డైలీ సీరియల్

పచ్చబొట్టు--5

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అమ్మకు నామీద చాడీలు చెబుతావురా! ఉండు నీ పని చెబుతా. ముందు నన్ను మాట్లాడనీ’’
‘‘అమ్మా! అదలాగే అంటుంది కానీ ఎప్పుడు బయలుదేరుతున్నావమ్మా? నువ్వు లేకుండా ఇంట్లోకి కూడా రాబుద్ధికావటం లేదు. ఇల్లంతా బోసిగా ఉంది. వచ్చెయ్యమ్మా!’’
‘‘అదేంకాదు లేమ్మా! నాకు పెళ్ళి చేసెయ్యండి అని పరోక్షంగా చెబుతున్నాడంతే!’’
‘‘ఒరేయ్! మీ ఇద్దరూ మాట్లాడుకుంటారా. నాతో మాట్లాడతారా?’’
మనసులో వాళ్ళ మాటలు విని చాలారోజులయిందని మురిసిపోతూనే.
‘‘అమ్మా! నువ్వు ఎప్పుడు బయలుదేరుతున్నావో చెప్పు.’’
‘‘రిజర్వేషన్ అయిపోతుందనుకొని వస్తున్నానని చెప్పాను. అది అవ్వగానే మీకు ఫోన్‌చేసి వచ్చేస్తానుగా. నాన్నగారిని బాగా చూసుకుంటున్నారా?’’
‘‘ఆ! చూసుకుంటున్నానన్మా. మాత్రలు కూడా జాగర్తగా ఇస్తున్నాను. నువ్వు నాన్నగారి గురించేమీ బాధపడక్కర్లేదు.’’
‘‘సరే! నాన్నగారికొక్కసారి ఇవ్వు.’’
‘‘అమ్మ పిలుస్తోంది నాన్నగారూ!’’
‘‘అన్నీ దానికి చెప్పాను. మీ ఆరోగ్యం జాగ్రత్త. మరి ఉండనా.’’
‘‘అలాగే’’అని ఫోన్ పెట్టేసారు.
‘‘గట్టిగా రమ్మని చెప్పాల్సింది’’ ఉండబట్టలేక అంది విద్య.
‘‘మీరిద్దరూ చెప్పారు కదమ్మా! అది మాత్రం మనల్ని విడిచి ఎప్పుడయినా ఉందా? ఇంకా ఇక్కడ మనం ముగ్గురం. పాపం అక్కడ అది ఒక్కటే.’’
ఆ మాటల్లో ఎంతో దిగులు. పిల్లలముందు బయటపడ కూడదనుకుంటూనే అనాలోచితంగా ఆ మాట వచ్చేసింది.
ఆయన బాధపడుతున్నారని గ్రహించి ‘‘నాన్నగారూ! నేను వెళ్ళి అమ్మను తీసుకొని వచ్చెయ్యనా?’’ అడిగాడు అనే్వష్.
‘‘వద్దులేరా! వాళ్ళక్కడ ఎక్కిస్తారు. మనం ఇక్కడ దించుకుంటాం.’’
‘‘సరే మీ ఇష్టం.’’
వాళ్ళు ముగ్గురిలో అంతులేని దుఃఖం. కానీ ఎవరూ ఎవరికీ దొరికిపోకూడదని తాపత్రయ పడుతున్నా అనుబంధం పంచుకోవటంలో ఒకరిపైన ఒకరు పోటీపడే ఆ కుటుంబంలో ఈ విషయంలో అందరూ ఓడిపోయారు.
భోజనాలయ్యాక ‘‘చెల్లీ! చెస్ ఆడుదాం రా!’’అని పిలిచాడు అనే్వష్.
కాసేపు తల్లిమీద దిగులన్నా పోతుందని ‘‘సరేరా!’’ అంది.
వెంటనే చెస్‌బోర్డు తెచ్చి తనే కాయిన్స్ అన్నీ సర్దాడు.
ఎప్పుడూ తనను ఆ పని చెయ్యనివ్వదు. ఎందుకురా?’’ అంటే అక్కడ స్టేషన్‌లో దొంగలు, దొంగతనాలు, దోపిడీలు, హత్యావార్తలు, హంతకుల మనస్తత్వాలతో పోరాడి అలిసిపోయిన నీ మనసుకి కానీ, శరీరానికి కానీ అలసట ఇంట్లో రానివ్వకపోవటం నా కనీస బాధ్యత అనిపిస్తుంది అంటుంది.
‘‘నువ్వుకూడా అలిసిపోయే వస్తావుగా.’’
‘‘నాది వేరు అన్నయ్యా!’’ నా అలసటకి నీ అలసటకి భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా!’’
‘‘ఏమిటో, కాసేపు విద్యతో అలా మాట్లాడించటం అంటే అతనికి ఎంతో ఇష్టం’’
‘‘్ఫ అన్నయ్యా! తెలిసి కూడా చెప్పించాలని చూస్తావ్.’’
‘‘లేదురా! నిజంగా తెలియదు.’’
‘‘ఆసుపత్రిలో జబ్బులతోపడే బాధవల్ల అరిచే అరుపులు తప్ప మమ్మల్ని మరేమీ డిస్ట్రబ్ చెయ్యవు. వారుకూడా డాక్టరు ఉన్నారంటే ఓర్చుకోవటానికే ప్రయత్నిస్తారు. ఎవరో ఒకరో, ఇద్దరో భయపడకుండా ఏడుస్తారు. వాళ్ళతో నాలుగు మాటలు ఓదార్పుగా మాట్లాడితే చాలు పసిపాపల్లా ప్రశాంతంగా మారిపోతారు.’’
