డైలీ సీరియల్

పచ్చబొట్టు-4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెల్లిని హాస్పిటల్ దగ్గర దింపేసి స్టేషన్‌కి బయలుదేరాడు.
ఆ దారిలో కనిపించే ‘విద్యాలయ స్కూల్’అంటే అతనికి ప్రత్యేక ఇష్టం.
అసలే చదువన్నా, చదువుచెప్పే మాస్టర్లనా, చదువు నేర్పించే విద్యాలయాలన్నా ఎంతో గౌరవం. కానీ ఈ స్కూల్‌ను చూసినప్పుడు మాత్రం అతని హృదయంలో స్పందన మొదలవుతుంది. ఆత్మీయత పెల్లుబుకుతుంది. ఆ అందమైన వాతావరణమా, ఆ స్కూలుకున్న మంచి పేరా? ఏమో! అతనికే అర్ధంకాదు. ఆ స్కూలుదగ్గరికి వచ్చేటప్పటికి దానికి ఏదో తెలిసినట్లే బండి స్లోఅవుతుంది. మళ్ళీ అది దాటగానే మామూలే! ఇంట్లో పొందే అనుభూతి ఇక్కడెందుకొస్తోందా అన్న ప్రశ్న రోజూ వేసుకోవటం అతనికి అలవాటుగా మారిపోయింది. ఈ ప్రశ్నకు జవాబు ఎప్పుడు దొరుకుతుంది? అసలు దొరుకుతుందా? లేదా? ఏమో! భవిష్యత్తు ముందే తెలిస్తే ఈ మనిషి ఇలా భూమిమీద నిలబడతాడా? ఇంకా ఎనె్నన్ని ఘోరాలు జరుగుతాయో? తన ఊహకి తనకే నవ్వువస్తోంది. స్టేషన్ రావటంతో బ్రేక్ వేసాడు. బండిని పార్క్‌చేసి లోపలికి వెళ్ళాడు. స్టేషన్ బయటగూడా గుంపులుగుంపులుగా జనం. రోజూ ఏదో కేసులో ఎవరోఒకరు వస్తూనే ఉంటారు. ఆ దృశ్యం మామూలే. కానీ ఈరోజు ఆ సంఖ్య రెట్టింపుఅయ్యింది. ‘పచ్చబొట్టు’ ప్రభావం అయి ఉంటుంది.
హెడ్ కాన్‌స్టేబుల్ ‘హరనాథ్’ సెల్యూట్ చేశాడు. అది అందుకుంటూనే వెళ్ళి తన సీటులో కూర్చున్నాడు. ఇక అక్కడికి వెళ్ళాక ఆ ప్రపంచమే వేరు.
‘‘ఏమన్నా ఫోన్స్ వచ్చాయా?’’ అడిగాడు హరనాథ్‌ని.
‘‘ఆగకుండా ఒకటే ఫోనులు సార్! పచ్చబొట్టు సంగతి మీకేమయినా తెలుసా? మీ యస్సైగారు ఎన్నింటికి వస్తారు?’’ అని.
‘‘సరే! నువ్వెళ్ళి నీ పని చూసుకో అంటూ ఆరోజు డ్యూటీలు ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏమేమి చెయ్యాలో వేసేసి పెండింగ్ ఫైల్స్‌ఏమైనా ఉన్నాయేమో చూసుకున్నాడు. ఏమీ కనిపించలేదు. డ్యూటీ ఫైల్‌ను రైటర్ రంగనాథంకి పిలిచి అప్పగించి ఏంచెయ్యాలో చెప్పాడు.
అతనూ అంతే. పనిలో పెండింగ్ నచ్చదు. తనచుట్టూ వారిని కూడా ఆ విషయంలో తనలాగే ఉండాలని స్ట్రిక్ట్‌గా ఆర్డర్ చేస్తాడు.
స్ట్ఫాంతా తనకి అనుకూలంగా ఉండటంతో డ్యూటీలన్నీ సక్రమంగా జరుగుతాయని తన స్టేషన్‌కి మంచి పేరువచ్చింది. ఆ పేరును అలా నిలబెట్టాలన్నదే తన తాపత్రయం.
