డైలీ సీరియల్

పచ్చబొట్టు-23

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదో... ఏదో... మమకారం తామిద్దరి మధ్య ఉన్నట్లనిపిస్తోంది. అదేమిటో మాత్రం అతనికి అంతుచిక్కటం లేదు.
పచ్చబొట్టునుంచీ ఫోనూ లేదూ ఉత్తరమూ లేదు. ఈ విషయం తెలియగానే కాల్ చెయ్యాలే! అసలీ మధ్య పచ్చబొట్టు విషయాలే తెలియలేదు. పాత పేపర్లు అన్నీ ముందేసుకొని కూర్చున్నాడు. పనుల హడావిడిలో పడి పేపరును చూడనే లేదు. వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళతో సరిపోయేది. ఇంటికిప్పుడు తనే పెద్దకాబట్టి ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా తను వాళ్ళ ఎదుట ఉండాల్సిందే! అది తను వాళ్ళకిచ్చే కనీస మర్యాద. ఇలాంటి సమయాలలో అది తప్పదు.
‘‘ఈమధ్యలో పచ్చబొట్టు ఏం ఘనకార్యాలు చేసిందో’’అనుకుంటూ పేపర్లు చూడటం ప్రారంభించాడు.
కళ్ళు హెడ్డింగ్స్‌ను చదువుకుంటూ పోతున్నాయి కానీ అవేమీ మైండ్‌కి ఎక్కటం లేదు. అమ్మానాన్నలు ఇద్దరూ ఒకేసారి తమను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. జరగవలసిన కార్యక్రమాల పర్యవేక్షణలో ఇప్పటిదాకా తీరిక చిక్కలేదు. ఇక అంతా ఖాళీనే. దుఃఖంలోంచే వైరాగ్యం పుడుతుందని అందుకే అని ఉంటారు పెద్దలు.
చదవబుద్ధికాక మళ్ళీ పేపర్లుఅన్నీ దొంతరగాపెట్టి ఒక మూలకు నెట్టేసాడు. అత్తయ్య వెళుతూ అన్న మాటలే చెవుల్లో మారుమ్రోగుతున్నాయి.
నాన్నగారి ఏడూరి సూతకాలు అయ్యేలోపు మీరిద్దరూ వివాహం చేసుకుంటే ఆ ఫలం అమ్మానాన్నలకు దక్కుతుంది. మీరు ముహూర్తాలు ఎప్పుడు పెట్టించమంటే అప్పుడు పెట్టిస్తాను’’ అంది అరుంధతి.
‘‘ఏమి ఆచారాలో అమ్మానాన్నలు చనిపోయి పదిహేను రోజులు కాలేదు. అప్పుడే తమకు పెళ్ళి ఆలోచనా? వాళ్ళ చేతులమీద పెళ్ళిచేయించుకొనే అదృష్టాన్ని కూడా తాము నోచుకోలేదు. ఎంత దురదృష్టవంతులం. మా పెళ్ళిళ్ళు మేమే చేసుకోవాలా? మా పెళ్ళి గురించి, కోడలు, అల్లుడి గురించి అమ్మా, నాన్న ఎన్ని కలలుకన్నారు? విద్య పెళ్ళిపేరుచెప్పి అమ్మ నన్ను ఎంత ఉడికించేది. అవన్నీ స్వప్నాలుగా మారిపోయాయి.
‘‘ఇప్పుడు తమకా ఉద్దేశంలేదని, ఇంకా టైము ఉంది కాబట్టి ఆలోచించుకుంటాంలే అత్తయ్యా!’’ అని తెలివిగా తప్పించుకున్నాడు.
ఆమెకున్న ఒక్కగానొక్క కూతురిని అనే్వష్‌కివ్వాలని ఆమె తాపత్రయం. తనకి మేనరికపు పెళ్ళిళ్ళు అంటే సదభిప్రాయం లేదు. ఆవిడ కొడుకుకు విద్యను ఇస్తామని తామే వెళ్ళి అడుగుతామని ధీమా!
విద్యకూడా తనలాగే అభిప్రాయపడటంతో ఇప్పటికి ఆ ఆలోచనకు ఫుల్‌స్టాప్ పెట్టేసాడు.
తమ ప్రయాణం దగ్గరపడటంతో నానమ్మ ప్రక్కన చేరారు ఇద్దరూ.
