డైలీ సీరియల్

పచ్చబొట్టు-29

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘విద్యా! నాకూ టీ! రెండు నిముషాలలో స్నానం చేసి వచ్చేస్తాను’’
‘‘ఎక్స్‌క్యూజ్‌మీ వినీల్’’ అంటూ లోపలికి వెళ్లాడు.
ముగ్గురూ కలిసి టీ త్రాగారు.
గత కొద్ది రోజులుగా వినీల్‌ని గమనిస్తున్నాడు. అంతులేని ప్రేమ, ఆరాధనలు విద్యపట్ల చూపిస్తుండటం గ్రహించాడు. ఎప్పటికప్పుడు విద్యని అడగాలని.. మళ్లీ ఇలాంటివి ఇపుడా అని చెల్లి అంటే ఎలా అని వెనుకంజ వేయటం..
ఈ పోలీసు ఉద్యోగం పుణ్యమా అని మైండ్ ఎప్పుడూ హాట్, హాట్‌గానే. ఇంటికి వస్తేనే ప్రశాంతత. ఈ రోజు తప్పకుండా అడగాలి అనుకున్నాడు.
‘‘నేను వెళ్ళొస్తాను’’ అంటూ లేచాడు వినీల్.
‘‘అదేమిటి వినీల్, భోంచేసి వెళ్ళు’’ అన్నాడు అనే్వష్.
‘‘మీ చెల్లిగారి తిండికి అలవాటుపడితే, బయట హోటల్ వాళ్ళు ఏడుస్తారు. అయినా వచ్చినపుడుల్లానా? సెలవు రోజుల్లో చూద్దాం!’’
‘‘మా ఇద్దరికీ సెలవులా!’’ ఇద్దరూ ఒకేసారి నవ్వారు.
వినీల్‌కి మనసంతా హాయిగా ఉంది. ఏ ఊరి చివరకో వెళ్లిపోయి మైదానాన్ని పరుపుగా చేసుకొని కొండలతో కబుర్లు, పిట్టలతో ఊసులు, ప్రకృతితో మమేకమవ్వాలని ఉంది. అందుకే ఎంత తొందరగా వెళితే అంత మంచిది.
‘‘వస్తాను అనే్వష్.. వస్తా విద్యా..’’ అంటూ బయటపడిపోయాడు.
ఈ రోజు అతని ప్రవర్తన కాస్త వింతగా అనిపించింది అనే్వష్‌కు.
వెళుతున్న వినీల్‌నే చూస్తున్న విద్యను ‘చిన్నా!’ అని పిలిచాడు.
‘‘ఏమిటన్నయ్యా!’’
‘‘ఇలారా.. ఇలా వచ్చి నా ప్రక్కన కూర్చో’’
‘‘ఊ.. చెప్పు.. ఏమిటి విశేషం’’
చెల్లి చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు.
‘‘చిన్నా! అమ్మా, నాన్న ఇంత తొందరగా వెళ్లిపోయి నన్ను పెద్దవాణ్ణి చేస్తారని కలలో కూడా అనుకోలేదురా. నాకా డ్యూటీలో పడితే ఎప్పుడు వస్తానో తెలియటంలేదు. ఇదివరకయితే అమ్మా నాన్న ఉండేవారు. నీ గురించి ఆలోచించవలసిన అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడలా కాదు. నేను ప్రశాంతంగా డ్యూటీనుంచీ రావాలంటే నీ పెళ్ళే ఒక పరిష్కారంలా అనిపిస్తోంది. ఎలాగూ సంవత్సరం లోపు చేస్తే పుణ్యం అమ్మా నాన్నలకు దక్కుతుందన్నారుగా. వాళ్ళు చెయ్యలేదన్న అసంతృప్తినీ పోగొట్టుకోవచ్చు. ఏమంటావ్?’
‘‘నీ ఇష్టం అన్నయ్యా!’’
‘‘అది కాదురా. ఎలాంటి అబ్బాయి కావాలని’’
‘‘విచిత్రంగా ఉందే. ఈ రోజు వినీల్ గుడికి రమ్మంటే నువ్వు ఇంకా రాలేదు కదా అని వెళ్ళాను. తనూ ఇదే అడిగాడు’’.
‘‘నిజమా. ఏం చెప్పావ్?’’ ఆత్రంగా అడిగాడు.
‘‘అందరిలానే.. మంచివాడు.. సంస్కారవంతుడు.. బీదవాడయినా నన్ను పోషించుకోగలవాడయితే చాలు అని. ఇంతెందుకు నీలా ఉంటే చాలు అన్నాను’’.
ఇక ఆలోచించటం అనవసరం అనుకున్నాడు.
‘‘విద్యా! వినీల్ అంటే నీకిష్టమా!’’’
‘‘ఇష్టమే’’
‘‘వినీల్‌ని చేసుకుంటావా?’’
‘‘నీకూ, తనకూ ఇష్టమయితే నేను ఓకె’’
‘‘మనమంతా కలిసి ఉండాలనే నిబంధనకి అతను ఒప్పుకుంటేనే, లేకపోతే నేనసలు పెళ్ళే చేసుకోను. నిన్ను విడిచి ఉండలేను’’.
‘‘పిచ్చిపిల్లా! అందుకే కదరా వినీల్‌ని సెలెక్ట్ చేసింది. పెద్ద పెద్ద సంబంధాలు తేగలను. కానీ వాళ్ళకు పెద్ద పెద్ద అలవాట్లుంటాయి. మనలా ఉండరు. ఇతనయితే మనకి సరిగ్గా సరిపోతాడు. వాళ్ళ వాళ్ళను విడిచి పెట్టాడన్న బాధ అతనికీ ఉండదు. మనకీ ఉండదు. అంతా హాపీనే. అతని అభిప్రాయం ఏమిటో కూడా తెలుసుకొని ముహూర్తాలు పెట్టుకుందాం.
