డైలీ సీరియల్

జ్వాలాముఖి.. మంత్రాలదీవి-22

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడే రాయంచ గొంతు వినిపించింది... వీని తిరిగి చూసాడు. రాయంచ విజయుడిని సమీపించింది.
‘‘యువరాజు అటుకాదు. ఇటువేపు... దారితప్పిపోవు చున్నారు’’. రాయంచ మాటలు విని ఆశ్చర్యపోతూ ‘‘నేను దారితప్పి వెళ్తున్నానా? మనం వెళ్లవలసిన దారి ఇదేకదా? అడిగాడు యువరాజు విజయుడు.
‘‘కాదు యువరాజా.. పొరపాటుపడ్డారు... వామహస్తం వైపు వెళ్ళవలె’’ చెప్పింది రాయంచ.
పంచకల్యాణి అటువైపు తిప్పాడు. పంచకల్యాణి కదలలేదు... యువరాజు పంచకల్యాణి వైపు చూసి ‘‘నీకు ఏమైనది... అలసిపోయావా?’’ అంటూనే సమయం లేదు పంచకల్యాణి.. ముందుకు కదులు’’ అంటూ కాస్త కటువుగానే అన్నాడు.
పంచకల్యాణి విజయుడు చెప్పిన మార్గంవైపు కదిలింది.
మిత్రమా యువరాణిని క్షేమంగా సరిహద్దులు దాటించావు కదా?’’ అడిగాడు రాయంచను
‘‘దాటించాను దాటించాను’’ చెప్పింది రాయంచ.
‘‘నీ చిలుక పలుకులు కరుకుగా వున్నాయి.. ఏమైనది మిత్రమా..’’ పరిశీలనగా చూస్తూ అడిగాడు రాయంచను.
రాయంచ ఆ మాటలు విననట్టు పంచకల్యాణికి దారిచూపిస్తూ వెళ్తోంది.
చాలా ఇరుకైన దారి.. కీకారణ్యం... పంచకల్యాణి వేగం తగ్గింది. విజయుడు గాల్లో ఎగురుతూ తమకు దారిచూపిస్తోన్న రాయంచను చూసి ‘‘మనం దారి తప్పడం లేదు కదా?’’ అన్నాడు.
అపుడు రాయంచ సమాధానం చెప్పకుండా కాస్త ముందుకు వెళ్ళింది. అప్పటికే పెద్దశబ్దంతో మెరుపులు మెరిసాయి. రాయంచ శరీరం గాల్లో గిర్రున తిరుగుతూ కపాలకుండగా మారింది.
‘‘హహహ... చిక్కినావురా చిన్నవాడా... నీ మరణం నా చేతిలో... చూసితివటరా... నినె్నలా మాయచేసి తెచ్చితినో’’అంటూ పెద్దపెట్టున నవ్వాడు.
‘‘ఓసీ మాయావి.. ఇందులో నీ తెలివి ఏమున్నదిరా’’. నువ్వు మా రాయంచవు కాదని నాకు తెలుసు. నీ మాయావేషం నీ టక్కుటమారా విద్యలు చూద్దామనే నిన్ను రాయంచగా నమ్మినట్టు వచ్చాను..
నన్ను పసికట్టావా?’’ కపాలకుండ ఆశ్చర్యపోతూ అడిగాడు.
‘‘మా రాయంచ గొంతు అతి మధురం.. తాను నన్ను మిత్రమా అని సంబోధిస్తుంది.. మా పంచకల్యాణి తల భాగమే తన సింహాసనం. నిన్ను చూసి ఎప్పుడూ తడబడని పంచకల్యాణి తడబడింది... మాటలతో నువ్వేమీ చేయలేవురా...’’
కపాలకుండ మొహం అవమానభారంతో ఎర్రబడింది..
‘‘నీకు తగిన శాస్తి చేస్తాను కాచుకో’’అంటూ కపాలకుండ... సర్పాన్ని పిలిచాడు. మరుక్షణమే అతి పొడవైన సర్పం విజయుడి ముందు నిలబడింది... నిలువెత్తు సర్పం..
‘‘వెళ్ళు ఎదురుగా వున్న శత్రువుని నీ విషపు కోరలతో కాటువేయి.. నీ కోరల్లోని పాషాణం అతని శరీరంలో వెళ్ళిపోవాలి...’’ ఆజ్ఞాపించాడు కపాలకుండ.
ఆ సర్పం విజయుడివైపు వచ్చింది.
* * *
ఒక్కసారి ఆ సర్పం గాల్లోకి ఎగిరింది.. విజయుడు కరవాలాన్ని గాల్లోకి విసిరాడు.. విచిత్రంగా ఆ కరవాలం అదృశ్యమైంది. సర్పం విజయుడి మెడను చుట్టుకుంది. విజయుడు తన శక్తినంతా ఉపయోగించి ఆ సర్పాన్ని తన శరీరంనుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. క్షణక్షణానికి ఆ సర్పం తన పట్టుబిగిస్తుంది.
ఓవైపు పోరాడుతూనే విజయుడు తీక్షణంగా ఆలోచిస్తున్నాడు. తన కరవాలం ఎలా అదృశ్యమయింది.?
అదే సమయంలో యువరాణి సహస్రదర్శినిని అడవి సరిహద్దులు దాటించి రాయంచ విజయుడిని వెతుక్కుంటూ ముందుకువెళ్లి తన మిత్రుడు కనిపించకపోవడంతో ఆకాశంలో విహరిస్తూ అదృశ్యవనంలోకి ప్రవేశించింది అనుమానంతో.
రాయంచ అనుమానం నిజమైంది. అక్కడ తన మిత్రుడు సర్పంతో పోరాడడం చూసింది. సర్పం చేతిలో విజయుడి మరణం తథ్యం అనే నిశ్చింతతో కపాలకుండ తన భారీ కాయాన్ని చెట్టుకుచేర్చి కునుకు తీస్తున్నాడు.
రాయంచ విజయుడి దగ్గరికి వచ్చింది. సర్పంతో ప్రాణాలొడ్డి పోరాడుతోన్న మిత్రుడిని చూసింది. రాయంచ ఒక క్షణం యోచించింది. ఆకాశంవైపు చూసింది. రాయంచ మొహంలో వెలుగు.. ఆకాశంలో ఒక గరుడ పక్షి... ఉత్తమ జాతికి చెందిన గండభేరుండ పక్షి కనిపించింది.
వెంటనే గాల్లోకి ఎగిరింది.
* * *
విజయుడు బలాన్ని ఉపయోగించి తన శరీరానికి చుట్టుకున్న సర్పాన్ని వేరుచేసి గాల్లోకి విసిరేసాడు. తన కరవాలంకోసం వెతికాడు. ఇప్పుడు కరవాలాన్ని వెతకడంకన్నా సర్పాన్ని ఎదుర్కోవడమే అవశ్యం అనుకున్నాడు. -సశేషం

- శ్రీ సుధామయి