‘‘నానమ్మా! ఇక మీరు ఇక్కడ ఎందుకు? మాతోపాటూ వచ్చెయ్యండి. మాకు మీరున్నారన్న తృప్తిమిగల్చండి’’ అన్నాడు అనే్వష్.
‘‘అవును నానమ్మా! మీరు రానంటే అసలు మాకు వెళ్ళాలనిపించటం లేదు’’ అంది విద్య.
‘‘ఆ పని చెయ్యండర్రా! నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఉంటున్నానన్న బాధ తప్పుతుంది. శుభ్రంగా ఇద్దరూ ఇక్కడకు ట్రాన్సఫర్ చేయించుకుని వచ్చెయ్యండి. అందరం ఇక్కడే కలిసి ఉండవచ్చు.’’
‘‘అంతేగానీ నువ్వు మాతో రానంటావ్?’’
‘‘లేదురా కన్నలూ! నాకు మీతో రావాలనే ఉంది. కానీ ఈ గడ్డ వదిలి ఏనాడూ నేను బయటకి కదలలేదు. మీ తాతయ్య ప్రాణం పోయినచోటే నేనూ కన్నుమూయాలి. నా ఊరు అనే మమకారం ఇప్పటివాళ్ళకు ఉండకపోవచ్చు. మరీ పాతకాలపు మనిషిలా ఆలోచిస్తున్నానని మీరు అనవచ్చు. తేలికగా నా మాటను కొట్టి పారవెయ్యవచ్చు. కానీ నాకిక్కడే ఉండాలనిపిస్తుంది.’’
‘సరే నానమ్మా! మేము బయలుదేరుతాం.’’
‘‘మీ పెళ్ళిళ్ళ విషయాలు ఆలోచించండి.’’
‘‘అలాగే నానమ్మా! నేను డాక్టర్‌ని. బావను తప్ప ఎవరినయినా చేసుకుంటాను.’’
‘‘అదేమిటే మేమంతా వాళ్ళని చేసుకోలేదా? పిల్లలని కనలేదా? పెంచలేదా?
గ్రుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్లు ఇప్పుడు మీరంతా డాక్టర్లయి అయిన సంబంధాలు చేసుకోకూడదని చదువు చెబుతున్నారు. ఇది పెద్ద చోద్యమే!’’
‘‘పెద్దావిడని బాధపెట్టాలని లేదు కానీ ఈ విషయాన్ని ఇక్కడితో తుంచేస్తే అందరికీ మంచిదని అనే్వష్ అభిప్రాయం. అందుకే.
‘‘నానమ్మా! నేనూ అంతే. విద్య మాటే నామాట. దానికిష్టం లేకుండా దాని పెళ్ళిచెయ్యలేను. మనకిష్టమైన వాళ్ళనిచ్చి చేసేకంటే దానికిష్టమైన వాళ్ళకిచ్చి చేస్తే అది సుఖపడుతుంది.
ఆవిడ ఆశలన్నీ ఆకులులా రాలిపోయాయి. అయినా మాట్లాడలేకపోయింది. ఆ విషయంలో. వాళ్ళింత ఖచ్చితంగా చెబుతుంటే తనుమాత్రం ఏం మాట్లాడగలదు?
‘‘సరే మీ ఇష్టం’’ అందావిడ.
ఇన్నాళ్ళూ పెద్దలమధ్య జరిగిన సంప్రదింపులు ఇప్పుడు తామే పెద్దవాళ్ళయి పోవటంతో తమ ముందుకు వచ్చాయంతే!
ఇలాంటివి అమ్మానాన్నను పదే పదే గుర్తుతెచ్చి రంపపుకోతకు గురిచేస్తున్నాయి.
‘‘విద్యా! అనే్వష్! ప్రతి ఆదివారం ఇక్కడకు తప్పకుండా రావాలి. ఈ నానమ్మ బ్రతికి ఉన్నన్నాళ్ళూ కాస్త చూడండి. ఆ తర్వాత ఈ ఊరు రావటం, రాకపోవటం మీ ఇష్టం.’’
‘‘అదేమిటి నానమ్మా! ఇక మీకు మేము, మాకు మీరు. మాకు మాత్రం మీరు తప్ప ఇంకెవరున్నారు? అందుకే నిన్ను తీసుకెళ్లమంటే నువ్వే రావటం లేదు’’ అంది విద్య.