పోలీసులంటే లంచం తీసుకొని తప్ప పనిచెయ్యరని ప్రజల అభిప్రాయం. ఏదయినా కేసు రాగానే ఎంత అంటే అంత ఇవ్వడానికి సిద్ధపడిపోతారు. ముందు ఆ ఆనవాయితీని అరికట్టాడు. ప్రజలలో పోలీసుల పట్ల మంచి అవగాహన ఏర్పడాలంటే ముందు మనలో నిజాయితీ వారికి కనిపించాలి అని చెబుతాడు. అది మీకేకాదు నాకు నేనే ప్రతిరోజూ చెప్పుకొనే పాఠం అని తన క్రిందవారిని దండించవల్సిన చోట దండిస్తూ, గౌరవించాల్సిన చోట గౌరవిస్తూ అది ఒక స్టేషన్‌లాకాక ఒక కుటుంబం, ఒక ఇల్లు. దీని బాధ్యత మనందరిదీ అన్న ఫీలింగ్ తన క్రిందవారికి రప్పించటంలో అతను కృతకృత్యుడయ్యాడు. తక్కువ కాలంలోనే మంచి ఎస్సైగా పలువురితో ప్రశంసించబడ్డాడు. అయినా అతనికి సంతృప్తి ఉండదు. చేసినకొద్దీ ఇంకా ఇంకా చెయ్యాలనిపిస్తుంది.
కానీ ఈరోజుమాత్రం ఎడతెరిపిలేని వానలా పోను రింగవుతూనే ఉంది. కారణం ఒకటే సమాధానం ఒకటే. విసుగు, విరామం లేకుండా సమాధానమిస్తూనే ఉన్నాడు.
***
‘‘ఏరా అన్నయ్యా! ప్రొద్దున నా చేతిలోంచి పేపరు లాగేసుకున్నావ్. పోనీ విషయమన్నా చెప్పావా? లేదు. ఇక హాస్పటల్‌కి వెళ్ళిన దగ్గరనుంచీ ఒకటే డిస్కషన్స్. నాకు పిచ్చి ఎక్కినట్లయింది. ఇన్నాళ్ళకు పేపరు చదివి వెళ్ళలేదే అని బాధ అనిపించింది. అరె! నొప్పులు పడుతున్న ఆవిడ కూడా అంత బాధలో కూడా ‘‘ఎవరో పచ్చబొట్టు అంటమ్మ ఆవిడ కబురు పేపరులో ఏటి రాసుందో చెప్పు డాటరమ్మా’’అని అడుగుతుంటే నవ్వాలో ఏడవాలో అర్థంకాలేదు.
‘‘ఇప్పుడది అవసరమా?’’ అని అడిగితే.

‘‘ఆడోళ్ళను ఉద్ధరించేవాళ్ళు అవతరిస్తుంటే మనకికాక ఇంకెవరికి అవసరముంటుంది. తల్లీ.. అబ్బా... అమ్మా... ఈ నొప్పి తట్టుకోలేక పోతున్నాను. మత్తు ఇంజెక్షన్ పడెయ్యి డాటరమ్మా... అబ్బా... అమ్మా... అమ్మా... ఆపరేషను థియేటర్‌కి తీసుకెళ్ళేలోపు పేపరు చదివేసి పచ్చబొట్టు గురించి కాస్త వినుపించమ్మా’’అని ఆమె బ్రతిమాలుతుంటే ఆ విషయం వినకపోతే ఆమెకి డెలివరీ అవదేమో అని పేపరుకోసం చూస్తే.. అది అలా పాసింగ్ బాల్‌లా తిరుగుతోంది. బయటకు పంపితే అన్ని పేపర్లు అయిపోయాయని. చివరకు ఎలాగో సంపాదించి ఆవిడకు వినిపించాను. దానికోసమా అన్నట్లు వెంటనే ఆమెకు సుఖప్రసవం జరిగింది.’’
బిడ్డను కన్నానన్న ఆనందంకంటే పచ్చబొట్టు గురించి విన్నానన్న సంతోషమే ఆమె కళ్ళలో ఎక్కువ కనిపించింది. ప్రపంచంలో మాతృత్వాన్ని మించినది లేదంటారే! అలాంటిది ఒక్కరోజులో ఈ ‘పచ్చబొట్టు’ ఎలా ఇంత స్థానం సంపాదించుకుందో అర్థంకాలేదురా! అసలు ఎవరు ఆ పచ్చబొట్టు. అమ్మాయా? అబ్బాయా?
