డైలీ సీరియల్

జ్వాలాముఖి... మంత్రాలదీవి--12

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేటలో ప్రావీణ్యం వున్న తమకు ఇది చాలా చిన్న విషయం అని తలపోశారు.
చీకట్లు ముసిరి పురవీధుల్లో భయాన్ని ప్రోదిచేసినట్టు... దూరంగా భీకరమైన అరుపులు... అవి కర్ణకరంగా మిక్కిలి భయానకంగా ఉన్నాయి.
ప్రతీరోజులానే ఈ రోజు కూడా పురప్రజలు తమతమ నెలవుల్లోనే తల దాచుకున్నారు. పురవీధులు నిర్మానుష్యంగా వున్నాయి..
ఒక్కసారిగా విపరీతమైన గాలి దుమారం... పెద్ద పెద్ద శబ్దాలు. పసి పిల్లలు భయంతో ఏడుపు లంకించుకున్నారు. ఒకసారిగా కోసల రాజ్యాన్ని చుట్టుముట్టాయి మాయాతోడేళ్లు...
పంట పొలాలను నాశనం చేస్తున్నాయి... వీధుల్లో వున్న అంగళ్లను విధ్వంసం చేస్తున్నాయి...
అదే సమయంలో విడిదిలో వున్న రాకుమారులు తమ కరవాలాలను దూశారు.. అప్పుడు కానీ వారికి అర్ధం కాలేదు. తాము ఎంతటి సాహసానికి ఒడికట్టామో అన్నది.. దూర ప్రాంతాలనుంచి వచ్చిన ఆ రాకుమారులకు ఇంకా వాస్తవం బోధపడలేదు.
విచిత్రమైన ఆకారాల్లో వున్నాయి.. వాటి కళ్లు చింతనిప్పుల్లా వున్నాయి. వాటి వేగం అశ్వవేగాన్ని మించి వుంది. ఒకేసారి ముగ్గురు రాకుమారులు ఢీకొట్టింది ఒకే ఒక తోడేలు. రాకుమారులు అల్లంత దూరము పడిపోయారు.
అప్పుడే కోసల రాజ్యంలోకి ప్రవేశించారు విజయ విక్రములు. వారికి తోడేళ్ళ విధ్వంస స్వాగతం లభించింది. దానిని ఎదుర్కోవడానికి సిద్ధంగా వున్నారు.
గురుదేవుడు ఉపదేశించిన మంత్రాలు నేర్పించిన అస్తవ్రిద్యలు అన్నీ స్ఫురణకు తెచ్చుకున్నారు. సృష్టికి విరుద్ధమయిన శక్తితో వున్న ప్రాణులతో పోరాడవలసి వచ్చినప్పుడు కరవాలాన్ని మంత్రోచ్ఛారణతో ప్రయోగించాలన్న గురుదేవుల మాటలను ఆచరణలో పెట్టారు మిత్రులిద్దరూ.
జై గురుదేవా అని గురుదేవుడిని స్మరించి కరవాలాలను పైకి లేపారు...
మారువేషంలో వచ్చిన సహస్రదర్శిని చిన్మయిలు అక్కడి బీభత్స దృశ్యాలను చూసారు. చెలికత్తె భయపడిపోయింది. ఆమె ధైర్యం తోడేళ్ళ గుంపును చూడగానే నీరుగారిపోయింది.
‘‘యువరాణి ఇవి మామూలు తోడేళ్ళు కావు.. క్షుద్రశక్తులతో కూడి వున్నాయి. వీటిని ఎదుర్కోవడం అంటే మృత్యువుతో తలపడడమే... వెనుతిరిగి అంతఃపురానికి వెళ్ళిపోదాం’’ అని ప్రాధేయపడింది.
ప్రమాదానికి భయపడి వెన్ను చూపడం... భయంతో నా రాజ్యంలో ప్రజలు భీతిల్లుతుంటే నేను అంతఃపురంలో విశ్రమించాలా... నువ్వు వెళ్ళిపో.. చిన్మయి... విజయమో వీరస్వర్గమో తేల్చుకుంటాను’’ స్థిరంగా అంది యువరాణి.
అప్పటికే పురవీధుల్లో సైనికులు క్షతగాత్రులై పడి వుండడం చూసారు. ఓ పక్క సైనికులు పోరాడుతూనే వున్నారు... కోసల రాజ్యం తమ రాజ్యగౌరవ చిహ్నంగా తమ బలానికి ప్రతీకగా నిలిపిన గజేంద్రుడిని వదిలారు... ఏనుగు ఘీంకారంతో కదిలింది.. మరోపక్క స్వయంవరానికి వచ్చిన రాకుమారులు రక్తసిక్తమై పడివున్న... రాజవైద్యులు క్షతగాత్రులకు తక్షణ చికిత్స చేస్తున్నారు... తోడేళ్ళ విధ్వంసం సాగుతూనే వుంది. ఒక తోడేలును సంహరిస్తే పదుల సంఖ్యల్లో పుట్టుకు వస్తున్నాయి.
