డైలీ సీరియల్

యువర్స్ లవ్వింగ్లీ...11

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కావచ్చు. కానీ ఆ రోజు భరణి గెస్ట్‌హౌస్‌కి వచ్చే సమయానికి వాచ్‌మెన్ అక్కడ లేకపోవడం మాత్రం యాదృచ్ఛికం కాదు. ఎవరో కావాలనే ఆ సమయానికి అతడు అక్కడ ఉండకుండా ప్లాన్ చేసారు’’
‘‘ఎలా చెప్పగలుగుతున్నారు?’’
‘‘తిరుపతయ్యకి ముందు రోజు బిగ్‌బజార్ నుంచి ఫోన్ వచ్చింది. అతడు వేసిన కూపన్‌కి బహుమతి వచ్చిందనీ, మర్నాడు ఫలానా సమయానికి వచ్చి బహుమతి తీసుకోమని. అది తీసుకోవడానికే వెళ్లాడు అతడు ఆ రోజు. తీరా అక్కడికి వెళ్ళాక తెలిసింది అది ఫేక్ ఫోన్ కాల్ అని. ఆ విషయాన్ని నిర్థారించుకుని అతడు తిరిగి గెస్ట్‌హౌస్‌కి వచ్చేసరికి భరణి రావడం, చనిపోవడం జరిగిపోయాయి.’’
‘‘అవునా?!’’ అన్నాడు రవీంద్ర ఆశ్చర్యంగా.
‘‘అవును. తిరుపతయ్యతో మాట్లాడాక నేను బిగ్‌బజార్‌కి ఫోన్ చేసి కనుక్కున్నాను. ఆ కూపన్ల డ్రా వాళ్ళు ఇంకా తియ్యలేదని చెప్పారు’’.
‘‘ఒక సహజ మరణం వెనుక ఇన్ని అనుమానాలు రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడేం చేద్దాం?’’ అన్నాడు రవీంద్ర.
‘‘ముందర భరణి క్లోజ్‌ఫ్రెండ్స్ శ్రీను, రాజులతో మాట్లాడాలి. వాళ్ళు ఎక్కడ ఉంటారు?’’ అడిగాడు పాణి.
***
ప్యారడైజ్ ఆన్ వీల్స్...
మధ్యాహ్నం పూట కావడంతో జనం పెద్దగా లేరక్కడ. కాలేజీలు ఎగ్గొట్టి వచ్చిన అమ్మాయిలూ అబ్బాయిలే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఒక మూలగా ఉన్న టేబిల్ దగ్గర కూర్చున్నారు వాళ్ళు. భరణి అంత్యక్రియలు జరిగి అప్పటికి మూడు గంటలు కావస్తోంది. స్మశానం నుంచి డైరెక్టుగా అక్కడికి వచ్చేసినట్లు ఉంది వాళ్ళ వాలకం చూస్తుంటే. స్నేహితుడ్ని పోగొట్టుకున్నామన్న బాధ, దుఃఖంకన్నా, అంతకుమించిన భావమేదో వాళ్ళ మనసుల్ని డిస్ట్రబ్ చేసినట్టుగా వున్నాయి వాళ్ళ ముఖాలు.
‘‘్భరణి మీ క్లోజ్ ఫ్రెండా?’’
‘‘అవును. భరణీ, వీడూ నేనూ కాలేజీలో ఒకే రోజు చేరాం. మొదటిరోజు మా పరిచయం మాకింకా గుర్తుంది. ఆ రోజునుంచీ ఎప్పుడూ మేము ముగ్గురం కలిసే వుండేవాళ్ళం. తరువాత కాలేజీలో స్టూడెంట్ యూనియన్‌కి నాయకుడయ్యాడు. అతడి సర్కిల్ పెరిగింది. అయినా కూడా భరణికి ఎంతమంది స్నేహితులున్నా మమ్మల్ని ప్రత్యేకంగా చూసేవాడు’’ అన్నాడు శ్రీను.
‘‘మీ క్లోజ్ ఫ్రెండ్ చనిపోతే, చనిపోయిన రోజే మీరిలా పబ్బుకి రావడం విచిత్రంగా ఉంది’’ వాళ్ళ ముఖాల్లోకి పరిశీలనగా చూస్తూ అన్నాడు పాణి.
‘‘్భరణికి ఈ పబ్బన్నా, ఈ ప్లేసన్నా చాలా ఇష్టం. మేము ముగ్గురం కలిసి ఇక్కడ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అతడి జ్ఞాపకాలని తల్చుకోవడానికే ఇవాళ మేము ఇక్కడికి వచ్చాం. మరో విషయం- మేము రేపట్నుంచీ మళ్లీ రమ్మన్నా ఇక్కడికి రాము’’ అన్నాడు శ్రీను.
‘‘ఎందుకు?’’
‘‘అది భరణి జీవితం మాకు నేర్పిన పాఠం’’ ఈసారి రాజు అన్నాడు.
