపురి రాజ్యసరిహద్దులు దాటి కోసల రాజ్యంలోకి ప్రవేశించాయి.
అప్పటివరకూ భయంతో బితుకుబితుకుమంటోన్న పురప్రజలు బిలబిలమంటూ ఇళ్ళల్లో నుంచి బయటకు వచ్చారు. తమ ఇళ్లల్లోనుంచే ఇద్దరు యువకుల పరాక్రమాలు చూసారు.. సైనికులు కూడా ఆ దృశ్యాన్ని చూసారు.
ఈ వార్త మహారాజును చేరింది. సూర్యుని వెలుగురేఖలు మహాపురిని చేరుకున్నాయి. పురవీధుల మధ్య విజయుడికి విక్రముడికి పురప్రజలు జేజేధ్వానాలు పలికారు. వెలుగురేఖలు వెలుగులో విజయుడిని గుర్తుపట్టారు. సైనికులు వందనం చేసారు. అప్పటికే మహారాజు మంత్రితోసహా మహారాణి సమేతంగా అక్కడికి చేరుకున్నారు.
పురప్రజలను కాపాడింది తమ పుత్రుడేనని తెలిసిన మహారాజు ఆనందభరితుడయ్యా డు. ప్రజలు జయజయ ధ్వానాలు చేసారు. మంత్రి తన కుమారుడిని ఆలింగనం చేసుకున్నాడు. మహారాజు విజయుడుని తన గుండెలకు హత్తుకున్నాడు.
విజయుడు తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించాడు.
‘కుమార రాచబిడ్డవు అనిపించవు.. రాజధర్మం పాటించావు. కాబోయే మహారాజుగా ఈ దేశం ప్రజల ప్రాణాలను కాపాడావు. నాయనా విజయస్నా... నీకోసమే ఈ వృద్ధప్రాణాలు ఎదురుచూస్తున్నాయి. ఈ విపరీత విపత్కర పరిస్థితుల్లో నీకు స్వాగత సత్కారాలు చేయడానికి మహారాజుగా మనసొప్పలేదు.. గురుదేవుడి ఆశ్రమంనుంచి వచ్చాక యువరాజుగా పట్ట్భాషేకం ఘనంగా చేయాలనుకున్నాను. కానీ ఇంతలోనే మనకు కీడు మొదలైంది... మన పొరుగు రాజ్యాల్లోకూడా ఇలాంటి విపరీత పరిణామాలు జరుగుతున్నాయి.

-సశేషం

- శ్రీ సుధామయి