యువరాణి సహస్రదర్శిని తమ కులదైవాన్ని తల్చుకుంది. కరవాలాన్ని దూసింది.
* * *
రాయంచ ఆకాశంలో విహరిస్తూ వుంది. రక్తమోడుతోన్న కోసల పురవీధుల్లో మాయతోడేళ్ళ ఆగమనం ఎక్కడినుంచా? అని గమనిస్తూ వుంది. తోడేళ్ళు ఒకదానిలో నుంచి మరొకటి పుట్టుకు వస్తున్నాయి. గాల్లోనుంచి పుట్టుకు వస్తున్నాయి. గాల్లోకి ఎగురుతున్నాయి... రాయంచ చిలుక ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని విజయుడికి చేరవేస్తూనే వుంది.
విజయుడు విక్రముడు చెరోవైపు నుంచి తోడేళ్ళ మందను ఎదుర్కొంటున్నారు. అప్పుడు గమనించాడు విజయుడు. ఓ నూనూగు మీసాల యువకుడు కరవాలాన్ని మెరుపువేగంతో తిప్పుతూ తోడేళ్ళ మందను ఎదుర్కొంటున్నాడు.. చూడడానికి చాలా అందంగా వున్నాడు.. ధైర్యంగా పోరాడే ఆ పోరాట పటిమ చసి విజయుడికి ముచ్చటేసింది.
కానీ మాయ తోడేళ్ల మందను ఎదుర్కోలేకపోతున్నాడు.
సరిగా అప్పుడు జరిగిందా హఠాత్ సంఘటన.
* * *
సైనికులు శక్తివంచన లేకుండా పోరాడుతున్నారు.
యువరాణి స్వయంవరానికి విచ్చేసిన రాకుమారులు రక్తమోడుతూ క్షతగాత్రులయ్యారు.
విజయుడి ధాటికి విక్రముడు పరాక్రమానికి భయపడుతూ పారిపోయిన తోడేళ్ళు ఈసారి. ఏనుగు మీద దాడిని చేసాయి.. ఒకేసారి తోడేళ్ళు ఏనుగు శరీరంలోకి ప్రవేశించాయి మాయారూపంతో...
దానితో ఆ ఏనుగు రెచ్చిపోయింది. దుష్టశక్తి ఆవహించినట్టు ఊగిపోయింది. యువరాణిని చూడగానే నేలమీద కూచొని ఉండిపోయన పట్టపుటేనుగు మదపుటేనుగుగా మారింది. తన రెండు కాళ్లను క్రోధంతో పైకెత్తింది.
సైనికులను తన పద ఘట్టనలతో ప్రాణాలను హరిస్తుంది, భయంకరమైన ఘీంకారంతో కోసల రాజ్యం వణికిపోయింది.
యువరాణి సహస్రదర్శిని చూసింది.. తన ముందర కాళ్లకు పైకెత్తింది.
ప్రమాదాన్ని ఊహించిన చెలికత్తె రక్షించండి అంటూ ఆర్తనాదాలు చేసింది.
రక్షించండి.. విజయుడికి సమాచారాన్ని అప్పటికే చేసింది.
ఏమాత్రం ఆలస్యమైనా యువరాణి ప్రాణాలు గాలిలో కలిసిపోవడానికి సిద్ధంగా వున్నాయి.
ఊహించని హఠాత్ పరిణామాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తుంది.. పెంపుడు ఏనుగులా వుండే గజేంద్రుడి వింత ప్రవర్తనకు ఖిన్నురాలైంది. కింకర్తవ్యము అని ఆలోచిస్తుంది.
తన ఇష్టదైవం అయిన పరమేశ్వరుని ప్రార్థించింది.
‘మా యువరాణిని కాపాడే వీరుడే లేడా?’’ చెలికత్తె మనసు రోధిస్తోంది.
అప్పుడు కదిలాడు విజయుడు మెరుపువేగంతో...
రెండు కాళ్లను పైకి లేపి యువరాణిని అంతం చేయాలనీ ప్రయత్నించిన ఏనుగును ఎదుర్కొన్నాడు విజయుడు.
ఒక్క ఉదుటున యువరాణిని పక్కకు నెట్టాడు.
గాల్లోకి ఎగిరాడు... ఏనుగు కుంభస్థలం మీద తన కరవాలాన్ని అంకుశంలా దించాడు. మరోసారి గాల్లోకి ఎగిరి ఏనుగు కుంభస్థలంపైకి దుమికాడు.
అప్పటివరకూ రెచ్చిపోయిన ఆ మదపుటేనుగు భయంతో నేలమీద కూచుండిపోయింది.
ఒక్క గెంతులో కిందికి దూకి యువరాణి సహస్రదర్శిని వున్నచోటుకు వెళ్ళాడు. భయంతో అలానే చూస్తోంది.

-సశేషం

- శ్రీ సుధామయి