‘‘కొంచెం వివరంగా చెబుతారా? అసలు భరణి ఎందుకు చనిపోయాడు? నిన్నటిదాకా సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా వున్న భరణి హఠాత్తుగా చనిపోవడానికి కారణమేమిటి? మీకెవరిమీదైనా అనుమానం ఉందా?’’
‘‘ఎందుకు సార్? ఇదంతా ఎందుకు మేం మీకు చెప్పాలి?’’ పాణి మాటలు పూర్తికాకముందే ఆవేశంగా, విసుగ్గా అన్నాడు రాజు.
‘‘తెలుసుకోవడానికి’’ అన్నాడు.
‘‘తెలుసుకుని ఏం చేస్తారు?’’
‘‘్భరణి మరణం వెనుక ఏదో మిస్టరీ ఉంది. దాన్ని ఛేదించాలి. మీకు ఎస్సై రవీంద్ర చెప్పలేదా? నేను భరణి కేసుని ఇనె్వస్టిగేట్ చేస్తున్న డిటెక్టివ్‌ని’’ వాళ్ళ వంక విచిత్రంగా చూస్తూ అన్నాడు పాణి.
‘‘కేసుని పరిశోధించి, మిస్టరీ ఛేదించి ఏం చేస్తారు మీరు? ఏమీ చెయ్యలేరు! ఏమీ చెయ్యలేని దానికి తెలుసుకోవడానికి మాత్రం దేనికి?! సార్, అనవసర ప్రయాస. మాని హాయిగా ముంబయి తిరిగి వెళ్ళి ఏ హత్య కేసులో, దొంగతనం కేసులో పరిశోధించుకుంటూ మీ పని మీరు చేసుకోండి సార్’’
పాణి చిన్నగా నవ్వాడు ‘‘్భరణిది కూడా హత్య కేసే కదా?’’ అన్నాడు.
ఒక్క క్షణం షాక్ తిన్నట్టుగా చూస్తూ ఉండిపోయారు వాళ్ళిద్దరూ ఆ మాటకి. మరుక్షణమే తేరుకుని అన్నాడు రాజు ‘‘పోస్టుమార్టమ్ రిపోర్టు చూసారు కదా? దాన్ని చూసిన వాళ్ళెవరైనా భరణిది హత్య అంటారా?!’’
‘‘నిజం రిపోర్టులలో బయటపడదు. పరిశోధనలోనే నిగ్గు తేలుతుంది’’
పాణి తమని వదిలేలా లేడన్న విషయం అర్థమైంది వాళ్ళిద్దరికీ. లేచి నిలబడి అతడికి రెండు చేతులతో నమస్కరిస్తూ అన్నారు ‘‘మాకే నిజమూ తెలియదు. మమ్మల్ని వదిలేయండి. మాకు తెలిసినంత వరకూ మీరు కూడా ఈ కేసును పరిశోధించి సాధించేదేమీ లేదు. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడకండి’’.
స్నేహితుడ్ని పోగొట్టుకున్నామన్న బాధ, దుఃఖం కన్నా మించిన భావేమేదో వాళ్ళ మనసుల్ని డిస్ట్రబ్ చేసినట్టుగా వున్నారని మొదటిచూపులోనే తనకి అనిపించడం గుర్తొచ్చింది పాణికి. ఆ భావం ఏమిటో అతడికి అర్థమైంది. అది భ..యం.
వాళ్ళ భుజం తట్టి అన్నాడు. ‘‘్భయపడకండి. మీకు చెప్పడం ఇష్టం లేకపోతే మిమ్మల్ని నేను బలవంతపెట్టను. నిజం చెప్పడమనేది ఎప్పుడూ ఒక సాహసమే. అది అందరూ చెయ్యలేరు. నాకు కావాల్సింది నిజం. ఎవరు చెబుతారన్నది నేను పట్టించుకోను. నా పరిశోధన న్యాయం కోసం. అది ఎవరికి అనుకూలం, ఎవరికి వ్యతిరేకం అన్నది కూడా నేను పట్టించుకోను’’.
అతడి మాటలు ఏదో హెచ్చరికలా అనిపించాయి వాళ్ళకి. బయటికి నడుస్తున్న పాణివంక అలా నిశ్చలంగా చూస్తూ ఉండిపోయారు ఇద్దరూ.
***
సమయం ఉదయం తొమ్మిది గంటలౌతోంది.. ఇంటినొదిలి ఒంటరిగా బయటికి అడుగుపెట్టిన అమ్మాయిల్నీ, అబ్బాయిల్నీ చుట్టుముట్టే రకరకాల ఆలోచనల్లా నగర వీధుల్లో ట్రాఫిక్ అప్పుడప్పుడే చిక్కబడుతోంది. ఉదయపు నీరెండ నల్లటి తార్రోడ్డుమీద ఎర్రగా ప్రతిఫలిస్తోంది.

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