ఇప్పుడయినా ఒప్పుకుంటుందేమో అని చిన్ని ఆశ విద్య కళ్ళలో.
‘‘ఏదైనా అవసరమయితే నా సెల్‌కి కాల్ చెయ్యి నానమ్మా! కాకిలా వాలిపోనూ!’’ భరోసా ఇచ్చాడు అనే్వష్.
‘‘నానమ్మా! నీ ఆరోగ్యం జాగ్రత్త’’అంది విద్య.
ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అది చూసి ఆవిడ కన్నీరు పెట్టుకుంది.
‘‘నేను ముందుపోయి తర్వాత వాడు వెనక ఉండాల్సినవాడు నన్నొంటరి దాన్ని చేసి వెళ్ళిపోయాడు. నీకు నేనున్నానని ప్రతిసారీ ధైర్యం చెప్పేవాడు. ఈసారి అలా చెప్పేందుకు వాడే లేకుండాపోయాడు’’అంటూ పైట చెంగుతో కళ్ళు వత్తుకుంది.
ఆమెను ఓదార్చి వినీల్ టాక్సీలో బయలుదేరారు.
ఎక్కడినుంచీ వచ్చాడో తెలియదు. వినీల్ వాళ్ళలో ఒకడిగా కలిసిపోయాడు. ఈ కొద్దిరోజుల్లోనే వారికి ఎంతో సన్నిహితుడయిపోయాడు. ఇప్పుడు వాళ్ళు ముగ్గురూ విడిపోవాలంటే ముగ్గురికీ బాధగానే ఉంది.
‘వినీల్! మీరు మాతోనే ఎందుకుండగూడదూ?’ హఠాత్తుగా అడిగాడు అనే్వష్. అప్పుడే టాక్సీ కాళహస్తి ఊరులోకి ప్రవేశిస్తోంది.
‘‘వద్దు అనే్వష్. పెళ్ళికావల్సిన పిల్ల ఉన్న ఇంట్లో పరాయి మగవాళ్ళు ఉంటే ఈ సమాజం హర్షించదు. ఇప్పటివరకూ మీకు ఉన్న మంచి పేరు ఈ చిన్న విషయంతో తుడిచిపెట్టుకుపోతుంది. విద్యకు గొప్ప డాక్టరుగా పేరుంది. అది కలకాలం అలా నిలిచిపోవాలి మన స్నేహంలా. ఒకే ఊరిలో ఉన్నాం కాబట్టి తరచుగా కలుసుకుందాం.’’
విద్య వౌనంగా వారి సంభాషణ వింటోంది.
తను ఆఫర్ చేసినా తమ గురించి ఆలోచిస్తున్న వినీల్ అంటే ఇష్టం మరింత పెరిగింది అనే్వష్‌కి.
టాక్సీ కాసాగార్డెన్స్ గేటు దాటుతూ ఉండగా దూరంనుంచీ ఒక అమ్మాయి లిఫ్ట్ కావాలన్నట్లు చెయ్యి చూపించింది.
దగ్గరకు వచ్చాక అనే్వష్ అనుమతితో టాక్సీని ఆపాడు వినీల్.
ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు అనే్వష్.
ఆమె.. ఆమె.. తృప్తి. మళ్ళీ అదే అనుభూతి.
‘‘అరె! మీరా అనే్వష్! అర్జెంట్‌గా టౌన్‌లోకి వెళ్ళాలి. అరగంటనుంచీ ప్రయత్నిస్తుంటే ఒక్క ఆటోలేదు. టాక్సీలేదు. అందుకే లిఫ్ట్ అడగక తప్పలేదు.
‘‘నో ప్రాబ్లమ్! వెల్‌కమ్’’ అన్నాడు అనే్వష్.
వెనక సీటులో విద్య ప్రక్కన కూర్చుంది తృప్తి.
‘‘విద్యా! ఆరోజు కన్నప్ప కొండమీద నన్ను రక్షించింది ఈవిడే! పేరు తృప్తి.’’
‘‘తృప్తీ! తను మా సిస్టర్. పేరు విద్య’’ పరిచయం చేసాడు.
‘‘చాలా థాంక్సండీ. మా అన్నయ్య అంటే నాకు ప్రాణం. అలాంటివాడి ప్రాణాలు నిలబెట్టిన మీకు జీవితాంతం ఋణపడి ఉంటాను.’’
*
-సశేషం

-యలమర్తి అనూరాధ 9247260206