వౌన శ్రోతల్లా వింటున్నారు తండ్రీ కొడుకులు.
నిజమే. కొన్నప్పుళ్ళు మాటరాని వౌనం నిశ్శబ్దమై రాజ్యమేలుతుంది. ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది.
‘‘అమ్మేమో!’’ పరుగెత్తుకెళ్ళింది విద్య.
పాలబ్బాయి...
నిరాశగా వెనుతిరిగింది. లోపలికి వెళ్ళి గినె్న తీసుకువచ్చి పాలు పోయించుకుంది. అదంతా ఒక కంట గమనిస్తూనే ఉన్నారు ఆయన.
భార్య వస్తాననటం.. అనుకోకుండా వదినగారు స్నానాల గదిలో కాలు జారి మంచం మీదనుంచీ దిగలేని పరిస్థితులలో పడటంతో ఉండలేక.. రాలేక ఆమె మధనపడటం.. ‘‘తప్పనిసరి పరిస్థితిగదా. ఉండిపో. సుఖాలలో మనం ఉన్నామాలేమా అని ఎప్పుడూ ప్రశ్నించుకో అక్కరలేదు. కష్టాలలో ఉన్నప్పుడే ‘నేనున్నానని’ భుజం తట్టడానికి మనం ఉండాలి. కాకపోతే విద్య నీమీద బెంగ పెట్టుకుంది. ఒక్కసారి ఫోనులో పలకరించు. ప్రయాణం వాయిదాపడిందని చెప్పు. ఆలస్యమవుతుందని మాత్రం చెప్పకు. దాని సున్నిత హృదయం ఒక్కసారి తట్టుకోలేదని’’ సలహా ఇచ్చాను.
మనసులోనే ఆయన జరిగినదంతా మననం చేసుకుంటున్నారు.
పాలు పొయ్యిమీదపెట్టి వచ్చి ‘‘నాన్నగారూ! అమ్మ నేను వచ్చేటప్పటికి ఇంట్లో ఉంటుందన్నారు. లేదేం?’’
చిన్నపిల్ల చాక్‌లేట్ తెస్తానని సాయంత్రం తేకపోతే నిలదీసినట్లే ఉంది ఆయనకు.
‘‘ఏం చెప్పాలి? అబద్ధం ఆడద్దు కానీ నిజం చెప్పవద్దని తేలికగా సలహా ఇచ్చాడు. తనదాకా వచ్చేటప్పటికి మాటలు రావటం లేదు.’’
ఇంతలో ఫోన్ రింగయింది. భగవంతుడా! నన్ను రక్షించావు. సత్యవతే అయి ఉంటుంది.
‘వెళ్ళు విద్యా! అమ్మే ఫోనుచేసి ఉంటుంది’. అనటం విద్య వెళ్ళటం ఒకేసారి జరిగాయి.
అప్పుడే చెల్లిని ఏడిపిద్దామనుకున్న అనే్వష్ కూడా ఆత్రంగా ఫోన్ దగ్గరికి వెళ్ళాడు.
‘‘విద్యా!’’ అవతలనుంచీ తల్లి స్వరం.
‘‘అరె! తనే ఎత్తుతుందని అమ్మ ఎలా ఊహించింది?’’
‘‘అమ్మా! నేనే! ఎలా ఉన్నావే? రాలేదేమిటమ్మా. ఈరోజు వచ్చేస్తానని నాన్నగారు చెప్పారు. అక్కడే ఉండిపోతావా ఏం?’’
ఆవిడ సమాధానం చెప్పేలోపే అనే్వష్ ఫోన్ అందుకుని ‘‘అమ్మా! దీనికి నీ మీద బెంగ లేదులే. వంట చెయ్యాల్సి వస్తోందని. నువ్వు వస్తే ఆ పని తగ్గుతుందని’’ అప్పటిదాకా గొంతుదగ్గిర ఆపిన మాటలు బయటకు వచ్చేసాయి.
-సశేషం

-యలమర్తి అనూరాధ 9247260206