డైలీ సీరియల్

జ్వాలాముఖి.. మంత్రాలదీవి-30

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయుడు గురుదేవుడిని స్మరించి అస్త్రాలను ప్రయోగించాడు. ఒక్కో అస్త్రం ఒక్కో ప్రాణాని సంహరించింది. వకృటాసురుడు పట్టరాని కోపంతో ఊగిపోయాడు. మంత్రదండాన్ని తన తలకు తాటించి గాల్లోకి విసిరాడు. ఒక్కసారిగా వకృటాసురుడు గుహమొత్తం తానే అయిపోయాడు. వకృటాసురులు ప్రత్యక్షమయ్యారు.
ఒకే సమయంలో చుట్టూ వకృటాసురులే... ముందు ఎవరిని సంహరించాలి.. ఎలా సంహరించాలి...? ఒక వకృటాసురుడిని ఎదుర్కొనే లోగా మరో వకృటాసురుడు వెనుకనుంచి దాడి చేస్తున్నాడు.
గుహ వకృటాసురుడి వికటాట్టహాసాలతో దద్దరిల్లిపోతుంది. గుహలో బంధించబడ్డ శక్తులు భయం భయంగా పోరాటాన్ని చూస్తున్నాయి.
విజయుడు ఏమాత్రం అలిసిపోకుండా పోరాడుతున్నాడు.
మత్స్యగంధి ఇచ్చిన వరం గుర్తొచ్చింది. మనసులో మత్స్యగంధిని స్మరించాడు. మరుక్షణం విజయుడి ప్రతిరూపాలు ప్రత్యక్షమయ్యాయి.
వకృటాసురుడి ప్రతిరూపాలకు సరిసమానంగా.
పోరు భీకరంగా సాగుతుంది. మాంత్రికుడు వామ భుజాన్ని మీద ఒకే వేటుతో శరీరం నుంచి వేరుచేయాలి. అయితే వకృటాసురుడి నిజరూపం కనిపెట్టడం ఎలా? అన్నిరూపాల్లో నిజరూపం వామభుజానే్న శరీరంనుంచి వేరుచేయాలి. శిలలా రాయిలావున్న ఆ భుజాన్ని కనిపెట్టాలి. ఒకే ఒక వేటుతో శరీరంనుంచి వేరుచేయాలి. రాయంచ వైపు చూసాడు విజయుడు. తన మిత్రుడి భావం అర్ధమైంది.
ఒకవైపు పోరాటం సాగుతూనే వుంది. రాయంచ వకృటాసురుల వామహస్తాల మీద వాలడం మొదలుపెట్టింది.
వకృటాసురుడి దృష్టి విజయుడి మీద వుంది. వామహస్తాలు అన్నీ సున్నితంగా వున్నాయి. ఒక వామహస్తం శిలవలే వుంది. తన ముక్కుతో పొడిచి చూసింది. తన ముక్కే గాయపడింది. రాయంచ నిజ రూపమైన వకృటాసురుడి భుజంమీద వాలి విజయుడికి సైగచేసింది.
విజయుడు తన జలఖడ్గాన్ని పైకిలేపాడు. తాను కోరుకున్న దిశలో ప్రయాణించడానికి సర్పముఖి ఇచ్చిన వరాన్ని ప్రయోగించాడు.
‘‘వకృటాసురా ఈరోజుతో నీ ఆయువుతీరింది కాచుకో’’అన్నాడు కరవాలాన్ని గాల్లోకి విసరి.
వకృటాసురుడు వామహస్తాన్ని విస్మరించి విజయుడిని ఎదుర్కోవడానికి మంత్రదండాన్ని గాల్లోకి లేపాడు. అదే సమయంలో జలఖడ్గం వకృటాసురుడి వామహస్తాన్ని ఒకేవేటుతో అతని శరీరంనుంచి వేరుచేసింది. మాంత్రికుడి వామహస్తం యజ్ఞగుండంలో పడి కాలిపోయింది.
గుహ మొత్తం ఊగిపోయింది.. క్రమక్రమంగా నేలమట్టం అవుతుంది.
గుహలో బంధించబడినవారు విముక్తులు అయ్యారు.
క్షణాల వ్యవధిలోనే మంత్రాలదీవి నామరూపాలు లేకుండా భూస్థాపితం అయ్యింది.
వికృతకాంక్షతో విశ్వవినాశనాన్ని కోరుకున్న వకృటాసురుడు భూస్థాపితమయ్యాడు.
* * *
జ్వాలాముఖీదేవి గుహ శిరస్సుభాగం గుహనుంచి వెలుపలికి పొడుచుకు వచ్చింది.
రెండు చేతులు జోడించాడు విజయుడు.
‘‘తల్లీ జ్వాలాముఖీదేవి... నీ చల్లని చూపుల దీవెనలు మాకు కావాలి. మామీద నువ్వు కనె్నర్రచేస్తే మేము భరించగలమా. నిన్ను ప్రసన్నం చేసుకునే శక్తి నువ్వే మాకివ్వాలి... అని రాయంచవైపు చూసి... ‘‘మిత్రమా ఇదే నువ్వు నాకు చేయవల్సిన చిట్టచివరి సాయం, నువ్వు గరుడపక్షి చేసిన సాయాలు మర్చిపోలేను’’ అన్నాడు. -సశేషం

- శ్రీ సుధామయి