‘‘ఏమో!’’
‘‘నువ్వేం వర్రీ కావద్దు ఈ విషయంలో. అంతా మనమనుకున్నట్లే జరుగుతుంది’’
‘‘వినీల్ తప్పక ఒప్పుకుంటాడు. ఏదో ఫార్మాలిటీకి అడగడం తప్ప. ఇది తను విద్యతో మాట్లాడేసి ఉంటే ఇపుడే వినీల్‌తో మాట్లాడేవాడు. సరే! కానీ ఒక్క రోజులో ఏం కొంప ములుగుతుంది?
ఆ రాత్రి చాలా రోజుల తర్వాత తృప్తిగా నిద్రపోయారా అన్నాచెలెళ్ళు.
***
స్టేషన్‌కి వెళ్ళే ముందు వినీల్ చెప్పిన గుర్తులను గుర్తుతెచ్చుకుంటూ వెళ్ళాడు అనే్వష్. ఎవరో తలుపు తడుతున్న శబ్దానికి వచ్చి తలుపు తీశాడు వినీల్.
తలుపు తెరిచిన అతను స్థాణువయ్యాడు. కలయా, నిజమా అని తనను తాను గిల్లుకున్నాడు.
‘‘అనే్వష్! నువ్విక్కడ!’’
‘‘సారీ! వినీల్! నేను నీ ఫ్రెండ్‌గా రాలేదు. డ్యూటీమీద వచ్చాను’’.
‘‘తానేం తప్పుచేశాడు? తన ఆటోలో ఏమైనా తప్పుడు సరుకు పెట్టి తనని ఇరికించారా?’’ పరిపరివిధాల పోయింది మనసు వినీల్‌కి.
నేరం ఒప్పుకుంటే అరెస్టు చెయ్యటానికి వచ్చాను.
‘‘ఏం నేరం’’ తడబడుతూ అడిగాడు.
ఇంకాస్త సీయస్‌గా చూస్తూ ‘ప్రేమ నేరం?’’ అన్నాడు.
‘‘ప్రేమా! లేదే! నేనెవరినీ ప్రేమించలేదే?’’
‘‘ఓహో! అయితే నేనే పొరపడ్డాను. విద్యను ప్రేమించారేమో అనుకొని అడిగి పెళ్లిచేద్దామని వచ్చాను. సరే! వస్తా’’ అని వెనుతిరిగాడు.
అప్పుడు వెలిగింది వినీల్ బుర్రకి.
అనే్వష్ వెళుతున్న వాడల్లా ఆగి, వెనక్కి తిరిగి ‘‘ఏంటి? వెళ్ళమంటావా?’’ అన్నాడు.
‘‘రా! బావా! అదరకొట్టేశావ్. ఒక్క నిమిషం గుండె ఆగిపోయిందనుకో. ఏం నేరం చేసానో అని. మీ పోలీసు వాళ్ళతో ఇదే తిప్పలు. హైరానా పెట్టేస్తారు’’
‘‘వినీల్! ఏమీ అనుకోకు. సరదాగా ఏడిపించాలని’’
‘‘అంత స్వీట్ న్యూస్ చెప్పేటప్పుడు ఈ మాత్రం బాధపెట్టినా తప్పులేదులే!’’
‘‘బాధపెట్టానా? ఐయామ్ సారీ?’’
‘‘్భలేవాడివే అనే్వష్! ఇంతేనా నన్ను అర్థం చేసుకుంది? ఇంత తీపి బాధ ఇంకొకరికి దొరుకబోదని గ్యారంటీగా చెప్పగలను. ఈ సుదినం ఇంత తొందరగా వస్తుందని నేను అనుకోలేదు’’.
రాత్రి నువ్వెళ్లాక విద్యను అడిగాను. ఒప్పుకుంది. నువ్వయితే మాలో కలిసిపోతావనిపించింది. విద్యను రెప్పకంటే ఎక్కువగా కాపాడతావని నమ్మకం. విద్య షరతు తెలుసుగా. అందుకు ఒప్పకుంటేనే..’’
‘‘స్వర్గంలో స్థానం ఇస్తానంటే వద్దంటానా? నావల్ల మీ అనుబంధానికి ఏనాడూ లోటు రానివ్వను. ఇది నా ప్రామిస్’’.
‘‘సరే! నే వెళ్లిరానా?’’
‘‘మొదటిసారి వచ్చావ్. ఏదైనా తీసుకు వెళ్దువుగానీ’’ అంటూ లోపలికి వెళ్లి గబగబా కాఫీ కలుపుకొని వచ్చాడు. రెడీమేడ్‌గా ఉన్న బిస్కెట్లను ప్లేటులో పెట్టి అందించాడు.
బిస్కెట్స్, టీ కానిచ్చి ‘బై’ చెప్పి బయలుదేరాడు అనే్వష్.
ఇన్నాళ్ళనుంచీ పెద్ద సమస్యగా తోచింది. పరిష్కారం దొరికేటప్పటికి తేలికయిపోయింది మనసు.
అనే్వష్ సందు మలుపు తిరిగేంతవరకు చూసి ఒక్క గెంతు గెంతాడు వినీల్.
గబగబా రెడీ అయిపోయాడు. ఆలోచనలు ఆకాశంలో విమానాలులా తిరుగుతున్నాయి. మనసుకు రెక్కలొచ్చి ఎప్పుడో విద్య దగ్గిరకు పరుగెత్తింది. -సశేషం

-యలమర్తి అనూరాధ 9247260206