‘‘ఆహా!’’అంటే చాలు ఆపేస్తుంది.
‘‘ఏమిటిరా అన్నయ్యా! ఆడుదామని సర్దేసి, నా ఆట ఆడేసినా నువ్వు కదపలేం?’’
అప్పుడు తెలివితెచ్చుకొని పావులు కదిపాడు.
విద్య అన్యమనస్కంగా ఆడుతోంది. దిగులు పోగొట్టుకుందామనుకుంటే అది ఇంకా ఎక్కువవుతోంది. ఇలా తామిద్దరూ ఆడుతుంటే అమ్మ తమ ప్రక్కన కూర్చుని ‘అలా చెయ్యవే’, ‘ఇలా చెయ్యవే’ అంటుంటే అన్నయ్య ఉడుక్కునేవాడు. ఎప్పుడూ దాని ప్రక్కనేనా నావైపురా అనేవాడు.
‘‘పోరా! నువ్వెప్పుడూ నాతోనే ఉంటావు. అది పెళ్లయితే వెళ్లిపోతుంది’’ అనేది.
‘‘అన్యాయం! అమ్మవి అలా పక్షపాతం చూపించకూడదు. నేనొప్పుకోను. ఒకాట నాకు, ఒకాట దానికి. అలా అయితేనే ఒప్పుకోవటం. లేకుంటే అసలు ఆడనంతే!’’
అమ్మ ‘సరే’ అనేంతవరకూ అలా పోరాడేవాడు.
అసలు ఒక ఆట మించి ఆడే టైమ్ తామిద్దరికీ ఉండదు.
ఏదో అమ్మకోసం అలా దెబ్బలాడుకోవటం ఎంతో సరదాగా ఉండేది.
అనే్వష్ వరుసగా ‘చెక్’ చెప్పేస్తున్నాడు.
‘‘ఏమిటిరా! పచ్చబొట్టు ఆవహించిందా ఏం? ఒకటే చెక్‌లు’’.
‘‘ఆ పచ్చబొట్టు నామస్మరణ వదలరా. ప్రొద్దున నుంచీ వినీ వినీ విసుగువచ్చేసింది’’.
‘‘నీకు అలా ఉందేమో గానీ నాకు మాత్రం ‘పచ్చబొట్టు’ గురించి ఎందెందరో ఊహించుకొని మాట్లాడే మాటలు అలా అలా ఇంకా ఇంకా వినాలనిపిస్తోంది’’.
‘‘అలాగే ఈ రోజు రాత్రంతా అలా కలలు కను. ఎలాగూ నీ ఆట కట్టు అయింది’’.
‘‘నిజమే! తన రాజు ఎటూ కదలలేని పరిస్థితులలో. కనీసం అడ్డువెయ్యటానికి కూడా ఎవరూ లేరు’’.
‘‘ఒప్పేసుకుంటున్నాను ఓడిపోయానని’’ అని పైకి అంది.
‘‘పచ్చబొట్టుకి మాత్రం ఓటమి రానీయకు’’ అని మనసులో అనుకుంది. ఒక్కరోజులో పచ్చబొట్టు తనకి అంత దగ్గిరయింది.
బయటకు అంటే అన్నయ్యకి కోపం వస్తుంది.
‘‘గుడ్‌నైట్ చెల్లీ!’’
‘‘గుడ్‌నైట్‌రా అన్నయ్యా!’’
తన రూమ్‌లోకి వెళ్లి దుప్పటి ముసుగేసుకున్నాడు. ఎంతో హాయిగా, ప్రశాంతంగా ఉంది. బయట వాతావరణమంతా చలి చలిగా ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం. మరో నలభై ఎనిమిది గంటలు రాష్టమ్రంతటా పెనుగాలులు, వర్షసూచన ఉన్నాయని టీవీలో, రేడియోలో ఒకటే ప్రకటనలు.
దుప్పటిలో శరీరం వెచ్చబడటంతో మనసంతా వేడిగా తయారైంది.
ఈ ఒక్కరోజే ఆ సంతోషమని. రేపటినుంచీ ఆలోచనలతో అతని శరీరం, బుర్ర కూడా వేడెక్కిపోతోందని. దానికి ఓ ప్రణాళిక సిద్ధవౌతోందని తెలియదుగా. అందుకే గాఢనిద్రలోకి జారుకున్నాడు.
‘పచ్చబొట్టు’ మాత్రం తన ఉద్యమం ఆగేవరకూ కంటిమీద కునుకు రానివ్వనని తనకు తనే భీష్మణ ప్రతిజ్ఞ చేసుకుంది.
***
సెల్ రింగ్‌కి మెలుకువ వచ్చింది అనే్వష్‌కు.
ప్రొద్దునే్న ఎవరా అనుకుంటూ ఆన్ చేశాడు.
‘‘విద్యాలయ స్కూలు నుంచీ సార్! బావిలో మా స్కూలు పాప శవం తేలింది. మీరు అర్జెంట్‌గా రావాలి సార్!’’
‘‘నిద్రమత్తంతా వదిలిపోయింది. వెంటనే ఎవరెవరికి ఫోన్లు చెయ్యాలో చేసేసాడు. కాస్త నీళ్ళతో ముఖం కడుక్కొని డ్రెస్సు వేసుకొని బయటపడ్డాడు విద్యకి చెప్పి. అంత మొద్దు నిద్రపోయాడేం? ఈపాటికి రెడీ అయి స్టేషన్‌కి వెళ్లిపోయేవాడు. విద్య అయినా లేపలేదేం? పాపం ఈ రోజు విద్య ఒక్కటే వెళ్లాలి ఆసుపత్రికి.

-సశేషం

--యలమర్తి అనూరాధ 9247260206